Don't Miss!
- Finance
7th cpc: ప్రభుత్వ ఉద్యోగులకు పెరగనున్న జీతాలు.. ఎప్పుడు, ఏమేమి పెరుగుతాయో తెలుసా..!
- Sports
అయ్యర్ స్థానంలో అతన్ని ఆడించండి.. శుభ్మన్ గిల్ మాత్రం వద్దు: దినేశ్ కార్తీక్
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- News
ఉత్తరాంధ్రలో టీడీపీకి అగ్నిపరీక్ష: ఆ నియోజకవర్గం అభ్యర్థి మార్పు- బాలయ్య ప్రచారం చేసినా..
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Janaki Kalaganaledu December 23rd: తమ్ముడి కోసం ఇంటి పాత్రలు తాకట్టు పెట్టిన రామ.. జానకి షాక్!
జానకి కలగనలేదు సీరియల్ కథనం మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. జ్ఞానాంబ చిన్న కోడలు జెస్సి గర్భవతి అవుతుంది. కానీ కడుపులో బిడ్డకు అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇక ఆమె భర్త అఖిల్ ఏ పని లేకుండా ఖాళీగా ఉంటాడు. ఇక అతను ఎదో ఒక రకంగా సెటిల్ అయితే బాగుంటుంది అని జానకి, రామ కూడా కోరుకుంటారు. కానీ అఖిల్ జానకి పై కోపం తెచ్చుకుంటాడు.
జానకి ఆ విషయంలో గొడవలు రాకుండా చేయాలని అనుకుంటుంది. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ పెరిగాయి. 7.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 460 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

అఖిల్ ఉద్యోగం కోసం రామ ఆలోచన
రామచంద్ర చిన్ననాటి స్నేహితుడు చరణ్ కొత్తగా ఒక కంపెనీ పెట్టబోతున్నట్లు తెలుసుకున్న రామచంద్ర అందులో తన తమ్ముడు అఖిల్ కి కూడా ఒక ఉద్యోగం వచ్చేలా చేయాలని అనుకుంటాడు. అయితే రామచంద్ర స్నేహితుడు చరణ్ మాత్రం అతను చదువు తగ్గట్టుగా జాబ్ ఇవ్వలేను అని ఏదైనా చిన్న జాబ్ దొరుకుతుంది అని అంటాడు.
అంతేకాకుండా మంచి జాబ్ కావాలి అంటే నేను స్టార్ట్ చేయబోతున్న కొత్త ప్రాజెక్టులో కొంత డబ్బు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది అని చెబుతాడు. అందుకోసం దాదాపు 20 లక్షల అవసరమవుతుంది అని అంత డబ్బు సమకూరుతాయా? అని చరణ్ అడగడంతో రామచంద్ర ఒక్కసారిగా ఆలోచనలో పడతాడు.

రామచంద్ర ఎంత చెప్పినా..
ఇక ఆ డబ్బును ఎలాగైనా తీసుకొచ్చి చరణ్ కు ఇచ్చి తన తమ్ముడికి ఉద్యోగం వచ్చేలా చేయాలని రామ అనుకుంటాడు. ఇక రామచంద్ర పూర్తి స్థాయిలో ఆ విషయం గురించి ఆలోచించి జానకి చెప్పిన విషయం గురించి మర్చిపోతాడు. జానకి తన తల్లిదండ్రుల ఆప్తికం అని రామచంద్ర కు ముందే చెబుతుంది. తప్పకుండా రావాలి అని అన్నయ్య వదిన కూడా నిన్ను అడిగారు అని అంటుంది.
అయితే రామచంద్ర మాత్రం డబ్బు గురించి జానకి తో చెప్పాలి అని అనుకుంటాడు. కానీ జానకి మాత్రం ఇప్పుడు ఫోన్లో ఏమీ మాట్లాడడానికి వీలు పడదు అని మీరు తొందరగా మా అన్నయ్య దగ్గరకు రావాలి అంటూ అక్కడ మాట్లాడుకుందాం అని జానకి చెబుతుంది. రామచంద్ర ఎంత చెప్పినా కూడా జానకి పట్టించుకోకుండా ఫోన్ పెట్టేస్తుంది.

