For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu Weekly Roundup: మల్లిక ప్లాన్ కు జానకి మరో ఊహించని కౌంటర్.. దిమ్మతిరిగేలా!

  |

  జానకి కలగనలేదు సీరియల్ అక్టోబర్ చివరి వారం కూడా మరింత ఆసక్తికరమైన కథాంశంతో కొనసాగింది. ఈ సీరియల్ మొదట్లో కాస్త నీరసంగా అనిపించినప్పటికీ ఆ తర్వాత అసలు కథలోకి రావడంతో రోజురోజుకు ప్రేక్షకుల్లో ఆదరణను పెంచుకుంటుంది. ఇక గత వారం మొత్తం కూడా అంటే అక్టోబర్ 24 నుంచి అక్టోబర్ 28 వరకు ఈ సీరియల్ లో ఎలాంటి మలుపులు చోటు చేసుకున్నాయి. అలాగే జానకి ఫ్యామిలీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం..

  అక్టోబర్ 24వ ఎపిసోడ్

  అక్టోబర్ 24వ ఎపిసోడ్

  ఫ్యామిలీ విడిపోవాలని గుడిలో కూడా మల్లిక ఆలోచిస్తుంది. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత అందరూ కూడా కలిసి మాట్లాడాలని అనుకుంటారు. ముఖ్యంగా జానకి అయితే మల్లిక గురించి మాట్లాడుతుంది. మరోసారి నువ్వు విడిపోవాలని ఆలోచనకు రాకు. ఉమ్మడి కుటుంబం అంటే ఎంతో సంతోషంగా ఉంటుంది అని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తోంది.

  అలాగే అఖిల్ కూడా ప్రేమానురాగాలకు దూరం కావొద్దు అని జానకి చెబుతుంది. ఈ విషయంలో పెద్దవారు అయినా మామయ్య గారు అందరితో ఒకసారి మాట్లాడాలి అని జానకి కోరుతుంది. అలాగే అత్తగారిని కూడా అదే విధంగా కోరుతున్నట్లు జానకి చెబుతోంది.

  పూర్తి వివరాలు

  అక్టోబర్ 25వ ఎపిసోడ్

  అక్టోబర్ 25వ ఎపిసోడ్

  జ్ఞానాంబ చిన్న కొడుకు అర్ధరాత్రి అఖిల్ కు హఠాత్తుగా కడుపులో నొప్పి వస్తుంది. అతను నొప్పితో బాధపడుతున్నట్లు గమనించిన జెస్సి వెంటనే జానకిని పిలుస్తుంది. అలాగే రామచంద్ర కూడా తమ్ముడిని చూడడానికి వస్తాడు. గదిలో నొప్పితో బాధపడుతున్న అఖిల్ ను రామచంద్ర ఏమైంది అని అంటాడు. ఇక వెంటనే జానకి హాస్పిటల్ కి వెల్దామా అఖిల్ అని ఉంటుంది. అయితే ముందుగానే జీలకర్ర మంజీగ కలిపి అది తాగమని చెబుతుంది. అప్పుడు అఖిల్ నొప్పి తగ్గింది అని అంటాడు. ఈమధ్య చెడు తిరుగుడులు తిరిగి మద్యం కారణంగా ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నావని అందుకే ఈ నొప్పి వచ్చింది అని రామచంద్ర చెబుతాడు.

  ఇక అఖిల్ కూడా ఈ ఆప్యాయతలు దూరమైతే దక్కవు అని మళ్ళీ కలిసి ఉండాలని అనుకుంటాడు. కానీ రామచంద్ర మాత్రం కలిసే అవకాశం లేదు అని ఉదయం ఇద్దరం కూడా విడిపోతున్నాము అని బాధపడుతూ చెబుతాడు.

