Don't Miss!
- News
ఢీ అంటే ఢీ అంటున్న రెండు పవర్ సెంటర్లు?
- Finance
Home Loan: హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా..? కొత్త టాక్స్ సిష్టం బెటరా..? పాతదే మేలా..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Sports
INDvsAUS : ఈ మూడు విషయాలే సిరీస్ విజేతను నిర్ణయిస్తాయి..!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Lifestyle
Valentines Day 2023: వాలెంటైన్స్ డే రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఉన్న మూడ్ పోయి సమస్యలు రావొచ్చు
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
దారుణంగా బిగ్ బాస్ హౌస్.. అన్నీ క్లియర్‌గా చూపించిన సుజాత
బిగ్ బాస్ షో నడిచే సమయంలో ఇళ్లు ఎలా ఉండేదో అందరికీ తెలిసిందే. ఎందుకంటే దాదాపు వంద రోజులకు పైగా ఆ షోను, బిగ్ బాస్ ఇంటిని మనం చూస్తూనే వచ్చాం. ఎంతో కలర్ ఫుల్‌గా, నిండుగా కనిపించేది. ఒక్కసారైనా లోపలకి వెళ్లి అ సౌకర్యాలను అనుభవించాలని అనుకునే వాళ్లు ఎంతో మంది ఉంటారు. కానీ ఒక్కసారిగా ఆ షో అయిపోతే ఇళ్లు ఎలా ఉంటుందో ఎవ్వరూ ఊహించలేరు. ప్రస్తుతం ఆ బిగ్ బాస్ ఇళ్లు ఎలా ఉందో సుజాత చూపించింది.

అందరూ అలా..
బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన అందరికీ అవకాశాలు వచ్చి జీవితాలు మారిపోతాయో లేదో చెప్పలేం. కానీ అందరూ మాత్రం ఓ రకంగా ఫేమస్ అవుతూనే ఉన్నారు. బిగ్ బాస్ కంటెస్టెంట్లకు యూట్యూబ్ ఓ వ్యాపారం అయిపోతోంది. వారికి వచ్చిన క్రేజ్‌ను ఉపయోగించుకుని యూట్యూబ్ చానెళ్లను పెట్టేసుకుంటున్నారు.

సుజాత సైతం..
బిగ్ బాస్ నాల్గో సీజన్ కంటెస్టెంట్ సుజాత యూట్యూబ్ చానెల్‌తో ఎంత రచ్చ చేస్తోందో అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ కంటెస్టెంట్లు, వారి ఫ్యామిలీ మెంబర్స్‌లను ఇంటర్వ్యూ చేస్తూ బాగానే వ్యూస్ కొల్లగొడుతున్నారు. అలా సుజాత కూడా తన యూట్యూబ్ చానెల్‌ను బాగానే ఫేమస్ చేసుకుంటోంది.

తాజాగా ఇలా..
సుజాత తాజాగా బిగ్ బాస్ ఇంటికే వెళ్లింది. అన్నపూర్ణ స్టూడియోకు అలా వెళ్లిన సుజాత.. పనిలో పనిగా బిగ్ బాస్ ఇంటిని కూడా పలకరించింది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ ఎలా ఉందో అందరికీ చూపిస్తాను అని చెబుతూ ఓ స్పెషల్ వీడియోను కూడా చేసింది.

శిథిలావస్తలో ఉన్నట్టుగా..
షో నడిచినంత కాలం గ్రీన్ మ్యాట్ వేసి అంతా పచ్చగా ఉండేలా చూశారు.కానీ ఇప్పుడు షో లేదు కాబట్టి అవన్నీ పీకి పారేశారు. స్విమ్మింగ్ పూల్ కూడా ఎండిపోయింది. చెత్తా చెదారంతో నిండి ఉంది. బాత్రూం ఏరియాను కూడా పీకేశారు. అలా మొత్తంగా బిగ్ బాస్ ఇంటి కళ లేకుండాపోయింది.

బాధగా ఉందంటూ..
తాము ఇంట్లో ఉన్నప్పుడు బిగ్ బాస్ హౌస్ ఎలా ఉండేది. ఇప్పుడు ఎలా ఉందంటూ సుజాత ఎమోషనల్ అయింది. అప్పుడే బాగుండేది.. ఇప్పుడు మొత్తం శిథిలావస్తకు వచ్చినట్టుగా ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతే ఎలా ఉంటుందో అలా ఉందంటూ సుజాత ఇంటిని మొత్తం చూపించింది. ఎక్కడ ఏమేమీ ఉండేవో క్లియర్‌గా చెప్పింది.