»   »  చిరంజీవిని మెగాస్టార్ ని చేసింది నేనే

చిరంజీవిని మెగాస్టార్ ని చేసింది నేనే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : చిరంజీవికి పేరుకు ముందు మొదట్లో సుప్రీం హీరో టైటిల్ ఉండేది. తర్వాత అది మెగా స్టార్ గా మారింది. అది ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలుసు. ఇంతకీ ఆయన్ని మెగాస్టార్ ని చేసింది ఎవరూ అంటే ప్రముఖ నిర్మాత కె.ఎస్ రామారావు. ఆయన తన బ్యానర్ లో చిరంజీవితో నిర్మించిన చిత్రంతో ఆ టైటిల్ ని ఇచ్చారు. ఆ విషయం ఆయన స్వయంగా ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే లో తెలిపారు.

కెఎస్ రామారావు మాట్లాడుతూ... అది 'మరణ మృదంగం' సినిమా సిమయంలో జరిగింది. అప్పుడు సూపర్‌స్టార్ కృష్ణగారు ఉండటంతో, మా హీరోకి కొత్త ట్యాగ్ ఏదైనా పెట్టాలని ఆలోచించి, 'మెగాస్టార్' చిరంజీవి అని వేశాం అన్నారు.

K. S. Rama Rao on Giving 'Mega Star' Title to Chiranjeevi

అలాగే చిరంజీవితో తన స్ట్రైయిట్ చిత్రం తీసానని చెప్తూ... ఆంధ్రజ్యోతిలో యండమూరి వీరేంద్రనాథ్ సీరియల్ 'అభిలాష' ఫాలో అవుతూ, బాగుందనిపించి, ఓ టీమ్‌ను ఏర్పాటు చేసుకుని, చిరంజవి గారితో ఆ సినిమా తీశాను. ఇళయరాజాను నేరుగా తెలుగుకు పరిచయం చేసింది ఆ సినిమాతోనే. అదివరకు 'సీతాకోకచిలుక'కు ఆయన పనిచేసినా, అందులోని పాటలు తమిళ ట్రాకువే. ఆయన ప్రత్యేకంగా తెలుగు సినిమా కోసం ట్యూన్లు కట్టింది మొదటగా 'అభిలాష'కే. ఆ తర్వాత ఆయన నా సినిమాలకు తెలుగు ట్యూన్లే చేస్తూ వచ్చారు అన్నారు.

అలాగే...చిరంజీవిగారితో హిట్లు తీశారు. కానీ ఆయనతో సినిమాలను మీరు ఆపడానికి కారణం ఏంటి? మీ మధ్య ఏమైనా పొరపొచ్ఛాలు వచ్చాయా? లేకుంటే వైవిధ్యత కోసమా? అని ప్రశ్నిస్తే... కెఎస్ రామారావు మాట్లాడుతూ... నాకు నా ఇండివిడ్యువాలిటీ ముఖ్యం. దాని విషయంలో నేను కాంప్రమైజ్ కాను. ఎలాంటి స్టేజ్‌లో అయినా నేను అంతే. నా ప్రొడక్షన్‌లో కొన్ని సార్లు నేను కాంప్రమైజ్ కావాల్సి వచ్చింది. అలాంటి సమయంలో నేను ఎటువెళ్తున్నానని అనుకుంటూ నా అంతట నేను చేసిన సినిమా 'చంటి'. 'స్ట్టువర్ట్‌పురం పోలీస్‌స్టేషన్' అయిన తర్వాత నిర్మాతగా నేను వెనకపడుతానేమో అనుకున్న తరుణంలో నేను చేసిన సినిమా 'చంటి' అన్నారు.

English summary

 ks ramarao's interview in the open heart program of a TV channel was telecasted on Sunday night on 25th of May. The senior producer heartily revealed that the time when he gave the title to Chiranjeevi as 'Megastar'( for 'Maranamrudangam' of 1988).
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu