For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu December 13th: జెస్సి కోసం సీమంతం వేడుక.. బాధను దాచుకుంటున్న రామ, జానకి!

  |

  జానకి కలగనలేదు సీరియల్ మరో ఆసక్తికరమైన కథనంతో ముందుకు సాగుతోంది. జానకి చిన్న మరిది అఖిల్ తన ఫ్రెండ్ మాధురిపై హత్య ప్రయత్నం చేయడంతో ఆ ఘటనను చూసిన జానకి అతడి పై కేసు కూడా పెడుతుంది. అయితే జానకి మాటలను ఫ్యామిలీలో మొదట ఎవరు నమ్మరు. ముఖ్యంగా జానకి తన భర్త ఒత్తిడి కారణంగా అలాగే కుటుంబం సంతోషం కారణంగా అఖిల్ మీద కేసును వెనక్కి తీసుకోవడం వలన తన ఐపిఎస్ చదువుకు న్యాయం చేయలేనెమో అని అనుకుంటుంది. ఆ చదువులు ఇంతటితో వదిలేయాలని కూడా అనుకుంటుంది. కానీ రామచంద్ర మాత్రం అలా జరగకూడదు అని అనుకుంటాడు. అయితే జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ పెరిగాయి. 7.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 452 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

  బాధలో జ్ఞానాంబ

  బాధలో జ్ఞానాంబ

  జ్ఞానాంబ రెండవ కోడలు మల్లికా కడుపు వచ్చింది అని అబద్ధం చెప్పి ఐదు నెలల వరకు ఇంట్లోనే ఖాళీగా తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఏ పని చేయకుండా ఇష్టం వచ్చింది తింటూ ఎంజాయ్ చేసిన మల్లికా ఆఖరికి నిజం తెలిసే పరిస్థితి ఎదురవడంతో తన కడుపు పోయింది అనే విధంగా నాటకం ఆడుతుంది. అయితే మల్లికా ప్రెగ్నెంట్ కాదు అన్న విషయం జానకికి ముందే తెలుసు. కానీ ఆ విషయాన్ని ఇంట్లో చెప్తే మళ్లీ ఎలాంటి గొడవలు జరుగుతాయో అని ఆమె చెప్పకుండా ఉంటుంది. మల్లికా కడుపు పోవడంతో ఇంట్లో అందరూ కూడా బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా జ్ఞానాంబ మనవడు మనవరాళ్లతో ఆడుకోవాలని ఆలోచనలతోనే బాధపడుతూ ఉంటుంది.

  పంతులు సలహా

  పంతులు సలహా

  ఇక తన భర్త గోవిందరాజులతో కలిసి జ్ఞానాంబ ఉదయమే గుడికి వెళుతుంది. అక్కడ దీనంగా కూర్చుని ఉండడంతో పంతులుగారు వచ్చి అసలు విషయం గురించి అడిగి తెలుసుకుంటారు. అయితే ఈ బాధ నుంచి మీరు కోలుకోవాలని అంటే చిన్న కోడలు జెస్సి నాలుగో నెలతో ఉంది కదా.. ఆమెకు సీమంతం చేయండి అని సలహా ఇస్తాడు. ఏడవ నెల కదా సీమంతం చేసేది అని ఆమె అడిగినప్పటికీ కూడా ఎవరి ఆచారాలు వారివి అని నాలుగో నెలలో చేస్తే కూడా ఏమీ కాదు అని అన్నారు. దీంతో ఆలోచన బాగానే ఉంది అని గోవిందరాజులు అందుకు ఒప్పుకుంటారు.

