For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu January 9th: అప్పు కోసం రామచంద్ర తిప్పలు.. బాధపెట్టేలా మల్లిక ప్రయత్నాలు

  |

  జానకి కలగనలేదు ఆసక్తికరమైన కథాంశంతో ముందుకు కొనసాగుతోంది. అఖిల్ కోసం రామచంద్ర చేసిన అప్పు కారణంగా అందరిని ఇబ్బందుల్లో పడేస్తుంది. ఇక అఖిల్ జాబ్ చేస్తే బాగుంటుంది అని అందరూ కోరుకుంటూ ఉండగా రామ అతని కోసం ఆలోచించి స్నేహితుడి చేతిలో మోసపోతాడు. అయితే సమస్యల వలన జానకి గొడవలు రాకుండా చూడాలని అనుకుంటుంది. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ పెరిగాయి. 7.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 473 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

  మూడు రోజుల్లో అప్పు కట్టాలి

  మూడు రోజుల్లో అప్పు కట్టాలి

  అఖిల్ కోసం అప్పు చేయడం వలన రామ తీవ్ర ఇబ్బందుల్లో పడతాడు. తన స్నేహితుడు చరణ్ తమ్ముడికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 20 లక్షలు తీసుకొని పారిపోతాడు. ఇంటిని తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బు కావడంతో అందరూ షాక్ అవుతారు. అంతే కాకుండా అప్పు ఇచ్చిన వ్యక్తి కూడా మూడు రోజుల్లో ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వాలని అంటాడు.

  ఇక రామచంద్ర ఎవరికి తెలియకుండా అప్పు చేశాడు అని ఇంట్లో వాళ్ళందరూ కూడా అసహనం వ్యక్తం చేస్తారు. నాతో ఒక్క మాట చెప్పలేదు అని తల్లి జ్ఞానాంబ కూడా కోపంగా ఉంటుంది.

  పరువు పోకుండా ఉండాలని

  పరువు పోకుండా ఉండాలని

  ఇక రామ ఇంటి పరువు పోకుండా ఉండాలి అని ఎవరి దగ్గరైనా డబ్బులను మళ్లీ అప్పుగా తీసుకురావాలని అనుకుంటాడు. కానీ ఎంతమందిని అడిగినా కూడా మూడు రోజుల్లో డబ్బులు సమకూర్చలేము అని కొంత సమయం కావాలి అని అంటారు. రామచంద్ర డబ్బుల కోసం తిరుగుతూ ఉండడంతో ఇంట్లో వాళ్ళు కూడా అతనికి సహాయం చేయాలని అనుకుంటారు. ఇక గోవిందరాజులు కూడా తనకు తెలిసిన స్నేహితుడని అడుగుతాడు. అలాగే మరొకవైపు జ్ఞానాంబ కూడా ఇంట్లో బంగారం నమ్మేసి డబ్బులు తీసుకురావాలని అనుకుంటుంది.

  కన్నబాబుతో గొడవ

  కన్నబాబుతో గొడవ

  అయితే ఈ క్రమంలో రామచంద్ర డబ్బు కోసం తిరుగుతూ ఉండగా దారి మధ్యలో అతడి పాత శత్రువు కన్నబాబు కనిపిస్తాడు. రామచంద్ర కుటుంబ పరిస్థితిని చూసి అతను మరింత కఠినంగా మాట్లాడుతూ హేళన చేస్తూ ఉంటాడు. నీకు 20 లక్షల డబ్బు కావాలి అంటే నీ భార్య చేత నాకు క్షమాపణలు చెప్పించు అని.. గతంలో ఆమె నన్ను అవమానించింది అని ఆ విషయంలో నాకు ఇంకా కోపం చల్లారలేదు అని అంటాడు.

  అందుకే నాకు క్షమాపణలు చెబితే మీ సమస్యలను గట్టేకిస్తాను అని అంటాడు. కానీ రామచంద్ర మాత్రం కన్నబాబు పై మరింత సీరియస్ అవుతాడు. ఈరోజు నా పరిస్థితి బాగోలేకపోయి ఉండొచ్చు కానీ ఎప్పటికీ ఇలాగే ఉండదు. మాటలు జాగ్రత్తగా మాట్లాడు అని రామచంద్ర అతనికి హెచ్చరికలు జారీ చేసే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

  భార్యను చూసి బాధతో..

