For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu November 2nd: దారుణంగా డ్రగ్స్ ఉచ్చులో అఖిల్.. ఐపీఎస్ గా జానకి ప్రమాణం!

  |

  జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతోంది. బయటవారికి ప్రేరణగా నిలిచే జ్ఞానాంబ కుటుంబంలో గొడవలు మొదలవుతాయి. ఇక కుటుంబం విడిపోయే పరిస్థితికి రావడంతో అందుకు పెద్ద కోడలు జానకి విడిపోనివ్వకుండా చూసుకుంటుంది. ఇక జానకి తన భర్త రామ సహాయంతోనే ఐపీఎస్ చదువును పూర్తి చేయాలని అనుకుంటుంది. అందుకు అత్త జ్ఞానాంబ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక జనకికి ఇంట్లోనే మల్లిక నుంచి కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు కూడా ఎదురవుతాయి. మరి జానకి ఏ విధంగా తన డ్రీమ్ ను సాధిస్తుంది అనేది ఈ సీరియల్ లోని ప్రధాన అంశం. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ పెరిగాయి. 7.90 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 423 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

  ఫ్యామిలీ విడిపోకుండా..

  ఫ్యామిలీ విడిపోకుండా..

  జ్ఞానాంబ రెండవ కోడలు మల్లిక ఎలాగైనా ఇంట్లో నుంచి వెళ్లిపోయి తన భర్త విష్ణుతో మరొక కాపురం పెట్టాలని అనుకుంటుంది. సిటీలోకి వెళ్లి అక్కడే భర్త చేత మరొక వ్యాపారం కూడా పెట్టించాలని ఎన్నో రోజుల నుంచి ఆలోచిస్తుంది. అయితే ఆమె ఎంత ఆలోచించినా కూడా జానకి మాత్రం ఫ్యామిలీ విడిపోకుండా చూడాలని అనుకుంటుంది. అయితే ఇంట్లో తన స్థాయి పెరిగే విధంగా ఉండాలి అని మల్లిక గర్భం రాకున్నప్పటికీ కూడా తాను తల్లి కాబోతున్నట్లు అబద్దం చెబుతుంది. దాంతో ఇంట్లో అందరూ కూడా ఆమెను ఎంతగానో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు.

  మల్లికకు మరో షాక్

  మల్లికకు మరో షాక్

  మల్లికకు ప్రత్యేకంగా వంటచేసి ఆమెకు కావాల్సినవన్నీ కూడా వండి పెడుతూ ఉంటారు. అయితే ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని మరోసారి అనుకున్న మల్లిక మొండిగా ప్రవర్తిస్తుంది. అలాగే జానకి అందరూ కూడా ఎంతగానో బ్రతిమాలుతూ ఉంటారు. ఇక జానకి, మల్లిక గర్భం విషయంలో అబద్ధం చెప్పింది అని నిజం తెలుసుకుంటుంది కానీ ఆ విషయాన్ని ఆమె అప్పుడే ఇంట్లో చెప్పదు. ఇక మల్లికా కు అప్పుడే ఊహించని షాక్ ఇస్తారు. ఆమె ఇంట్లో ఇష్టమైన నాన్ వెజ్ తిననివ్వడం లేని కారణంగా ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని అనుకుంటుంది కాబట్టి తనకు ఇష్టమైనవి ఇక్కడే వండుకోవచ్చు అని అంటారు. వేరే కాపురం పెట్టాలి అనుకున్నప్పుడు కేవలం చేసేది ఇదే కదా అని జ్ఞానాంబ ఒక షరతు విధిస్తుంది.