  జెస్సి విషయంలో షాక్

  జెస్సి విషయంలో షాక్

  ఇక మరోవైపు రామచంద్ర జానకి ఇద్దరు కూడా జెస్సిని హాస్పిటల్ తీసుకెళ్తారు. అయితే అక్కడ డాక్టర్లు జెస్సి కడుపులో పెరుగుతున్న బిడ్డ ఎదుగుదలలో మార్పులు కనిపించడం లేదు అని.. ఇంకా కొన్ని టెస్టులు చేయాల్సి ఉంది అని అంటారు. అంతేకాకుండా మా ప్రయత్నం మేము చేస్తామని కాకపోతే మీరు హోప్స్ పెట్టుకోకండి అని కూడా అనడంతో జానకిరామచంద్ర ఒక్కసారిగా షాక్ అవుతారు. దీంతో ఆ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ జెస్సీకి అలాగే ఇంట్లో వాళ్లకు కూడా చెప్పొద్దని అనుకుంటారు. ఇక ఇంటికి రాగానే జ్ఞానాంబ జెస్సి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుంటుంది. డాక్టర్లు ఏమన్నారు అని అడుగుతుంది. అంతా బాగానే ఉంది అని కూడా జానకి చెబుతుంది.

  సంతోషాన్ని చెడగొట్టాలని

  సంతోషాన్ని చెడగొట్టాలని

  అయితే జెస్సికి సీమంతం చేయాలని అనుకుంటున్నాము అని జ్ఞానాంబ జానకి తో చెబుతుంది. దీంతో రామచంద్ర జానకి కొంత ఆలోచనలో పడతారు. ఇక మరోవైపు మల్లిక శ్రీమంతం చేయడంపై తీవ్ర సంతృప్తితో ఉంటుంది. తాను కూడా ఇంకో నెల రోజులు నాటకం ఆడి సీమంతం చేయించుకుని ఉంటే బాగుండేది అని అనుకుంటుంది. అయితే వాళ్లందరూ సీమంతం చేసుకుని సంతోషంగా ఉంటే నాకు నచ్చదు అని ఆ సంతోషాన్ని చెడగొట్టాలని మళ్ళీ అనుకుంటుంది.

  ఆనందంగా ఉండడంతో..

  ఆనందంగా ఉండడంతో..

  ఇక మరోవైపు రామచంద్ర కూడా ఇంట్లో అందరూ కూడా ఇప్పుడు ఆనందంగా ఉండడంతో అసలు నిజం చెప్పేందుకు వెనుకడుగు వేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జెస్సి కడుపులో పెరుగుతున్న బిడ్డ సమస్య గురించి తల్లికి చెప్పకూడదు అని రామచంద్రా అనుకుంటాడు. అయితే మరొకసారి టెస్ట్ చేయాలని వైద్యులు చెప్పారు కదా ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆలోచిద్దామని జానకి రామచంద్ర కు ధైర్యం చెబుతుంది.

  సీమంతం వేడుక

  సీమంతం వేడుక

  ఇక జ్ఞానాంబ మరుసటి రోజు జెస్సికి సీమంతం చేయాలని అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేయాలి అని రామచంద్రతో చెబుతుంది. ఇక వెంటనే జ్ఞానాంబ జెస్సి తండ్రికి కూడా ఫోన్ చేసి చెబుతుంది. అయితే జెస్సి తల్లి మాత్రం కేరళ వెళ్లింది అని అతను చెప్పడంతో మేరీ గారు వచ్చిన తర్వాత సీమంతం చేద్దామని జ్ఞానాంబ చెబుతుంది. అయితే తమవల్ల ఆ వేడుక ఆగిపోకూడదు అని మీరు జరిపించండి అని చెప్పడంతో జ్ఞానాంబ అందుకు ఒప్పుకుంటుంది. ఇక మరుసటి రోజు అందరూ కూడా సీమంతం వేడుకలతో హడావిడిగా కనిపిస్తూ ఉంటారు. ఇక ఈ క్రమంలో జానకి రామచంద్ర మధ్యలో మరో రొమాంటిక్ సన్నివేశం చోటు చేసుకుంటుంది. మరి మల్లికా ఏ విధంగా ఆలోచిస్తుందో తదుపరి ఎపిసోడ్లు చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Today Episode 452
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X