For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu November 10th: పోలీస్ స్టేషన్ లో అఖిల్ ఏడుపు.. జానకి పై రామచంద్ర అసహనం!

  |

  జానకి కలగనలేదు సీరియల్ ఎమోషనల్ ట్విస్ట్ లతో ఎంతో ఆసక్తిగా కొనసాగుతోంది. జ్ఞానాంబ చిన్న కొడుకు అఖిల్ మాధురిపై హత్యాయత్నం చేయడంతో ఇంటి పెద్ద కోడలు జానకి పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది. దీంతో కుటుంబంలో విబేధాలు రావడంతో పరిస్థితులు మారిపోతుంటాయి. జానకి తన భర్త రామ కూడా జానకి మాటలను పూర్తిగా నమ్మడు. మరోవైపు అత్త జ్ఞానాంబ కూడా బాధలో ఉంటుంది. ఇక మల్లిక నుంచి కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు కూడా ఎదురవుతాయి.

  మరి జానకి ఏ విధంగా ఈ విషయంలో అందరికి అర్థమయ్యేలా చెబుతుంది అనే పాయింట్ ఆసక్తిగా మారింది. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ పెరిగాయి. 7.90 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 429 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

  డ్రగ్స్ వలన ఇబ్బందుల్లో అఖిల్

  డ్రగ్స్ వలన ఇబ్బందుల్లో అఖిల్

  జ్ఞానాంబ చిన్న కుమారుడు అఖిల్ ఎలాగైనా డబ్బు సంపాదించాలి అనే ఆలోచనతో తప్పుడు దారిలో తన ప్రయత్నాలను మొదలుపెడతాడు. తన భార్య నెక్లెస్ అమ్మేసి ఆ వచ్చిన డబ్బుతో డ్రగ్స్ వ్యాపారం లోకి దిగుతాడు. తన స్నేహితుడి ద్వారా డ్రగ్స్ కొనుగోలు చేసి తన కాలేజీలోనే అమ్మాలని అనుకుంటాడు. అయితే అఖిల్ డ్రగ్స్ అమ్ముతూ తన స్నేహితురాలికి దొరికిపోతాడు.

  దీంతో ఆ అమ్మాయి అఖిల్ వాళ్ళ ఇంట్లోనే చెప్పాలని అనుకుంటుంది. ఇక మాధురికి ఎంత చెప్పినప్పటికీ వినకపోవడంతో అఖిల్ ఆమెను ఒక కర్ర తీసుకొని కొడతాడు దీంతో తీవ్రంగా గాయపడిన మాధురి పరిస్థితి గురించి జానకి తెలుసుకుంటుంది. వెంటనే ఆసుపత్రిలో చేర్పిస్తుంది.

  నమ్మలేకపోయిన జ్ఞానాంబ ఫ్యామిలీ

  నమ్మలేకపోయిన జ్ఞానాంబ ఫ్యామిలీ

  ఇక మాధురి తల్లిదండ్రులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోవడంతో వారిని జానకి ఓదార్చాలని అనుకుంటుంది. అంతేకాకుండా మాధురి పరిస్థితి రోజురోజుకు సీరియస్ కావడంతో రోజులు గడిస్తే గాని ఆమె పరిస్థితి గురించి చెప్పలేము అని వైద్యులు కూడా చెప్పడం వలన జానకి మరొక విధంగా ఆలోచిస్తుంది. కుటుంబ స్వార్థం కోసం ఒక అమ్మాయిపై దాడికి పాల్పడిన అఖిల్ను వదిలిపెట్టకూడదు అని అతనికి చట్టప్రకారం శిక్ష పడాలి అని ఆలోచిస్తుంది.

  అందుకే జానకి వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది. అయితే జానకి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో ఇంట్లో ఎవరూ కూడా నమ్మలేక పోతారు. అయితే అఖిల్ తప్పు చేశాడు అని అంటే కూడా ఎవరు నమ్మలేక పోతారు. అఖిల్ కూడా ఆ విషయంలో చాలా అబద్దాలు చెబుతాడు.

  జానకి నిర్ణయంతో..

  జానకి నిర్ణయంతో..

