Karthika Deepam 2 September 20th: దీపాకు కొండంత ధైర్యం.. జ్యోత్స్న మాస్టర్ మైండ్.. అసలైన స్టోరీ మొదలు

Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 సెప్టెంబర్ 19వ తేదీ 467వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. శౌర్య పాప పుట్టిన రోజు వేడుకలను కార్తీక్ బాబు ఇంట్లో ఘనంగా నిర్వహిస్తారు. ఈ వేడుకలకు అటు శ్రీధర్, ఇటు శివ నారాయణ కుటుంబం మొత్తం హాజరవుతుంది. చిన్నారి శౌర్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతారు. ఇక ఏకంగా శివ నారాయణ శౌర్య పాపకు డబ్బు కట్ట ఇచ్చి నీ అవసరాలకు వినియోగించుకోమని చెబుతాడు. దాంతో శౌర్య పాప సరేనని తీసుకుంటుంది. ఆ తర్వాత కేక్ కట్ చేసి సీట్లు పంపిణీ చేస్తారు. ఈ సందర్భంగా సుమిత్ర కార్తీక్ బాబును ఒక ప్రశ్న అడుగుతుంది. మేం పుట్టిన రోజు సెలబ్రేషన్స్ తో పాటు ఆ మనిషిని కూడా కలవడానికి వచ్చామని అంటుంది.

నీ ప్రాణదాతను మాకు చూపిస్తానని చెప్పారు కదారా కార్తీక్, వెంటనే వెళ్లి కలిసి వద్దాం పదా అని అంటుంది. సుమిత్ర మాటలు విన్నాక అందరూ మేము కూడా వస్తామని, మనకు చేసిన మేలుకు ఆమెకు ధన్యవాదాలు చెప్పడమే కాకుండా ఎలాంటి సాయమైనా చేద్దామని అంటుంది. నేనైతే తనకు రెండు చేతుల నమస్కరిస్తానని, తను సాయం పొందే పరిస్థితిలో ఉంటే ఎలాంటి సాయమైనా చేస్తానని అంటుంది. ఇక ఆ తర్వాత కార్తీక్ బాబు నువ్వు కళ్లు మూసుకో అత్త నీకు ప్రాణదాతను చూపిస్తానని అంటాడు. వెంటనే దీపా చేతులను తీసుకొచ్చి సుమిత్ర చేతిలో పెడుతాడు. కళ్లు తెరిచి చూసిన సుమిత్ర షాక్ అవుతుంది. దీపా ప్రాణదాత అంటే నేను నమ్మను అని అంటుంది. కార్తీక్ బాబు ఆధారంగా చిన్నప్పటి దీప ఫొటోలను, కుబేరాతో ఉన్న ఫొటోలను చూపిస్తాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ లో చూడాలి. సెప్టెంబర్ 20వ తేదీ 468 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 468 September 20th 2025

కార్తీక్ బాబు ప్రాణాలను చిన్నప్పుడు కాపాడిన ప్రాణదాత గురించి సుమిత్రకు తెలిసిపోతుంది. శౌర్య పాప బర్త్డే కోసం శివ నారాయణ కుటుంబం మొత్తం కార్తీక్ బాబు ఇంటికి వచ్చిన సందర్భంగా కార్తీక్ బాబు తన ప్రాణదాత గురించి అందరికీ తెలిసేలా చేస్తాడు. అయితే దీపానే కార్తీక్ బాబు ప్రాణదాత అని చెప్పడంతో సుమిత్ర షాక్ అవుతుంది. ఇక కార్తీక్ బాబు ప్రాణదాతను కలిసి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పడంతో పాటు తనకు ఎలాంటి సాయం అయినా చేయడానికి సిద్ధంగా ఉంటానని సుమిత్రమ్మ చెప్పిన మాటలను కార్తీక్ బాబు గుర్తుకు చేస్తాడు. నువ్వు దీపను కచ్చితంగా క్షమించాలి అత్త అని అంటాడు. దాంతో సుమిత్ర మళ్లీ మౌనంగా ఉంటుంది. ఇక కార్తీక్ బాబుకు కోపం వస్తుంది. ఇంకా ఎన్నాళ్ళు ఇలా మౌనంగా ఉండిపోతామని, ఇంకెప్పుడు మన కుటుంబం మొత్తం కలిసి రోజు వస్తుందని అడుగుతాడు. ఈరోజు ఎలాగైనా మన కుటుంబం మధ్య ఉన్న గొడవలన్నీ పరిష్కారం కావాలని అంటాడు.

