For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu August 25th: అఖిల్ కోసం పట్టు విడువని జెస్సి.. మల్లిక షాకింగ్ ప్లాన్!

  |

  జానకి కలగనలేదు సీరియల్ మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. భర్త రామచంద్ర సహకారంతోనే జానకి తన ఐపీఎస్ కలను పూర్తి చేయాలని అనుకుంటుంది. ఇక జానకి చదువుకోవడానికి చివరికి అత్తగారు కూడా ఒప్పుకుంటారు. అయినప్పటికీ జనకికి కొన్ని ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 7.70 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 374 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం పదండి..

  అబద్దంతో మల్లిక హ్యాపీ

  అబద్దంతో మల్లిక హ్యాపీ

  మనవడు మనవరాళ్ళతో ఆడుకోవాలి అని జ్ఞానాంబ ఎంతగానో ఆలోచిస్తుంది. అయితే అదే సమయంలో చిన్న కోడలు మల్లిక నెల తప్పినట్లు చెప్పడంతో ఆమె ఎంతగానో సంతోషిస్తుంది. ఈ ఆనందాన్ని ఒక వేడుకలా జరుపుకోవాలని కూడా చుట్టుపక్కల వారిని పిలిచి భోజనాలు పెట్టిస్తుంది. అంతేకాకుండా మల్లికను ఆశీర్వదించేలా చేస్తుంది. కానీ నిజానికి మల్లిక మాత్రం నెల తప్పినట్లుగా నాటకం ఆడుతుంది. డబ్బులు ఇచ్చి పక్కింటి నీలావతి చేత అబద్ధం చెప్పిస్తుంది. ఇక ఆ ఆనందంలోనే మల్లికా ఇంట్లో ఏ పనులు కూడా చేయదు. అంతేకాకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి అని అత్తగారు ప్రేమను కూడా చూపిస్తూ ఉంటారు. ఇక కావాల్సింది తింటూ మల్లికా చాలా హ్యాపీగా ఉంటుంది.

   కంగారు పడిన మల్లిక

  కంగారు పడిన మల్లిక

  అయితే మల్లిక అసలు విషయం బయటపడినట్లు కల రావడంతో ఎంతగానో కంగారుపడుతుంది. ఒకవేళ అదే జరిగితే తనను అత్తగారు ఏమాత్రం క్షమించరు అని కూడా ఆందోళన చెందుతుంది. ఏదేమైనా కూడా ఈ అబద్ధపు మాటలతో ఉన్నన్ని రోజులు కూడా చాలా హ్యాపీగా ఉండవచ్చు అని మల్లిక ఆలోచిస్తుంది. అంతేకాకుండా నిజం తెలిసే అవకాశం వస్తే మరో అబద్ధం కూడా చెప్పాలి అని అనుకుంటుంది. అయితే ఈ క్రమంలో జానకిని మరింత ఇబ్బందులకు గురిచేయాలని కూడా మల్లికా ఆలోచిస్తుంది.

  మల్లిక ప్లాన్

  మల్లిక ప్లాన్

  జానకి ఉదయం లేచి ఇంట్లో అన్ని పనులు చేసుకుని కాలేజీకి వెళ్లడానికి రెడీ అవుతుంది. ఇక మల్లిక.. జానకికి మరింత ఆలస్యం అయ్యేలా చేయాలని అనుకుంటుంది. జానకి పరీక్షలు ఉన్నాయి అంటూ చాలా హడావిడిగా వెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఇక అప్పుడే మల్లికా తనకు జీడిపప్పు ఉప్మా తినాలని ఉంది అంటూ చెప్పడంతో పక్కనే ఉన్న మామ గోవిందరాజులు ఆశ్చర్యపోతాడు. నీకు ఈరోజు పరీక్షలు ఉన్నాయి కదామ్మా.. నువ్వు వెళ్ళు తనే చేసుకుంటుంది అని అంటాడు. అయితే ఇంట్లో పనులు చేయవద్దు అని అత్తగారు చెప్పారు కాబట్టి నేను పనులు చేయడం లేదు అని మల్లికా అంటుంది. ఆ తర్వాత సీన్లోకి ఎంట్రీ ఇచ్చిన అత్తగారు పరవాలేదు నేను చేయిస్తాను నువ్వు పరీక్షలకు వెళ్ళు అని జానకి కి సపోర్ట్ చేస్తుంది.
  ఇక మల్లికా ప్లాన్ మొత్తం రివర్స్ అవుతుంది.

