Karthika Deepam 2 October 2nd: శ్రీధర్ నిర్ణయాన్ని తప్పుబట్టిన కార్తీక్.. జ్యోత్స్నకి శివన్నారాయణ డెడ్‌లైన్

శ్రీధర్ తీసుకొచ్చిన సరుకుల్ని వెనక్కి తీసుకెళ్లిపోమంటాడు కార్తీక్. నేను నా పిల్లల కోసం ఏం చేయకూడదా? అని తండ్రి బాధపడటంతో వాటిని తీసుకోవడానికి ఒప్పుకుంటాడు. దీప కళ్లు తిరిగి పడిపోయిందని, సుమిత్ర అత్త భోజనం పెట్టిందని కార్తీక్ చెప్పడంతో కాంచన, అనసూయ, శ్రీధర్‌లు షాక్ అవుతారు. భోజనం చేయకుండా పక్కనే కూర్చొన్న దశరథను తినడానికి పిలుస్తుంది జ్యోత్స్న. తప్పు చేసింది దీప అయితే మా అమ్మను ఎందుకు దూరం పెట్టారని మండిపడుతుంది. ఇంతలో శివన్నారాయణ వచ్చి మీ అమ్మనాన్నల్ని ఇంకా విడదీస్తావా? అంటూ జ్యోత్స్నపై సీరియస్ అవుతాడు.

నా కొడుక్కి నేను ఏం చేయలేకపోతున్నానని శ్రీధర్ బాధపడగా కావేరి ఓదారుస్తుంది. కానీ ఏం చేసైనా సరే వాడి జీవితాన్ని నిలబెడతానని తేల్చిచెబుతాడు. ఉదయాన్నే శివన్నారాయణ ఇంటికి వస్తాడు శ్రీధర్. కుటుంబ సభ్యులంతా కిందకి రావడంతో కార్తీక్‌తో నీ ఒప్పందం బ్రేక్ చేయాలంటే ఏం చేయాలని జ్యోత్స్నని అడుగుతాడు. అగ్రిమెంట్ రూల్స్ ప్రకారం ఒప్పందం నుంచి రిలీవ్ చేయాలంటే 10 కోట్ల కట్టాలని చెబుతుంది జ్యోత్స్న. దాంతో వెంటనే జేబులోంచి చెక్ బుక్ తీసి 10 కోట్ల రూపాయలు చెక్ రాసి ఇచ్చేస్తాడు. ఇంతలో కార్తీక్, దీప వచ్చి శ్రీధర్‌ని చూసి షాక్ అవుతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. మరి అక్టోబర్ 2వ తేదీ 478వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 478 October 2nd 2025 Here is full story

అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయడానికి మీ నాన్న జ్యోత్స్నకి 10 కోట్ల రూపాయల చెక్ ఇచ్చాడని చెబుతాడు దశరథ. అగ్రిమెంట్ జరిగింది నాకు, బావకు మధ్య ఫైనల్ డెసిషన్ తనదేనని చెప్పానని జ్యోత్స్న అంటుంది. నా నిర్ణయమే, నీ నిర్ణయమని చెప్పు.. అవసరానికి మించి నీ స్థాయిని నువ్వే తగ్గించుకున్నావ్, ఇన్ని రోజుల నుంచి నేను మాత్రమే కాదు నీ భార్య, నీ అమ్మ అందరూ బాధపడేది నువ్వు డ్రైవర్‌గా పనిచేయడం ఇష్టం లేకనే అని చెబుతాడు శ్రీధర్. మీరు రాసుకున్న ఒప్పందానికి ఇది జడ్జమెంట్ డే అని.. చెక్ తీసుకెళ్లి జ్యోత్స్న చేతుల్లో పెడతాడు. వాడిని నేను తీసుకెళ్లిపోతున్నానని, అగ్రిమెంట్ అనే జైలు నుంచి నీకు విముక్తి లభించిందని ఇక నువ్వు ఎవరికీ తలవంచకుండా నీకు నచ్చిన పని నువ్వు వెళ్లిపోవచ్చని అంటాడు శ్రీధర్.

