For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu November 9th: అఖిల్ అరెస్టుతో కుప్పకూలిన జ్ఞానాంబ.. జానకిపై రామ ఒత్తిడి

  |

  జానకి కలగనలేదు సీరియల్ ఊహించని ట్విస్ట్ తో ఎంతో ఆసక్తిగా మారింది. జ్ఞానాంబ చిన్న కొడుకు అఖిల్ మాధురిపై హత్యాయత్నం చేయడంతో జానకి పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది. ఇక కుటుంబంలో గొడవల వలన విబేధాలు రావడంతో పరిస్థితులు మారిపోతుంటాయి. ఇక జానకి తన భర్త రామ కూడా జానకి మాటలను పూర్తిగా నమ్మడు. మరోవైపు అత్త జ్ఞానాంబ కూడా బాధలో ఉంటుంది.

  ఇక మల్లిక నుంచి కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు కూడా ఎదురవుతాయి. మరి జానకి ఏ విధంగా ఈ విషయంలో అందరికి అర్థమయ్యేలా చెబుతుంది అనే పాయింట్ ఆసక్తిగా మారింది. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ పెరిగాయి. 7.90 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 428 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం.

  డ్రగ్స్ వలన

  డ్రగ్స్ వలన

  రామచంద్ర చిన్న తమ్ముడు అఖిల్ డబ్బు సంపాదించాలి అనే ఆలోచనతో తప్పటడుగులు వేస్తూ ఉంటాడు. తొందరగా డబ్బులు సంపాదించుకోవాలి అని తన స్నేహితుడి సపోర్ట్ తో డ్రగ్స్ వ్యాపారంలోకి దిగుతాడు. మొదట పెట్టుబడి కోసం డబ్బులు కూడా అతని స్నేహితులకు ఇస్తాడు. అయితే డ్రగ్స్ తీసుకుని అఖిల్ తన కాలేజీలోనే అమ్ముతూ ఉంటాడు.

  అయితే అఖిల్ డ్రగ్స్ అమ్ముతూ ఉండడం అతని స్నేహితురాలు మాధురి చూస్తుంది. నువ్వు చేస్తున్నది తప్పు అంటూ అతనితో వాదిస్తుంది. అంతేకాకుండా విషయాన్ని వెంటనే మీ ఇంట్లో చెబుతాను అని మాధురి అనడంతో బ్రతిమాలే ప్రయత్నం చేస్తాడు. ఇక మాధురి వినకపోవడంతో ఒక కర్ర తీసుకొని కొట్టడంతో ఆమె అక్కడికక్కడే పడిపోతుంది. ఇక జానకి ఆ ఘటనను చూస్తుంది.

  అఖిల్ చేసిన తప్పు

  అఖిల్ చేసిన తప్పు

  జానకి చూసినట్లు అఖిల్ గమనించకుండా అక్కడినుంచి పారిపోతాడు. అయితే జానకి వెంటనే మాధురిని హాస్పిటల్ లో జాయిన్ చేస్తుంది. ఇక మాధురి తల్లిదండ్రులు ఆ విషయంలో ఎంతగానో బాధపడుతూ ఉంటారు. కూతురు పరిస్థితి సీరియస్ గా ఉందని తెలియడంతో ప్రతిరోజు హాస్పిటల్ లో ఏడుస్తూ ఉంటారు. ఇక వారి పరిస్థితిని చూసి గమనించిన జానకి ఒక కాబోయే ఐపీఎస్ ఆఫీసర్ గా ఆలోచిస్తుంది. కుటుంబం గురించి ఆలోచించి ఒక అమ్మాయికి అన్యాయం చేయకూడదని అనుకుంటుంది. వెంటనే అఖిల్ మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలని కూడా ఉంటుంది.

  అఖిల్ తప్పు చేయడు అంటూ..

  అఖిల్ తప్పు చేయడు అంటూ..

  ఇక అనుకున్నట్లే చేసిన జానకి ఇంటికి పోలీసులతో వస్తుంది. ఆ విషయంలో కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. మరోవైపు అఖిల్ మాత్రం తాను ఈ నేరం చేయలేదు అని మరోసారి అబద్ధాలు చెబుతూ ఉంటాడు. జానకి ఎంత చెప్పినా కూడా ఎవరు కూడా ఆ విషయంలో పూర్తిస్తాయిలో నమ్మకంతో ఉండరు. అఖిల్ చిన్నచిన్న పొరపాటు చేస్తాడేమో కానీ ఇలా ఒక అమ్మాయి మీద అత్యాయత్నం చేయాలని అనుకోడు అని రామచంద్ర కూడా చెప్పడంతో జానకి ఒక్కసారిగా షాక్ అవుతుంది.