  పూర్తి వివరాలు

  అక్టోబర్ 26 వ ఎపిసోడ్

  అక్టోబర్ 26 వ ఎపిసోడ్

  పనిమనిషి చికిత్త వచ్చి ఇంటి చిన్న కోడలు జెస్సి ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయినట్లుగా చెబుతుంది. దీంతో వెంటనే జానకి వెళ్లే జెస్సి పరిస్థితిని గమనిస్తుంది. ఇక తర్వాత డాక్టర్ కు కూడా ఫోన్ చేస్తూ ఉంటుంది. అయితే కడుపుతో ఉంది కాబట్టి కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది అని అందరూ అనుకుంటారు. కొద్దిసేపటి తర్వాత జెస్సి మళ్లీ కొలుకుంటుంది. అయితే అదే సమయంలో డాక్టర్ వచ్చినప్పుడు తనను కూడా చెక్ చేస్తే దొంగ ప్రెగ్నెన్సీ విషయం బయటపడుతుందేమో అని మల్లిక భయపడుతుంది.

  ఇక తర్వాత డాక్టర్ రాకముందే అక్కడ నుంచి వెళ్లిపోవాలని అనుకుంటుంది. ఇక డాక్టర్ రాగానే మల్లికా ఒక చెట్టు ఎక్కి కూర్చుంటుంది. కానీ జానకి మల్లిక పరిస్థితిని చూసి అనుమానిస్తుంది.

  పూర్తి వివరాలు

  అక్టోబర్ 27వ ఎపిసోడ్

  అక్టోబర్ 27వ ఎపిసోడ్

  తర్వాత చెట్టు ఎందుకు ఎక్కవు అని జానకి అడుగుతుంది. కానీ మల్లిక మాత్రం సరైన సమాధానం చెప్పకుండా వేపాకు జ్యూస్ కోసం ఆకులు తెంపడానికి వెళ్లాను అని ఉంటుంది నీకు వేపాకు జ్యూస్ అంటే ఇష్టం ఉండదు కదా అయినా ఎవరికో ఒకరికి చెప్పాల్సి ఉండేది. అలాంటిది నువ్వు ఎందుకు చెట్టు ఎక్కావు అని జానకి ప్రశ్నిస్తుంది.

  ఇక జానకి తరచుగా ప్రశ్నలు అడుగుతూ ఉండడంతో సమాధానం చెప్పలేక నాకు దాహంగా ఉంది వెళ్లి నీళ్లు తాగి వస్తాను అని మల్లికా అంటుంది. అసలు నిజంగా మల్లికా గర్భవతి అయ్యిందా లేదంటే కావాలని నాటకం ఆడుతుందా అని జానకి అనుమానిస్తుంది. అందుకోసం జానకి, నీలావతినీ రంగంలోకి తెస్తుంది.

  పూర్తి వివరాలు

  అక్టోబర్ 28వ ఎపిసోడ్

  అక్టోబర్ 28వ ఎపిసోడ్

  జానకి ప్రెగ్నెన్సీ విషయంలో నిజం తెలుసుకోవాలని జానకి నీలావతిని రంగంలోకి దింపుతుంది. జానకి ఫోన్ చేయగానే ఆమె కొంత టెన్షన్ పడుతుంది. ఎందుకు జానకి ఇంత ఉదయాన్నే ఫోన్ చేసింది అని నీలావతి ఆశ్చర్య పోతుంది. బహుశా నేను మల్లిక గర్భవతి అనే అబద్ధం చెప్పిన విషయం ఆమెకు తెలిసిపోయిందా అని అంటుంది. అసలే అమెది పోలీస్ బుర్ర ఏమైనా తేడా వస్తే నేను పోలీస్ స్టేషన్లో పడతానేమో అని డైరెక్ట్ గా జానకితో నిజం చెప్పాలని అనుకుంటుంది. ఇదంతా మల్లికే చేసింది అని చెప్పాలని కూడా ఆలోచిస్తుంది. కానీ మల్లికా వెంటనే ఆమెకు అడ్డుపడుతుంది.

  ఇక తర్వాత ఏదో ఒకటి సర్ది చెప్పి మల్లిక నీలావతిని ఇంటి నుంచి పంపించేస్తుంది. కానీ జానకి మాత్రం నిజం తెలుసుకొని మల్లికా చెంప పగలగొడుతుంది. మరి ఈ పరిణామాల తరువాత మల్లిక అబద్దాలను జానకి ఇంట్లో ఎలా నిరూపిస్తుందో చూడాలి.

  పూర్తి వివరాలు

  English summary
  vJanaki Kalaganaledu Serial Weekly Roundup: October 24th to October 28th Episode Highlights,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X