For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu January 16th: బాధలోనే జ్ఞానాంబ నవ్వులు.. షాప్ లేదని మల్లిక మరో ట్విస్ట్!

  |

  జానకి కలగనలేదు సీరియల్ విభిన్నమైన కంటెంట్ తో ఆకట్టుకుంటోంది. అఖిల్ జాబ్ కోసం రామ చేసిన అప్పు కారణంగా జ్ఞానాంబ ఫ్యామిలీని ఇబ్బందుల్లో పడేస్తుంది. అయితే ఆ సమస్యల వలన రామ భార్య జానకి గొడవలు రాకుండా చూడాలని అనుకుంటుంది. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 7.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 478 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

  బయటకు వెళ్లే పరిస్థితి

  బయటకు వెళ్లే పరిస్థితి

  అఖిల్ జీవితం బాగుండాలి అనే రామచంద్ర ఇంటిని తాకట్టు పెట్టి మరి 20 లక్షల అప్పు చేస్తాడు. అతనికి ఉద్యోగం ఇస్తాడేమో అనుకొని తన స్నేహితుడిని నమ్మడంతో అతడు మోసం చేసి ఆ డబ్బును తీసుకొని పారిపోతాడు. ఇక తర్వాత ఇంట్లో అందరూ కూడా బయటకు వెళ్లే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ఆర్థికంగా కూడా జ్ఞానాంబ కుటుంబం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తూ ఉంటుంది. ఇంట్లో కూడా మల్లికా తన ప్రతి విషయంలోనూ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉంటుంది. ప్రతి పనిలో కూడా జానకి ఇబ్బంది పడుతూ ఉంటుంది.

   మర్చిపోయిన రామ

  మర్చిపోయిన రామ

  ఇక మల్లిక స్నానం చేసుకోవడానికి బాత్రూంకి వెళుతుండగా ఒక్కటే ఉండడంతో మరింత అసహనంతో ఉంటుంది. బాత్రూంలో జెస్సి ఉండడంతో ఈ ఇంట్లో ఇంకా ఎన్ని ఇబ్బందులు పడాలో అని అనుకుంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత జానకి వంట చేస్తుండగా రామచంద్ర హఠాత్తుగా వస్తాడు. త్వరగా టిఫిన్ పెట్టండి ఆకలి వేస్తుంది అని అసలే షాప్ కు కూడా వెళ్లాలి అని అంటాడు. ఇక జానకి మాత్రం ఒక్కసారిగా ఆలోచిస్తుంది. ఎందుకంటే షాప్ అప్పు చేయడం కారణంగా భాస్కర రావు ఆధీనంలో ఉంటుంది. దీంతో రామచంద్ర ఆ విషయాన్ని గ్రహించి మళ్ళీ ఒక్కసారిగా దీనంగా మారిపోతూ ఉంటాడు. షాప్ లేదు అన్న విషయం మర్చిపోయాను అని ఎలాగైనా ఇప్పుడు మరొక పని వెతుక్కోవాలి అని అనుకుంటాడు.

  కొడుకు విషయంలో బాధ

  కొడుకు విషయంలో బాధ

  ఇక జానకి మాత్రం తన అత్తగారితో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. జ్ఞానాంబ మాత్రం కొడుకు మీద కోపంతో అతనితో ఏమాత్రం మాట్లాడకుండా ఉంటుంది. అందుకే జానకి అత్తగారికి నచ్చ చెప్పాలని అనుకుంటుంది. అయినప్పటికీ కూడా జ్ఞానాంబ కొడుకు చేసిన తప్పు విషయంలో మాత్రం బాధగానే ఉంటుంది. ఇక ఆమె అలా కోపంగానే ఉండడంతో భర్త గోవిందరాజులు వచ్చి రామచంద్ర విషయంలో నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావని అనుకోకుండా జరిగిన తప్పుకు నువ్వు ఇంకా కోపంగా ఉండడం కరెక్ట్ కాదు అని అంటాడు.

