For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu November 22nd: చదువుకు దూరమవుతున్న జానకి.. కలచివేస్తున్న తండ్రి మాటలు!

  |

  జానకి కలగనలేదు సీరియల్ ఊహించని ట్విస్ట్ లతో కొనసాగుతోంది. రామ తమ్ముడు తన స్నేహితురాలు మాధురి పై హత్యాయత్నం చేస్తాడు. ఎందుకంటే అఖిల్ డ్రగ్స్ అమ్ముతూ మాధురికి కనిపించడంతో ఆమె ప్రశ్నించే ప్రయత్నం చేస్తుంది. అంతే కాకుండా మీ ఇంట్లో ఈ విషయం చెబుతాను అని కూడా అంటుంది. దీంతో ఆమెపై కోపాన్ని పెంచుకున్న అఖిల్ అనుకోకుండా ఒక కర్ర తీసుకొని కొడతాడు.

  దాంతో రక్తపు మడుగులో మునిగిపోయిన మాధురిని జానకి వెంటనే హాస్పిటల్ లో జాయిన్ చేస్తుంది. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ పెరిగాయి. 7.90 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 437 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

  ఊహించని సమస్యలు

  ఊహించని సమస్యలు

  జానకి ఎంతో నిజాయితీగా నిబద్దతతో తన ఐపిఎస్ చదువును కొనసాగించాలని అనుకుంటుంది. ఐపీఎస్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత కుటుంబ విషయంలో కూడా ఆమె ఎలాంటి భేదాభిప్రాయాలు చూపవద్దు అని అనుకుంటుంది. ఎవరికైనా సరే న్యాయం చేయాలని ఆలోచనతోనే తన చదువులు కొనసాగిస్తుంది.

  అయితే ఆ చదువు పూర్తికాక ముందే కుటుంబ పరిస్థితుల నుంచి ఊహించని పరీక్షలు కలుగజేస్తాయి. తన సొంత మరిది అఖిల్ ఒక అమ్మాయిపై హత్యాయత్నం చేసి తప్పించుకోవాలని చూస్తాడు. కుటుంబ సభ్యులు కూడా అఖిల్ నేరం చేయలేదు అని నమ్ముతారు. ఇక అఖిల్ను తప్పించేందుకు జానకి కేసు కూడా వెనక్కి తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది.

  ఐపీఎస్ చదువుకు అర్థం లేదు

  ఐపీఎస్ చదువుకు అర్థం లేదు

  ఇక అఖిల్ ను విడిపించినందుకు జానకి తీవ్ర స్థాయిలో బాధపడుతుంది. అంతేకాకుండా ఐపీఎస్ చదువుకు అర్థం లేదు అని ఆ చదువును కూడా అదే కుటుంబం కోసం పక్కన పెడుతుంది. ఇక అఖిల్ ఇంటికి రాగానే అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉంటారు. కానీ జానకి మాత్రం తన చదువును కొనసాగించకూడదు అని అనుకుంటుంది.

  అయితే భర్త రామచంద్ర మాత్రం తను ఎప్పటిలనే చదువుకుంటుందేమో అని అనుకుంటాడు. కానీ ఆమె కాలేజీకి వెళ్లకుండా ఇంట్లో పనులు చూసుకుంటూ ఉంటుంది. అడిగిన ప్రతిసారి కూడా ఏదో ఒక మాట చెబుతూ ఆ విషయాన్ని దాటవేస్తుంది. రామచంద్ర కు మాత్రం ఆ విషయం సరిగ్గా అర్థం కాదు.

  మల్లికకు మరో షాక్

  మల్లికకు మరో షాక్

  ఇక రామచంద్ర జానకి కాలేజ్ కి వెళ్ళకపోవడం గమనిస్తాడు. అయితే అదంతా నేను అని చూసుకుంటాను అని జానకి చెబుతుంది. దీంతో రామచంద్ర కూడా సైలెంట్ గా ఉంటాడు. ఇక మరొకవైపు మల్లిక తెల్లవారిన సరే నిద్ర లేవకుండా హ్యాపీగా పడుకుంటూ ఉంటుంది. దొంగ ప్రెగ్నెన్సీ విషయం జానకికి తెలియడంతో ఆ విషయం ఇంట్లో ఎప్పుడు తెలుస్తుందో అని టెన్షన్ కూడా పడుతుంది.

