Karthika Deepam 2 September 27th: దీపపై ప్రేమ కురిపించిన సుమిత్ర.. రగిలిపోయిన జ్యోత్స్న

శౌర్య స్కూల్‌కి వెళ్లనని మారాం చేస్తుండగా జ్యోత్స్న ఫోన్ చేసి నాకు చెక్ పంపిస్తున్నావా? క్యాష్ పంపిస్తున్నావా? అని అడుగుతుంది. నీకు నేను ఎందుకని పంపించాలి అని కార్తీక్ అడగ్గా.. నువ్వు మా ఇంటికి రాకపోతే మన అగ్రిమెంట్ ప్రకారం 10 కోట్లు కట్టాలని చెబుతుంది జ్యోత్స్న. మేం వస్తున్నామని అంటాడు కార్తీక్. వారిద్దరూ ఇంట్లోకి అడుగుపెట్టబోతుండగా శివన్నారాయణ అడ్డుకుని తిరిగి వెళ్లిపోమ్మని చెబుతాడు. మీ ఇద్దరి వల్ల ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని కారణం చెబుతాడు.

ఎంత చెబుతున్నా కార్తీక్ - దీపలు వినిపించుకోకపోవడంతో వారిద్దరినీ లోపలికి వెళ్లమంటాడు శివన్నారాయణ. ముందు మీ నాన్న కోపం తగ్గించమని దీపకు కార్తీక్ చెబుతాడు. ఇంట్లో జరిగిన గొడవ, కూతురు తనను అంత మాట అనడంతో దశరథ్ కుమిలిపోతుంటాడు. ఇంతలో దీప వెళ్లి కాఫీ ఇవ్వడంతో ఎంతో సంతోషిస్తాడు. సుమిత్ర అమ్మగారిని క్షమించి వదిలేయమని దశరథ్‌కు చెబుతుంది దీప. వీరి మాటలను విన్న సుమిత్ర.. బాధపడుతూ కిందకి వెళ్లిపోతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. మరి సెప్టెంబర్ 27వ తేదీ 474 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 474 September 27th 2025 Here is full story

ఉదయం 10 గంటలు కావొస్తున్నా కాశీ నిద్రలేకపోవడంతో దిల్లూ వచ్చి లేపుతుంది. జాబ్ ఉన్నప్పుడు టెన్షన్ టెన్షన్‌గా ఉండేదని, నీతో అది చేశా, ఇది చేశానని భార్య చెప్పడంతో నాకు జాబ్ లేదని గుర్తుచేస్తున్నావా? అని కాశీ ఫైర్ అవుతాడు. జాబ్ కోసం నేనేం చేయాలి? మన ఫ్యూచర్ ఏంటీ? అని ఆలోచిస్తూ నిద్ర పట్టలేదని చెబుతాడు కాశీ. రాత్రంతా నిద్రపోకుండా ఆలోచిస్తే జాబ్ రాదని ట్రై చేస్తేనే వస్తుందని మండిపడుతుంది దిల్లూ. నేను వర్క్ ఫ్రమ్ హోమ్ నైట్ షిఫ్ట్ చేసి మార్నింగ్ పడుకుంటే నువ్వు కాఫీ కప్‌తో నిద్రలేపి ఇచ్చేదానివి అని గుర్తుచేస్తాడు కాశీ. ఆ ప్రేమ ఇప్పుడు కూడా ఉందని దిల్లూ చెప్పగా.. మరి చేతిలో కాఫీ కప్ ఏది అని అడుగుతాడు.