  జానకిని వెంటనే కేసు వెనక్కి తీసుకోవాలి అని భర్త రామచంద్ర కూడా ఎంతగానో బ్రతిమాలుతాడు. కొన్నిసార్లు మనం పొరపాటు పడతామని అఖిల్ అలాంటివాడు కాదు అని నచ్చజేబుతాడు. అయినప్పటికీ జానకి నేను అబద్ధాలు చెప్పడం లేదు అని నా కల్లారా అఖిల్ ఆ అమ్మాయిపై దాడి చేయడం చూశాను అని అందుకే ఈ విషయంలో నేను ఏమి చేయలేను అని అంటుంది.

  ఇక జానకి ఆ విధంగా నిర్ణయం తీసుకోవడంతో ఇంట్లో ఎవరూ కూడా భోజనం కూడా సరిగ్గా చేయరు. అందరు కూడా మౌనంగా కూర్చుండిపోతారు. ఇక జానకి వెళ్లి ప్రతి ఒక్కరిని బ్రతిమాలే ప్రయత్నం చేస్తుంది.

  బాధలో జ్ఞానాంబ ఫ్యామిలీ

  ముఖ్యంగా తన అత్తగారు జ్ఞానాంబను కూడా భోజనం చేయాలని ఉంటుంది. కన్న కొడుకు పోలీస్ స్టేషన్లో ఉంటే నా కడుపు ఎలా నింపుకోగలను అని ఉంటుంది. ఇక తర్వాత అఖిల్ తండ్రి గోవిందరాజులు కూడా జానకి వెళ్లి బ్రతిమాలుతుంది. అయినా కూడా అఖిల్ గురించి బాధపడుతూ ఉంటారు. ఇక జెస్సిని కూడా ప్రతిమలూతూ ఉండగా పక్కనే ఉన్న మల్లికా జానకి పై మరింత కోపం వచ్చేలా మాట్లాడుతుంది. నువ్వే అఖిల్ ను పోలీస్ స్టేషన్లో పడేసి ఇప్పుడు అందరిని భోజనం చేయమని అంటే ఎలా? అని మాట్లాడుతుంది.

   పోలీస్ స్టేషన్ లో అఖిల్

  పోలీస్ స్టేషన్ లో అఖిల్

  ఇక తర్వాత రామచంద్ర రావడంతో జానకి అందరినీ భోజనం చేయమని మీరైనా చెప్పండి అని అడుగుతుంది. కానీ అఖిల్ పోలీస్ స్టేషన్లో ఉంటే ఎవరు మాత్రం హ్యాపీగా ఉంటారు మీరు మాత్రం మీ మాట నెగ్గించుకున్నారు కదా అని విభిన్నంగా మాట్లాడడంతో జానకి మరింత బాధపడుతుంది. ఇక తర్వాత రామచంద్ర పోలీస్ స్టేషన్ కు వెళ్తాడు. అక్కడ అఖిల్ పరిస్థితిని చూసి అతను ఆశ్చర్యపోతాడు. జానకి పై అఖిల్ తీవ్ర కోపంగా ఉంటాడు. రామచంద్ర అఖిల్ ను చూడగానే ఎంతగానో ఏడుస్తూ ఉంటాడు.

  భర్త మాటలకు బాధలో జానకి

  భర్త మాటలకు బాధలో జానకి

  నేను ఈ పోలీస్ స్టేషన్లో ఒక్క నిమిషం కూడా ఉండలేను అన్నయ్య నన్ను వెంటనే విడిపించు అని బ్రతిమాలితాడు. ఇక రామచంద్ర తప్పకుండా నిన్ను విడిపిస్తాను అని అంటాడు. జానకి కేసు వెనక్కి తీసుకుంటేనే అఖిల్ విడిపించడం జరుగుతుందని పోలీసులు కూడా చెప్పడంతో రామచంద్ర మరొకసారి జానకి తో మాట్లాడాలని అనుకుంటాడు. మీరు ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఆలోచిస్తూ ఇంటి గురించి మర్చిపోతున్నారు అని ఇది ఎంత మాత్రం న్యాయం కాదు అని రామచంద్ర మరోసారి ఊహించిన విధంగా మాట్లాడతాడు. దీంతో రామా ఆ విధంగా మాట్లాడడంతో జానమి మరింత బాధపడుతూ ఉంటుంది. మరి తన భర్తకు ఆమె ఎలా అర్థమయ్యేలా చెబుతుందో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Today Episode 429
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X