  భార్యను చూసి బాధతో..

  ఇక మరోవైపు జ్ఞానాంబ నగలు అమ్మేస్తుంది. వచ్చిన 5 లక్షల డబ్బు గురించి ఇంట్లో చెబుతుంది. మిగతా డబ్బు రామ తీసుకు వస్తాడాని తండ్రి నమ్మకంతో ఉంటాడు. ఇక ప్రతిరోజు నిండుగా నగలతో మహాలక్ష్మి లా కనిపించే నా భార్య ఈరోజు నగలు లేకుండా కనిపించడం చూడలేకపోతున్నాను అని గోవిందరాజులు బాధపడుతూ ఉంటాడు. మన అలంకారానికి ఉపయోగపడిన నగలు అవసరానికి ఉపయోగపడితే తప్పేముంది అంటూ అయినా మనకు మొదట్లో ఇవన్నీ ఉన్నాయా అని జ్ఞానాంబ ఎంతో ఆలోచించి మాట్లాడుతుంది.

  భర్త కోసం జానకి ఎదురుచూపులు

  భర్త కోసం జానకి ఎదురుచూపులు

  ఇక మరోవైపు మల్లికా మాత్రం ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని అనుకుంటూ ఉంటుంది. అందుకే ముందుగానే బట్టలు అన్ని సర్దేసి పెట్టుకుని రెడీగా ఉంటుంది. ఏమాత్రం ఛాన్స్ దొరికినా కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని ఆలోచిస్తుంది. అంతే కాకుండా జానకి తన భర్త ఇంటికి ఇంకా రాలేదు అని బాధపడుతూ ఉంటుంది. భోజనం చేయకుండా జానకి గుమ్మం ముందు నిలబడే భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక ఇంతలో వచ్చిన గోవిందరాజులు రామచంద్ర వస్తాడులే అని ముందు నువ్వు భోజనం చేసి పడుకో అని అంటాడు. కానీ జానకి మాత్రం పరవాలేదు అని ఎదురుచూస్తూ ఉంటుంది.

  మల్లిక ఘాటైన మాటలు

  మల్లిక ఘాటైన మాటలు

  ఇక మరోవైపు మల్లిక జానకి బాధలో ఉంటే మరింత ఘాటుగా మాట్లాడుతుంది. ఇంటి పరువు పోవడానికి ఇంకా ఒక్కరోజు సమయం మాత్రమే ఉంది అని ఒక రాత్రిలో అంత డబ్బు రావడం కూడా కష్టమే అని మాట్లాడుతుంది. ఇక మల్లిక మాటలకు గోవిందరాజులు సీరియస్ అవుతాడు. కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్లు తుడవాలి కానీ కళ్ళల్లో కారం కొట్టకూడదు అని ఆమెకు హెచ్చరిక చేస్తాడు. ఇక సైలెంట్ గా మల్లిక అక్కడ నుంచి వెళ్లి పోతుంది.

  జెస్సి సీరియస్

  ఈ క్రమంలో జెస్సి అఖిల్ గురించి కాస్త సీరియస్ అవుతుంది. ఇంట్లో అందరూ కూడా ఇంటి పరువు గురించి ఆలోచిస్తున్నారు. బావగారు రాత్రి పగలు అని తేడా లేకుండా అప్పు కోసం బయట తిరుగుతున్నారు. కానీ నీకు మాత్రం ఎలాంటి టెన్షన్ లేదు.. నువ్వు ఈ విధంగా ఉండడం నాకు నచ్చడం లేదు అని జెస్సి అఖిల్ పై అసహనం వ్యక్తం చేస్తుంది. ఇక అఖిల్ జెస్సి పై కొంత సీరియస్ అవుతాడు. వాళ్ళు చేసిన తప్పుకు నేను ఎలా బాధ్యుడిని అంటూ ఆమెపై కోపగించుకుంటాడు. ఇక మరుసటి రోజు అప్పు ఇవ్వాలి అని భాస్కరరావు ఇంటికి వస్తాడు. మరోవైపు రామచంద్ర ఖాళీ చేతులతో గుమ్మం నుంచి వస్తాడు. మరి ఈ పరిస్థితుల్లో జానకి ఏ విధంగా ఆలోచిస్తుందో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Today Episode 473
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X