For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu Weekly Roundup: మల్లిక ఎత్తులకు జానకి రివర్స్ కౌంటర్.. బాధలో జెస్సి!

  |

  జానకి కలగనలేదు సీరియల్ రేటింగ్ రోజురోజుకు మరింత ఎక్కువగా పెరుగుతోంది. మొదట్లో ఈ సీరియల్ కాస్త నిరాశకు గురి చేసినప్పటికీ ఆ తర్వాత అసలు కథలోకి రావడంతో రోజురోజుకు ప్రేక్షకుల్లో ఆదరణను పెంచుకుంటుంది. ఇక గత వారం మొత్తం కూడా అంటే అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 7 వరకు ఈ సీరియల్ లో ఎలాంటి మలుపులు చోటు చేసుకున్నాయి. అలాగే జానకి, అఖిల్ జెస్సి ప్రేమ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం..

  అక్టోబర్ 3వ ఎపిసోడ్

  అక్టోబర్ 3వ ఎపిసోడ్

  జానకి పరీక్షలు బాగా రాయడంతో రామ చాలా సంతోషంగా ఉంది అంటూ ఆమెను కాలేజీలోనే పైకి ఎత్తుకొని తిరుగుతూ ఉంటాడు. ఇక తర్వాత జానకి సిగ్గుపడుతూ కిందకు దించండి రామ గారు అని అంటాడు. ఇక ఈ విషయం వెంటనే అమ్మగారికి చెప్పాలి అని ఇద్దరు కూడా ఇంటికి బయలుదేరుతారు. మరోవైపు మల్లిక మాత్రం ఎలాగైనా జానకి పరీక్షల్లో ఫెయిల్ కావాలి అని ఈసారైనా నేనే గెలవాలి అని అమ్మవారి ముందు ప్రార్థన చేస్తూ ఉంటుంది. కానీ అప్పుడే గోవిందరాజులు వచ్చి ఏదో మంట పెట్టాలని చూస్తున్నావు కదా అది ఎంత మాత్రం నెరవేరదు అని సెటైర్ వేస్తాడు

  పూర్తి వివరాలు

  అక్టోబర్ 4వ ఎపిసోడ్

  అక్టోబర్ 4వ ఎపిసోడ్

  అప్పుడే వచ్చిన జానకి అత్తగారితో మాట్లాడుతుంది. ఈసారి ఎలాంటి పొరపాటు జరగకుండా నేను చూసుకుంటాను అని మన ఇంట్లో ఎప్పటిలాగే బొమ్మలు కొలువు జరిపిద్దామని అంటుంది. ఎందుకంటే మన ఇంట్లోకి ఇద్దరు వారసులు రాబోతున్నారు కాబట్టి ఈ సమయంలో తప్పకుండా జరుపుకోవాలి అని కూడా జానకి చెబుతుంది. దీంతో జానకి మాటలకు జ్ఞానాంబ ఒప్పుకుంటుంది. అయితే మరోవైపు మల్లిక మాత్రం ఇదే ఆసరాగా చేసుకుని జానకిపై పగ తీర్చుకోవాలని అనుకుంటుంది.

  పూర్తి వివరాలు

  అక్టోబర్ 5వ ఎపిసోడ్

  అక్టోబర్ 5వ ఎపిసోడ్

  అప్పుడే జానకి చుట్టుపక్కల వారి ఇంటికి ఫోన్ చేస్తుంది. పిల్లలు ఇంకా రాలేదు అని అడగడంతో మీ ఇంట్లో పూజలు ఆచారాలు పద్ధతులు లేకుండా జరుగుతున్నాయని అందుకే మా పిల్లలను పంపించాలని అనుకోవడం లేదని అంటారు. ఇక ఆ మాటలకు అందరూ కూడా బాధపడుతూ ఉంటారు. ఇక అప్పుడే జానకి గతంలో కాపాడిన ఒక చిన్నారి పూజకు వస్తుంది. ఇక ఆ అమ్మాయి చేత బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తారు. మరి తర్వాత మల్లికా ఎలాంటి ప్లాన్ వేస్తుందో చూడాలి.

  పూర్తి వివరాలు

  అక్టోబర్ 6వ ఎపిసోడ్

  అక్టోబర్ 6వ ఎపిసోడ్

  మరోవైపు జానకి ఉదయాన్నే లేచి తన భర్తతో కలిసి ఫిట్నెస్ పై దృష్టి పెడుతుంది. ప్రత్యేకంగా పార్కులో జాగింగ్ కూడా చేస్తుంది. ఇక మరోవైపు మల్లిక కూడా ఇంట్లో పనుల నుంచి తప్పించుకోవాలి అని బయట వ్యాయామం చేయాలని అనుకుంటుంది. కానీ ఆమె గర్భవతిగా ఉన్నట్లు అబద్ధం చెప్పిన విషయం తెలిసిందే. ఇక ఎలా పడితే అలా వ్యాయామం చేస్తూ ఉండడంతో జానకి ఆశ్చర్య పోతుంది. నువ్వు అలా చేయకూడదు అని కేవలం నడవాలి అని సలహా ఇస్తుంది. ఇక ఆ తర్వాత మల్లిక సరే అంటుంది. మరోవైపు జ్ఞానాంబ గోవిందరాజు ఇద్దరు కూడా ఈ పండగ సమయంలో అందరూ సంతోషంగా ఉండాలి అని కోరుకుంటారు. కానీ అప్పుడే జెస్సీ తల్లిదండ్రులు కోపంగా వారి ఇంటికి వస్తారు

  పూర్తి వివరాలు

  అక్టోబర్ 7వ ఎపిసోడ్

  అక్టోబర్ 7వ ఎపిసోడ్

  మల్లికా పేరు చెప్పాలని అనుకున్నప్పటికీ కూడా ఆమెకు దండం పెడుతున్నట్లు చేతులు చూపడంతో జెస్సి పేరెంట్స్ సైలెంట్ గా వెళ్ళిపోతారు. ఇక తర్వాత బయటకు వచ్చిన మల్లికా తనలో తానే ఆవేశాన్ని తెచ్చుకుంటుంది. ప్లాన్ చేస్తే మొత్తం వృధా అయ్యిందని అనుకుంటుంది. కానీ గోవిందరాజులు ఆమెను కూడా అనుమానిస్తాడు. ఈ విషయంలో నీకు నిజంగా సంబంధం ఉంది అని తెలిస్తే మాత్రం మామూలుగా ఉండదు అని కూడా హెచ్చరిస్తాడు.

  ఇక ఆ తర్వాత జానకి చదువుకుంటూ ఉండగా రామచంద్ర ఆమెను ఏ మాత్రం డిస్టర్బ్ చేయకూడదు అని అనుకుంటాడు. కానీ అప్పుడే జెస్సి జానకి దగ్గరకు వచ్చి అఖిల్ తనతో సరిగ్గా మాట్లాడటం లేదు అని అలాగే ఈ ఇంట్లో నేను మంచి కోడలిగా ఉండాలి అంటే పద్ధతులు ఆచారాల గురించి పండగల గురించి తెలుసుకోవాలని అనుకున్నట్లు మాట్లాడుతుంది.

  పూర్తి వివరాలు

  English summary
  Janaki Kalaganaledu Serial Weekly Roundup: October 3rd to October 7th Episode Highlights
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X