Don't Miss!
- News
mother: కూతురితో కలిసి ఆత్మహత్య చేసుకున్న తల్లి, అంగన్ వాడి టీచర్ ఇంట్లో ?
- Finance
7th cpc: ప్రభుత్వ ఉద్యోగులకు పెరగనున్న జీతాలు.. ఎప్పుడు, ఏమేమి పెరుగుతాయో తెలుసా..!
- Sports
అయ్యర్ స్థానంలో అతన్ని ఆడించండి.. శుభ్మన్ గిల్ మాత్రం వద్దు: దినేశ్ కార్తీక్
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Janaki Kalaganaledu December 30th: స్నేహితుడిని నమ్మి మోసపోయిన రామ.. ఫ్యామిలీకి బిగ్ షాక్!
జానకి కలగనలేదు సీరియల్ మరో ఆసక్తికరమైన కథాంశంతో కొనసాగుతోంది. రామ చిన్న తమ్ముడు అఖిల్ ఏ పని లేకుండా ఖాళీగా ఉండడంతో అతను సెటిల్ అయితే బాగుంటుంది అని ఇంట్లో వాళ్ళు అందరూ కోరుకుంటూ ఉంటారు. ఇక జానకి, రామ కూడా అదే ఆలోచిస్తారు. అయితే అఖిల్ మాత్రం జానకి పై కోపం తెచ్చుకుంటాడు. జానకి ఆ విషయంలో గొడవలు రాకుండా చేయాలని అనుకుంటుంది. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ పెరిగాయి. 7.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 465 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

ఎవరికి చెప్పకూడదని..
రామచంద్ర తన తమ్ముడికి మంచి జాబ్ రావాలి అని తన స్నేహితుడికి 20 లక్షలు ఇచ్చి ఒక జాబ్ ఇప్పించాలని కోరుకుంటాడు. అయితే ఆ డబ్బు విషయం గురించి అందరికీ ఇంట్లో తెలియడంతో ఒక్కసారిగా షాక్ అవుతారు. అసలు మొదట ఆ విషయాన్ని రామచంద్ర ఇంట్లో చెప్పకూడదు అని అనుకుంటాడు. ఎందుకంటే అఖిల్ తన సొంత టాలెంట్ తోనే జాబ్ సంపాదించాలని అనుకుంటాడు. ఇక రామచంద్ర తన స్నేహితుడు చరణ్ కు చెప్పి డబ్బు ఇస్తున్నట్లుగా కూడా ఎవరికి చెప్పకూడదు అని మాట తీసుకుంటాడు. ఇక అఖిల్ కు మాత్రం జాబ్ వచ్చినట్లుగా చరణ్ ఫోన్ చేస్తాడు. ఇక తర్వాత అఖిల్ తన టాలెంట్ తోనే జాబ్ వచ్చింది అని కూడా అనుకుంటాడు.

స్వలాభం కోసమే 20 లక్షలు అప్పు
అయితే ఆ విషయాన్ని రామచంద్రం మాత్రం ఇంట్లో ఎవరికీ చెప్పడు. కానీ అతను ఇంటి పత్రాలను తాకట్టుపెట్టి 20 లక్షల అప్పులు తీసుకువస్తాడు. ఇక అప్పు ఇచ్చిన వ్యక్తి ఇంటికి రావడంతో అసలు విషయం మొత్తం బయటకు వస్తుంది. ఇక ఈ విషయంలో రెండవ కోడలు మల్లిక జానకి పై నిందలు వేయాలని అనుకుంటుంది. అఖిల్ జాబ్ కోసం అని చెప్పి ఈ తరహాలో నాటకాలు ఆడుతున్నారు అని వారి స్వలాభం కోసమే 20 లక్షలు అప్పు చేసి ఉంటారు అని మల్లిక మాట్లాడుతుంది. అయితే నిజంగా తాను అఖిల్ కోసమే 20 లక్షల అప్పు చేశాను అని రామచంద్ర మరోసారి గట్టిగా చెబుతాడు. అంతే కాకుండా దీన్ని నిరూపిస్తాను అని కూడా అతను చరణ్ ఆఫీస్ దగ్గరకు ఇంట్లో వాళ్ళను తీసుకువెళ్లాలని అనుకుంటాడు.

