Don't Miss!
- News
ఫిబ్రవరి 7.. `రాజధాని అమరావతి`కి బిగ్ డే..!!
- Lifestyle
ఎరుపు రంగు హ్యాండ్లూమ్ చీరలో నిర్మలా సీతారామన్, శక్తిని, ధైర్యానికి సంకేతంగా..
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Finance
Stock Market: మార్కెట్ల బడ్జెట్ దూకుడు.. నష్టపోయిన స్టాక్స్.. లాభపడిన స్టాక్స్ ఇవే..
- Technology
Samsung కొత్త ఫోన్లు లాంచ్ ఈ రోజే! లైవ్ ఈవెంట్ ఎలా చూడాలి,వివరాలు!
- Sports
వికెట్ తీసిన తర్వాత అతి చేష్టలు.. స్టార్ ఆల్‌రౌండర్‌పై అంపైర్ గుస్సా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Janaki Kalaganaledu December 21st: జానకి గురించి తప్పుగా ఆలోచిస్తున్న అఖిల్.. రామ కంట్రోల్!
జానకి కలగనలేదు సీరియల్ కథ రోజురోజుకు ఎంతో ఆసక్తిగా మారుతోంది. జ్ఞానాంబ చిన్న కోడలు గర్భవతి అవుతుంది. అయితే కడుపులో బిడ్డకు అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఇక ఆమె భర్త అఖిల్ ఏ పని లేకుండా ఖాళీగా ఉంటాడు. ఇక అతను ఎదో ఒక రకంగా సెటిల్ అయితే బాగుంటుంది అని జానకి కూడా అనుకుంటుంది. కానీ అఖిల్ జానకి పై కోపం తెచ్చుకుంటాడు.
ఇక జానకి ఆ విషయంలో గొడవలు రాకుండా చేయాలని అనుకుంటుంది. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ పెరిగాయి. 7.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 458 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

ఉద్యోగం కోసం
ఎలాగైనా అఖిల్ స్థిరపడేలా చేయాలని రామచంద్ర ఆలోచిస్తూ ఉంటాడు. అయితే అతని స్నేహితుడు కొత్తగా కంపెనీ పెట్టడంతో అందులో ఏదైనా జాబ్ ఉంటే చూడాలి అని రామచంద్ర సహాయం అడుగుతాడు. తప్పకుండా మీ తమ్ముడికి జాబ్ ఇస్తాను అని కూడా అతను చెప్పడంతో రామచంద్ర అతని కార్డు తీసుకొని ఇంటికి వస్తాడు.
ఇక అదే విషయాన్ని జానకి తో కూడా చెబుతాడు. ఇక జానకి కూడా ఎంతగానో సంతోషిస్తుంది. అయితే ఈ కార్డు గురించి మీరే అఖిల్ తో చెప్పాలి అని రామచంద్రా జానకితో చెప్పినప్పటికీ కూడా ఆమె అందుకు ఒప్పుకోదు. మళ్ళీ నేను ఈ విషయం గురించి చెబితే అఖిల్ తప్పుగా అర్థం చేసుకుంటాడు అని అలాంటి సమస్య రావద్దు అంటే నేను దూరంగానే ఉండాలి అని జానకి చెబుతుంది.

అఖిల్ కోపంగా..
ఇక రామచంద్ర జానకి చెప్పిన మాటలకు ఏమీ మాట్లాడకుండా సరే అంటూ అఖిల్ దగ్గరకు వెళ్తాడు. అయితే అఖిల్ జాబ్ రాలేదు అని టెన్షన్ లో ఉంటాడు. అంతేకాకుండా ఇంట్లో వాళ్ళు చిన్న చూపు చేసి మాట్లాడుతున్నారు అని తనలో తానే ఆలోచించుకుంటూ కోపంగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక అప్పుడే అతని భార్య జెస్సి వచ్చి మల్లిక అక్క చెప్పింది వినవచ్చు కదా అని మాట్లాడుతుంది.
దీంతో అఖిల్ కు మరింత కోపం వస్తుంది. అప్పుడే రామ వచ్చి తన స్నేహితుడు కొత్తగా కంపెనీ పెట్టాడు అని అందులో నీకు జాబ్ వచ్చేలా చేస్తాను అని ఈ కార్డు తీసుకుని ఉదయానే వెళ్ళు అని అంటాడు.

