Karthika Deepam 2 October 3rd: కార్తీక్ నుంచి నిజం రాబట్టాలని శ్రీధర్ ఆఖరి ప్రయత్నం.. కొడుకుపై కాంచన ఫైర్

కార్తీక్‌‌ను అగ్రిమెంట్ నుంచి విముక్తి చేయడానికి జ్యోత్స్నకి 10 కోట్ల రూపాయల చెక్ ఇస్తాడు రాజ్. నా చేతుల్లో ఏం లేదని బావ చెప్పిందే చేస్తానని జ్యోత్స్న అంటుంది. ఈ చెక్ ఇచ్చి నువ్వు బయటికి వచ్చేయమని కొడుకును అడుగుతాడు శ్రీధర్. దాంతో కార్తీక్ చెక్‌ని తండ్రి చేతుల్లోనే పెట్టి బయల్దేరమంటాడు. కార్తీక్ నిర్ణయంతో పారు, జ్యోత్స్నలు ఊపిరి పీల్చుకుంటారు. ఇంత చేసినా కార్తీక్ ఒప్పుకోకపోవడంతో అసలు నిజం ఏంటో రాబట్టాలని దీపని నిలదీస్తాడు శ్రీధర్. తనకు ఏం తెలియదని కార్తీక్‌నే అడగమని చెప్పడంతో శ్రీధర్ బాధపడుతూ వెళ్లిపోతాడు.

నష్టాల్లో ఉన్న మన కంపెనీని బయటికి తీసుకురావడానికి నీకిచ్చిన సమయం అయిపోతోందని జ్యోత్స్నకు వార్నింగ్ ఇస్తాడు శివన్నారాయణ. తాను వేలం పాటలో ఓ రెస్టారెంట్‌ని కొనబోతున్నానని తన ప్లాన్ అందరికీ చెబుతుంది జ్యోత్స్న. దానికి కార్తీక్ కూడా సపోర్ట్ చేయడంతో జ్యోత్స్న, పారులు సంతోషిస్తారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. మరి అక్టోబర్ 3వ తేదీ 479వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 479 October 3rd 2025 Here is full story

పగలు ప్రతీకారాలు మానేసి, కంపెనీని నష్టాల్లోంచి ఎలా బయటపడేయాలో ఆలోచించు లేదంటే పదవి, పరువు రెండూ పోతాయని జ్యోత్స్నకు చెబుతాడు కార్తీక్. నువ్వు ఎన్ని మైండ్ గేమ్‌లు ఆడినా తట్టుకుని నిలబడతానని చెబుతుంది జ్యోత్స్న. నేను మైండ్ గేమ్ ఆడానా? నాకు అలాంటివి తెలియవని నేనొక డ్రైవర్‌ని అని చెబుతాడు కార్తీక్. శౌర్యని అడ్డుపెట్టుకుని మా మమ్మీని, దీపని అడ్డు పెట్టుకుని మా డాడీని మార్చడానికి ట్రై చేశావా? అని నిలదీస్తుంది జ్యోత్స్న. నా కన్నా నువ్వు ఇంకా బాగా వాడుతున్నావ్.. ఈ తెలివి తేటలతోనే అత్తయ్యని, మావయ్యని విడదీశావ్ అని కార్తీక్ అనడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది.

నువ్వు దీపను అడ్డుపెట్టుకుని మా డాడీ మనసును మార్చావ్ కాబట్టే.. మా డాడీకి, మా మమ్మీ శత్రువైందని అంటుంది జ్యోత్స్న. వేలం పాటలో మీరు విజయం సాధించాలని, మా తాత పరువు కాపాడమని చెబుతాడు కార్తీక్. నీ మనసులో నా గురించి ఎన్నో ఉన్నాయని అవేంటీ తెలుసుకుంటానని అనుకుంటుంది జ్యోత్స్న. శ్రీధర్ తన కుటుంబంతో కలిసి భోజనం చేస్తూ.. మీ అన్నయ్య ఆత్మాభిమానం గురించి నీకు తెలుసు కదా అని స్వప్నతో చెబుతాడు. కన్నతండ్రి దగ్గర కూడా రూపాయి తీసుకోని కొడుకు నా దగ్గరే ఉన్నాడని, ఇలాంటి వారిని చూసి చాలామంది నేర్చుకోవాలని అనడంతో కాశీ కోపంతో లేస్తాడు.