టిఫిన్ వేడిగా ఉందని, బ్రష్ చేసి టిఫిన్ పెడదామని వచ్చానని.. అందుకే కాఫీ కప్ లేదని చెబుతుంది దిల్లూ. జాబ్ లేనివాడికి 9 గంటల వరకు పడుకునే రైట్ లేదని, అదే నేను నైట్ షిప్ట్ చేసి పడుకుని ఉంటే మనిద్దరి మధ్య సంభాషణ వేరుగా ఉండేదని అంటాడు కాశీ. నిన్ను నిద్రలేపడం తప్పయిపోయింది, నేను నీ రూమ్‌లోకి కూడా రానని దిల్లూ కోపంగా వెళ్లిపోతుంది. వీరిద్దరి మాటలు విన్న శ్రీధర్ - కావేరిలు బాధపడతారు. అల్లుడితో కాస్త జాగ్రత్తగా మాట్లాడమని స్వప్నకి నువ్వయినా చెప్పమని అంటాడు శ్రీధర్. ఉద్యోగం లేని మగాళ్లలో ఇన్‌సెక్యూరిటీ ఉంటుందని, మన మాటలు మరింత బాధపెట్టేలా ఉండకూడదని చెబుతాడు.

స్వప్నతో నేను చెబుతానని కావేరి అంటుంది. మాటల విషయంలోనే కాదు, మర్యాదల విషయంలోనూ అల్లుడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ ఇస్తాడు శ్రీధర్. అన్ని పరిస్ధితులు ఒకలా ఉండవు, అందరూ వాటిని ఒకలా తీసుకోరని అంటాడు. నా కొడుక్కి సీఈవో జాబ్ పోయింది, ఆస్తి పోయింది, ఫ్యామిలీతో రోడ్డునపడ్డాడని అయినా ఆగిపోలేదని మళ్లీ జీవితాన్ని మొదటి నుంచి మొదలు పెట్టాడని చెబుతాడు శ్రీధర్. సత్యరాజ్ రెస్టారెంట్‌ని టేకోవర్ చేశాడు, వాడెంటో వాడి మీద ఛాలెంజ్ చేసినవాళ్లకి ప్రూవ్ చేశాడని అది కదా స్పిరిట్ అంటే అని చెబుతాడు. ఈ మాటలు విన్న కాశీ బాధపడతాడు. బావగారిలా జీవితంలో నేను పడిపోతే లేవడం నాకు చేత కాదని అనుకుంటున్నారా? అని అంటాడు. అల్లుడు నేను చెప్పింది నెగిటివ్‌గా అర్ధం చేసుకున్నాడని, ముందు అతనికి ఏం కావాలో చూడమని చెబుతాడు.

అసలు డాడీతో దీప మాట్లాడాల్సిన అవసరం ఏంటీ? అని సుమిత్రను జ్యోత్స్న ప్రశ్నిస్తుంది. వాళ్లంతా ఒక్కటైపోయారని, డాడీని పూర్తిగా వారి మనిషిగా చేసుకున్నారని అంటుంది. తాత కూడా మారిపోయాడని, నువ్వు దీపని అర్జెంట్‌గా ఇంట్లో నుంచి గెంటేయకపోతే.. ఈ ఇంట్లో నువ్వు నేను అనాథలుగా మిగిలిపోతామని వార్నింగ్ ఇస్తుంది జ్యోత్స్న. దీప డాడీని నీకు దూరం చేస్తోందని జ్యోత్స్న చెప్పగా.. నాకు అలా అనిపించడం లేదని, దీప మాట్లాడిన దాంట్లో, మీ డాడీ మాట్లాడిన దాంట్లోనూ తప్పులేదని సుమిత్ర చెప్పడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది.

తప్పు ఏదైనా ఉందంటే అది నాలోనే ఉందని, నీ మాట విని మెడలోని తాళి తీయడమే అతిపెద్ద తప్పని అది చేయకుండా ఉంటే నా భర్త ముందు నేను దోషిలా నిలబడాల్సిన అవసరం వచ్చేది కాదని సుమిత్ర బాధపడుతుంది. నీ మాట విని నేను తప్పు చేస్తే.. నన్ను మా ఆయన అర్ధం చేసుకోలేదని ఎందుకు అనుకోవాలని అంటుంది సుమిత్ర. అలా అనుకోవడం ఇంకా పెద్ద తప్పని చెబుతుంది. ఇన్నేళ్లుగా కలతలు లేని కాపురం చేస్తున్న నా భర్తకు నేను ఎలా ఉంటానో? ఏం మాట్లాడతానో? ఎలా ఆలోచిస్తానో తెలియదు అంటావా అని ప్రశ్నిస్తుంది.

