For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu November 8th: జ్ఞానాంబ ఇంటికి పోలీసులు.. మళ్ళీ మాట మార్చిన అఖిల్!

  |

  జానకి కలగనలేదు సీరియల్ మరో సీరియస్ ట్విస్ట్ తో ఎంతో ఆసక్తిగా మారింది. జ్ఞానాంబ చిన్న కొడుకు అఖిల్ చేసిన తప్పు వలన జానకి పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది. ఇక కుటుంబంలో గొడవల వలన విబేధాలు రావడంతో పరిస్థితులు మారిపోతుంటాయి. అయితే జానకి తన భర్త రామ సహాయంతోనే ఐపీఎస్ చదువును పూర్తి చేయాలని అనుకుంటుంది. మరోవైపు అత్త జ్ఞానాంబ కూడా సపోర్ట్ చేస్తుంది.

  జనకికి ఇంట్లోనే మల్లిక నుంచి కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు కూడా ఎదురవుతాయి. మరి జానకి ఏ విధంగా తన డ్రీమ్ ను సాధిస్తుంది అనేది ఈ సీరియల్ లోని ప్రధాన అంశం. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ పెరిగాయి. 7.90 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 427 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

  డబ్బు సంపాదించాలి

  డబ్బు సంపాదించాలి

  అఖిల్ ఎలాగైనా డబ్బు సంపాదించాలి అనే ఆలోచనలో తప్పుడు దారిలో ప్రయత్నాలు మొదలు పెడుతూ ఉంటాడు. ఎవరికి తెలియకుండా డ్రగ్స్ మాఫియాలోకి వెళ్లిన అఖిల్ అక్కడ డబ్బు సంపాదించాలని అనుకుంటాడు. ఇక ఇంట్లో ఎలాంటి అనుమానం రాకుండా మంచిగా మారాను అనే విధంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఎప్పుడు చూసినా కూడా పుస్తకాలు పట్టుకుంటూ మంచివాడిలా నటిస్తూ ఉంటాడు.

  దీంతో తల్లిదండ్రులు అది నిజమని అనుకుంటారు. అయితే కాలేజీలో అఖిల్ ఒకరోజు డ్రగ్స్ అమ్ముతూ తన స్నేహితురాలికి కంటపడతాడు. మాధురి అతన్ని వెంటనే ప్రశ్నిస్తుంది.

  మాధురిని కొట్టిన అఖిల్

  మాధురిని కొట్టిన అఖిల్

  నువ్వు ఏదో తప్పు పని చేస్తున్నావు అని అనిపిస్తుంది అని వెంటనే ఈ విషయాన్ని మీ ఇంట్లో చెబుతాను అని మాధురి అంటుంది. మొదట అఖిల్ ఆ అమ్మాయిని చాలా బ్రతిమాలే ప్రయత్నం చేస్తాడు. ఈ విషయాన్ని మా ఇంట్లో చెప్పకు అని ఎంతగానో ప్రాధేయపడతాడు. అయితే ఆ తర్వాత మాధురి పరిగెత్తుకుంటూ వెళుతూ ఉండగా అఖిల్ ఒక కర్ర తీసుకొని ఆమె నెత్తిపై కొడతాడు.

  దీంతో మాధురి ఒక్కసారిగా కింద పడిపోతుంది. అయితే అఖిల్ ఆ అమ్మాయి వెంటపడుతున్నప్పుడే జానకి కూడా చూస్తుంది. అంతేకాకుండా అతను కొట్టడం కూడా గమనించిన జానకి ఆశ్చర్య పోతుంది. ఆ తర్వాత అఖిల్ ఏమీ తెలియనట్టుగా అక్కడ నుంచి పారిపోతాడు.

  ఎంత మాత్రం క్షమించకూడదు

  ఎంత మాత్రం క్షమించకూడదు

  ఇక మాధురి పరిస్థితిని గమనించిన జానకి వెంటనే ఆసుపత్రిలో చేర్పిస్తుంది. అయితే మాధురి తల్లిదండ్రులు కూతురు పరిస్థితిని చూసి ఎంతగానో కన్నీరు పెట్టుకుంటారు. ఆమె పరిస్థితి సీరియస్ గా ఉందని చెప్పడంతో ఐపీఎస్ కావాల్సిన జానకి తన కుటుంబంలోని వ్యక్తి ఆ విధంగా తప్పు చేయడంతో ఎంత మాత్రం క్షమించకూడదు అని అనుకుంటుంది.

