For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu November 30th: ఐపీఎస్ డ్రీమ్.. భర్తను కఠినమైన కన్ఫ్యూజన్ లో పడేసిన జానకి!

  |

  జానకి కలగనలేదు సీరియల్ మరో ట్విస్ట్ తో ఎంతో ఆసక్తిగా మారింది. జ్ఞానాంబ చిన్న కొడుకు అఖిల్ తన ఫ్రెండ్ మాధురిపై హత్య ప్రయత్నం చేసి తప్పించుకోవాలని అనుకుంటాడు. ఇక అది చూసిన జానకి అతడి పై కేసు కూడా పెడుతుంది. కానీ జానకి మాటలను ఎవరు నమ్మరు. ఆమె పొరపాటు పడి ఉంటుంది అని ఇంట్లో వాళ్ళందరూ అనుకుంటారు. ఇక అఖిల్ కూడా ఆ విధంగా అందరిని నమ్మిస్తాడు. జానకి తన భర్త ఒత్తిడి కారణంగా అలాగే కుటుంబం సంతోషం కారణంగా అఖిల్ మీద కేసును వెనక్కి తీసుకోవడం వలన తన ఐపిఎస్ చదువుకు న్యాయం చేయలేనెమో అని అనుకుంటుంది. ఆ చదువులు ఇంతటితో వదిలేయాలని అనుకుంటుంది. కానీ రామచంద్ర మాత్రం అలా జరగకూడదు అని అనుకుంటాడు. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ పెరిగాయి. 7.90 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 443 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

  ఏమాత్రం పట్టించుకోకుండా..

  ఏమాత్రం పట్టించుకోకుండా..

  జానకి తన ఐపీఎస్ చదువును కొనసాగించకూడదు అని నిర్ణయం తీసుకోవడంతో రామచంద్ర కొంతవరకు ఆశ్చర్యపోతాడు. అసలు అఖిల్ తప్పు చేశాడా లేడా అనే విషయాన్ని వారు ఏమాత్రం పట్టించుకోకుండా జానకిని మాత్రం మళ్లీ చదువుకోవాలి అని అనుకుంటారు. కానీ బాధ్యతలేని చదువు సమాజానికి ఉపయోగపడదని కుటుంబం కారణంగా అఖిల్ పైన ఉన్న కేసులు వెనక్కి తీసుకోవడంతో తన ఐపీఎస్ చదువుకు న్యాయం చేయలేనేమో అని జానకి మాత్రం మొండి పట్టుదలతో చదువుకోలేను అని చెబుతుంది. కానీ రామచంద్ర మాత్రం ఆమెను మళ్లీ చదువు వైపు మళ్ళించాలి అని ఆలోచిస్తూ ఉంటాడు.

  మల్లిక పూజలు

  మల్లిక పూజలు

  ఇంట్లో వరుసగా అనార్థాలు జరుగుతూ ఉండడంతో జ్ఞానాంబ కూడా దోషమేమైనా ఉందేమో అని గుడిలో ప్రత్యేకంగా హోమాలు చేయిస్తుంది. ఈ క్రమంలో మల్లిక కొన్ని పూజలు చేయడానికి అసలు ఇష్టపడదు. ఇక ఆమెతో పాటు పూజలను కొనసాగించాలని గోవిందరాజులు కూడా చెబుతాడు. ఇక మల్లిక బాధపడుతూనే తన పూజను కొనసాగిస్తూ ఉంటుంది. పక్కనే ఉన్న పని మనిషిని సహాయం అడుగుతుంది కానీ ఆమె ఏ మాత్రం చేయకూడదు అని గోవిందరాజులు కూడా చెబుతాడు.