తప్పుగా ఆలోచిస్తున్న అఖిల్
అయితే అఖిల్ మాత్రం అందుకు ఒప్పుకోడు. నాకు ఒకరి వల్ల వచ్చే జాబ్ ఏమీ అవసరం లేదు అని రేపు నీ కారణంగా జాబ్ వస్తే మళ్ళీ వదిన మా వల్లే జాబ్ వచ్చింది అని చిన్నచూపు చూస్తుంది అని తప్పుగా అర్థం చేసుకుంటాడు.
ఎంత నచ్చ చెప్పినప్పటికీ కూడా అఖిల్ ఆ విషయంలో ఒప్పుకోకపోవడంతో సొంతంగా ప్రయత్నం చేస్తాను అని ఉంటాడు. సరే అంటూ రామచంద్ర కార్డు తీసి అతనికి ఇస్తాడు. ఇక జానకి ఇంట్లో పరిస్థితులను ఆలోచిస్తూనే తన చదువును కూడా కొనసాగిస్తుంది.

కంట్రోల్ చేసుకున్న రామ
త్వరలోనే ఐపీఎస్ మెయిన్ పరీక్షలు ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో సీరియస్ గా చదువుకోవాలి అని అనుకుంటుంది. ఇక ఆమె చదువుకుంటూ ఉంటే రామచంద్ర అదేపనిగా చూస్తూ ఉంటాడు. తనను తాను కంట్రోల్ చేసుకుంటూ మళ్ళీ నిద్రలోకి జారుకుంటాడు. ఇక ఆ తర్వాత ఉదయం కూడా జానకి బయట పనులు చేస్తూ ఉంటే ఆమెను రామచంద్ర చూస్తూ ఉంటాడు. మీ చూపులు నాకు తగులుతున్నాయి అని జానకి నవ్వుతూ చెబుతుంది. మళ్లీ మనం కంట్రోల్ తప్పకూడదని రామచంద్ర సరదాగా చెబుతూ ఉంటాడు.
|
సొంతంగా జాబ్ సంపాదించుకుంటాను
ఇక అఖిల్ అప్పుడే ఇంటర్వ్యూ కోసం బయలుదేరాలని అనుకుంటాడు ఇక రామచంద్ర నేను ఆఫీస్ దగ్గర దిగబెడతాను అంటూ అఖిల్ కు చెబుతాడు. పరవాలేదు అన్నయ్య నేను వెళ్తాను అని చెప్పినప్పటికీ కూడా రామచంద్ర చిన్నప్పుడు నిన్ను స్కూల్లో నేనే తీసుకెళ్ళాను మర్చిపోయావా అని అనడంతో అఖిల్ సరే అని ఒప్పుకుంటాడు.
ఇక ఆఫీస్ కు వెళ్లిన తర్వాత అక్కడ చివరిసారిగా రామచంద్ర మరోసారి అఖిల్ కు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తాడు. నేను ఏదైనా చెబితే నీకు తప్పకుండా జాబ్ వస్తుంది అని మాట్లాడినప్పటికీ కూడా అఖిల్ అందుకు ఒప్పుకోడు. నేను సొంతంగా జాబ్ సంపాదించుకుంటాను అని అంటాడు.

జానకి ఫోన్ కాల్
ఇక అఖిల్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూలో వివిధ రకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఆ సమయంలో అఖిల్ కూడా ఎంతో ఓపికగా సమాధానం చెబుతూ ఉంటాడు. అయితే అఖిల్ ఇంటర్వ్యూ ముగిసిన తర్వాత సైలెంట్ గా బయటకు వెళ్లిపోతాడు. ఆ తర్వాత రామచంద్ర మళ్ళీ అదే ఆఫీసుకు వచ్చి తన స్నేహితున్ని కలుస్తాడు.
అఖిల్ గురించి చెబుతాడు. ఇక మరోవైపు జానకి తన తల్లిదండ్రుల ఆప్తికం ఉంది అని మా అన్నయ్య వదినలకు ఫోన్ చేశారు అని వెళ్లాలి అని అంటుంది. అయితే తనకు ఆలస్యం అవుతుంది అని ఇప్పట్లో రాలేను అని నువ్వు వెళ్ళు నేను తర్వాత వస్తాను అని అంటాడు. మరి అఖిల్ కు నిజంగా జాబ్ వచ్చిందో లేదో తదుపరి ఎపిసోడ్ లో చూడాలి.