మన గురించి తెలిసిన వారికి మనమెంటో తెలుస్తుంది, మన మీద అంచనా ఉంటుందని దానిని దాటి కొత్తగా ప్రవర్తిస్తే వాళ్లు తట్టుకోలేరని.. నేను కొత్తగా కాదు, చెత్తగా ప్రవర్తించానని సుమిత్ర బాధపడుతుంది. నా భర్త నన్ను అసహ్యించుకోవడం లేదని, నాలో తప్పు చేసిన మనిషిని అసహ్యించుకుంటున్నాడని అంటుంది. తప్పు చేశానని దీప ఒప్పుకోవడం లేదని జ్యోత్స్న అనగా.. అది ఆయన ఇష్టమని దానిని నేను తప్పు పట్టలేనని చెబుతుంది. నాతో ఈ తప్పు ఎవరు చేయించారన్న ఆలోచన రాలేదని.. నీ వల్లే ఇది జరిగిందని తెలిస్తే ఆయన అస్సలు ఊరుకోరని సుమిత్ర చెప్పడంతో జ్యోత్స్న టెన్షన్ పడుతుంది.

అనవసరమైన విషయాల్లోకి తలదూర్చుకుండా.. సీఈవో పోస్ట్‌ని కాపాడుకోమని చెబుతుంది సుమిత్ర. నా భర్త నన్ను క్షమించడానికి కొంత టైం పడుతుందని అప్పటి వరకు వెయిట్ చేస్తానని చెబుతుంది సుమిత్ర. అందరూ తనకు రివర్స్ అయ్యేసరికి జ్యోత్స్న రగిలిపోతుంది. శ్రీధర్ ఇంటికి అతని బంధువు ఒకరు వచ్చి పెళ్లి శుభలేఖ ఇస్తారు. ఇంతో కాశీ రావడంతో మా అల్లుడని అతనికి పరిచయం చేస్తాడు శ్రీధర్. మీరిద్దరూ లేచిపోయి పెళ్లి చేసుకున్నారని విన్నాను, మీ జాబ్ కూడా పీకేశారని తెలిసిందని ఆ బంధువు నానామాటలు అనడంతో కాశీ అవమానంగా ఫీల్ అవుతాడు. పెళ్లికి రెండ్రోజుల ముందే వస్తే నీ అల్లుడు పెళ్లిలో సాయంగా ఉంటాడని ఆ బంధువు మరింత అవమానిస్తాడు. దాంతో కాశీ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

జ్యోత్స్న రగిలిపోతూ ఉండగా పారిజాతం వచ్చి ఏం జరిగిందని అడగటంతో జరిగినదంతా చెబుతుంది జ్యోత్స్న. నీ మనవడికి జాబ్ లేదు కదా.. వాడికి ఏదైనా జాబ్ ఇప్పించాలని అనుకుంటున్నానని అంటుంది జ్యోత్స్న. ముందు కాశీని గౌరవించడం నేర్చుకోమ్మని మండిపడుతుంది పారిజాతం. ఇంతలో కార్తీక్ వచ్చి కాశీ నీ సొంత తమ్ముడా అని షాక్ అవుతాడు. గ్రానీ కొడుకు నాకు బాబాయ్ అవుతాడని అలా తమ్ముడని అంటుంది జ్యోత్స్న. కాశీ నీకు సొంత బామ్మర్ది అని నువ్వు పట్టించుకోవా? అని మండిపడుతుంది జ్యోత్స్న. నా చెల్లిని, నా బామ్మర్ధిని ఎలా చూసుకోవాలో నాకు తెలియదా అని ఫైర్ అవుతాడు కార్తీక్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X