దాంతో కార్తీక్ తన తండ్రిని ఆపి చెక్ శ్రీధర్ చేతుల్లో పెట్టి నేను అగ్రిమెంట్ రద్దు చేసుకోవడానికి సిద్ధంగా లేనని చెబుతాడు. ఆ మాటలతో శ్రీధర్ షాక్ అవుతాడు. కొన్నింటికి మనం కట్టుబడి ఉండాలని, నాకు ఎవరి సాయం అక్కర్లేదని కోపంగా వెళ్లిపోతాడు కార్తీక్. వాడు నీ మేనల్లుడే కదా, నీ చేతుల్లో పెరిగినవాడే కదా? నువ్వయినా చెప్పొచ్చుగా ఎందుకు సైలెంట్‌గా ఉండిపోయావని సుమిత్రను అడుగుతాడు శ్రీధర్. వాడు ఎవరి మాట వినడని, గతంలో ఎన్నో అవకాశాలు వచ్చాయని అప్పుడు కూడా ఇలాగే వద్దన్నాడని, వాడి మనసులో ఏదో ఉందని అంటుంది సుమిత్ర.

ఎవరికీ తెలియకపోయినా భార్యకు ఖచ్చితంగా తెలుస్తుందని అనుకుని దీప వైపు చూస్తాడు శ్రీధర్. నేను నీతో మాట్లాడాలని దీపను బయటికి పిలుస్తాడు శ్రీధర్. దీపే కాదు అత్త చెప్పినా బావ ఒప్పుకోడు, నా మెడలో మూడు ముళ్లు వేసే వరకు బావ నా కళ్ల ముందే ఉంటాడని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. కార్తీక్ ఎందుకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వదులుకుంటున్నాడు, వాడి మనసులో ఏముందని దీపని అడుగుతాడు శ్రీధర్. మీరిద్దరూ బానిసల్లా ఈ ఇంట్లో ఎందుకు బతకాలి? నా కొడుకుని ఇలా చూడలేకపోతున్నాను, నాకు ఈ సాయమైనా చేయమని బతిమలాడతాడు. నా చేతుల్లో లేనిది నేను ఏం చేయగలనని అంటుంది దీప. దాంతో దశరథ బావని షూట్ చేసింది నేనే అని నువ్వు ఒప్పుకుంటే అసలు ఈ గొడవే ఉండేది కాదని, దానికి నీ భర్త సపోర్ట్ చేయడం లేదు, ఈ కుటుంబాల్ని కలపడానికి నీకు ఛాన్స్ వచ్చినా నువ్వు వదిలేసుకున్నావని మండిపడతాడు శ్రీధర్.

నీ భర్త ఎన్నాళ్లు ఈ అగ్రిమెంట్‌కి కట్టుబడి ఉండాలో తెలుసా? అని అడగ్గా.. తెలియదని దీప చెబుతుంది. జ్యోత్స్న వద్దు అనే వారికి మీరిద్దరూ ఇలా బానిసల్లా బతకాల్సిందేనని ఫైర్ అవుతాడు శ్రీధర్. మీకు అసలు నిజం తెలియక ఇలా మాట్లాడుతున్నారని, నేను ఈ ఇంటి వారసురాలినని.. అదే అసలు కారణమని మనసులో అనుకుంటుంది దీప. నీ భర్తంటే నీకు ప్రేమ ఉంటే కార్తీక్ మనసులో ఏముందో కనుక్కుని చెప్పమంటాడు శ్రీధర్. నీ ఆపరేషన్ కోసమే దీప రాసిన అగ్రిమెంట్ మీద కార్తీక్ సంతకం చేశాడు, ఈ ఇంటి డ్రైవర్‌గా మారాడని మండిపడతాడు. నన్ను నా తల్లిదండ్రులకు దగ్గర చేయడానికి బావ ఇదంతా చేస్తున్నాడని మీకు చెప్పలేనని మనసులో బాధపడుతుంది దీప. జ్యోత్స్న, పారిజాతంల నుంచి మా అమ్మనాన్నల్ని కాపాడటానికే నేను ఇక్కడ ఉన్నానని అనుకుంటుంది.

దివాళ తీసిన సత్యరాజ్ రెస్టారెంట్‌ని సిటీలోనే నెంబర్‌ వన్‌గా చేసిన ఘనత నా కొడుకుది.. అంత తెలివైన నా కొడుకు నీ కోసం డ్రైవర్‌గా మారాడని నీకు బాధగా లేదా అని ప్రశ్నిస్తాడు శ్రీధర్. అతని కోసం నువ్వు ఏమైనా చేయాలి కదా అని అడుగుతాడు. నేను నా కొడుకుని అగ్రిమెంట్ నుంచి బయటికి తీసుకురావాలని అనుకుంటున్నా.. కానీ వాడు బయటికి రావడం లేదు ఎందుకు అని ప్రశ్నిస్తాడు శ్రీధర్. మీరు ఏమైనా అడగాలంటే మీ అబ్బాయినే అడగండని దీప బాధపడుతూ వెళ్లిపోతుంది.