  ఇక పనిమనిషి చికిత్త ఆమెకు ఉదయాన్నే కాఫీ ఇవ్వడానికి వెళుతుంది. కానీ అది కాఫీ కాదు కలబంద కాఫీ అని ఈరోజు నుంచి ఇలాంటివి తాగాలి తినాలి అని మీ అత్తయ్య గారు ఆర్డర్ వేసినట్లుగా ఆమె చెబుతుంది. దీంతో మల్లిగా ఏమీ చేయలేని విధంగా బాధపడుతుంది.

  ఏ మాత్రం పట్టించుకోకుండా

  ఏ మాత్రం పట్టించుకోకుండా

  ఇక జానకి మరుసటి రోజు అయినా కాలేజీకి వెళుతుందేమో అని రామచంద్ర అనుకుంటూ ఉంటాడు. కానీ ఆమె చదువు విషయం గురించి ఏ మాత్రం పట్టించుకోకుండా బట్టలు ఉతకడానికి వెళుతుంది. ఇక వెంటనే రామచంద్ర ఆమెను అడగాలని అనుకుంటాడు. కానీ జానకి మాత్రం చదువు గురించి ప్రస్తావన తీసుకురాకుండా మీకోసం టిఫిన్ చేసాను వెళ్లి తిందాం పదండి అని చెబుతోంది. రామచంద్ర మళ్ళి కన్ఫ్యూజన్లో పడతాడు.

  నిజం తెలుసుకున్న రామ

  నిజం తెలుసుకున్న రామ

  ఆ తర్వాత ఇంట్లో గోవిందరాజులు అప్పుడే హాస్పిటల్ నుంచి వస్తాడు. డాక్టర్ గారు ఏమన్నారు అని జ్ఞానాంబ అడిగినప్పటికీ అంతా బాగానే ఉంది అని ఈ వయసులో తన కుటుంబం కారణంగా ఎంతో సంతోషంగా ఉండాలని చెబుతూ ఎమోషనల్ అవుతాడు. ఇక మరోవైపు రామచంద్ర బయటకు వెళ్లి సామాన్లు తెస్తూ ఉండగా ఇప్పుడే జానకి కాలేజీ నుంచి అతనికి ఫోన్ చేస్తుంది.

  జానకి గత నాలుగు రోజులుగా కాలేజ్ కు రావడం లేదు అని కారణాన్ని అడుగుతుంది. ఇప్పుడు మెయిన్స్ కు అసలైన సమయమని ఇప్పుడు రెగ్యులర్గా కాలేజీకి వస్తూ ఉండాలి అని అలాగే నిరంతరం చదువుతూనే ఉండాలి అని ప్రిన్సిపల్ చెప్పడంతో రామచంద్ర మళ్ళి కొంత ఆశ్చర్యపోతాడు.

  గుడిలో జానకి కన్నీళ్లు

  గుడిలో జానకి కన్నీళ్లు

  జానకి గారు అసలు క్లాస్ లు జరగడం లేదు ఎందుకు చెప్పింది. అసలు ఆమె చదువు గురించి ఎందుకు పట్టించుకోవడం లేదు అని అనుకుంటాడు. ఇక ఇంటికి వెళ్లి జానకిని ప్రశ్నించాలని అనుకుంటాడు. కానీ ఆమె అప్పుడు అక్కడ ఉండదు. జానకి తన బాధను దిగమింగుకోలేక గుడికి వెళ్లి దేవుడికి ప్రార్థిస్తుంది. కుటుంబం కోసం బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించలేనేమో.. నేను కన్న కలను కూడా ఇంతటితో వదిలేస్తున్నాను.. ఎవరితో కూడా నా బాధను చెప్పుకోలేని భగవంతుడా అని దేవుడు ముందు ఆమె కన్నీరు పెట్టుకుంటూ ఉంటుంది.

  తండ్రికి ఇచ్చిన మాట

  తండ్రికి ఇచ్చిన మాట

  అయితే అప్పుడే అక్కడికి జానకి వదిన తన కొడుకుతో వస్తుంది. బాబుకు కూడా జానకి తండ్రి పేరు పెట్టడంతో ఎమోషనల్ అవుతుంది. అప్పుడే తండ్రి కి చేసిన వాగ్దానం మాట కూడా గుర్తుకొస్తుంది. నువ్వు ఎలాగైనా ఐపీఎస్ అయితే నేను పైనుంచి చూస్తాను అని తండ్రి చెప్పిన మాటలు ఆమెకు గుర్తుకు వస్తాయి. ఇక ఏం జరిగింది అని ఎందుకు అలా ఉన్నావు అని జానకి వదిన అడిగే ప్రయత్నం చేస్తుంది. మరి జానకి తన వదినకు అసలు నిజం చెబుతుందో లేదో తదుపరి ఎపిసోడ్ లో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Today Episode 437
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X