దాంతో శ్రీధర్ కోప్పడి కాశీని కూర్చోమంటాడు. నా కొడుకు గురించి నేను మాట్లాడుకుంటుంటే దానికి నిన్ను కనెక్ట్ చేసుకుని లో లోపల బాధపడొద్దని చెబుతాడు. ఉద్యోగం ఎప్పుడు వస్తుందని పీక మీద కత్తి పెట్టానా? ఖాళీగా ఎందుకు ఉంటున్నావని నస పెడుతున్నానా? అని అడుగుతాడు శ్రీధర్. నీకు నచ్చిన తిండి తిను, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు కాఫీ తాగు.. ఫ్రీగా ఫ్రెండ్లీగా ఉండు అని చెబుతాడు. ఎవడినైనా ఏమైనా అంటే నన్ను దృష్టిలో పెట్టుకునే నా మామ అన్నాడని నీలో నువ్వు కుమిలిపోవద్దని చెబుతాడు శ్రీధర్.

ఆత్మాభిమానాలు, మొహమాటాలు మనకి తిండి పెట్టవని.. సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి. నీ గెలుపు ఎలా ఉండాలంటే మామగారికి కూడా మాట పడిపోవాలని ఇన్‌స్పైర్ చేస్తాడు శ్రీధర్. ఎవరు తిన్న ప్లేట్ వాడు కడుక్కోవడం సంస్కారమని నా కొడుకు నేర్పించాడని చెబుతాడు శ్రీధర్. నువ్వు మీ నాన్నని మార్చే ప్రయత్నంలో ఉన్నావని, మీ నాన్న ఇస్తానన్న డబ్బులు ఎందుకు తీసుకోలేదని కార్తీక్‌ను ప్రశ్నిస్తుంది కాంచన. ఇంటికి సరుకులు తీసుకొస్తేనే వద్దని గొడవ చేశాను, డబ్బులు ఎందుకు తీసుకుంటానని నిలదీస్తాడు కార్తీక్. ఏదో ఒక రకంగా ఆ ఇంట్లో నుంచి బయటకు రావొచ్చు కదా అని కాంచన అడుగుతుంది.

నేను చేస్తున్న పనుల మీద మీకు నమ్మకం ఉంది కదా.. దానిని అలాగే ఉంచమని కార్తీక్ అంటాడు. ఇంతలో శ్రీధర్ వచ్చి అలా ఎంతకాలం ఉంటావని మండిపడతాడు. నీ భార్య కోసమే అగ్రిమెంట్ మీద సంతకం పెట్టావ్, అగ్రిమెంట్ ప్రకారం ఆ ఇంట్లో డ్రైవర్‌గా మారావ్, అగ్రిమెంట్ బ్రేక్ చేయాలంటే పది కోట్లు కట్టాలి, కానీ అందులోంచి బయటపడే అవకాశం వస్తే నువ్వెందుకు ఆ ఛాన్స్ తీసుకోలేదని ప్రశ్నిస్తాడు శ్రీధర్. నీ తండ్రి డబ్బు నీకు అక్కర్లేకపోతే.. నేను నీకు ఫైనాన్స్ ఇప్పిస్తాను తీసుకుంటావా? అని అడుగుతాడు శ్రీధర్. నేనే కాదు, నువ్వు ఎవరు డబ్బులిచ్చినా తీసుకోవని నాకు తెలుసని అంటాడు.

