For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu Weekly Roundup: జ్ఞానాంబ కుటుంబంలో విబేధాలు.. ప్లాన్ తో విడగొట్టిన మల్లిక!

  |

  జానకి కలగనలేదు సీరియల్ ప్రతీ వారం కూడా మరింత పెరుగుతోంది. మొదట్లో ఈ సీరియల్ కాస్త నీరసంగా అనిపించినప్పటికీ ఆ తర్వాత అసలు కథలోకి రావడంతో రోజురోజుకు ప్రేక్షకుల్లో ఆదరణను పెంచుకుంటుంది. ఇక గత వారం మొత్తం కూడా అంటే అక్టోబర్ 18 నుంచి అక్టోబర్ 21 వరకు ఈ సీరియల్ లో ఎలాంటి మలుపులు చోటు చేసుకున్నాయి. అలాగే జానకి, అఖిల్ జెస్సి ప్రేమ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం..

  అఖిల్ 18వ ఎపిసోడ్

  అఖిల్ 18వ ఎపిసోడ్

  అయితే భవిష్యత్తులో మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకొని ట్రీట్మెంట్ చేయిస్తే సరిపోతుంది అని అందుకోసం డబ్బు కూడా ఖర్చవుతుంది అని వైద్యులు చెబుతారు. ఇక రామచంద్ర మరోసారి ఆలోచనలు పడతాడు. ఈ విషయం ఇంట్లో చెబితే మళ్ళీ అందరూ బాధపడతారు అని అందుకే ఎవరికీ తెలియకుండా మనమే కొంత డబ్బులు ఆదా చేస్తూ ఉండాలి అని జానకి రామచంద్ర కు చెబుతుంది. ఇక రామచంద్ర కూడా అందుకు ఒప్పుకుంటాడు. కానీ ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో తెలియకూడదు అని కూడా జానకి రామచంద్ర కు తెలియజేస్తుంది. ఆ తర్వాత హాస్పిటల్ లోపల నుంచి వచ్చిన జెస్సి ఏం జరిగింది అని అడుగుతుంది. మరి జానకి ఈ విషయంలో జెస్సి కి ఎలాంటి మాటలు చెబుతుందో తదుపరి ఎపిసోడ్లో చూడాలి.

  అఖిల్ 18వ ఎపిసోడ్

  అఖిల్ 19వ ఎపిసోడ్

  అఖిల్ 19వ ఎపిసోడ్

  ఇక తర్వాత ఆ డబ్బులు తీసుకువెళ్లి రామచంద్ర తన భార్యకు ఇస్తాడు. ఉదయాన్నే బ్యాంకులో డిపాజిట్ చేయాలి అని అంటాడు. ఇక ఆ డబ్బులు జానకికి ఇస్తున్న సమయంలోనే మల్లిక వీడియో తీస్తుంది. వాళ్లు సొంతంగా డబ్బులు సేవ్ చేసుకుంటున్నారు అని అనుమానిస్తూనే ఆ తర్వాత అదే విషయాన్ని తన భర్త విష్ణుకు చెబుతుంది. ఇక విష్ణు దగ్గర నుంచి కూడా రామచంద్ర డబ్బులు తీసుకొని వాటిని కూడా డిపాజిట్ చేయాలని అనుకుంటాడు. కానీ అప్పుడు మల్లిక ఒప్పుకోదు. మీరు మాత్రం డబ్బులు ఆదా చేసుకుని మా డబ్బులు ఇంట్లో వాడాలని అనుకుంటారా అని కోపంతో మాట్లాడుతుంది. మరి వారికి జానకి ఏ విధంగా సమాధానం చెబుతుందో చూడాలి.

  అఖిల్ 19వ ఎపిసోడ్

  అఖిల్ 20 ఎపిసోడ్

  అఖిల్ 20 ఎపిసోడ్

  ఇక జానకి రామచంద్ర చేసేది ఏమీ లేక మరోసారి వెళ్లి జ్ఞానంబతో మాట్లాడతారు. వాళ్లు ఏదో తెలియక అలా మాట్లాడుతున్నారు మనం అలా జరగనివ్వకూడదు అని రామచంద్ర చెబుతాడు. కానీ జ్ఞానంబ మాత్రం వాళ్లు తెలిసే మాట్లాడుతున్నారని వారికి నచ్చినట్లుగానే చేయాలి అని చెప్పడంతో రామచంద్ర గోవిందరాజులు జానకి మరింత బాధపడుతూ ఉంటారు. మరోవైపు వెన్నెల కూడా కుటుంబం విడిపోతుంది అని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అవుతుంది. మరి ఈ తరహా మార్పులతో ఎవరు ఎటువైపు వెళతారో తదుపరి ఎపిసోడ్ లో చూడాలి.

  అఖిల్ 20 ఎపిసోడ్

  అక్టోబర్ 21 ఎపిసోడ్

  అక్టోబర్ 21 ఎపిసోడ్

  అక్టోబర్ 21 ఎపిసోడ్


  ఇక ఆమె ఎందుకు విడిపోయారు ఏమైనా సమస్య వచ్చిందా అంటూ ఇంట్లో ఉన్న గొడవలు గురించి తెలుసుకోవాలని అనుకుంటుంది. ఇక మల్లిక ఆ విషయాన్ని చెప్పబోతుంటే జానకి అడ్డుపడి ప్రత్యేకంగా పూజ జరిగే వరకూ అయినా కాస్త ప్రశాంతంగా ఉండలేవా అని అంటుంది. అంతేకాకుండా ఆ విషయాలు అయినా మీకెందుకు అంటూ ఆ మహిళతో జానకి గట్టిగా మాట్లాడుతుంది. అలాగే జ్ఞానాంబ కూడా ఆ మహిళపై కోపగించుకుంటుంటే ఆ తర్వాత ఆమె సైలెంట్ గా వెనక్కి వెళ్లిపోవడంతో మల్లికా అప్సెట్ అవుతుంది. ఇక అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి తమతో కలిసి రావాలి అని జానకి చెబుతుంది. కానీ మల్లిక నేను రాను అని అనడంతో జ్ఞానాంబ ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ జానకి చెప్పినట్లు చెయ్యాలి అని ఉంటుంది. ఇక మల్లికా ఏమీ అనలేక సరే అని ఒప్పుకుంటుంది. ఆ తర్వాత మల్లిక జానకి చెప్పినట్లుగానే అమ్మవారికి ప్రత్యేకంగా తయారు చేసిన నైవేద్యంతో గుడిలోకి వెళతారు. మరి ఈ పూజ తరువాత తదుపరి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.

  అక్టోబర్ 21 ఎపిసోడ్

  English summary
  Janaki Kalaganaledu Serial Weekly Roundup: Janaki Kalaganaledu October 18th to October 21st Episode Highlights
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X