   జ్ఞానాంబ నవ్వులు

  జ్ఞానాంబ నవ్వులు

  అయితే ఆ క్రమంలో గోవిందరాజులు కాఫీ తాగుతుండగా అందులో చక్కెర బదులు మరొకటి చేదు పదార్ధాన్ని కలపడంతో చేదుగా ఉంటుంది. దీంతో పనిమనిషి పై గోవిందరాజులు కొంత అసహనం వ్యక్తం చేస్తాడు. ఇక గోవిందరాజులు ఇబ్బంది పడుతూ ఉంటే సరదాగా అనిపించడంతో జ్ఞానాంబ ఒక్కసారిగా నవ్వుతుంది. ఇక తర్వాత మల్లిగా కూడా వచ్చి కిచెన్ లో చక్కెర లేదు అని చెబుతోంది. పనిమనిషి దగ్గర చెక్కర డబ్బా ఉండడంతో దాన్ని తీసుకుంటుంది. ఇక అందరూ కూడా సరదాగా నవ్వుతూ ఉంటారు. కానీ జ్ఞానాంబ మాత్రం అలా నవ్వుతూనే మళ్లీ తన బాధ గుర్తుకు వచ్చి దీనంగా మారిపోతూ ఉంటుంది.

   ఆ బోర్డును తీయవద్దని

  ఆ బోర్డును తీయవద్దని

  ఇక మరోవైపు రామచంద్ర తన షాప్ దగ్గర నుంచి వెళుతూ ఉండగా స్వీట్ షాప్ నుంచి తల్లి పేరుతో ఉన్న బోర్డును తీసేస్తూ ఉంటారు. దీంతో వెంటనే రామచంద్ర అక్కడికి వెళ్లి ఇంకా కొన్ని రోజులు ఆ బోర్డును అలాగే ఉంచండి అని చెబుతాడు. భాస్కర రావును కూడా ప్రత్యేకంగా బ్రతిమాలడంతో ఆయన సరే అని ఒప్పుకుంటాడు. ఇక రామచంద్ర ఎలాగైనా సమస్యలన్నీ తొలగిపోయేలా ప్రయత్నం చేయాలి అని అనుకుంటాడు. ఇక ఇంట్లో జానకి ఒకవైపు చదువుకుంటూనే మరొకవైపు వంట పనులు కూడా చేసుకుంటూ ఉంటుంది. ఆమె ఆ పనుల్లో బిజీగా ఉండగా గోవిందరాజులు ఆలోచనలో పడుతూ ఉంటాడు.

   టాబ్లెట్స్ కోసం

  టాబ్లెట్స్ కోసం

  మీరు ఎక్కువగా టెన్షన్ పడకండి అని జ్ఞానాంబ కూడా అతనికి ధైర్యం చెబుతోంది. ఇక గోవిందరాజులు టాబ్లెట్స్ వేసుకున్స్ సమయం కావడంతో జ్ఞానాంబ గుర్తు చేస్తుంది. కానీ టాబ్లెట్స్ ఉండవు అయిపోయాయని ఆమెకు తెలుస్తుంది. మళ్ళీ మెడికల్ షాప్ దగ్గరికి వెళ్లి తీసుకురావాలని అనుకుంటుంది. అందుకోసం పనిమనిషిని పిలుస్తుంది. కానీ ఆమె ఎంత పిలిచినా కూడా రాదు.

  విష్ణు షాప్ లేదా?

  విష్ణు షాప్ లేదా?

  ఇక జానకి అత్త దగ్గరకు వచ్చి ఏం జరిగింది అని అడుగుతుంది. కానీ అత్తగారు మాత్రం జానకి తో మాట్లాడరు. పక్కనే ఉన్న గోవిందరాజులు టాబ్లెట్స్ అయిపోయాయి అని చెబుతాడు. ఇక నేను తెస్తాను అని జానకి అంటుంది. ఇక జ్ఞానాంబ జానకి చేతికి టాబ్లెట్స్ వివరాలు ఇవ్వకుండా ఒక టేబుల్ మీద పేపర్ పెడుతుంది. పరవాలేదు అని తీసుకున్న జానకి టాబ్లెట్స్ తీసుకురావాలని అనుకుంటుంది. కానీ చేతిలో డబ్బులు ఉండవు. ఇక మల్లిక భర్త విష్ణు దగ్గర కొన్ని డబ్బులు అడగాలని అనుకుంటుంది. అయితే ఇంతలోనే వచ్చిన మల్లికా మా దగ్గర డబ్బులు లేవు అని అసలు ఉన్న షాప్ కూడా లేదు అని అంటుంది. ఇక వెంటనే వచ్చిన జ్ఞానాంబ షాప్ లేదా అని ప్రశ్నిస్తుంది? మరి ఆ విషయంలో మల్లిక ఏ విధంగా సమాధానం చెబుతుందో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Serial 2023 January 16th Episode
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X