For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu November 15th: జానకి పెట్టిన కేసుతో అఖిల్ ఉరిశిక్ష.. మరో ట్విస్ట్ ఇచ్చిన మల్లిక!

  |

  జానకి కలగనలేదు సీరియల్ ఆసక్తికరంగా మారుతోంది. రామచంద్ర చిన్న తమ్ముడు అఖిల్ తన స్నేహితురాలు మాధురి పై హత్యాయత్నం చేయడం జానకి కల్లారా చూస్తుంది. అతను కాలేజీలో డ్రగ్స్ అమ్ముతూ మాధురికి కనిపించడంతో ఆమె ప్రశ్నించే ప్రయత్నం చేస్తుంది. అంతే కాకుండా మీ ఇంట్లో ఈ విషయం చెబుతాను అని కూడా అంటుంది. దీంతో ఆమెపై కోపాన్ని పెంచుకున్న అఖిల్ అనుకోకుండా ఒక కర్ర తీసుకొని కొడతాడు.

  దాంతో రక్తపు మడుగులో మునిగిపోయిన మాధురిని జానకి వెంటనే హాస్పిటల్ లో జాయిన్ చేస్తుంది. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ పెరిగాయి. 7.90 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 431 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

   అఖిల్ కేసులో జానకి ఇబ్బందులు

  అఖిల్ కేసులో జానకి ఇబ్బందులు

  అయితే అక్కడ హాస్పిటల్ లో మాధురి తల్లిదండ్రుల బాధను చూసి జానకి స్వయంగా వెళ్లి అఖిల్ పై కేసు పెడుతుంది. జానకి కేసు పెట్టడంపై ఇంట్లో వాళ్ళు ఆమెతో విభేదిస్తారు. ఎందుకంటే అఖిల్ తాను ఏ నేరం చేయలేదు అని చెబుతాడు. అనవసరంగా వదిన నన్ను అనుమానిస్తోంది అని నేను మాధురి అనే అమ్మాయిని కొట్టలేదు అని చంపడానికి కూడా ప్రయత్నం చేయలేదు అని అంటాడు. దీంతో జానకి ఆ విషయంలో తీవ్రస్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటుంది.

  లాయర్ వద్దకు రామచంద్ర

  లాయర్ వద్దకు రామచంద్ర

  రామచంద్ర ఎంత బ్రతిమాలిన కూడా ఆమె ఒక అమ్మాయికి అన్యాయం చేయలేను అని అఖిల్ను ఇప్పుడు కట్టడి చేయకపోతే భవిష్యత్తులో అతను మరింత క్రూరంగా మారే అవకాశం ఉంటుంది అని కూడా ఆమె చెబుతుంది. ఇక రామ చేసేదేమీ లేక అఖిల్ కు బేయిల్ ఇప్పించాలని అనుకుంటాడు. అయితే లాయర్ మాత్రం ఎఫ్ఐఆర్ నమోదైన పత్రాలను తీసుకురమ్మని అంటాడు. అంతేకాకుండా కేసు నమోదు చేసిన జానకి చేత కేసు వాపసు తీసుకునేలా చేయాలి అని కూడా లాయర్ చెప్పడంతో రామచంద్ర మళ్ళి ఆలోచనలో పడతాడు.

