For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu January 4th: మల్లిక మాటలతో మరింత బాధలో రామ.. అప్పు కోసం మరో వేట!

  |

  జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు మరింత ఆసక్తి మారుతోంది. తమ్ముడు అఖిల్ కోసం రామచంద్ర చేసిన అప్పు ఇంట్లో వాళ్ళను ఇబ్బందుల్లో పడేస్తుంది. అఖిల్ జాబ్ చేస్తే బాగుంటుంది అని అందరూ కోరుకుంటూ ఉంటారు. జానకి ఆ విషయంలో గొడవలు రాకుండా చేయాలని ఆలోచిస్తుంది. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ పెరిగాయి. 7.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 469 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

  అప్పుతో ఇంటి సమస్య

  అప్పుతో ఇంటి సమస్య

  రామచంద్ర తన తమ్ముడు భవిష్యత్తు కోసం ఆలోచించిన విధానం ఇప్పుడు ఇంటిపై ప్రభావం చూపే పరిస్థితి ఏర్పడింది. తమ్ముడికి ఎలాగైనా జాబ్ ఇప్పించాలని తన స్నేహితుడిని నమ్మి 20 లక్షలు పెట్టుబడి కింద రామ అప్పు తీసుకొస్తాడు. అది కూడా ఇంటిని మొత్తం తాకట్టుపెట్టి తీసుకురావడంతో ఊహించని సమస్య ఎదురవుతుంది.

  రామచంద్ర స్నేహితుడు చరణ్ మోసం చేశాడని తెలుస్తుంది. ఇక అతను కనిపించకుండా పోవడంతో డబ్బు ఎక్కడ నుంచి తీసుకురావాలో రామచంద్రకు అర్థం కాదు. అంతే కాకుండా ఇంట్లో వాళ్ళు కూడా రామచంద్రను ఊహించిన విధంగా అనుమానిస్తూ ఉంటారు.

  ఇంటి అప్పును తీర్చేందుకు

  ఇంటి అప్పును తీర్చేందుకు

  దానికి తోడు జానకీ వచ్చిన తర్వాత రామ ఇలా తయారయ్యాడవని అతని స్వలాభం కోసం ఎక్కడైనా ప్లాట్ తీసుకునేందుకు 20 లక్షల అప్పు చేసి ఉండవచ్చు అని మల్లిక కూడా అనుమానాలు వ్యక్తం చేస్తుంది. అయితే రామచంద్ర మాత్రం ఇంటి గురించి ఆలోచిస్తూ ఉంటే తనను ఈ విధంగా నిందించడం ఏమాత్రం తట్టుకోలేకపోతు ఉంటాడు.

  ఎలాగైనా మళ్ళీ అప్పును తీర్చేసి ఇంటిని కాపాడుకోవాలని అనుకుంటాడు. రామచంద్ర ఇంటి అప్పును తీర్చేందుకు మరొక విధంగా ఆలోచిస్తూ ఉంటాడు. కుటుంబానికి జీవనాధారంగా ఉన్నటువంటి స్వీట్ షాప్ కు తాకట్టుపెట్టి 20 లక్షలు తీసుకురావాలని అనుకుంటాడు. అదే విషయాన్ని తల్లితో చెబుతాడు.

  మాటలతో మరింత బాధపెట్టిన మల్లిక

  మాటలతో మరింత బాధపెట్టిన మల్లిక

  కానీ మల్లిక అప్పుడే వచ్చి ఊహించిన విధంగా మరొక షాక్ ఇస్తుంది. మొన్న ఇల్లు తాకట్టు పెట్టారు మళ్ళీ ఇప్పుడు స్వీట్ షాప్ కూడా పెడతాను అంటున్నారు. ఇలా ఎన్ని రోజులు చేస్తారు అని ఊహించిన విధంగా మాట్లాడుతుంది. ఇక మల్లిక మాటలకు ఇంట్లో వాళ్ళు అందరూ కూడా షాక్ అవుతారు. అలా మాట్లాడతావు ఏమిటి మల్లికా అంటూ జానకి కూడా అంటుంది.

