For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu August 16th: మల్లికలో దెయ్యం భయం.. జానకిని బాధపెట్టేందుకు మరో ప్లాన్!

  |

  జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్స్ మరింత ఆసక్తికరంగా కొనసాగుతున్నాయి. భర్త రామచంద్ర సహకారంతో జానకి తన ఐపీఎస్ కలను పూర్తి చేయాలని అనుకుంటుంది. ఇక జానకి చదువుకోవడం అత్తగారికి ఏ మాత్రం ఇష్టం ఉండదు. దీంతో తెలియకుండా భర్త అండతో జానకి చదువును కొనసాగిస్తోంది. అయితే అప్పుడు జనకికి కొన్ని ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 7.70 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 365 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం పదండి..

  మరోసారి దొరికిపోయిన మల్లిక

  మరోసారి దొరికిపోయిన మల్లిక

  మల్లిక మాంసం తినడం వలన ఇంట్లో ఆచారాలను పట్టించుకోకుండా తప్పుగా ప్రవర్తించింది అని అత్త జ్ఞానాంబ ఆమెకు శిక్ష వేస్తుంది. రెండు రోజులపాటు అన్నం కూడా తినవద్దు అని చెబుతుంది. ఇక ఆకలికి తట్టుకోలేక మల్లిక దొంగతనంగా అన్నం తినడానికి ప్రయత్నం చేస్తుంది. ఇక అప్పుడే ఇంట్లోకి అత్తగారు రావడంతో రెడ్ హ్యాండెడ్ గా దొరికేస్తుంది. ఆ తర్వాత మరోసారి అతని క్షమాపణలు కూడా అడుగుతుంది. కానీ జ్ఞానాంబ మాత్రం ఏ మాత్రం ఆలోచించకుండా మరింత సీరియస్ అవుతుంది. మరోసారి నువ్వు ఇంట్లో తినడానికి వీలులేదు అని ఇంకొక రోజు ఉపవాసం ఉండాలి అని కూడా శిక్ష వేస్తుంది. ఇక ఏమి చేయలేని పరిస్థితుల్లో మల్లికా మరోసారి తల పట్టుకుంటుంది.

  మల్లిక దెయ్యం భయం

  మల్లిక దెయ్యం భయం

  అయినప్పటికీ మల్లికా అర్ధరాత్రి ఆకలికి తట్టుకోలేక కిచెన్ లోకి వెళ్లాలని అనుకుంటుంది. ఇక ఆమెకు హాల్లో ఒక దెయ్యం తిరుగుతుంది అని అనిపిస్తుంది. వెంటనే ఇంట్లో అందరూ లేచే విధంగా కేకలు కూడా పెడుతుంది. ఏమైందో ఏమో అని అందరూ హాల్లోకి రాగానే మల్లిక తల పట్టుకుని కూర్చుంటుంది. ఇంట్లో దయ్యం తిరుగుతుంది అని చెప్పినప్పటికీ ఎవరు నమ్మరు. ఇక తర్వాత రామచంద్ర వచ్చి అది దయ్యం కాదు అని జానకి గారు చదువుకోడానికి నెత్తిపై ఒక లైట్ పెట్టుకున్నారు అని చెప్పడంతో మల్లిక ఆశ్చర్య పోతుంది. ఇక తర్వాత మల్లిక పరిస్థితిని చూసి అందరూ నవ్వుకుంటారు. మరోవైపు మామయ్య గోవిందరాజులు కూడా ఆమెపై సెటైర్లు వేస్తూ ఉంటాడు.

