For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu December 12th: సునందదేవి ఇంటికి వెళ్లి వార్నింగ్ ఇచ్చిన జానకి.. పవర్ఫుల్ కౌంటర్!

  |

  జానకి కలగనలేదు సీరియల్ ఊహించని కథనంతో ముందుకు సాగుతోంది. జానకి చిన్న మరిది అఖిల్ తన ఫ్రెండ్ మాధురిపై హత్య ప్రయత్నం చేశాడాని ఆ ఘటనను నేను చూశానని జానకి అతడి పై కేసు కూడా పెడుతుంది. అయితే జానకి మాటలను ఫ్యామిలీలో మొదట ఎవరు నమ్మరు. ముఖ్యంగా జానకి తన భర్త ఒత్తిడి కారణంగా అలాగే కుటుంబం సంతోషం కారణంగా అఖిల్ మీద కేసును వెనక్కి తీసుకోవడం వలన తన ఐపిఎస్ చదువుకు న్యాయం చేయలేనెమో అని అనుకుంటుంది. ఆ చదువులు ఇంతటితో వదిలేయాలని కూడా అనుకుంటుంది. కానీ రామచంద్ర మాత్రం అలా జరగకూడదు అని అనుకుంటాడు. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ పెరిగాయి. 7.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 451 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

  కన్నబాబు కావాలనే చేశాడు

  కన్నబాబు కావాలనే చేశాడు

  అఖిల్ మాదిరిపై హత్యాయత్నం చేయడం నిజం కాదు అని తెలియడంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎంతగానో సంతోషిస్తారు. కన్నబాబు కావాలనే అఖిల్ ను ఇరికించేందుకు ప్రయత్నం చేశాడు అని కూడా జానకి కనుగొంటుంది. అయితే ఈ విషయంలో జానకిని మరోసారి అందరూ మెచ్చుకుంటారు. మొదట పొరపాటు జరిగినప్పటికీ ఆ తర్వాత మళ్లీ ఒక ఆడపిల్లకు అన్యాయం జరగకుండా కన్నబాబు పై కేసు పెట్టడం కూడా మంచిదే అని జ్ఞానాంబ మెచ్చుకుంటుంది. ఇక ఒకవైపు కుటుంబ సభ్యులు ఆనందంగా ఉన్నప్పటికీ మరొకవైపు మల్లిక కడుపు పోయింది అనే బాధపడుతూ ఉంటారు.

  న్యూ తప్పు కూడా ఉంది

  న్యూ తప్పు కూడా ఉంది

  అయితే అఖిల్ నిజానికి మాధురినీ కొంత గాయపరిచేలా చేయడం జానకి చూస్తుంది. కన్నబాబుది 70% తప్పు ఉంటే నీది 30% తప్పు ఉంది అని జానకి చెబుతుంది. అంటే నువ్వు నేరం చేసినట్లు కాదు. ఇకనైనా ఆలోచించి కుటుంబం కోసం పనిచేయడానికి కృషి చెయ్యి మీ అన్నయ్య ఎంతో కష్టపడుతున్నాడు. అలాగే మీరు రెండో అన్నయ కూడా వ్యాపారం చేసుకుంటున్నాడు. రేపు పుట్టబోయే బిడ్డ కోసం అయినా సరే నువ్వు ఏదో ఒక విధంగా కెరీర్ సెట్ చేసుకోవాలి అని జానకి అతనికి నచ్చచెబుతోంది. అయితే అఖిల్ మాత్రం కొంత అసహనంతోనే ఉంటూ పైకి మాత్రం సరే వదినా అని వినయంగా సమాధానం చెబుతాడు.