  సాటి అమ్మాయికి ఎలాగైనా న్యాయం చేయాలి కాబట్టి కుటుంబంలోని వ్యక్తి అయినా సరే తప్పు చేస్తే చట్టం ముందు దోషిగా నిలబడాల్సిందే అని అనుకుంటుంది. ఇక మాధురి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి మీ అమ్మాయికి ఇలాంటి పరిస్థితిని తీసుకువచ్చిన వాడికి శిక్ష పడేలా చేస్తాను అని మాట ఇస్తుంది.

  మల్లికలో భయం

  మల్లికలో భయం

  ఇక ఆ తర్వాత జానకి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో కథ ఒక్కసారిగా మలుపు తిరుగుతుంది. అయితే జ్ఞానాంబ ఇంటికి పోలీసులు రావడంతో మల్లిక కొంత టెన్షన్ పడుతుంది. తాను గర్భవతి అని అబద్ధం చెప్పి ఇంట్లో నాటకం ఆడుతున్నాను అనే విషయం గురించి జానకి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందేమో అని ఆమె చాలా భయపడుతుంది. ఇక పోలీసులు ఇంట్లోకి రాగానే అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. అఖిల్ మీద జానకి కంప్లైంట్ ఇచ్చింది అని తెలియడంతో మరింత ఆశ్చర్యపోతారు.

  అఖిల్ తప్పు చేశాడు

  అయితే జ్ఞానాంబ మాత్రం ముందుగా అసలు ఏం జరిగిందో పరిస్థితులను తెలుసుకొని ఆ తర్వాత ఈ విషయం గురించి ఆలోచిద్దామని ఇప్పుడు పోలీసులను వెళ్లిపోమని చెప్పాలి అని జానకితో ఉంటుంది. కానీ జానకి మాత్రం అఖిల్ తప్పు చేశాడు కాబట్టే కంప్లైంట్ ఇచ్చాను అని చెబుతోంది. అలాగే మరొకవైపు రామచంద్ర కూడా ఆ విషయంలో జానకితో మాట్లాడేందుకు ప్రయత్నిస్తాడు. ఇక అఖిల్ ను పిలవండి అని అప్పుడు నిజం తెలుస్తుంది అని జానకి చెప్పడంతో అఖిల్ రాగానే రామచంద్ర నిజంగా నువ్వు ఒక అమ్మాయిపై హత్యాయత్నం చేశవా అని అడుగుతాడు.

  విభేదించిన రామ

  విభేదించిన రామ

  అయితే అఖిల్ మాత్రం తనకు ఏమీ తెలియనట్టుగా అబద్ధాలు చెబుతూ ఉంటాడు. అసలు మాధురి అనే అమ్మాయి కూడా ఎవరో నాకు తెలియదు అని జానకి వదిన అనవసరంగా నన్ను ఈ కేసులో విరిపించాలని చూస్తోంది అంటూ అఖిల్ మళ్ళీ అబద్ధాలు చెబుతూ ఉంటాడు. దీంతో ఇంట్లో వాళ్ళు మళ్లీ కన్ఫ్యూజన్లో పడతారు.

  గోవిందరాజులు కూడా ఈ విషయం గురించి మరోసారి ఆలోచించాలి అని అఖిల్ జైలుకు వెళితే అతని భవిష్యత్తుకు కూడా ప్రమాదమేనని జానకికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారు. అయితే ఎంత చెప్పినా కూడా జానకి కళ్లారా చూసాను అని చెప్పడంతో పోలీసులు కూడా అఖిల్ ను అరెస్టు చేసి తీసుకు వెళుతూ ఉంటారు.

  అయితే ఈ క్రమంలో రామచంద్ర మాత్రం జానకితో కొంత విభేదించే ప్రయత్నం చేస్తాడు. కొన్నిసార్లు మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి అని అంటాడు. మరి ఆ మాటలపై జానకి ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Today Episode 427
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X