For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu August 23rd Episode: మరోసారి బెడిసికొట్టిన మల్లిక ప్లాన్.. జ్ఞానాంబ సర్‌ప్రైజ్‌

  |

  జానకి కలగనలేదు సీరియల్ ఒకరోజు సీరియస్ గా కొనసాగుతుంటే మరొకరోజు చాలా కూల్ గా మారుతోంది. అత్త కోడళ్ల గొడవల్లో కోపాలతో పాటు ఆప్యాయతలు అనురాగాలు కూడా చాలానే కనిపిస్తున్నాయి. జానకి చదువు కోసం భర్త పడే తాపత్రయం రోజుకో ట్విస్టును తలపిస్తోంది. ఇక మల్లిక పాము లాంటి పగ జానకిని తీవ్ర స్థాయిలో ఇబ్బందుల్లోకి నెట్టి వేస్తోంది.

  జానకి ఎంత సైలెంట్ గా ఉన్నా కూడా మల్లిక కుట్రలు ఏ మాత్రం ఆగడం లేదు. ఇక భర్త రామచంద్ర చేస్తున్న పనులు తల్లి జ్ఞానాంబకు తెలిస్తే ఇంట్లో పెద్ద వివధాలు చెలరేగడం ఖాయం. జానకి పోలీస్ అవ్వాలన్న కోరిక ఎంతవరకు సక్సెస్ అవుతుందనే పాయింట్ ఈ సిరియల్ లో హైలెట్ గా నిలుస్తోంది. జ్ఞానాంబ కట్టుబాట్లు ఊహించని అనుభవాలను నేర్పుతోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 111వ ఎపిసోడ్ పై ఒక లుక్కేస్తే..

  కండిషన్ పెట్టినప్పటికీ..

  కండిషన్ పెట్టినప్పటికీ..

  జానకిని కార్ఖానాకు వెళ్లమని చెప్పిన జ్ఞానాంబ మరోసారి ఎవరు ఊహించని విధంగా నిర్భయం తీసుకుంటుంది. మూడు రోజులు కార్ఖానాలో అక్కడే పనులన్నీ నేర్చుకుంటూ భర్తను ఏ మాత్రం కలవడానికి కండిషన్ పెట్టినప్పటికీ రామచంద్ర మాత్రం తల్లి మాటను లెక్క చేయకుండా జానకి చదువు కోసం కాలుస్తాడు. ఆమె విషయంలో మరొక కీలకమైన నిర్ణయం కూడా తీసుకుంటాడు. అంతే కాకుండా ఐపీఎస్ అవ్వడానికి మెయిన్స్ పరీక్షల కోసం దరఖాస్తు చేయిస్తాడు. ఆ నిర్ణయంతో జానకి భర్తకు మరింత దగ్గరవుతుంది.

  తల్లికి ఏమాత్రం తెలియకుండా

  తల్లికి ఏమాత్రం తెలియకుండా

  జానకి చదువు కోసం భర్త రామచంద్ర పడుతున్న తాపత్రయం అంతా ఇంతా కాదు. తల్లికి ఏమాత్రం తెలియకుండా జానకిని చదువు పూర్తి చేయించాలని అనేకరకాల ప్లాన్ చేస్తున్నాడు. అయితే అప్పుడప్పుడు మల్లిక కారణంగా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇప్పటికే మల్లిక మనసులో జానకి చదువు పై అనేక రకాల అనుమానాలు మొదలయ్యాయి. జానకి చదువు గురించి తెలుసుకునేందుకు అన్ని వైపులా నుంచి ఒత్తిడి పెంచుతోంది.

  మరో అబద్ధం చెప్పిన రామచంద్ర

  మరో అబద్ధం చెప్పిన రామచంద్ర

  ఇక ఇటీవల జానకిని చెప్పకుండా బయటికి తీసుకెళ్ళు విషయం తెలియడంతో జ్ఞానాంబ ఒక్కసారిగా ఆవేశానికి గురవుతుంది. ఇంట్లో అందరూ అందరి ముందు నిజం తెలుసుకోవాలని జానకి రామచంద్రలను ప్రశ్నిస్తుంది. అయితే మరోసారి తెలివిగా అబద్ధం చెప్పిన రామచంద్ర తల్లికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు.

  అసలు తాము కాలేజీకి వెళ్ళలేదు అంటూ కాలేజీ పక్కనే ఉన్న ఒక గుడి దగ్గరకు వెళ్లినట్లు చెబుతాడు. ఎందుకంటే ఆ రోజు జానకు వాళ్ళ తండ్రి పుట్టినరోజు కావడంతో అక్కడికి తప్పనిసరిగా వెళ్లాల్సి వచ్చిందని అంటాడు. జానకి కూడా ఆ విషయం తనతో చెప్పలేదని.. తనే ఆ విషయం గురించి తెలుసుకున్నట్లు చెబుతాడు.

  సర్‌ప్రైజ్‌ ఇచ్చిన జ్ఞానంబ

  సర్‌ప్రైజ్‌ ఇచ్చిన జ్ఞానంబ

  కొద్ది సేపు ఆలోచించిన జ్ఞానాంబ లోపలికి వెళ్లి బట్ట కప్పిన ఒక ప్లేట్ తీసుకొని వస్తుంది. అయితే అందులో ఏముందో అని అందరూ కొద్దిసేపటి వరకు ఆశ్చర్యానికి గురి అవుతారు. మల్లికని పిలిచిన జ్ఞానాంబ అందులో ఉన్న దాన్ని అందరికీ ఇవ్వమని చెబుతుంది. అసలు అందులో ఏముందో అని ఎంతో ఆతృతగా ఎదురు చూసిన మల్లిక స్వీట్స్ ఉన్నాయని తెలియడంతో షాక్ అవుతుంది.