  మీ స్వలాభం కోసం చూసుకొని ఉమ్మడి కుటుంబంగా ఆస్తిని తగ్గించాలని చూస్తున్నారు దీనికి ఎంత మాత్రం ఒప్పుకోను అని అంటూంది. అలాగే తల్లి జ్ఞానంబ కూడా అదే తరహాలో చెబుతుంది. వెంటనే స్వీట్ షాప్ పేపర్లను అక్కడ పెట్టేసి వెళ్లిపో అని ఒకే ఒక్క మాట చెబుతుంది.

  జానకి సపోర్ట్

  జానకి సపోర్ట్

  దీంతో రామచంద్ర మరింత బాధపడుతూ ఉంటాడు. ఏదో ఒక ఉపాయంతో ఈ సమస్య నుంచి బయట పడాలని ఆలోచిస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎందుకు ఇంతలా అనుమానిస్తున్నారు అని బాధపడుతూ ఉంటాడు. అలాగే ఏనాడు కూడా తాను స్వలాభం చూసుకోలేదు అని జానకితో చెబుతూ ఉంటాడు.

  ఇక జానకి మాత్రం రామచంద్ర సపోర్ట్ చేసే విధంగా మాట్లాడుతుంది. మీరు ఎప్పుడూ చదువుకోలేదు కానీ జీవితం గురించి ఎన్నో నేర్చుకున్నారు. ఇప్పుడు ఈ సమస్య నుంచి బయటపడడం మీకు పెద్ద సమస్య కాకపోవచ్చు ఒకసారి ప్రయత్నం చేసి ఆలోచించండి అని జానకి అతన్ని ఉత్తేజ పరుస్తుంది.

  విష్ణు సహాయం చేస్తుంటే..

  విష్ణు సహాయం చేస్తుంటే..

  ఇక రామచంద్ర తనకు తెలిసిన వారిని డబ్బులు అడగాలి అని అనుకోని బయటకు వెళతాడు. అయితే మరోవైపు అన్నయ్య రామచంద్ర పరిస్థితి చూసిన విష్ణు అతనికి ఎలాగైనా తన నుంచి సహాయం చేయాలని అనుకుంటాడు. ఇక తనకు తెలిసిన స్నేహితులకు ఫోన్ చేసి అర్జెంటుగా 10 లక్షలు కావాలి అని అంటాడు.

  అయితే మల్లిక మాత్రం తన భర్త ఫోన్ చేస్తుంటే తట్టుకోలేక పోతుంది. మీ అన్నయ్య తప్పు చేస్తే మీరు ఎందుకు అప్పు అడుగుతున్నారు అని ప్రశ్నిస్తుంది. అంతేకాకుండా వాళ్లు వాళ్ళ స్వార్థం కోసం తాకట్టు పెట్టారు అని ఇప్పుడు మీరు 10 లక్షలు ఇచ్చారు అంటే రేపు అవి కూడా మీకు తిరిగి రావు అని అంటుంది. దీంతో మల్లిక మాటలకు కూడా విష్ణు ఏమీ అనలేక సైలెంట్ గా ఉండిపోతాడు.

  జ్ఞానాంబ మరింత కోపంగా..

  జ్ఞానాంబ మరింత కోపంగా..

  మరోవైపు రామచంద్ర తనకు తెలిసిన వాళ్లను డబ్బులు అడిగే ప్రయత్నం చేస్తారు. కానీ అందరూ మీ కుటుంబం మీద నమ్మకంతో ఇవ్వాలని ఉంది కానీ కొంత సమయం పడుతుంది అని అంటారు. కానీ రామచంద్ర మాత్రం మూడు రోజుల్లోనే డబ్బులు తిరిగి కట్టేయాలి అని అడుగుతాడు. కానీ అది సాధ్యపడదు.

  ఇక మరోవైపు గోవిందరాజులు పక్షవాతం వచ్చి పడిపోవడం వలన అతన్ని రోజు వచ్చి వైద్యులు చూస్తూ ఉంటారు. రోజు నేను ఇచ్చిన టాబ్లెట్స్ వేసుకోవాలి అని అలాగే ఆయిల్ తో మసాజ్ చేయాలి అని డాక్టర్ అంటారు. ఇక జానకి సాయం చేయడానికి వస్తుటే జ్ఞానాంబ మాత్రం అందుకు ఒప్పుకోదు. కొడుకు కోడలిపై జ్ఞానాంబ చాలా కోపంగా ఉంటుంది. మరి ఈ పరిస్థితులను దాటి జానకి ఎలా ముందడుగు వేస్తుందో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Today Episode 469
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X