అలా పరిష్కారం కావాలంటే నువ్వు నా భార్య దీప ను క్షమించాలని కార్తీక్ బాబు అంటాడు. నేను దీపాన్ని క్షమించాలి అంటే నన్ను మీ మామయ్య దశరథ క్షమించాలని సుమిత్ర అంటుంది. ఇక కార్తీక్ బాబు దశరథను చూస్తూ మామ అత్తను క్షమించడానికి మీకు ఏంటి సమస్య అని అడుగుతాడు. సమస్య నాకు కాదు నా చెల్లి కాంచన సుమిత్రను క్షమించినట్లయితే నేను కూడా క్షమించినట్లే అని చెబుతాడు. మరోవైపు కాంచన స్పందిస్తూ క్షమించాల్సింది నేను కాదు అని అంటుంది. దాంతో అందరు షాక్ అవుతారు. నా భర్తకు నేనంటే చెల్లెలు కాంచన వెంటనే ఎక్కువ ఇష్టమని సుమిత్ర అంటుంది. ఇక మీరు క్షమించకపోతే ఇంకెవరు క్షమిస్తారు అత్త అని అడుగుతుంది. అందుకు సుమిత్ర స్పందిస్తూ నీ వల్ల బాధపడింది నేను కాదు వదిన అని సుమిత్రతో కాంచన అంటుంది. నా వల్లనే పెళ్లి ఆగిపోయింది కదా అని సుమిత్ర తన తప్పు మరొకసారి గుర్తు చేస్తుంది. దానివల్ల బాధపడింది నేను కాదు కదా అని కాంచన అంటుంది.

నువ్వు తాళి తీయడం వల్ల ఎంతగానో బాధపడింది కేవలం దీప మాత్రమే అని చెబుతుంది. దీంతో సుమిత్ర షాక్ అవుతుంది. అంటే ఇప్పుడు నన్ను దీప క్షమించాల్సి ఉంది అని సుమిత్ర అంటుంది. ఇక దశరథ స్పందిస్తూ క్షమాపణలు కోరాలని, దీపను నువ్వు కూడా క్షమించాలని దశరథ అంటాడు. దాంతో సుమిత్ర మరొక కండిషన్ పెడుతుంది. నేను క్షమాపణలు చెప్పాల్సిన స్థలం ఇది కాదని అంటుంది. మీరందరూ ఇవాళ ఇప్పుడే మాతో పాటే మా ఇంటికి రండి ఎక్కడైతే నేను తాలిని దొంగలించానో అక్కడే దీపకు నేను క్షమాపణలు చెప్తానని అంటుంది. దాంతో సరే అందరం బయలుదేరి వస్తామని సుమిత్రతో అంటారు. ఆ తర్వాత శివ నారాయణ కుటుంబం తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్లి పోతుంది. ఇక శ్రీధర్ కూడా ఇంట్లో వాళ్ళందరికీ నేను వెళుతున్నాననీ చెప్పి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత శ్రీధర్ కార్తీక్ బాబు ఇంట్లో జరిగిన విషయాలు అన్నిటిని రెండో భార్య కావేరికి చెబుతాడు. కుటుంబం మొత్తం కలిసిపోయే సమయం వచ్చిందని కావేరితో అంటాడు. నావల్లే ఈ రెండు కుటుంబాలు విడిపోయాయని నువ్వు ఎప్పుడు అంటుంటావు కదా, ఈరోజు ఆ రెండు కుటుంబాలు కలవడానికి నేను కూడా కారణం అవుతున్నానని గర్వంగా చెబుతాడు. శ్రీధర్ అలా చెప్పడంతో కావేరి ఎంతగానో సంతోషిస్తుంది. ఇక శ్రీధర్ ను క్షమాపణలు కోరుతుంది. ఇన్నాళ్లు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నానని అంటుంది.

ఇక ఇంటికి తిరిగి వెళ్ళిన తర్వాత పారిజాతం జోష్ణ మధ్య ఆసక్తికరమైన సంఘటన జరుగుతుంది. పారిజాతం జోష్ణ తో మాట్లాడుతూ ఉంటుంది. జోష్ణ పారిజాతంపై ఫైర్ అవుతుంది. కార్తీక్ బాబు ఇంట్లో నువ్వు నాకు ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావని జోష్ణ పారిజాతాన్ని ప్రశ్నిస్తుంది. నీవల్ల నా పరువు మొత్తం పోయిందని మండిపడుతుంది. జోష్ణ మాట్లాడుతుండగానే పారిజాతం రగిలిపోతుంది. కోపం తట్టుకోలేక జ్యోత్స్న చెంపలు వాయిస్తుంది. దాంతో జోష్ణ నన్నెందుకు కొడుతున్నావని పారిజాతాన్ని ప్రశ్నిస్తుంది. నిన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తూ వస్తుంటే నా కొడుకు తోనే ఆటలాడుతావా అని ఫైర్ అవుతుంది. నా మనవడు కాశి జైల్లో ఉంటే కాపాడాల్సింది పోయి, కనీసం నాకు చెప్పను కూడా లేదని అంటుంది. ఈ విషయం నాకు దాసు ద్వారా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటుంది. నీకు కాస్త కూడా మానవత్వం లేదని, రక్తసంబంధానికి విలువే లేదని అంటుంది. ఇక తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్ కు వాయిదా పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X