For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu January 11th: సొంత ఇంటిని వదిలిన జ్ఞానాంబ ఫ్యామిలీ.. జానకితో రామ ముద్దులు!

  |

  జానకి కలగనలేదు సీరియల్ మరొక కీలక మలుపు తిరుగుతోంది. అఖిల్ జాబ్ కోసం రామ చేసిన అప్పు అందరిని ఇబ్బందుల్లో పడేస్తుంది. కానీ ఆ సమస్యల వలన రామ భార్య జానకి గొడవలు రాకుండా చూడాలని అనుకుంటుంది. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 7.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 475 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

  అప్పు వలన తీవ్ర సమస్యలు

  అప్పు వలన తీవ్ర సమస్యలు

  రామచంద్ర తన తమ్ముడు జీవితం బాగుండాలి అని అతని ఉద్యోగం కోసం తన స్నేహితుడు 20 లక్షలు కడతాడు. ఇంటిని తాకట్టు పెట్టి మరి ఆ డబ్బులు కట్టడంతో చివరికి మోసపోతాడు. దీంతో తీవ్ర సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అది కూడా ఇంట్లో ఎవరికీ చెప్పకపోవడంతో తల్లి జ్ఞానాంబ రామచంద్రపై తీవ్ర అసహనంతో ఉంటుంది.

  గతంలో చాలాసార్లు ఏ విషయమైనా సరే నాతో చెప్పి గానీ చేయని రామచంద్ర ఈసారి ఇంటిని తాకట్టు పెట్టి మరి డబ్బులు తీసుకోవడం ఏమాత్రం నచ్చలేదు అని కోపంగా ఉంటుంది. అంతే కాకుండా జానకి కూడా ఈ విషయాన్ని చెప్పకపోవడంతో ఆమె మరింత అసహనం వ్యక్తం చేస్తుంది.

  బయటకొచ్చిన ఫ్యామిలీ

  బయటకొచ్చిన ఫ్యామిలీ

  ఇక రామచంద్ర అప్పు ఇచ్చిన భాస్కరరావు ఇంటికి వచ్చి ఇచ్చిన గడువు సమయం అయిపోయింది అని డబ్బులు ఇస్తారా లేదంటే ఇల్లు ఖాళీ చేస్తారా అని అడుగుతాడు. దీంతో మాట తప్పని జ్ఞానాంబ ఇచ్చిన మాట ప్రకారం మేము మూడు రోజుల్లో డబ్బులు చెల్లించకపోతే ఇంట్లో నుంచి వెళ్లిపోతాము అని చెప్పాము అందుకే ఇప్పుడు మీకు ముందుగా 5 లక్షలు ఇస్తున్నాము అని మిగతా డబ్బులు తొందరగా ఇస్తాము అని చెబుతుంది.

  అయితే భాస్కరరావు వడ్డీ కింద మీ కారు కూడా తీసుకుంటున్నాను అని చెప్పడంతో ఇంట్లో వాళ్ళు మరింతగా బాధపడతారు. ఇక చేసేదేమీ లేక అందరు కూడా ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని అనుకుంటారు.

  భర్తకు ధైర్యం చెప్పే ప్రయత్నం

  భర్తకు ధైర్యం చెప్పే ప్రయత్నం

  మరోవైపు రామచంద్ర కుటుంబ పరిస్థితిని చూసి ఒక్కసారిగా కంటతడి పెట్టుకుంటాడు. ఈ ఇంటిని మా అమ్మ ఎంతో ప్రేమగా చూసుకునేది అలాంటిది ఈరోజు ఇంట్లో నుంచి వెళ్లిపోవాల్సిన పరిస్థితి రావడం తట్టుకోలేకపోతున్నాను అని రామచంద్ర బాధ పడుతూ ఉంటాడు. ఇక జానకి తన భర్తకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తూనే ఇక తర్వాత ఇంట్లో నుంచి అందరూ కూడా బయటకు వెళ్లి పోతూ ఉంటారు. ఇక చివరగా ఇంటిని చూస్తూ బాధపడుతూ ఉంటారు.

