For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu August 20th Episode: మరో అబద్ధం చెప్పిన రామచంద్ర.. అత్త చేతికి చిక్కిన జానకి!

  |

  జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతోంది. రెగ్యులర్ అత్త కోడళ్ల గొడవలు కాకుండా అందులో ఆప్యాయతను ఒక ప్రత్యేకమైన ఎమోషన్ ను ఎలివేట్ చేస్తున్న విధానం బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. జానకి, రామచంద్ర మధ్యలో కొనసాగుతున్న రొమాంటిక్ సీన్స్ యువతను కూడా ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఏ మాత్రం స్లో అవ్వకుండా సీరియల్ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను అందుకుంటోంది. ఇక రేటింగ్స్ విషయంలో కూడా టాప్ సీరియల్స్ కు పోటీగా నిలుస్తోంది. భార్య ఐపీఎస్ చదువు కోసం ఒక భర్త చేసే ప్రయత్నానికి తల్లి తెలియకుండానే అడ్డు పడితే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ గా ఉంది.

  ఇక దానికితోడు చిన్న కోడలు మల్లిక శత్రుత్వాన్ని పెంచికోవడం మరొక మేజర్ ప్లస్ పాయింట్స్. ఆ క్యారెక్టర్ నుంచి జానకి జీవితం అనేక రకాల మలుపులు తిరుగుతోంది. ఆమె భర్త రామచంద్ర చేస్తున్న పనులు తల్లి జ్ఞానాంబకు తెలిస్తే ఇంట్లో పెద్ద వివధాలు చెలరేగడం ఖాయం. జానకి పోలీస్ అవ్వాలన్న కోరిక ఎంతవరకు సక్సెస్ అవుతుందనే పాయింట్ ఈ సిరియల్ లో హైలెట్ గా నిలుస్తోంది. జ్ఞానాంబ కట్టుబాట్లు ఊహించని అనుభవాలను నేర్పుతోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 110వ ఎపిసోడ్ పై ఒక లుక్కేస్తే..

  Photo Courtesy: Star మా and Disney+Hotstar

  జానకి చదువు కోసం మరొక కీలకమైన నిర్ణయం

  జానకి చదువు కోసం మరొక కీలకమైన నిర్ణయం

  జానకిని కార్ఖానాకు వెళ్లమని జ్ఞానాంబ ఆదేశాలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆమెతో మూడు రోజులు అక్కడే పనులన్నీ నేర్చుకుంటూ భర్తను ఏ మాత్రం కలవడానికి వీల్లేదని చెబుతుంది. కానీ రామచంద్ర మాత్రం తల్లి మాటను లెక్క చేయకుండా జానకి చదువు కోసం మరొక కీలకమైన నిర్ణయం తీసుకుంటాడు. అంతే కాకుండా ఐపీఎస్ అవ్వడానికి మెయిన్స్ పరీక్షల కోసం దరఖాస్తు చేయిస్తాడు. ఆ నిర్ణయంతో జానకి భర్తకు మరింత దగ్గరవుతుంది.

   ఏదో ఒక రోజు ఈ విషయం బయట పడుతుంది

  ఏదో ఒక రోజు ఈ విషయం బయట పడుతుంది

  తన చదువు గురించి ఇంట్లో ఏ మాత్రం తెలియకూడదు అని జానకి అనేకసార్లు అనుకుంటుంది. భర్త తన కోసం పడుతున్న తాపత్రయం ఎలాంటి వివాదాలకు దారితీస్తుందో అని కంగారు పడుతూనే ఉంటుంది. ఇక చాలా సార్లు అత్తకు అసలు నిజాన్ని చెప్పాలని అనుకుంటుంది. కానీ భర్త మాటకు వెనకడుగు వేస్తుంది కూడా. అయితే మరోసారి ధైర్యం చేసి చెప్పే ప్రయత్నం చేయాలని అనుకుంటుంది. అయితే తప్పకుండా ఏదో ఒక రోజు ఈ విషయం బయట పడుతుందని ఆ విషయం గురించి ఆలోచించకుండా చదువు గురించి ముందడుగు వేయాలని రామచంద్ర చెబుతాడు. మీరు అనుకున్న కలను నెరవేర్చుకోకపోతే జీవితాంతం బాధపడాల్సి వస్తుందని పోలీస్ అవ్వాలనే కలను ఏ మాత్రం వదులుకోవద్దు అని భరోసా ఇస్తాడు.