  అర చేతిలో హారతి

  అర చేతిలో హారతి

  ఇక మరొకవైపు రామచంద్ర జానకి మళ్ళీ చదువుకునే విధంగా మనసును మార్చాలి అని దేవుడిని కోరుకుంటూ ఉంటాడు. అర చేతిలో హారతి పెట్టుకుని ఉండడంతో అది చూసిన జానకి ఒక్కసారిగా ఆశ్చర్య పోతుంది. వెంటనే ఇలా ఎందుకు చేస్తున్నారు అని ఆ హారతిని నెట్టివేస్తుంది. మీరు చదువు విషయంలో మళ్ళీ మీ నిర్ణయాన్ని మార్చుకోవాలి అని అడగడంతో అది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు అని మరోసారి జానకి చెబుతుంది. ఒక భార్యగా మీకు ఏమైనా నేను చేస్తాను అని చెప్పడంతో రామచంద్ర మళ్లీ చదువు విషయాన్ని గుర్తు చేస్తాడు.

  ఐపిఎస్ కలను మర్చిపోండి

  ఐపిఎస్ కలను మర్చిపోండి

  మీరు మీ ఐపిఎస్ కలను మర్చిపోండి.. కానీ నా భార్యను మాత్రం నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా చూడాలని అనుకుంటున్నారు. అలాగే మీ నాన్నగారు కూడా నువ్వు ఐపీఎస్ కావాలని ఎంతగానో కోరుకున్నారు. కాబట్టి ఆ కోరికను నాకోసం నెరవేర్చండి అని మీ నిర్ణయాన్ని శివుడు సాక్షిగా మార్చుకోవాలి అని రామచంద్ర చెప్పి వెళ్ళిపోతాడు. ఇక మరొకవైపు అఖిల్ కారణంగా గాయపడిన మాధురి హాస్పిటల్ లోనే కోమాలో ఉంటుంది. వైద్యులు మరోసారి పరిక్షిస్తారు. కానీ ఎలాంటి మార్పు లేదని ఇంకా ఆమె కోమాలోనే ఉంది అని చెప్పడంతో వారి తల్లిదండ్రులు మరింత బాధపడుతూ ఉంటారు. మన కూతురిపై ఇలాంటి దారుణానికి ఓడి కట్టిన దుర్మార్గుడు ఎవరో అని బాధపడుతూ ఉంటారు.

  టెన్షన్ లేకుండా

  టెన్షన్ లేకుండా

  అయితే అఖిల్ మాత్రం ఇంట్లో ఎలాంటి టెన్షన్ లేకుండా ఉండగా అతని భార్య జెస్సి అతనికి మరింత ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తుంది. కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి అని వాటన్నిటిని పట్టించుకోకుండా నీ కెరీర్ పై దృష్టి పెట్టు అని జెస్సి సలహా ఇస్తుంది. ఇక వారు భోజనం చేస్తూ ఉండగా అప్పుడే ఇంట్లోకి రామచంద్ర వస్తాడు. జానకి గారు ఇంకా తన నిర్ణయం గురించి చెప్పలేదు అని రామచంద్ర ఆలోచిస్తూ ఉంటాడు. అదే విషయాన్ని ఒకసారి జానకి తో చర్చించాలని అనుకుంటాడు.

  మళ్ళీ కన్ఫ్యూజన్ లో పడేసిన జానకి

  మళ్ళీ కన్ఫ్యూజన్ లో పడేసిన జానకి


  ఇక బయట తులసి కోట దగ్గర ఉన్న జానకితో మాట్లాడిన రామచంద్ర ఏం నిర్ణయం తీసుకున్నారు అని అడుగుతాడు. అయితే జానకి మాత్రం మీ నుంచి కూడా నాకు ఒక సపోర్ట్ కావాలి అని.. రేపు ఇలాంటి మరొక సమస్య వస్తే.. నేను ఒక కోడలిగా ఆలోచించాలా లేదా.. న్యాయంగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా ఆలోచించాలా అని రామచంద్రను ప్రశ్నిస్తుంది. దీంతో రామచంద్ర ఒక్కసారిగా సందిగ్ధంలో పడతాడు. మరి ఈ విషయంలో రామచంద్ర జానకిని ఇంకా ఏ విధంగా ఒప్పిస్తాడో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Serial November 30th Episode 443
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X