Karthika Deepam 2 October 8th: సుమిత్ర కూతురు ఎవరు.. పారుని నిలదీసిన దీప, జ్యోత్స్నకు ముచ్చెమటలు

Photo Courtesy: JioHotstar

వేలంలో నువ్వు ఓడిపోయేలా చేసిన కార్తీక్‌ను ఏం చేయాలని జ్యోత్స్నను శివన్నారాయణ అడుగుతాడు. మెడపట్ట బయటికి గెంటేయాలని ఆమె చెప్పడంతో మనవరాలిపై శివన్నారాయణ రగిలిపోతాడు. కార్తీక్ లేకపోయుంటే మనకి ఈరోజు 11 కోట్లు నష్టం వచ్చేదని చెప్పడంతో పారు, సుమిత్రలు షాక్ అవుతారు. ఏం జరిగిందో వైరా నోటీతోనే చెప్పిస్తాడు దశరథ. వైరా తన మాజీ బిజినెస్ పార్ట్‌నర్ అని వ్యాపారంలో మోసం చేయబోతే నేనే పట్టుకుని గెంటేశానని చెబుతాడు. ఇప్పుడు మనపై పగతో రగిలిపోతున్నాడని, వేలం పాట దగ్గర ఎదురవ్వడంతో ఏం జరుగుతుందోనని అనుకున్నానని అంటాడు దశరథ.

ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ వాళ్లు మన రెస్టారెంట్‌పై రైడ్ చేయించినట్లు జ్యోత్స్న ఫేక్ కాల్ చేయించిందని చెప్పడంతో అంతా షాక్ అవుతారు. ఇంత మంచి చేసి కూడా నువ్వు అవమానాలు పడొద్దని నువ్వు, నీ భార్య ఈ ఇంటిలో నుంచి వెళ్లిపోమ్మని చెబుతాడు శివన్నారాయణ. పెద్ద మేడం చెబితేనే వెళ్తానని కార్తీక్ తేల్చేస్తాడు. వంటగదిలో మాట్లాడుకుంటున్న కార్తీక్‌ దగ్గర మాట తీసుకుని ఎందుకు మా ఇల్లు వదిలి వెళ్లడం లేదని చెప్పమంటుంది సుమిత్ర. నీ కూతురి కోసమే ఇదంతా చేశానని చెప్పడంతో పారు, జ్యోత్స్నలు షాక్ అవుతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి అక్టోబర్ 8వ తేదీ 483వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 483 October 8th 2025 Here is full story

Photo Courtesy: JioHotstar

అగ్రిమెంట్ రద్దు చేసే ఛాన్స్ వచ్చినా ఎందుకు శివన్నారాయణ ఇంటిలో ఊడిగం చేస్తున్నావని కొడుకుపై మండిపడుతుంది కాంచన. ఇన్నాళ్లు దీప గురించి అని చెప్పావ్.. ఇప్పుడేమో అత్త కూతురి కోసం ఇదంతా చేస్తున్నాను అని చెబుతున్నావ్, మీరిద్దరూ పూర్తిగా ఏది చెప్పారా అని మండిపడుతుంది కాంచన. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలిసిన మా వదినకి కూతురిని ఎలా బాగు చేయాలో తెలియదా? అని ప్రశ్నిస్తుంది. నీ మేనకోడలు తాత మాటే సరిగా వినదు, ఇక తల్లి మాట ఎలా వింటుందని అడుగుతుంది అనసూయ. వినేలా చేయాల్సిన బాధ్యత కార్తీక్, దీపలది కాదని అంటుంది కాంచన. ఏ తల్లి అయినా తన బిడ్డలు తను కోరుకున్నట్లుగా ఉండాలని అనుకుంటుందని, లేదా తను కోరుకున్న దానికంటే గొప్పగా ఉండాలని అనుకుంటుందని చెబుతుంది.

కార్తీక్ బాబు మీద నీ బిడ్డకు ఎంత ప్రేమ, నమ్మకం ఉంటాయో .. నాకు కూడా అంతే నమ్మకం ఉందని అంటుంది అనసూయ. ఏదో ఒక రోజు కార్తీక్, దీపలు రెండు కుటుంబాలను ఒక్కటి చేస్తారని.. నువ్వు ఎదురుచూస్తోన్న సంక్రాంతిని నీ వాకిట్లోకి తీసుకొస్తారని చెబుతుంది. ఆ రోజు రావాలని నేను కూడా కోరుకుంటున్నానని.. కానీ మా వదిన రానివ్వదని అంటుంది కాంచన. ఇంతలో శౌర్య వచ్చి సైకిల్ కావాలని అలుగుతుంది. అయితే దీపావళికి కొంటానని కార్తీక్ చెబుతాడు. అదెప్పుడు అంటే.. నాన్న సైకిల్ కొన్నప్పుడు అని అంటాడు కార్తీక్. నాన్న మాటిస్తే తప్పుతాడా? అని అడుగుతాడు.