  కుప్పకూలిన జ్ఞానాంబ

  కుప్పకూలిన జ్ఞానాంబ

  ఈ విషయంలో జ్ఞానాంబ కూడా ఏమీ అనలేక ఒకసారిగా కుప్పకూలిపోతుంది. అఖిల్ నిజంగానే తప్పు చేశాడు అని జానకి మరోసారి చెబుతుంది. ఇక జ్ఞానాంబ కింద పడిపోవడంతో కొడుకు రామచంద్ర మరోసారి జరగని బ్రతిమాలతూ ఉంటాడు. వెంటనే మీ కేసును వాపస్ తీసుకోవాలని లేకుండా అఖిల్ భవిష్యత్తు మీద అది తీవ్ర ప్రభావం చూపిస్తుంది అని అంతే కాకుండా అమ్మ కూడా తట్టుకోలేదు ఎంతగానో చెబుతాడు. జానకి ఇక విషయంలో నేను ఏమి చేయలేను చట్టం ప్రకారం అఖిల్ కు పోలీసులు అరెస్ట్ చేసి తీసుకు వెళ్లారు అని అంటుంది.

  మల్లికకు మరో ఛాన్స్

  మల్లికకు మరో ఛాన్స్

  అయితే మరోవైపు మల్లికా ఇదే అవకాశంగా చేసుకొని జానకిని మరింత బ్యాడ్ చేయాలని అనుకుంటుంది. ఇక అఖిల్ భార్య జెస్సిని ఒకవైపు ఓదారుస్తూనే మరొకవైపు జానకి ఇలా కావాలని కక్ష పెట్టి చేసి ఉంటుంది అనేలా మాట్లాడుతుంది. జెస్సి కూడా జానకిని బ్రతిమాలతూ ఉంటుంది. అఖిల్ ఇప్పుడిప్పుడే మారిపోయి చాలా మంచిగా ఉంటున్నాడు అని.. కెరీర్ పై దృష్టి పెడుతున్నాడు అని ఇలాంటి సమయంలో అతనిపై పోలీస్ కేసు నమోదు అయితే భవిష్యత్తు మీద ప్రభావం పడుతుంది అని జెస్సీ ఎంతగానో ప్రాధేయపడుతుంది.

  ఏమీ మాట్లాడకుండా

  ఏమీ మాట్లాడకుండా

  అయితే జానకి ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి తన బెడ్ రూమ్ లోకి వెళ్లిపోతుంది. అందరూ నన్ను ప్రశ్నించినా పరవాలేదు కానీ నన్ను ఎంతగానో నమ్మే రామచంద్ర గారు కేసు వెనక్కి తీసుకోమనడం మరింత బాధ పెడుతుంది అని జానకి బాధపడుతూ ఉంటుంది. ఇక మరోసారి రామచంద్ర జానకి తో మాట్లాడాలని అనుకుంటాడు. మీరు ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా ఆలోచిస్తున్నారు అని ఇంట్లో పరిస్థితుల వలన అందరు ఎంతగా బాధపడతారో ఆలోచించారా తెలుసా అంటూ మరొక విధంగా మాట్లాడతాడు.

  అఖిల్ మాటలకు జానకి షాక్

  అఖిల్ మాటలకు జానకి షాక్

  అంతే కాకుండా అఖిల్ అలాంటి తప్పు చేయడు అని చిన్నప్పటి నుంచి అతను నుంచి నేను చూస్తున్నాను అని అంటాడు. అంతేకాకుండా మీరు ఐపీఎస్ తరహాలో ఆలోచిస్తూ కుటుంబం గురించి పట్టించుకోవడం లేదు అని అనడంతో జానకి మరోసారి షాక్ అవుతుంది. ఇప్పటివరకు చదువు విషయంలో ఎంతగానో సపోర్ట్ చేసిన రామచంద్ర ఇలా మాట్లాడడంతో జానకి మౌనంగా ఉండిపోతుంది. మరి ఈ పరిస్థితులు జానకి చదువుపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Today Episode 428
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X