  కన్నబాబు వార్నింగ్

  కన్నబాబు వార్నింగ్

  ఇక కన్నబాబు వై కేసు పెట్టించడం వలన అతను అరెస్టయి ఉంటాడు అని అందరూ అనుకుంటారు. అయితే రామచంద్ర గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ కన్నబాబు హ్యాపీగా కారులో తిరుగుతూ ఉండడం చూస్తాడు. వెంటనే అతని దగ్గరికి వెళ్లే నువ్వు మాధురిపై హత్యాయత్నం చేయబోయి నా తమ్ముడిపై నేరం ముపేందుకు ప్రయత్నం చేశావు. నీ మీద కేసు పెట్టినా కూడా నువ్వు ఇలా బయట తిరుగుతున్నారు ఏంటి అని రామచంద్ర ప్రశ్నిస్తాడు. అతను పొగరుగా నేను కార్పొరేటర్ కొడుకుని అని, నా మీదే కేసు పెడితే జైల్లో కూర్చుంటాను అని అనుకున్నావా, నా మీద కేసు పెట్టిన ఎవరిని వదిలిపెట్టను అని రామచంద్రకు కూడా వార్నింగ్ ఇస్తాడు.

  వదిలిపెట్టను

  వదిలిపెట్టను

  ఇక రామచంద్ర ఆ విషయాన్ని ఇంటికి వచ్చి జానకితో చెబుతాడు. మీరు అతనిపై కేసు పెట్టినప్పటికీ మరొక అమాయకుడిని పై కేసు మోపి అతని జైల్లో పెట్టినట్లుగా తెలిసింది అని రామచంద్ర చెబుతాడు. ఇక దాంతో జానకి ఒక్కసారిగా షాక్ అవుతుంది. వెంటనే సునంద దేవి ఇంటికి వెళుతుంది అక్కడ ఆమెకు జానకి హెచ్చరిక చేస్తుంది. అయితే సునంద దేవి కూడా జానకి పై చాలా సీరియస్ అవుతుంది. నీ కొడుకు ఒక అమ్మాయికి అన్యాయం చేశాడు అని నేను ఇంకా ఐపీఎస్ కాలేదు అప్పుడే నీ కొడుకు పై కేసు పెట్టాను. సాక్షాలు కూడా రుజువు చేశాను. ఇక ఐపీఎస్ అయితే ఎలా ఉంటుందో ఊహించుకొ అని జానకి మరోసారి హెచ్చరిక చేస్తుంది.

  చిన్న కోడలికి సీమంతం

  చిన్న కోడలికి సీమంతం

  దీంతో సునంద దేవి ఏమీ మాట్లాడలేని పరిస్థితుల్లో ఉంటుంది. ఆ తర్వాత కన్నబాబు వచ్చినప్పటికీ అతనిపై కూడా జానకి సీరియస్ అవుతుంది. మరోసారి నా కుటుంబం దగ్గరికి వస్తే ఏ మాత్రం వదిలిపెట్టను అని జానకి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత జానకి అత్తగారి పరిస్థితిని చూసి షాక్ అవుతుంది. జ్ఞానాంబ తన మనవళ్ళతో ఆడుకోవాలని ఎంతగానో ఆశపడుతుంది. అయితే మల్లిక కడుపు పోయింది అని అబార్షన్ అయింది అని తెలియడంతో ఆమె ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంతేకాకుండా పిచ్చిదానిలా ప్రవర్తిస్తుంది. ఇక జానకి ఆ పరిస్థితిని చూసి ఎంతగానో బాధపడుతుంది. మల్లికా చేసిన మోసం గురించి కూడా ఆలోచిస్తుంది. ఇక ఆ తర్వాత రోజు చిన్న కోడలు వెన్నెల కూడా కడుపుతో ఉండడం వలన ఆమెకు సీమంతం చేయాలని అనుకుంటారు. అందుకోసం తగిన ఏర్పాట్లు కూడా చేయవలసిందిగా జ్ఞానాంబ తన కొడుకులకు చెప్తుంది. మరి మల్లిక విషయంలో జానకి ఏవిధంగా ఆలోచిస్తుందో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Serial December 12th Episode 451
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X