కార్తీక్ అగ్రిమెంట్ నుంచి ఎందుకు బయటపడటం లేదో చెప్పమని కాంచనను అడుగుతాడు శ్రీధర్. దాంతో నాకేం తెలియదని, కార్తీక్‌ను చెప్పమంటుంది. ఇదివరకు నా కొడుకు ఎవ్వరికీ సమాధానం చెప్పనక్కర్లేదేని నన్ను వెనకేసుకొచ్చావ్? ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నావని కాంచనపై అరుస్తాడు కార్తీక్. ఇదే ప్రశ్న నేను నిన్ను చాలాసార్లు అడిగినా, నువ్వు నాకు చెప్పలేదని కాంచన అంటుంది. ఆ మాటలు విన్న శ్రీధర్.. నీ కొడుకు నీకు కూడా నిజం చెప్పలేదా? అని షాక్ అవుతాడు శ్రీధర్. కార్తీక్ మా మామగారి ఇంటిలో డ్రైవర్‌గా ఎందుకు పనిచేస్తున్నాడో మీకెవ్వరికీ తెలియదన్న మాట. దీప ఎలాగూ చెప్పదు.. కార్తీకే చెప్పాలని అంటాడు శ్రీధర్. దాంతో బలవంతంగా కార్తీక్‌ని తీసుకుని వేరే చోటికి వెళ్లి మాట్లాడతాడు.

నా స్థానంలో నువ్వుంటే.. నువ్వు గారాభంగా పెంచుకున్న నీ కొడుకు డ్రైవర్‌గా పనిచేస్తుంటే నువ్వు ఊరుకోగలవా? నువ్వు శ్రీమంతుడివి అయ్యుండి నీ కొడుకు పేదరికాన్ని అనుభవిస్తుంటే నువ్వు బాధపడకుండా ఉండగలవా? అని ప్రశ్నిస్తాడు శ్రీధర్. నువ్వు పేదరికంతో పోరాడుతూ.. మధ్యతరగతి జీవితానికి అలవాటు పడిపోయావని దీనింతటికి కారణం ఎవరు? దీప అని ఫైర్ అవుతాడు. నిన్ను రోడ్డు మీదకి తీసుకొచ్చింది దీప, ఆమెను పెళ్లి చేసుకోవడం వల్లే నీకు దరిద్ర్యం అని నానామాటలు అంటాడు శ్రీధర్. దీపి లేకపోయుంటే అసలు నీ ముందు నిలబడేవాడిని కూడా కాదని చెబుతాడు కార్తీక్. దీపే నీ ప్రాణాలు కాపాడిందని తనను పెళ్లి చేసుకుని, తన బిడ్డకు తండ్రివి అయ్యావని అంటాడు శ్రీధర్.

దీప రుణం తీర్చుకోవడానికే నేను అగ్రిమెంట్ మీద సంతకం పెట్టానని చెబుతాడు కార్తీక్. దీప రుణం తీర్చుకోవడానికి, ఆ ఇంటికి సంబంధం ఉందని చెప్పగా... అదేంటో నేనే తేల్చుకుంటానని చెబుతాడు శ్రీధర్. నా మీద ఒట్టేసి నిజం చెప్పు, నా కొడుకు పడుతున్న బాధేంటో నాకు తెలియాలి, నా కొడుకు బయటికి చెప్పుకోలేకపోతున్న నిజం ఏంటో తెలియాలి, దీపకి ఆ ఇంటికి ఉన్న సంబంధం ఏంటో తెలియాలని అంటాడు శ్రీధర్. కొంతకాలం వెయిట్ చేస్తే అందరికీ అన్ని నిజాలు తెలుస్తాయని చెబుతాడు. దీప రుణం తీర్చుకోవడానికి, ఆ ఇంటికి సంబంధం ఏంటో నాకు అర్ధం కావడం లేదని చెబుతాడు శ్రీధర్. నిజాలు తెలిసే వరకు నిన్ను చూసి నేను బాధపడాల్సిందేనా అని ప్రశ్నిస్తాడు. ఏం చేసినా కార్తీక్ చెప్పడని.. నేనే తెలుసుకుంటానని మనసులో అనుకుంటాడు శ్రీధర్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X