తాకట్టుగా ఇంటి పత్రాలు
ఇక ఆ తర్వాత రామచంద్ర ఊహించని విధంగా ఆలోచిస్తాడు. ఎలాగైనా 20 లక్షలు సమకూర్చి తమ్ముడికి జాబ్ వచ్చేలా చేయాలి అని ఇంటి పత్రాలను తాకట్టు పెట్టాలని అనుకుంటాడు. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్లి అర్జెంటుగా 20 లక్షలు కావాలి అని తాకట్టుగా ఇంటి పత్రాలు పెట్టుకోవాలి అని చెబుతాడు.
ఇక వడ్డీ వ్యాపారి రామచంద్ర గురించి తెలిసి ఒక్కసారిగా అంత డబ్బు ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. అంతేకాకుండా ఒక తెల్ల కాగితంపై అతను సంతకం కూడా పెట్టించుకుంటాడు. అయితే మొదట రామచంద్ర ఈ సంతకాలు ఏమిటి అని అడుగుతాడు కానీ ఏదో కొన్ని ఫార్మాలిటీస్ కు అని తర్వాత మరిన్ని సంతకాలు పెట్టాల్సి ఉంటుంది అని చెబుతాడు. దీంతో రామచంద్ర సరే అని అతని నమ్మి సంతకాలు పెడతాడు.

ఎవరికీ తెలియకుండా
ఆ తర్వాత ఆ డబ్బు తీసుకువెళ్లే తన స్నేహితుడు చరణ్ కు ఇస్తాడు. ఈ డబ్బు తీసుకొని మా తమ్ముడికి మంచి ఉద్యోగం ఇప్పించాలి అని ఈ జాబ్ వాడికి చాలా ముఖ్యమని కూడా రామ చెబుతాడు. అంతేకాకుండా ఈ డబ్బు నేను ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఇంటి పత్రాలు తాకట్టుపెట్టి తీసుకువచ్చాను అని కూడా రామచంద్ర చెప్పడంతో అందుకు చరణ్ కొంత ఆలోచిస్తాడు.
నువ్వు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నట్లు ఉన్నావు నాకు ఈ డబ్బు అవసరం లేదు మీ తమ్ముడికి మరొక ఉద్యోగం వచ్చేలా చూస్తాను అని.. కావాలంటే డబ్బు తీసుకు వెళ్ళమని అంటాడు. కానీ రామచంద్ర మాత్రం అలా ఏమీ లేదు అని ఏదో టెన్షన్ లో ఆ విధంగా మాట్లాడాను అని, నువ్వు ఈ డబ్బు తీసుకొని వెంటనే తమ్ముడికి ఉద్యోగం ఇవ్వాలి అని పదేపదే చెబుతూ ఉంటాడు.
|
జానకి షాక్
ఇక తప్పకుండా అంటూ చరణ్ మరొక విషయాన్ని కూడా చెబుతాడు. మరో మూడు నెలల్లోనే ఈ డబ్బు మొత్తం వెనక్కి వచ్చేలా చేస్తాను అని కూడా అంటాడు. దీంతో రామచంద్ర కొంత సంతోషిస్తాడు. ఆ తరువాత మరోవైపు జానకి తన తండ్రి అప్తికంలో పాల్గొంటూ రామచంద్ర రాకపోవడంతో కొంత బాధపడుతూ ఉంటుంది.
అయితే ఇంట్లో అఖిల్ ఉద్యోగం గురించి తన అన్నయ్యకు చెప్పడంతో అఖిల్ కు యోగి సహాయం చేయడానికి ఒప్పుకుంటాడు. ఇక జానకి ఇంటికి వచ్చిన తర్వాత రామచంద్ర అసలు విషయం చెబుతాడు. అఖిల్ ఉద్యోగం కోసం 20 లక్షల అవసరం పడటంతో నేను ఇల్లు తాకట్టుపెట్టి డబ్బులు ఇచ్చాను అని ఇక వాడికి ఉద్యోగం చేసినట్టే అని చెబుతాడు. దీంతో జానకి ఒక్కసారిగా షాక్ అవుతుంది. వెంటనే ఈ విషయాన్ని అత్తయ్య గారితో చెబుతాను అని అంటుంది. మరి జానకి ఆ విషయాన్ని నిజంగా చెబుతుందో లేదో తదుపరి ఎపిసోడ్ లో చూడాలి.