For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu December 27th: హ్యాపీగా ఉన్న సమయంలో అపశకునం.. మళ్ళీ టెన్షన్ లో జానకి!

  |

  జానకి కలగనలేదు రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతోంది. జ్ఞానాంబ చిన్న కుమారుడు అఖిల్ ఏ పని లేకుండా ఖాళీగా ఉంటాడు. ఇక అతను ఎదో ఒక రకంగా సెటిల్ అయితే బాగుంటుంది అని ఇంట్లో వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. ఇక జానకి, రామ కూడా అదే ఆలోచిస్తారు. అయితే అఖిల్ మాత్రం జానకి పై కోపం తెచ్చుకుంటాడు. జానకి ఆ విషయంలో గొడవలు రాకుండా చేయాలని అనుకుంటుంది.

  ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ పెరిగాయి. 7.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 462 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

  ఉద్యోగం వచ్చేలా..

  ఉద్యోగం వచ్చేలా..

  మొత్తానికి రామ తన తమ్ముడా ఉద్యోగం వచ్చేలా చేస్తాడు. తన చిన్ననాటి మిత్రుడు చరణ్ కొత్తగా ఒక కంపెనీ పెట్టాలని అనుకుంటాడు. అయితే రామచంద్ర ఆ కంపెనీలో నా తమ్ముడికి కూడా జాబ్ వస్తే బాగుంటుంది అని ఆలోచించి అతనితో మాట్లాడుతాడు. అయితే చరణ్ మాత్రం ఈ కంపెనీలో మీ తమ్మునికి మంచి జాబ్ రావాలి అంటే ఒక 20 లక్షలు కట్టాలి అని మళ్ళీ మూడు నెలల్లోనే ఆ డబ్బు వెనక్కి వచ్చేలా చేస్తామని అంటాడు.

  దీంతో రామచంద్ర తమ్ముడు జాబ్ కోసం ఇంటి పత్రాలను తాకట్టు పెట్టి 20 లక్షలు అప్పు చేస్తాడు. ఇక చరణ్ ను నా తమ్ముడికి జాబ్ వచ్చిందని ఫోన్ చేయమని రామ చెబుతాడు. ఇక చరణ్ కూడా అఖిల్ కు ఫోన్ చేసి ప్రాజెక్ట్ మేనేజర్ గా జాబ్ వచ్చిందని అంటాడు.

  ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు

  ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు

  ఇక అఖిల్ కు జాబ్ వచ్చింది అని ఇంట్లో వాళ్ళందరికీ తెలియడంతో ఎంత సంతోషిస్తూ ఉంటారు. ఇక రామచంద్రం మాత్రం ఇంటి పత్రాలను తాకట్టు పెట్టినట్లుగా ఎవరితోనో చెప్పడు. జానకితో మాత్రమే అతను చెబుతాడు. కానీ జానకి అది మోసం అని అనుమానిస్తుంది. అనవసరంగా మీరు డబ్బులు ఇచ్చారు అని ఇలాంటి మోసాలు చాలా జరుగుతాయి అని జానకి చెబుతుంది.

  కానీ రామచంద్ర మాత్రం తన చిన్ననాటి స్నేహితుడు అని అలా మోసం చేయడు అని అంటాడు. ఇక జానకికి చివరికి నచ్చజెప్పిన రామచంద్ర ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారని ఈ సమయంలో ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు అని బ్రతిమాలతాడు. దీంతో జానకి కూడా ఏమీ అనలేని పరిస్థితుల్లో ఉంటుంది.

  ఆనందంలో జ్ఞానాంబ ఫ్యామిలీ

  ఆనందంలో జ్ఞానాంబ ఫ్యామిలీ

  ఇక అఖిల్ కు జాబ్ వచ్చింది అని ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా ఉంటారు. ముఖ్యంగా తల్లి జ్ఞానాంబతో పాటు తండ్రి గోవిందరాజులు కూడా బయట కూర్చుని అందరూ కలిసి భోజనాలు చేయాలని అనుకుంటారు. ఇక కుటుంబ సభ్యులందరూ కూడా ఎంత ఆడుతూ పాడుతూ కనిపిస్తారు.