  డ్రగ్స్ ఉచ్చులో అఖిల్

  డ్రగ్స్ ఉచ్చులో అఖిల్

  మొదట ఇంట్లో అందరికీ కూడా తనది దొంగ గర్భం అనే విషయం తెలిసిందేమో అని మల్లిక భయపడుతుంది. కానీ జానకి ఆ విషయాన్ని చెప్పదు. ఇక మరొకవైపు చిన్న కొడుకు అఖిల్ మరింత చెడిపోతూ ఉంటాడు. అతను డబ్బు కోసం మాదకద్రవ్యాలు అమ్మే పరిస్థితికి వస్తాడు. అందుకోసం ఇంట్లో తన భార్య జెస్సి దగ్గర నెక్లెస్ కూడా తీసుకుంటాడు. దాన్ని అమ్మేసి ముందుగా పెట్టుబడి పెడుతూ ఉంటాడు. తన స్నేహితుడి ద్వారా మాదకద్రవ్యాలు కొనుగోలు చేసిన అఖిల్ వాటిని కాలేజీలో అమ్మాలని అనుకుంటాడు. ఇక అతనికి అమ్మిన డీలర్ మాత్రం ఈ విషయం బయట తెలిసి తన మీదకు వస్తే.. అప్పుడు మీ ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఇరికిస్తాను అని హెచ్చరికలు చేస్తాడు. అందుకే జాగ్రత్తగా ఉండాలి అని కూడా అతను హెచ్చరిక చేస్తాడు.

  మల్లిక ఇష్ట ప్రకారమే

  మల్లిక ఇష్ట ప్రకారమే

  ఇక మరొకవైపు జానకి ఇంట్లో పరిస్థితుల గురించి ఆలోచిస్తూ ఉండగా ఆమె భర్త రామచంద్ర మాత్రం ఆమెకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మీరు ముందు పరీక్షలపై దృష్టి పెట్టాలి అని అంటాడు. మరోవైపు మల్లికకు కుటుంబ సభ్యులు ఊహించని విధంగా షాక్ ఇస్తారు. ఆమెకు ఎలాంటి వంట చేసి ఇవ్వాల్సిన అవసరం లేదు అని తన ఇష్ట ప్రకారమే వంట గదిలోకి వెళ్లి ఏదైనా సరే వండుకోవచ్చు అని చెబుతారు. అంతే కాకుండా నాన్ వెజ్ కూడా తినవచ్చు అని గోవిందరాజులు కూడా అంటాడు. ఇక మల్లికా కొంత అప్సెట్ అవుతుంది.

  ప్రమాణం చేసిన జానకి

  ప్రమాణం చేసిన జానకి

  ఆ తర్వాత జానకి తన ఐపీఎస్ కోచింగ్ సెంటర్లో ఒక పోలీస్ ఆఫీసర్ ఇచ్చిన స్పీచ్ చూసి ప్రేరణ పొందుతుంది. మీ కుటుంబంలో వాళ్లు తప్పు చేసినా కూడా ఏమాత్రం క్షమించకూడదు అని బాధ్యతాయుతంగా ఎలాంటి స్వార్థం లేకుండా అందరికీ న్యాయం జరిగేలా చూడాలని చెబుతూ ఉంటారు. ఆ విధంగా ప్రతి ఒక్కరూ వారి మనస్ఫూర్తిగా ప్రమాణం చేయాలి అని కూడా అనడంతో అందరికంటే మొదటగా జానకి లేచి తప్పకుండా నిస్వార్థంగా పోలీస్ డ్యూటీ కి న్యాయం చేస్తానని ప్రమాణం చేస్తుంది. దీంతో అందరూ కూడా ఆమె నుంచి ప్రేరణ పొందుతారు.

  రక్తం వచ్చేలా కొట్టిన అఖిల్

  రక్తం వచ్చేలా కొట్టిన అఖిల్

  ఇక మరొకవైపు రామచంద్ర చిన్న తమ్ముడు అఖిల్ మాదకద్రవ్యాలు తన కాలేజీలోనే అమ్ముతూ ఒక అమ్మాయికి దొరికిపోతాడు. నువ్వు ఏదో తప్పు చేస్తున్నావ్ అంటూ ఆమె నిలదీసే ప్రయత్నం చేస్తుంది. ఇక పోలీసులకు చెప్పే ప్రయత్నంలో అఖిల్ ఆమెను అడ్డుకుంటాడు. ఒక కర్ర తీసుకొని కొట్టడంతో ఆమె రక్తంతో కింద పడిపోతుంది. ఇక జానకి ఆమెను రక్షించే ప్రయత్నం చేస్తుంది. మరి జానకి తన మరిది విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తదుపరి ఎపిసోడ్ లో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Today Episode 422
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X