For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu Serial May 25th Episode: కోడలి గుట్టుపై ఆరా తీసిన జ్ఞానాంబ.. ఇక ఎవ్వరు కాపాడలేరు!

  |

  జానకి కలగనలేదు సిరియల్ మరో ఎపిసోడ్ తో కీలక మలుపులు తిరిగింది. గత వారం కంటే ఈ వారం మరింత ఆసక్తిగా మారుతోంది. ఎవరు ఊహించని విదంగా జ్ఞానాంబ ట్విస్టులతో ఈ సిరియల్ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటోంది. సీనియర్ నటి రాశి నటన అమితంగా ఆకట్టుకుంటోంది. అందమైన ప్రేమ మధ్యలో భార్య జానకి ఆశయం, భర్త రామచంద్ర అమాయకత్వ ప్రేమ, అత్త జ్ఞానాంబ కట్టుబాట్లు ఆప్యాయత.. ఈ సిరియల్ లో ప్రధాన అంశాలు. ఇక ఈ రోజు ప్రసారం కాబోయే 47వ ఎపిసోడ్ పై ఒక లుక్కేస్తే..

  మల్లిక అబద్ధాలు చెప్పడంతో

  మల్లిక అబద్ధాలు చెప్పడంతో

  దొంగల బీభత్సాన్ని సీక్రెట్ గా ఉంచిన మల్లిక విషయం బయటకు రావడంతో జ్ఞానాంబ అందరితో మీటింగ్ పెడుతుంది. విషయం తెలిసిన తరువాత కూడా మల్లిక అబద్ధాలు చెప్పడంతో జ్ఞానాంబ మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. వెంటనే మల్లిక గుట్టు విప్పాలని అనుకుంటుంది.

  సినిమా టిక్కేట్లు కనిపించడంతో

  సినిమా టిక్కేట్లు కనిపించడంతో

  పని మనిషి చికిత్తను పిలిచి ఆమె హ్యాండ్ బ్యాగ్ తెప్పించడంతో అసలు విషయం బయటపడుతుంది. స్నేహితులతో కలిసి సినిమాకు వెళ్లిన టికెట్స్ బ్యాగ్ లోనే ఉండడంతో జ్ఞానాంబ అసలు కోపాన్ని చూపిస్తుంది. దీంతో మల్లిక గ్యాప్ లేకుండా ఏడవడం స్టార్ట్ చేస్తుంది.

  భార్యను తప్పించాలని

  భార్యను తప్పించాలని

  ఈ క్రమంలో మల్లికను ఆ గొడవ నుంచి తప్పించాలని భర్త విష్ణు వెంటనే చేయి చేసుకోవడం అందరిని షాక్ కు గురి చేస్తుంది. అప్పటికే ఆమెకు కనుసైగలతో అర్ధమయ్యేలా చేస్తూ మరింత కొట్టడానికి ముందుకు వేలుతుంటాడు. ఇక ఇంట్లో వాళ్ళు అందరూ కూడా విష్ణుని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు.

  మల్లికను పంపించేయలని..

  మల్లికను పంపించేయలని..

  మల్లికను ఇంట్లో నుంచి శాశ్వతంగా పంపించేయలని జ్ఞానాంబ నిర్ణయం తీసుకుంటుంది. ఈ విషయంలో ఎలాంటి మార్పు లేదని చెబుతూ.. జానకిని పిలుస్తుంది. నువ్వు మీ అన్నయ్య దగ్గరకు వెళతా అన్నావు కాదా ఒకసారి నీ తొడి కోడలికి చివరిసారిగా వెళ్ళొస్తానని చెప్పు అని జ్ఞానాంబ అదేశిస్తుంది.

  మల్లిక తల్లిదండ్రులకు ఫోన్ చేసి

  మల్లిక తల్లిదండ్రులకు ఫోన్ చేసి

  ఈ క్రమంలో మల్లిక మరోసారి ఇలాంటి పొరపాటు చేయనని అత్త ముందు ఏడుస్తూ బ్రతిమాలుకుంటుంది. అయినప్పటికీ జ్ఞానాంబ మనసు కరగదు. అయినా కూడా మల్లిక ఏడుపు ఆపకపోవడంతో వెంటనే మీ తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఇంటికి ఓసారి రమ్మను అని జ్ఞానాంబ చెబుతుంది. ఇక భర్త విష్ణు భార్యను కాపాడేందుకు ప్లాన్ వేయాలని ఆలోచిస్తాడు.

  Captain Vijayakanth Biography, వడివేలు పై ఎందుకంత పగ ! || Filmibeat Telugu
  ఎవరు కాపాడలేరు..

  ఎవరు కాపాడలేరు..

  ఇక జానకి ఇంటికి వెళ్లే క్రమంలో ఆమెకు తోడుగా వెళ్లిన చిన్న మరిది ఆటోలో ఒక మాట చెబుతాడు. అమ్మకు అబద్ధం చెబితే అస్సలు నచ్చదు. చిన్న వదినను ఎవరు కాపాడలేరని చెప్పగానే జానకి షాక్ అవుతుంది. తన చదువు గురించి తెలిస్తే ఇక ఆ ఇంట్లో తనకు స్థానమే ఉండదని అనుకుంటుంది. ఇక అదే విషయాన్ని తన పుట్టింటికి వెళ్లి అన్నయ్యతో చెబుతుంది. తనకు చదువు లేదని అత్తయ్యతో ఎందుకు అబద్ధం చెప్పావు అని బాధపడుతున్న సమయంలో వెంటనే అక్కడికి రామచంద్ర వస్తాడు.. ఇక ఆ తరువాత ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్ లో చూడాలి.

  English summary
  TV serials are gaining more popularity now than ever before. Even though it is a routine format, Janaki kalaganaledu. Serial category impresses them immensely. Along with the cute love story, a wife's ambition, husband's innocence love, majestic aunt domination, affection .. are the main elements in this serial. Take a look at the 46th episode airing today.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X