  ఆ సంతోషాన్ని చూసిన రామచంద్ర కూడా ఎంతగానో ఆనందపడతారు. ఈ సంతోషం మొత్తం కూడా అఖిల్ కు జాబ్ రావడం వల్లనే తల్లిదండ్రులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తారు.

  జానకిలో టెన్షన్

  ఈ క్రమంలో గోవిందరాజులు మల్లికను ఆట పట్టిస్తూ ఆమెపై సెటైర్లు వేస్తూ ఉంటాడు. ఇక జ్ఞానాంబ అయితే రామ, జానకి లను మరింత ఎక్కువగా నమ్ముతుంది. ఇక జానకి మాత్రం రామచంద్ర ఇంటి పత్రాలను తాకట్టు పెట్టి తీసిన డబ్బు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ విషయం తెలిస్తే పరిస్థితులు ఎలా మారిపోతాయో అని ఆమె ఆందోళన చెందుతూ ఉంటుంది. అయితే అందరూ సంతోషంగా ఉన్నా కూడా జానకి వదిన సంతోషంగా ఎందుకు లేదు అని అఖిల్ కూడా కొంత అనుమానాన్ని వ్యక్తం చేస్తాడు.

   అంతా మంచే జరుగుతుంది

  అంతా మంచే జరుగుతుంది

  ఇక మరోవైపు గోవిందరాజులు కలిసి ఉదయాన్నే గుడికి వెళతారు. కొబ్బరికాయ కొట్టగా అది పాడైపోయి ఉంటుంది. దీంతో ఏదో అపషకుణం పొంచి ఉందేమో అని గోవిందరాజులు జ్ఞానాంబ ఇద్దరు కూడా ఆందోళన చెందుతూ ఉంటారు. ఇక అదే విషయాన్ని పంతులు గారికి చెప్పగా ఆయన ప్రత్యేకంగా పూజ నిర్వహించి ఒక కలశం ఇవ్వడం జరుగుతుంది.

  దాన్ని ఇంట్లో పెట్టుకుంటే అంతా మంచే జరుగుతుంది అని అంటారు. దీంతో జ్ఞానాంబ గోవిందరాజులు దాన్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకువెళ్తారు. ఇక ఇంటి దగ్గర మల్లికా తన చీర తానే కుట్టుకుంటూ డబ్బులు ఆదా చేస్తున్నట్లు చెబుతూ ఉంటుంది. ఇక పనిమనిషి చికిత మాత్రం ఆమెపై గ్యాప్ లేకుండా సెటైర్స్ వేస్తూ ఉంటుంది.

  దోషాలు పోవాలంటే..

  దోషాలు పోవాలంటే..

  ఈ క్రమంలో రామచంద్ర జానకిని చూసి మల్లిక ఎంతకనో కుల్లుకుంటుంది. ఇక తర్వాత గోవిందరాజులు జ్ఞానాంబ కూడా కొంత బాధతో ఇంటికి వస్తూ ఉంటారు. వారి చేతిలో కలశాన్ని చూడగా మల్లికా ఎందుకు దాన్ని తెచ్చారు అని అనుకుంటుంది. వెంటనే ఇంట్లోకి వెళ్లి అడుగుతుంది.

  ఇంట్లో కొన్ని దోషాలు ఉన్నాయని అవి పోవాలంటే దీని ఇంట్లో పెట్టుకోవాలని పంతులుగారు చెప్పినట్లుగా ఆమె చెబుతుంది. ఇక ఆ మాట చెప్పగానే జానకి కొంత టెన్షన్ పడుతుంది మరి ఈ పరిస్థితులలో జానకి తీసుకుని నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయో తదుపరి ఎపిసోడ్ లో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Today Episode 462
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X