చరణ్ మోసం
అఖిల్
తో
పాటు
తన
తండ్రి
గోవిందరాజులను
కూడా
వెంట
తీసుకొని
వెళ్లాలని
అనుకుంటాడు.
ఇక
వారి
వెంట
రెండవ
తమ్ముడు
విష్ణు
కూడా
వస్తాడు.
అయితే
ఆఫీస్
దగ్గరికి
వెళ్లి
చూస్తే
అక్కడ
ఎవరూ
ఉండరు.
ఇంతకుముందు
చరణ్
ఉన్న
ఆఫీస్
మొత్తం
కూడా
ఖాళీగా
కనిపిస్తూ
ఉంటుంది.
ఇక
అక్కడ
ఉన్న
వాచ్
మెన్
వచ్చి
ఎవరికోసం
చూస్తున్నారు
అని
అడుగుతాడు.
అయితే
ఇక్కడ
చరణ్
అని
కొత్తగా
ఒక
సాఫ్ట్
వేర్
కంపెనీ
పెట్టాడు
కదా
అతను
ఎక్కడ
అని
అడుగుతారు.
అయితే
అతను
నిన్ననే
ఆఫీస్
మొత్తం
ఖాళీ
చేసి
వెళ్ళిపోయారు
అని
మీలాగే
చాలామంది
వచ్చి
అతని
గురించి
అడుగుతున్నారు
అని
అతను
చెప్పడంతో
అందరూ
ఒక్కసారిగా
షాక్
అవుతారు.

నాటకం అనిపిస్తోంది
మరోవైపు తండ్రి గోవిందరాజులు కూడా ఆందోళన చెందుతూ ఉంటాడు. 20 లక్షలు అంటూ పదే పదే గుర్తు చేస్తూ రామచంద్రను టెన్షన్ లో పడేలా చేస్తాడు. ఇక వారు చేసేదేమీ లేక సైలెంట్ గా ఇంటికి వస్తారు. అక్కడ ఎవరూ లేరు అని జ్ఞానాంబ తో చెప్పడంతో ఆమె కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. అయితే ఈ విషయంలో మల్లిక మరింత ఘాటుగా మాట్లాడుతుంది. ఇదంతా ఒక నాటకం అని అనిపిస్తోంది అని ఆమె జానకి రామచంద్రపై నిందలు వేయాలని అనుకుంటుంది. జానకి ఈ తరహా నాటకం ఆడించి ఉంటుంది అని కూడా ఆమె చెప్పడంతో ఇంట్లో వాళ్ళు ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు.

మా భవిష్యత్తు ఏమవుతుందో..
కుటుంబం కోసం ఎంతో కష్టపడిన రామచంద్ర ఆ విధంగా నిందలు వేయడం కరేక్ట్ కాదని తల్లిదండ్రులు చెప్పినప్పటికీ కూడా మల్లికా మరొక విధంగా మాట్లాడుతుంది. జానకి వచ్చిన తర్వాత రామచంద్ర బాగా మారిపోయాడు అని ఆమె పదేపదే మాట్లాడుతుంది. అయితే ఈ తరహా లో ఎవరి స్వార్థం వారు చూసుకుంటే రేపు మా భవిష్యత్తు ఏమవుతుందో అని మల్లికా ఆందోళన చెందుతూ ఉంటుంది.

మల్లిక మాటలకు
అంతే కాకుండా అంతకముందే మల్లికా మూడవ కోడలు జెస్సి కి కూడా కొన్ని మాటలు చెప్పి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. జానకి మిమ్మల్ని కూడా మోసం చేస్తోంది అని మీరు కూడా ఈ ఇంట్లో నుంచి బయటకు వెళ్లి మరొక కాపురం పెట్టాలి అని ఆమె చెబుతోంది. కానీ జెస్సి మాత్రం జానకి రామచంద్రలను నమ్ముతుంది. ఇక మరోవైపు మల్లిక ఇంట్లో నేను ఉండడానికి ఒప్పుకోను అని ఎవరి వాటాలు వారికి పంచాల్సిందే అని గట్టిగా అడుగుతుంది. దీంతో గోవిందరాజులు ఒక్కసారిగా గుండె నొప్పితో కింద పడిపోతాడు. మరి ఈ సమస్య నుంచి జానకి తన భర్తను ఎలా బయటపడేస్తుందో తదుపరి ఎపిసోడ్లో చూడాలి.