  ఇంటి పనుల్లో బిజీగా జ్ఞానాంబ

  ఇంటి పనుల్లో బిజీగా జ్ఞానాంబ

  ఆ తర్వాత జ్ఞానాంబ ఇంట్లో పనులు కూడా చకచకా చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే రామచంద్ర కూడా ఆమెకు ఫోన్ చేసి ఈరోజు నేను కొట్టు తెరవడం లేదు అని వేరే ఊరిలో బిజీగా ఉన్నాను అని అంటాడు. అయితే కొట్టు తెరవకపోవడం మంచిది కాదు అని నేను వెళతాను అంటూ జ్ఞానాంబ కొట్టుకు వెళుతుంది. మరోవైపు మల్లికకు వివిధ రకాల తిండివంటలను సిద్ధం చేసి ఉంచుతారు. జీడిపప్పు బాదంపప్పు అంటూ ప్రతిరోజు వీటిని తినాలి అని అప్పుడే పండంటి బిడ్డకు జన్మనిస్తావని అంటారు. ఇక దాన్ని ఆసరాగా చేసుకుని మల్లికా మరింత సంతోషంగా ఉంటుంది.

  అత్తగారి కోసం మారుతున్న జెస్సి

  అత్తగారి కోసం మారుతున్న జెస్సి

  అయితే మరోవైపు కాలేజీకి వెళ్లిన జానకి అక్కడ జెస్సిని చూస్తుంది. ఒక విధంగా జెస్సి జానకి కోసం అక్కడ ఎదురు చూస్తూ ఉంటుంది. ఎలాగైనా అఖిల్ ను పెళ్లి చేసుకోవాలని అందుకు జానకి సహాయం కూడా తీసుకోవాలని అనుకుంటుంది. ఇక అందుకోసం జెస్సి కూడా చాలా వరకు చేంజ్ అవుతుంది. మొన్నటి వరకు మోడరన్ డ్రెస్సులలో కనిపించిన జెస్సి అఖిల్ తల్లి గారికి అలాంటి వేషధారణ నచ్చదు అని అందుకే తనను తాను పూర్తిగా మార్చుకోవాలని అనుకుంటుంది. అఖిల్ లేనిది తన జీవితం లేదు అని కూడా అనుకుంటుంది. అయితే జానకి మాత్రం ఆ విషయంలో నువ్వు మరీ ఎక్కువ నమ్మకం పెట్టుకోవద్దు అని మా అత్తగారు ఒక్కసారి ఏదైనా ఆలోచిస్తే దానికి తగ్గట్టుగా ఉంటారు అని చెబుతుంది.
  నువ్వు అఖిల్ గురించి ఆలోచించకుండా ముందు నీ చదువు గురించి దృష్టి పెట్టు అని ఆ విషయం గురించి మర్చిపోవాలి అని కూడా అంటుంది. కానీ అఖిల్ లేకపోతే నేను బ్రతకలేను అంటూ అతన్ని పెళ్లి చేసుకుంటాను అని జెస్సి అంటుంది.

  అప్పుడే వచ్చిన జానకి

  అప్పుడే వచ్చిన జానకి

  మరోవైపు ఇంట్లో చాలా హ్యాపీగా మల్లిక కూర్చుని తనకు ఇష్టమైన వాటిని తింటూ ఉంటుంది. అయితే ఈ క్రమంలో అప్పుడే వచ్చిన నీలావతి నువ్వు ఆడుతున్న నాటకం గురించి ఇంట్లో తెలిస్తే ఏంటి పరిస్థితి అని అడుగుతుంది. అందుకు మల్లికా నా కడుపు పోవడానికి జానకి ఏదో చేసింది అని అబద్ధం చెబుతాను అని అంటుంది. ఇక అప్పుడే జానకి ఎంట్రీ ఇస్తుంది మరి ఈ విషయం గురించి జానకి నిజంగానే తెలుసుకుంటుందా లేదా అనేది తదుపరి ఎపిసోడ్ లో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Today Episode 374:
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X