   ఉలిక్కిపడిన జానకి

  ఉలిక్కిపడిన జానకి

  అయితే జానకి రామచంద్ర ఉదయాన్నే ఇంటికి రమ్మని చెప్పిన జ్ఞానాంబ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అని ఆలోచిస్తుంటారు. అయితే ఇద్దరినీ ఇంట్లో నుంచి బయటకు పంపి వేసినట్లు జానకి కల కంటుంది. ఆ కల నుంచి దెబ్బకి ఉలిక్కిపడి అసలు నిజాన్ని చెప్పాలని కూడా భర్తకు చెబుతుంది. కానీ రామచంద్ర ఏమాత్రం వెనక్కి తగ్గాడు ఉదయాన్నే తల్లి దగ్గరకు వెళ్ళిన రామచంద్ర ఎలాగోలా ఈ గండం నుంచి తప్పించుకోవాలని అబద్ధం చెబుతాడు.

  మల్లిక సంబరాలు

  మల్లిక సంబరాలు

  తండ్రి గోవిందరాజులు ఈసారికి క్షమించమని జ్ఞానాంబను బ్రతిమాలాడు కానీ అందుకు ఆమె ఏ మాత్రం ఒప్పుకోదు. మల్లిక అందరినీ ఒకేలా చూడమని నన్ను వేలెత్తి చూపిస్తుంది.. అందుకైనా నేను ఇప్పుడు సరైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తోంది. లేకపోతే ఇంట్లో కట్టుబాట్లు అన్నీ తారుమారు అవుతాయి అని జ్ఞానాంభ ఆగ్రహానికి గురవుతుంది.మరోవైపు మల్లిక జానకి ఇంట్లో నుంచి బయటికి వెళ్లి పోవడం ఖాయమని ఎంతగానో సంతోషిస్తుంది. ఆమె వెళ్ళిపోతుంటే తనకు తిరుగుండదని ఆ తర్వాత ఏకఛత్రాధిపత్యం నాదే సంబరపడిపోతుంది.

  మరో అబద్ధం చెప్పిన రామచంద్ర

  మరో అబద్ధం చెప్పిన రామచంద్ర

  ఇక రామచంద్ర జానకి ఇద్దరినీ కూడా జ్ఞానాంబ అనేక రకాల ప్రశ్నలతో సందిగ్ధంలో పడేస్తుంది. ఐదవ తరగతి చదివిన జానకిని సిటీలో ఉన్న కాలేజీకి ఎందుకు తీసుకువెళ్లారు అని ఆరా తీస్తుంది. అందుకు ఒక్కసారిగా షాక్ అయినా రామచంద్ర కొంతసేపు ఆలోచించి అబద్ధం చెబుతాడు. కాలేజీ పక్కనే ఉన్న ఒక గుడికి తీసుకువెళ్లాల్సి వచ్చిందని తండ్రి పుట్టిన రోజు కావడంతో ఆ గుడికి తప్పకుండా వెళ్లాలని ఒకరోజు తనతో జానకి చెప్పిందని అంటాడు. తనకు ఎంతో ఇష్టమైన తండ్రి కోసం గుడికి వెళ్లి పూజ చేయించి వచ్చామని చెబుతాడు.

  Hero Raj Tarun Talks About Co-Stars In Orey Bujjiga Movie
  మరో షాక్ ఇవ్వబోతున్న జ్ఞానాంబ

  మరో షాక్ ఇవ్వబోతున్న జ్ఞానాంబ

  మరోవైపు మల్లిక జ్ఞానంబ మనసులో చిచ్చు రేపే ప్రయత్నం చేస్తుంది. గోవింద రాజులు కూడా చిన్న కోడలిని అదుపులో పెట్టే ప్రయత్నం చేస్తాడు. కానీ జ్ఞానాంభ ఏ మాత్రం తగ్గకుండా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. మా ఇంట్లోకి వెళ్లిన జ్ఞానాంబ ఒక పళ్ళెంలో బట్ట కప్పుకొని తీసుకువస్తుంది. అందులో ఏముందో అని అందరూ ఒక్కసారిగా ఆలోచనలో పడతారు. జానకిని కూడా దగ్గరకు పిలిచి ఏదో చెప్పాలని అనుకుంటుంది. జానకి రామచంద్ర కూడా అందుకు షాక్ అవుతారు. ఇక అందులో తుపాకీ గాని కత్తి గాని ఏమైనా పెట్టుకొని వచ్చిందా అని మల్లిక అనుమానంతో ఆలోచిస్తుంది. ఇక బట్టకట్టిన పళ్లెంలో ఏముందని రామచంద్ర జానకి కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. మరి జానకి రామచంద్ర చేసిన తప్పుకు జ్ఞానాంబ ఎలాంటి షాక్ ఇస్తుందో తెలియాలి అంటే రేపటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

  English summary
  Janaki Kalaganaledu August 20th Episode:
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X