Karthika Deepam 2 October 7th: జ్యోత్స్నకి షాకిచ్చిన శివన్నారాయణ... దీప పుట్టుకపై బాంబు పేల్చిన కార్తీక్

Photo Courtesy: JioHotstar

రెస్టారెంట్‌కి వెళ్తూ కార్తీక్‌ని వేలం పాట జరిగే దగ్గరే ఉండమని చెబుతాడు దశరథ. మనం బయటికి వెళ్తున్నాం, ఇక్కడ వైరా కూడా ఉన్నాడు.. కార్తీక్ ఇక్కడే ఉండటం మంచిదని శివన్నారాయణకు చెబుతాడు దశరథ. వేలం పాట మొదలవ్వగానే జ్యోత్స్నను రెచ్చగొట్టి 20 కోట్ల వరకు తీసుకెళ్తాడు వైరా. ఇంకా పాడితే శివన్నారాయణ కంపెనీ నష్టాల్లోకి వెళ్లిపోతుందని.. అప్పుడు ఆ రెస్టారెంట్స్‌ని టేకోవర్ చేయాలని వైరా అనుకుంటున్నాడని కార్తీక్ ఊహిస్తాడు. వెంటనే ఆమెకు ఫోన్ కాల్ చేయించడంతో జ్యోత్స్న వేలం పాట మధ్యలోనే వచ్చేస్తుంది. 20 కోట్ల నష్టానికి వేలం పాట గెలిచిన వైరా కోపంతో రగిలిపోతాడు.

వేలం పాటలో నేను గెలవకుండా కార్తీక్ చేశాడని జ్యోత్స్న ఇంటిలో పంచాయతీ పెడుతుంది. దాంతో శివన్నారాయణ, పారు, సుమిత్రలు కార్తీక్‌- దీపలపై మండిపడతారు. అగ్రిమెంట్ తీసుకొచ్చేయ్.. వీళ్లు ఈ ఇంట్లో ఉండకూడదని శివన్నారాయణ చెప్పడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి అక్టోబర్ 7వ తేదీ 482వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 482 October 7th 2025 Here is full story

Photo Courtesy: JioHotstar

శివన్నారాయణ చెప్పడంతో అగ్రిమెంట్ తీసుకొచ్చి తాత చేతిలో పెడుతుంది జ్యోత్స్న. దాంతో అగ్రిమెంట్ కార్తీక్ చేతిలో పెట్టి నువ్వు, నీ భార్య బయటికి వెళ్లిపోండిన చెబుతాడు శివన్నారాయణ. జ్యోత్స్న ఏదో చెప్పబోతుండగా వీడు తప్పు చేశాడా? లేదా? అని ప్రశ్నిస్తాడు పెద్దాయన. ఇలాంటి వాడిని ఊరికే వదిలేయాలా? అని కొడుకుని అడగ్గా.. వదలకూడదని చెబుతాడు దశరథ. నువ్వు చెప్పమని జ్యోత్స్నని అడగ్గా.. మెడ పట్టుకుని బయటికి గెంటేయాలని అంటుంది జ్యోత్స్న. దాంతో నోరు మూయ్ అని కోప్పడతాడు శివన్నారాయణ.

ఈ మాట ఎలా అనాలని అనిపిస్తుంది? నాకున్న కోపానికి నిన్ను కొట్టకుండా ఉండటానికి నా వల్ల కావడం లేదని అంటాడు శివన్నారాయణ. దాంతో ఏం జరిగిందో తెలియక పారు, సుమిత్ర, దీపలు షాక్ అవుతారు. నువ్వు అసలు మనిషివేనా? నాకు తెలిసి నీ బుద్ధి అరికాళ్లలోకి జారిపోయి ఉంటుందని మండిపడతాడు శివన్నారాయణ. తప్పు చేసింది కార్తీక్ అయితే జ్యోత్స్నని ఎందుకు తిడుతున్నారని పారు అడుగుతుంది. నా కూతురు వేలం పాట పాడకుండా అడ్డుకుని, మనకి నష్టం తీసుకొచ్చిన కార్తీక్‌ని వదిలేసి జ్యోత్స్నని తిడతారేంటీ? అని సుమిత్ర ప్రశ్నిస్తుంది. ఎవరు నష్టం తీసుకొచ్చారో? ఎవరు నష్టం తీసుకురాకుండా కాపాడారో? వీళ్లకి తెలియాలని దశరథకు చెబుతాడు శివన్నారాయణ. దాంతో వైరాకి దశరథ కాల్ చేస్తాడు.