నువ్వు రెస్టారెంట్‌కి వెళ్తున్నావా? నీకు ఇచ్చిన టైం గుర్తుందా అని శివన్నారాయణ, దశరథలు జ్యోత్స్నని అడుగుతారు. నాకు మొత్తం గుర్తుందని అందుకే నేను ఓ నిర్ణయం తీసుకున్నానని, మార్కెట్ రోడ్డులో ఉన్న రెస్టారెంట్ అమ్మకానికి వచ్చిందని రేపు వేలం వేయబోతున్నారని చెబుతుంది జ్యోత్స్న. అది మనం దక్కించుకుని తీరాలని అంటుంది. మనం నష్టాల్లో ఉన్నాం.. వాళ్లు దివాలా తీశారు, ఇప్పుడు నువ్వు దానిని కొని ఏం సాధిస్తావని శివన్నారాయణ కోప్పడతాడు. మనమేమీ కొనాల్సిన అవసరం లేదని, ముందు మన రెస్టారెంట్‌ని నష్టాల్లోంచి ఎలా బయటికి తీసుకురావాలో ఆలోచించమని దశరథ మండిపడతాడు.

నేను తీసుకున్న నిర్ణయం మన కంపెనీ భవిష్యత్తుని మారుస్తుందని చెబుతుంది జ్యోత్స్న. మార్కెట్ రోడ్డులో అన్న రెస్టారెంట్ వాల్యూ.. ప్రస్తుతం ఉన్న దానికంటే రెండు, మూడేళ్లలో డబుల్ అవుతుంది. దానిని లీజ్‌కి ఇచ్చినా మనకి లాభమేనని అంటుంది జ్యోత్స్న. ఇలాంటి టైంలో కూడా నువ్వు నాకు సపోర్ట్ చేయకపోతే ఎలా అని అడుగుతుంది. తను చెప్పే దానిలో నష్టమేమీ కనిపించడం లేదు కానీ, కాలం మన కంట్రోల్‌లో ఉండదు కదా అని అంటాడు దశరథ. ప్రాపర్టీ వాల్యూ కన్నా మించి పడొడ్దని చెప్పగా.. వదిలే ప్రసక్తే లేదని తేల్చేస్తుంది జ్యోత్స్న. నువ్వు ఏమనుకుంటున్నావ్ కార్తీక్ అని శివన్నారాయణ అడుగుతాడు.

ఓ డ్రైవర్ సలహా పెద్ద మేడం గారు తీసుకోరని కార్తీక్ అనగా.. నువ్వు ఈ కంపెనీని నడిపిన సీఈవోవీ అని అంటాడు శివన్నారాయణ. నమ్మకంతో తీసుకున్న నిర్ణయం మనల్ని సక్సెస్ వైపు తీసుకెళ్తుందని చెబుతాడు కార్తీక్. దాంతో అంతా షాక్ అవుతారు. బావ నెగిటివ్‌గా మాట్లాడకుండా నన్ను సపోర్ట్ చేశాడంటే ఏదో ఉందని వెంటనే కార్తీక్‌తో మాట్లాడాలని అనుకుంటుంది జ్యోత్స్న. నేను వేలం పాటలో ఓడిపోయి, కంపెనీని నష్టాల్లోంచి బయటికి తీసుకురాలేక సీఈవో పోస్ట్‌కి రాజీనామా చేస్తానని అనుకుంటున్నావా? అని అడుగుతుంది. తాత తీసేసే దానికంటే ముందే నువ్వే పారిపోయేలా ఉన్నావని అంటాడు కార్తీక్. నువ్వు గెలిస్తే నేను గెలిచినట్లే.. మా తాత ఇంటి పరువు, మర్యాదల్లో నాకు భాగం ఉందని పోతుంటే ఎలా వదులుతానని చెబుతాడు. మరి నువ్వు, నేను ఒక్కటి కామా అని జ్యోత్స్న అడుగుతుంది. అది ఎప్పటికీ జరగదని ఎందుకంటే మీరు ఓనర్లు, మేం వర్కర్లు అని చెబుతాడు కార్తీక్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X