For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu లోకి భార్యాభర్తలు.. క్లారిటీ ఇచ్చిన సెలబ్రిటీ జంట, పర్మిషన్ ఇస్తే అంటూ!

  |

  విపరీతమైన ప్రేక్షదారణను సంపాదించుకున్న తెలుగు రియాలిటీ షోలలో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది బిగ్ బాస్. ఎలాంటి అంచనాలు లేకుండా 2017లో ప్రారంభమైన ఈ షో వరుస పెట్టి సీజన్లతో దూసుకుపోతోంది. ఇక ఇందులో మొదటి సీజన్ లో ఆల్రేడీ ఫేమ్ ఉన్న సెలబ్రిటీలను కంటెస్టెంట్లుగా తీసుకొచ్చారు. తర్వాత సోషల్ మీడియా స్టార్స్, సీరియల్ నటీనటులు, జర్నలిస్ట్, రివ్యూవర్లు ఇలా విభిన్నమైన టాలెంటెడ్ పర్సన్స్ కు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు తర్వాత వచ్చే బిగ్ బాస్ సీజన్ కు జానకి కలగలనలేదు సీరియల్ హీరో అమర్ దీప్, అతని భార్య తేజస్విని గౌడ ఎంట్రీ ఇస్తున్నారనే విషయంపై క్లారిటీ ఇచ్చారు.

   మిగతా భాషల్లోకి..

  మిగతా భాషల్లోకి..


  బిగ్ బ్రదర్ అనే పేరుతో అమెరికాలో ప్రారంభమైన రియాలిటీ షో ఎల్లలు దాటి ఇండియాలోకి బిగ్ బాస్ గా వచ్చింది. రావడమే కాకుండా అశేషమైన ప్రేక్షకాదరణ పొందింది. దీంతో ముందుగా హిందీలో ప్రారంభమైన ఈ రియాలిటీ షోను క్రమేణా మిగతా భాషల్లోకి కూడా తీసుకొచ్చారు. ఎన్నో అనుమానాలు, ఎలాంటి అంచనాలు లేకుండా ఈ రియాలిటీ షో తెలుగు మొదటి సీజన్ 2017లో ప్రారంభమైంది.

  రన్నరప్ గా శ్రీహాన్..

  రన్నరప్ గా శ్రీహాన్..


  బిగ్ బాస్ షో ఇప్పటికి ఐదు రెగ్యూలర్ (టీవీ), ఒక ఓటీటీ (నాన్ స్టాప్) వెర్షన్ సీజన్లను పూర్తి చేసుకుంది. ఇటీవల బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ కూడా పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ 4న ప్రారంభమైన ఈ ఆరో సీజన్ డిసెంబర్ 18న గ్రాండ్ ఫినాలే నిర్వహించుకుంది. అదే రోజున ఆరో సీజన్ టైటిల్ విన్నర్ గా సింగర్ రేవంత్ ను విజేతగా ప్రకటించారు. రన్నరప్ గా శ్రీహాన్ నిలిచాడు. టాప్ 3 కంటెస్టెంట్ గా కార్తిక దీపం ఫేమ్ కీర్తి భట్ సరిపెట్టుకుంది.

  దాదాపుగా రానా దగ్గుబాటి..

  దాదాపుగా రానా దగ్గుబాటి..


  ఇక త్వరలో బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్, ఓటీటీ రెండో సీజన్ ను ప్రారంభించనున్నారు బీబీ మేకర్స్. ఇందులో భాగంగానే హోస్ట్ గా నందమూరి నటసింహం బాలకృష్ణ, దగ్గుబాటి రానా పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో దగ్గుబాటి రానా పేరును టాలీవుడ్ కింగ్ నాగార్జున రికమండ్ చేసినట్లు సమాచారం. అంతేకాకుండా రానాకు అయిన ఓ సర్జరీ కారణంగా సినిమాలకు కొన్ని నెలలు దూరం కానున్నాడట. ఆ గ్యాప్ ను ఫిల్ చేసేందుకు, ప్రేక్షకులతో ఇంటరాక్ట్ అవ్వొచ్చన్న ఉద్దేశంతో రానా దగ్గుపాటి దాదాపుగా ఒప్పుకున్నాడని ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

  ఆ కపుల్స్ లాగే..

  ఆ కపుల్స్ లాగే..

  ఇక కంటెస్టెంట్లుగా ఇప్పటికీ అనేక మంది పేర్లు వినిపించాయి. వారిలో సింగర్ మోహన భోగరాజు, బిగ్ బాస్ తెలుగు 3 సీజన్ రన్నరప్, యాంకర్ శ్రీముఖి, హీరో సాయి రోనాక్ తోపాటు ఇటీవల పెళ్లి చేసుకుని ఒక్కటయిన అమర్ దీప్ చౌదరి, తేజస్విని గౌడ పేర్లు కూడా వినిపించాయి. ఆరో సీజన్ లో మెరీనా అబ్రహం-రోహిత్ సహ్ని, మూడో సీజన్ లో వరుణ్ సందేశ్-వితికా షేరు కపుల్స్ గా ఎంట్రీ ఇచ్చారు. వారిలాగే బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ కోసం ఈ సీరియల్ జంటను బీబీ మేనజ్ మెంట్ అప్రోచ్ అయిందని టాక్ వినిపించింది.

  డేట్స్ మ్యానేజ్ చేయడం..

  డేట్స్ మ్యానేజ్ చేయడం..

  ఇప్పుడు ఆ వార్తలపై స్పందించింది అమర్ దీప్-తేజస్విని జంట. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బిగ్ బాస్ లోకి అవకాశం వస్తే వెళతారా అన్న ప్రశ్నకు.. "చూద్దాం.." అని తలూపాడు అమర్ దీప్. తర్వాత ఇద్దరికీ పెళ్లయింది కాబట్టి జంటగా వెళ్తారనే టాక్ వినిపిస్తోందని అని అంటే.. "అది కష్టం. తేజూకి జీ తమిళం సీరియల్ ఉంది. కాబట్టి అది వదిలేసి రాలేదు. ఇక్కడి డేట్స్, అక్కడి డేట్స్ మ్యానేజ్ చేయడానికే కష్టమైపోతోంది" అని సమాధానం ఇచ్చాడు అమర్ దీప్.

  మాకు బ్యాటింగ్ ఉంటుంది..

  మాకు బ్యాటింగ్ ఉంటుంది..

  అమర్ దీప్ ఆన్సర్ కి ఒకవేళ అక్కడ పర్మిషన్ ఇస్తే వెళ్తారు అని యాంకర్ మళ్లీ క్వశ్చన్ వేయడంతో.. "ఒక ఎపిసోడ్ షూటింగ్ కే మేము ఒక్క రోజు లేకపోతేనే మాకు బ్యాటింగ్ ఉంటుంది. ఇక రెండు సీరియల్స్ అంటే చాలా హెక్టిక్ షెడ్యూల్ ఉంటుంది" అని అమర్ దీప్ చెప్పుకొచ్చాడు. అమర్ దీప్ జానకి కలగనలేదుతోపాటు మిస్టర్ పెళ్లాం అనే సిరీస్ లో హీరోగా చేస్తున్నాడు. అలాగే ఐరావతం సినిమాలో ఓ రోల్ చేశాడు. ఇక తేజస్విని గౌడ్ కేరాఫ్ అనసూయలో హీరోయిన్ గా చేస్తోంది.

  English summary
  Bigg Boss Telugu 7 Season Team Approaching Janaki Kalaganaledu Serial Actor Amardeep Chowdary And Care Of Anasuya Actress Tejaswini Gowda And Couple Gives Clarity.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X