ఎన్టీఆర్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. త్వరలోనే తెర మీదకు, ఇక రచ్చే!
నందమూరి అందగాడు ఎన్టీఆర్ చివరిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఇప్పుడు మళ్లీ రాజమౌళి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు కానీ ఆ సినిమా ఇప్పట్లో ఆ రిలీజ్ అయ్యే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. అయితే ఆయన తన అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చేలా ఎవరు మీలో కోటీశ్వరుడు అనే ఒక షో ద్వారా బుల్లితెర మీద కనిపించబోతున్నాడు..
నిజానికి ఈ షో ఇప్పటికే మొదలు కావాల్సి ఉన్నా కరోనా మహమ్మారి రెండో దశ దేశం లోకి ఎంటర్ కావడంతో వాయిదా పడింది. ఎవరు మీలో కోటీశ్వరుడు అనే షో మా టీవీలో పాపులర్ అయిన మీలో ఎవరు కోటీశ్వరుడు అనే షో చూసి ఇన్స్పైర్ అయి రూపొందించారు. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో జెమిని టీవీలో ప్రారంభం కావాల్సి ఉంది.. అయితే కరోనా కారణంగా వాయిదా పడిన ఈ షో ప్రారంభించే ప్రయత్నం మొదలయ్యాయని తెలుస్తోంది.

ఇప్పటికే ఎన్టీఆర్ తో లుక్ టెస్ట్ కూడా యూనిట్ నిర్వహించినట్లు సమాచారం.. వివిధ రకాల డ్రస్సులతో, సూట్ లతో ఈ లుక్ టెస్ట్ నిర్వహించారని, సుమారు పదికి పైగా లుక్స్ సిద్ధం చేశారని వీటిలో పర్ఫెక్ట్ గా ఉందని భావించిన ఒక లుక్ ని ఫైనల్ చేయబోతున్నారని అంటున్నారు. ఒకసారి లుక్ ఫైనల్ చేశాక షూటింగ్ కూడా వీలైనంత త్వరలో ప్రారంభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
ఇక ప్రస్తుతానికి ఆయన రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాలో రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్నారు.. ఈ సినిమా పూర్తయిన వెంటనే ఆయన కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమా ప్రారంభించనున్నారు. అయితే కొద్ది రోజుల్లో ఎన్టీఆర్ లుక్ ఫైనల్ గానే షో కి సంబంధించిన ఎన్టీఆర్ లుక్ ని కూడా అధికారికంగా రిలీజ్ చేయబోతున్నారు అని తెలుస్తోంది. ఒకరకంగా ఇది ఎన్టీఆర్ అభిమానులకు పండగ చేసుకునే వార్త అని చెప్పొచ్చు.


Click it and Unblock the Notifications