  మల్లిక కఠినమైన మాటలు

  మల్లిక కఠినమైన మాటలు

  ఇక మరొక చోటుకు వెళ్లి కొత్త ఇంట్లోకి అడుగు పెడతారు. ఇక ఆ సమయంలో మల్లికా తన మాటలతో మరింత బాధ పెట్టే ప్రయత్నం చేస్తుంది. బావగారు ముద్దుగానే ప్లాన్ చేసి ఈ ఇంటిని తీసుకున్నారు అని ముందు జాగ్రత్తలు బాగానే ఉన్నాయి అని వెటకారంగా మాట్లాడుతుంది. నేను చూడలేదు మల్లికా మన కొట్టులో పనిచేసే అబ్బాయికి చెప్పాను. అతనే ఇది చూశాడు అని రామచంద్ర చెబుతాడు. ఇక రామచంద్ర కుటుంబ సభ్యులందరితో కలిసి ఇంట్లోకి బాధపడుతూనే వెళతాడు.

  విడిపోవాల్సిన అవసరం లేదు

  విడిపోవాల్సిన అవసరం లేదు

  అయితే ఇంట్లోకి వెళ్లిన తర్వాత అక్కడ రెండు గదులు మాత్రమే ఉండడంతో మల్లిక తాను ఈ ఇంట్లో సర్దుకోలేము అని మా వల్ల మీరు ఎందుకు ఇబ్బంది పడతారు అని మేము బయట ఎక్కడైనా ఉంటామని చెబుతుంది. కానీ అందుకు జ్ఞానాంబ మాత్రం ఒప్పుకోదు. మీరు ఒక గదిలో ఉండండి అని విడిపోవాల్సిన అవసరం లేదు అని చెబుతుంది. అంతేకాకుండా జెస్సీ కడుపుతో ఉంది కాబట్టి ఆమె తన భర్తతో కలిసి మరొక గదిలో ఉంటుంది అని జ్ఞానాంబ ఆదేశాలు జారీ చేస్తారు. ఇక జానకి రామచంద్ర ఇద్దరు కూడా వంట గదిలో ఉంటాము అని అంటారు. అక్కడ మాకు సౌకర్యంగానే ఉంటుంది అని చెబుతూ ఉంటారు.

  భర్తకు జానకి మద్దతు

  భర్తకు జానకి మద్దతు

  ఇక మీరు ఎక్కడ ఉంటారు అని అత్తగారిని మామ గారిని అడిగినప్పుడు మీ అందరిని చూసుకుంటూ ఇక్కడే హాల్లో ఉంటామని సమాధానం ఇస్తారు. ఇక ఆ తర్వాత జానకి రామచంద్ర వంటగదిలోకి వెళ్లి అక్కడ పరిస్థితి చూస్తారు రామచంద్ర ఆ గదిని చూసి కొంత బాధపడతాడు. కానీ జానకి మాత్రం అసలు బాధపడవద్దు అని.. మొన్నటి వరకు మన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి పెద్ద ఇల్లు ఉంది. ఇప్పుడు ఈ పరిస్థితికి వచ్చాము. కష్టపడనిదే ఏదీ కూడా మళ్లీ రాదు. మళ్లీ మనం కష్టపడదాం మంచి రోజులు వస్తాయి అని ఆమె ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తుంది.

  వంటగదిలో రామ ముద్దులు

  వంటగదిలో రామ ముద్దులు

  ఇక మరోవైపు మల్లికా మాత్రం ఆ ఇంట్లో ఉంటున్నందుకు చాలా కోపంగా ఉంటుంది. తన భర్తపై కోపాన్ని చూపిస్తూ ఎప్పుడు తల్లి వెంటే ఉంటారు అని మాట్లాడుతూ ఉంటుంది. ఇక జానకి ఇంట్లో పాలు పొంగించాలి అని తన భర్తకు చెబుతుంది. అందుకోసం జ్ఞానాంబను కూడా అడుగుతుంది. కానీ జ్ఞానాంబ మాత్రం నాకు అధికారం లేదు అంటూ.. పెద్ద కోడలు వచ్చిన తర్వాత తనదే అధికారం అని చెప్పడంతో రామచంద్ర మొదట బాధపడతాడు. కానీ తర్వాత జానికి చేతుల మీదుగా పాలు పొంగిస్తారు. ఇక సంతోషంలో రామచంద్ర భార్యకు ముద్దు పెట్టుకుంటూ వంటగదిలోనే కౌగిలించుకుంటాడు. మరి ఈ పరిణామాల తర్వాత జ్ఞానాంబ ఎలా రియాక్ట్ అవుతుందో తదుపరి ఎపిసోడ్ లో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Today Episode 475
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X