   గోవిందరాజులు కౌంటర్

  గోవిందరాజులు కౌంటర్

  అయితే జానకికి పరీక్షలు ఉన్నాయని ఆమె కొన్ని రోజులు ఇంట్లో పనులు చేయదు అని జ్ఞానాంబ మల్లికకు మరోసారి ఇంటి బాధ్యతను అప్పగిస్తుంది. ఇంట్లో పనులన్నీ కూడా నువ్వే చూసుకోవాలి అని చెప్పడంతో మల్లికా మరోసారి షాక్ అవుతుంది. ఈ తరుణంలో ఆమె పని చేసుకుంటూ ఎంతగానో బాధపడుతుంది. పక్కనే ఉన్న పనిమనిషి చికిత కూడా మల్లికపై సెటైర్లు వేస్తుంటుంది అత్తగారు అంటే తనకు ఏ మాత్రం భయం లేదు అని కూడా మల్లిక ఆమె ముందు గొప్పలు చెప్పుకుంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఆమెకు సరైన బుద్ధి చెప్పాలి అని గోవిందరాజులు సీన్లోకి ఎంట్రీ ఇస్తాడు. మల్లికా తుడుస్తూ ఉండగా బండలపై అదేపనిగా నడుచుకుంటూ వెళుతూ ఉంటారు. అయితే ఈ విషయం నేను అత్తయ్య గారికి చెబుతాను అంటూ మల్లిక చెప్పడంతో గోవిందరాజులు మరొక కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. నువ్వు అత్తయ్య గారిని ఇప్పుడు ఇక్కడికి పిలిస్తే ఇందాక నువ్వు మాట్లాడిన మాటలను ఈ ఫోన్లో ఆమెకు చూపిస్తానని చెప్తాడు. దీంతో వెంటనే మల్లికా మరోసారి ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉండిపోతుంది.

   జెస్సితో అఖిల్ షికారు

  జెస్సితో అఖిల్ షికారు

  ఇక ఇంట్లో అందరూ రాఖీ సెలబ్రేషన్స్ లో ఉండగా మరోవైపు జ్ఞానాంబ చిన్న కొడుకు అఖిల్ తన ప్రేయసి జెస్సి తో కలిసి షికారు చేస్తూ ఉంటాడు. ఆమెను బైక్ పై ఎక్కించుకొని విహారయాత్రలు చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా రాఖీ పండుగ రోజు ఆమె పుట్టినరోజు ఉండడంతో ప్రత్యేకంగా ఒక కానుక కూడా ఇస్తాను అని అంటాడు. అయితే ప్రేయసి జెస్సి మాత్రం నువ్వు మరొక బైక్ కొనుక్కోవాలి అని చెబుతోంది. తప్పకుండా మా అమ్మను అడిగి బైక్ కొంటాను అని అఖిల్ చెప్పడంతో ఆమె సంతోషపడుతుంది.

  వెన్నెల ఎమోషనల్

  వెన్నెల ఎమోషనల్

  ఇక ఇంట్లో అందరూ కూడా రాఖీ పండుగలు చాలా ఆనందంగా ఉంటారు. మొదట రామచంద్ర కు తన చెల్లి వెన్నెల రాఖీ కడుతుంది. రాఖీ కట్టే సమయంలో ఆమె చాల ఎమోషనల్ అవుతుంది. ఎప్పటికీ కూడా నువ్వే నా ధైర్యము అన్నయ్య అని వెన్నెల తన అన్నకు చెబుతూ ఉంటుంది. ఆ మూమెంట్ చూసి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎమోషనల్ అవుతారు. ఆ తరువాత విష్ణు కి కూడా వెన్నెల రాఖీ కడుతుంది. అయితే ఇదే సమయంలో జానకికి మాత్రం తన అన్నయ్యకు రాఖీ కట్టేందుకు వీలుపడదు. ఆ విషయాన్ని గుర్తు చేసుకొని గోవిందరాజులు జ్ఞానాంబ ఇద్దరు కూడా బాధపడతారు.

   బాధపెట్టాలని మల్లిక ప్లాన్

  బాధపెట్టాలని మల్లిక ప్లాన్


  అయితే మల్లిక తమ్ముడు కూడా అదే సమయంలో అక్కడికి వస్తాడు. చెప్పకుండానే వచ్చావు ఏమిటి అని మల్లికా అడగగా రాత్రి అత్తయ్య గారు ఫోన్ చేసి చెప్పారు అని అనడంతో మల్లిక కూడా ఎమోషనల్ అవుతున్నట్టు నటిస్తుంది. ఇక అదే అనువుగా చూసుకొని మల్లిక, జానకిని మరింత బాధ పెట్టాలని అనుకుంటుంది. ఈరోజు తన అన్నయ్యకు రాఖీ కట్టడం లేదు కాబట్టి ఆమెని కొన్ని మాటలతో బాధపెట్టాలని అనుకుంటుంది. మరి జ్ఞానాంబ ఆ విషయంలో ఏ విధంగా రియాక్ట్ అవుతుందో తదుపరి ఎపిసోడ్లో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Serial August 16th Episode 367
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X