For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బిగ్ బాస్‌ 4 హోస్ట్‌పై క్లారిటీ: నిర్వహకుల ప్లాన్ వర్కౌట్.. రీఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరో

  By Manoj
  |

  బుల్లితెర చరిత్రలో తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందిన షోలలో 'బిగ్ బాస్' రియాలిటీ షో ఒకటి. కొంత మంది సెలెబ్రిటీలను ఓ ఇంట్లోకి పంపించడం.. హౌస్‌మేట్స్‌తో కలిసి కొన్ని రోజులు ట్రావెల్ చేయడం.. అక్కడ జరిగే గొడవలు తట్టుకుని నిలబడడం.. చివరకు ఇంట్లోని వారితో పాటు ప్రేక్షకుల హృదయాలను గెలిచిన ఒకరిని విజేతగా ప్రకటించడం.. ఇదీ బిగ్ బాస్ ప్రాసెస్. ఇప్పటికే ఈ షో మూడు సీజన్లను పూర్తి చేసుకుంది. నాలుగో సీజన్ ప్రారంభం అవడానికి చాలా సమయం ఉంది. అయినా.. దీని గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ప్రస్తుతం ఇది బుల్లితెరతో పాటు వెండితెర వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఏంటా న్యూస్.?

  ఆదరించారంటే కారణం అతడే

  ఆదరించారంటే కారణం అతడే

  ఏమాత్రం అంచనాలు లేకుండానే బిగ్ బాస్ సీజన్ 1 ప్రారంభం అయింది. తెలుగు వారికి అస్సలు పరిచయం లేని ఈ షోకు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించాడు. ఈ క్రమంలోనే తనకున్న ప్రత్యేకతను చాటుకున్నాడు. యాక్టింగ్‌ను పక్కన పెట్టేసి స్టేజ్‌పై జీవించాడు. మొత్తంగా తన అద్భుతమైన హోస్టింగ్‌తో ఈ సీజన్‌ను సక్సెస్‌ఫుల్‌గా నడిపించాడు.

  #CineBox : RGV's #KRKR In Trouble? | Pawan Kalyan Voice Over For #AlaVaikunthapuramuloTeaser ?
  నేచురల్‌గానే మెప్పించాడు

  నేచురల్‌గానే మెప్పించాడు

  మొదటి సీజన్ విజయవంతం అవడంతో రెండో దానిపై అందరి కళ్లూ ఉన్నాయి. అయితే, ఈ సీజన్‌ను జూనియర్ హోస్ట్ చేయకపోవడంతో, నేచురల్ స్టార్ నాని ఈ స్థానాన్ని భర్తీ చేశాడు. ఈ సీజన్ అంతా కాంట్రవర్శీలు జరగడంతో హైలైట్ అయింది. వాటిని నాని డీల్ చేసిన విధానాన్ని తెలుగు ప్రేక్షకులు మెచ్చుకున్నారు. దీంతో నాని కూడా సక్సెస్ అయ్యాడు.

  సీనియర్ అని నిరూపించాడు

  సీనియర్ అని నిరూపించాడు

  రెండో సీజన్ ముగిసిన తర్వాత నాని.. ఇకపై బిగ్ బాస్‌ను హోస్ట్ చేయనని తేల్చి చెప్పేశాడు. దీంతో నిర్వహకులు అక్కినేని నాగార్జునను తీసుకొచ్చారు. ఆయన కూడా యంగ్ హీరోలకు ధీటుగా షోను రన్ చేశాడు. అందుకే టీఆర్పీ రేటింగులు భారీగా వచ్చాయి. ముఖ్యంగా ఓ పెద్దగా హౌస్‌మేట్స్‌ను హెచ్చరించిన తీరుకు అందరూ ఫిదా అయిపోయారు.

  అప్పుడే మొదలెట్టేశారు

  అప్పుడే మొదలెట్టేశారు

  మూడో సీజన్ కొద్ది రోజుల క్రితం ముగిసిన విషయం తెలిసిందే. ఇది అయిపోయినప్పటి నుంచే నాలుగో సీజన్‌ను ఎవరు హోస్ట్ చేస్తారన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఎవరికి తోచిన పేరు వాళ్లు చెబుతున్నారు. మరికొందరైతే.. నాగార్జుననే కంటిన్యూ చేస్తారని అంటున్నారు. దీంతో నాలుగో సీజన్ హోస్ట్ ఎవరన్న దానిపై ఆసక్తి నెలకొంది.

  ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది

  ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది

  నాలుగో సీజన్‌ను హోస్ట్ చేసేది ఎవరన్న దానిపై తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఈ సారి జూనియర్ ఎన్టీఆర్‌ను రంగంలోకి దింపుతున్నారట షో నిర్వహకులు. ఇందుకోసం ఆయనకు అడిగినంత రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారట. దీంతో తారక్ దీనికి ఓకే చెప్పేశారని ప్రచారం జరుగుతోంది. ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

  English summary
  The three seasons of Bigg Boss have been really successful for the makers as the show has now penetrated deep into the audience. The three hosts till now, NTR, Nani, and Nagarjuna have done a very good job and have set the bar high.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X