వేలం పాటలో గెలిచినందుకు కంగ్రాట్స్ చెబుతాడు దశరథ. చావు దెబ్బ కొట్టించి కంగ్రాట్స్ చెప్పడానికి కాల్ చేశావా? అని వైరా మండిపడతాడు. 10 కోట్లు పలికే ప్రాపర్టీని 20 కోట్లు పాడేలా చేశావని, నేను వదిలేద్దామనుకున్న టైంలో నువ్వు నీ కూతురితో పాట ఆపించి రమ్మని ఫోన్ చేసి వెళ్లిపోయేలా చేశావని అంటాడు వైరా. దెబ్బ అదిరిపోయింది కానీ ఈ వైరా ఎవ్వరినీ వదలడని బెదిరిస్తాడు. నా కూతురి ముందే నిలబడలేని వాడివి, నాతో నీకు చాలెంజా, ఏం చేసుకుంటావో చేసుకోమ్మని అంటాడు దశరథ.

వాడి పేరు వైరా, ఒకప్పుడు నా పార్ట్‌నర్, నన్ను బిజినెస్‌లో మోసం చేశాడు.. ముందుగానే వాడి మోసాన్ని గుర్తించి కంపెనీ నుంచి వాడిని బయటికి గెంటేశానని చెబుతాడు దశరథ. అప్పటి నుంచి నా మీద వాడు పగ పెంచుకుని, ఇన్నేళ్ల తర్వాత ఇండియా వచ్చాడని వేలం పాట దగ్గర వాడిని చూడగానే నా మీద దెబ్బకొడతాడని అనుకున్నానని అంటాడు. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ వాళ్లు రెస్టారెంట్ మీద రైడ్ చేయడంతో నాన్న నేను వెళ్లిపోయామని... మమ్మల్ని వెళ్లిపోయేలా చేసింది జ్యోత్స్న అని తెలిసిందని చెబుతాడు దశరథ. అప్పటికే డౌట్ వచ్చి కార్తీక్‌ని వేలం పాట దగ్గరే ఉంచామని వైరా చాలా తెలివిగా 20 కోట్ల వరకు పాడించాడని అంటాడు.

జ్యోత్స్న 21 అనగానే వాడు లేచి వెళ్లిపోయేవాడని అప్పుడు మనకి 11 కోట్లు నష్టం వచ్చేదని.. సరిగ్గా అదే సమయంలో కార్తీక్ ఫోన్ చేసి పరిస్థితి చెప్పాడని అంటాడు దశరథ. వెంటనే ఫేక్ కాల్ చేయించి జ్యోత్స్నని అక్కడి నుంచి వచ్చేలా చేశానని చెబుతాడు కార్తీక్. ఆ ప్రాపర్టీ వాల్యూ 10 కోట్లేనని నాకు తెలుసని, కానీ ఆ వైరా నాకు వార్నింగ్ ఇచ్చాడని అందుకే పోటీకి పాడానని అంటుంది జ్యోత్స్న. ఇంత సిగ్గులేకుండా నిన్ను నువ్వు ఎలా సమర్ధించుకుంటున్నావని ప్రశ్నిస్తాడు దశరథ. కార్తీక్ లేకపోయుంటే మనం ఎంత బాధపడేవాళ్లమో అంటాడు.