  అనవసరంగా ఈ కేసు పెట్టింది

  అనవసరంగా ఈ కేసు పెట్టింది

  ఇక ఇంట్లో అందరూ కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటారు. అఖిల్ కు బేయిల్ వస్తే బాగుండు అని జ్ఞానాంబ తో పాటు ఆమె భర్త గోవిందరాజులు కూడా కోరుకుంటారు. ఇక అప్పుడే అనుకోకుండా జెస్సి తల్లిదండ్రులు అక్కడికి వస్తారు. అంతకుముందే మల్లిక వాళ్లకు జరిగిన విషయాన్ని చెబుతుంది. జానకి అనవసరంగా ఈ కేసు పెట్టింది అని కూడా వాళ్లకు చెప్పడంతో జెస్సీ తల్లిదండ్రులు అందరికీ ధైర్యం చెబుతూ ఉంటారు. ముఖ్యంగా జానకి దగ్గరకు వెళ్లి వాళ్ళు ఎంతగానో బ్రతిమాలతో ఉంటారు ఎలాగైనా నువ్వు అఖిల్ ను బయటకు వచ్చేలా చేయాలి అని కేసు వెనక్కి తీసుకోవాలని అంటారు.

  మల్లిక కన్ఫ్యూజన్

  మల్లిక కన్ఫ్యూజన్

  ఇక రామచంద్ర కూడా అదే తరహాలో జానకిని బ్రతిమాలుకుంటాడు. అయితే మరోవైపు గొడవ సృష్టించాలని అనుకున్న మల్లిక ప్లాన్ కొంత వృధా అవుతుంది. జెస్సీ తల్లిదండ్రులు వచ్చి జానకి పై విరుచుకుపడతారు అనుకుంటే ఇలా సైలెంట్ గా మాట్లాడుతారు ఏమిటి అని కొంత కన్ఫ్యూజన్లో పడుతుంది. ఇక తర్వాత జెస్సిని వాళ్ళే తల్లిదండ్రులు ఈ సమయంలో ఇంటికి తీసుకువెళ్తామని అంటారు. కానీ ఆమె మాత్రం ఈ సమయంలో కుటుంబాన్ని వదిలేసి నా స్వార్థం నేను చూసుకోలేను అని ఇక్కడే అత్తయ్య వాళ్ళకి తోడుగా ఉంటాను అని చెబుతుంది.

   బాధలో జ్ఞానాంబ, గోవిందరాజులు

  బాధలో జ్ఞానాంబ, గోవిందరాజులు

  ఇక మరోవైపు ఎలాగైనా మరొక ప్లాన్ వేయాలి అని మల్లికా కూడా ఆలోచనలో పడుతుంది. ఇక పరిస్థితులు తారుమారవుతున్న తరుణంలో జ్ఞానాంబ గోవిందరాజులు కూడా ఆందోళన చెందుతూ ఉంటారు. మనకి ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది అని జ్ఞానాంబ బాధపడుతూ ఉండడంతో కోడలిని నేను వెళ్లి మరోసారి అడుగుతాను అని గోవిందరాజులు అంటాడు.

  ఉరిశిక్ష అంటూ మల్లిక ట్విస్ట్

  ఉరిశిక్ష అంటూ మల్లిక ట్విస్ట్

  ఇక జెస్సి ఒక దగ్గర కూర్చుని ఉండగా మల్లిక వెళ్లి ఆమెతో కొన్ని అబద్ధాలు చెబుతుంది. జానకి పై కోపం రగిలించాలి అని.. ఇప్పుడు అఖిల్ కు బేయిల్ రాకపోతే అతనికి ఉరిశిక్ష పడే అవకాశం ఉంది అని ఊళ్లో వాళ్ళందరూ అనుకుంటున్నట్లుగా ఆమె అబద్దాలు చెబుతుంది. ఇక అదే విషయాన్ని పక్కనే ఉన్న రామచంద్ర కూడా వింటాడు.

  వెంటనే వెళ్లి రామచంద్ర జానకి తో మరోసారి సీరియస్ గా మాట్లాడుతాడు. మీరు ఎలాగైనా సరే కేసు వెనక్కి తీసుకోవాలి అని అంటాడు. అయితే జానకి మాత్రం ఈ విషయంలో క్షమించండి రామ గారు అంటూ నా నిర్ణయంలో ఇలాంటి మార్పు లేదు అని చెబుతోంది. మరి జానకి నిర్ణయం పై రామచంద్ర ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Today Episode 432
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X