  జానకి తండ్రి పుట్టిన రోజు సందర్భంగా అందరికీ స్వీట్స్ పంచాలని చెబుతుంది. అలాగే క్లాస్ప్ కూడా కొట్టడంతో తల్లి కోపం తగ్గిందని రామచంద్ర కూడా ఊపిరి పీల్చుకున్నాడు. తన మాటను తప్పినప్పటికి భార్య మనసును అర్థం చేసుకున్నందుకు జ్ఞానాంబ సంతోషం వ్యక్తం చేస్తుంది.

  నిజం ఎప్పటికైనా తెలియాల్సిందే..

  నిజం ఎప్పటికైనా తెలియాల్సిందే..

  అయితే జానకి మనడులో మాత్రం అత్త మంచి మనసును ఆసరాగా చేసుకుని అబద్దాలు చెప్పడం ఏమాత్రం నచ్చడం లేదని భర్తతో చెబుతోంది. ఇక మరో సారి రామ, జానకికి అర్థమయ్యేలా వివరిస్తాడు. ఈ నిజం ఎప్పటికైనా బయట పడాల్సి ఉంటుంది. మంచి పని కోసం ఈ విధంగా అడుగులు వెయ్యక తప్పదని అంటాడు.

  ఇక మరోవైపు మల్లిక తన ప్లాన్ మొత్తం డిజాస్టర్ అయ్యిందని కొంత బాధకు గురవుతుంది. దానికి తోడు జానకి జ్ఞానాంబ ఇద్దరు కూడా క్లోజ్ అవుతారు. జానకి కార్ఖానాలో పని చేయడానికి వెళ్లాలని అనుకుంటుంది. కానీ అప్పుడే జ్ఞానాంబ కోడలిని ఆపేస్తూ ఇక కార్ఖానాకు వెళ్లాల్సిన అవసరం లేదని అంటుంది.

  కోపం తట్టుకోలేకపోయిన మల్లిక

  కోపం తట్టుకోలేకపోయిన మల్లిక

  దీంతో జానకి ఒక్కసారిగా అత్త ప్రేమకు షాక్ అవుతూ ఇలాంటి అత్తమ్మ దొరికినందుకు చాలా అదృష్టవంతురాలిని అని సంబర పడుతుంది. మల్లికా కూడా అత్త పై ప్రశంసల జల్లు కురిపించే ప్రయత్నం చేస్తుంది కానీ అందుకు జ్ఞానాంబ కౌంటర్ ఇస్తుంది. అతి వినయం తగ్గించుకుంటే బెటర్ అని జానకిని చూసి నేర్చుకోవాలని కూడా అంటుంది.

  ఇక కోపం తట్టుకోలేకపోయిన మల్లిక ఆ కోపాన్ని భర్తపై చూపించేందుకు ప్రయత్నం చేస్తుంది. ఇంకా ఇంట్లో ఏ మాత్రం ఉండాల్సిన అవసరం లేదని ఇప్పుడే బయటకు వెళ్లి మరొక కాపురం పెడదామని ఉంటుంది.

  జానకి హెచ్చరిక

  జానకి హెచ్చరిక

  జానకిని అత్త మెచ్చుకోవడం తనకు ఏమాత్రం నచ్చలేదని కూడా ఉంటుంది. ఇక అదే సమయంలో వెనకాల నుంచి మల్లిక మాటలు విన్న జానకి కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. తనపై ఎందుకంత అసూయ అని అడుగుతుంది. ఇంత మంచి కుటుంబం నుంచి బయటకు వెళ్లాలని ఎలా అనిపిస్తోందని కూడా ఆరా తీస్తుంది.

  మీరు ప్రత్యేకంగా డబ్బులు దాచుకున్న విషయం తెలిసినప్పటికీ ఎవరు ఏమీ అనడం లేదు. అయినా కూడా ఇలా ప్రవర్తిస్తున్నావు ఇది మంచి పద్ధతి కాదు. మార్చుకోవడం బెటర్ అని జానకి హెచ్చరిస్తుంది.

  Prabhas ప్యాన్ ఇండియా స్టార్ నుండి Universal Star గా మారుతాడు | #PrabhasNagshwin || Filmibeat Telugu
  రామ ఏం చెప్పబోతున్నాడు..?

  రామ ఏం చెప్పబోతున్నాడు..?

  మరోవైపు జానకి రామచంద్ర తల్లి జ్ఞానాంభకు ఏదో చెప్పాలని అనుకుంటారు వెనకాల నుంచి వారిని గమనిస్తున్న మల్లిక ఏదో జరుగుతోందని మరోసారి అనుమానాలు వ్యక్తం చేస్తుంది. జానకి రామచంద్రతో ఏదో చెప్పించాలని గట్టిగానే ప్రయత్నం చేస్తుంది. తల్లి దగ్గరికి వెళ్లి రామచంద్ర సైలెంట్ గా నిలబడతాడు. అసలు రామచంద్ర ఏం చెప్పాలనుకుంటున్నాడో అని మల్లిక కూడా బుర్ర బద్దలు అయ్యేలా ఆలోచిస్తుంది. ఇక ఆ విషయం పై క్లారిటీ రావాలంటే రేపటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

  English summary
  Janaki Kalaganaledu Today Episode 111
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X