నేను ఆ నష్టాన్ని కవర్ చేసేదాన్నని జ్యోత్స్న అనడంతో.. ముందు నష్టాల్లోని కంపెనీని బయట పడేయ్, అయినా నిన్ను నేను సీఈవోని ఎలా చేశానో నాకే అర్ధం కావడం లేదని రగిలిపోతాడు శివన్నారాయణ. నీ లాంటి వాడిని ఇక్కడ డ్రైవర్‌గా ఉంచుకోలేనని అగ్రిమెంట్ తీసుకుని వెళ్లిపోమని చెబుతాడు. నేను అగ్రిమెంట్ రాసింది పెద్ద మేడం గారికే, నేను వెళ్లిపోవాలంటే పెద్ద మేడం గారే చెప్పాలని అంటాడు కార్తీక్. బావను నేను వదులుకోనని, అలాంటి మనిషి నాకు అవసరమని చెబుతుంది జ్యోత్స్న. అగ్రిమెంట్‌లో రాసినట్లుగా ఈ ఇంటికి అన్ని నేనే.. పెద్ద మేడం గారు వెళ్లిపోమంటేనే వెళ్లిపోతానని చెబుతాడు కార్తీక్. నువ్వయినా మీ బావకి చెప్పమని శివన్నారాయణ, దశరథ అనగా మా బావ ఎవరికైనా మాటిస్తే దానిని నిలబెట్టుకోవడానికి దేన్నయినా వదులుకుంటాడని వెళ్లిపోతుంది దీప.

కార్తీక్‌కి స్వీట్ తినిపించిన దీప.. నీ వల్ల మా అమ్మ బాధపడిందని చెబుతుంది. కూతురు సాధించుకుని వస్తుంది, తనతో కలిసి భోజనం చేయాలని అనుకుందని అంటుంది. ఇంతలో సుమిత్ర వచ్చి కార్తీక్‌ని హాల్‌లోకి పిలుస్తుంది. కార్తీక్ దగ్గర మాట తీసుకున్న సుమిత్ర.. అగ్రిమెంట్ రద్దు చేయకుండా నువ్వెందుకు ఈ ఇంట్లో ఊడిగం చేస్తున్నావని ప్రశ్నిస్తుంది. దాంతో అంతా షాక్ అవుతారు. ఒట్టేసి బావ ఇరుక్కుపోయాడని నిజమే చెప్పాలి, అబద్ధం చెప్పకూడదని అనుకుంటుంది దీప. నేను ఇంట్లో ఉండటానికి, డ్రైవర్‌గా పనిచేయడానికి కారణం నీ కూతురేనని చెబుతాడు కార్తీక్. దాంతో జ్యోత్స్న టెన్షన్ పడుతుంది.

నువ్వు అడగకుండానే ఇదంతా ఎందుకు చేస్తున్నానో త్వరలోనే చెబుతానని సుమిత్రతో చెబుతాడు కార్తీక్. వాడి మనసులో ఇంకేదో ఉందని శివన్నారాయణ అంటాడు. నిజం చెప్పావు కానీ అర్ధం కాకుండా చెప్పావని కార్తీక్‌తో అంటుంది దీప. అదేంటో నేను తెలుసుకోవచ్చా అని జ్యోత్స్న అడుగుతుంది. అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసే అవకాశం నీకున్నా.. నా కోసం ఆగిపోయానని చెప్పడానికి కారణం ఏంటీ? అని జ్యోత్స్న ప్రశ్నిస్తుంది. నీకు బుద్ధి చెప్పడానికేనని అంటాడు. అంటే జ్యోత్స్న సుమిత్ర అత్త కూతురు కాదా అని అడుగుతాడు కార్తీక్. ఆ మాటలలతో పారు షాక్ అవుతుంది. జ్యోత్స్న సుమిత్ర కన్నకూతురని, హాస్పిటల్‌లో నేనే పక్కన ఉన్నానని చెబుతుంది పారు. అంటే మొత్తం దగ్గరుండి అన్ని నువ్వే చూసుకున్నావా అని అడుగుతాడు కార్తీక్. మనిద్దరి మధ్య తేల్చుకోవాల్సిన లెక్కలు చాలా ఉన్నాయని.. సెకండాఫ్‌లో ప్రతీ సీన్ క్లైమాక్స్‌లా ఉంటుందని అంటాడు కార్తీక్. అతని మాటలతో పారు, జ్యోత్స్నలు షాక్ అవుతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X