ఏదో ఒకటి చెప్పి అందరి దగ్గరి నుంచి తప్పించుకోవడం నీకు బాగా అలవాటైపోయిందని అంటుంది దీప. దీనినే లౌక్యం అంటారని చెబుతాడు కార్తీక్. ఆ లౌక్యంతోనే ఏదో ఒకరోజు నిజం చెప్పేలా ఉన్నావని అంటుంది దీప. నిజం చెప్పాలని, జ్యోత్స్న ఏదైనా మాట అంటే గట్టిగా సమాధానం చెప్పాలని.. పారుని కూడా ఉతికి ఆరేయమంటాడు కార్తీక్. నేను ఈ నిజాన్ని ఎంతో కాలం దాచలేనని అనిపిస్తోందని దీప అనగా.. అవునని కార్తీక్ అంటాడు. మనం ఈ నిజాన్ని చెప్పకూడదని జ్యోత్స్న, పారుల నోటితోనే చెప్పించాలని చెబుతాడు కార్తీక్.

ఉదయాన్నే మొక్కలకు నీళ్లు పోస్తున్న దీపను జ్యోత్స్న కెలుకుతుంది. నువ్వు మా బావ జీవితంలో ఉన్నంత కాలం ఆయన కారు దగ్గరే ఉంటాడని, ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని అంటుంది జ్యోత్స్న. మా అమ్మతో నీ కూతురి కోసమే ఈ ఇంట్లో ఉంటున్నానని బావ చెప్పాడని, నా కోసం ఎందుకు ఉండాలో నాకు అర్ధం కావడం లేదని చెబుతుంది. తెలిసిన విషయాన్ని అర్ధం కానట్లుగా నటించడం కష్టమని అంటుంది. ఇంతలో పారు వచ్చి నువ్వేదో మేధావివి అయినట్లు మాట్లాడొద్దని, కార్తీక్ గాడు జ్యోత్స్న కోసమే ఈ ఇంట్లో ఉంటున్నాడని అంటుంది.

అమ్మాయిగారి వల్లే బావ ఇక్కడ ఉంటున్నాడని, కానీ అమ్మాయిగారి కోసం కాదని చెబుతుంది దీప. రెండూ ఒకటే కదా? అత్త కూతురి కోసం ఉన్నాడు కదా? అని అంటుంది పారు. అత్త ఎవరు? కూతురు ఎవరు? అని దీప అడగ్గా.. సుమిత్ర, జ్యోత్స్నలని చెబుతుంది పారు. మళ్లీ చెప్పండి కూతురు ఎవరు? అని దీప గట్టిగా నిలదీయడంతో పారు, జ్యోత్స్నలు వణికిపోతారు. సుమిత్ర అత్త కూతురి కోసమేనని కార్తీక్ అన్నాడని పారు చెబుతుంది.. కానీ జ్యోత్స్న కోసమని బావ చెప్పలేదని అంటుంది దీప. ఆమె వెళ్లిపోగానే నేను ఈ ఇంటి కూతురిని కాదని చాలా క్లారిటీ చెప్పిందని అంటుంది జ్యోత్స్న. మన చేత తప్పులు చేయించి మనిద్దరినీ ఇరికించడమే ఆ కార్తీక్ గాడి పని అని మండిపడుతుంది పారు.

ఆ వెంటనే తన సొంత తండ్రిని కలవడానికి వెళ్తుంది జ్యోత్స్న. నీ ప్రేమ నీకున్న అవసరం మీద ఆధారపడి ఉంటుందని చెబుతాడు. అందుకేనా? నువ్వు నన్ను మీ అమ్మ దగ్గరికి పంపించాలని అనుకున్నావని నిలదీయడంతో జ్యోత్స్న షాక్ అవుతాడు. నీ తమ్ముడి జాబ్ కోసం సాయం అడిగితే చేయలేదని అంటాడు తండ్రి. నేను జాబ్ చూస్తున్నానని అన్నానని, డబ్బులు ఇస్తే మావయ్య తీసుకోనివ్వలేదని అంటుంది జ్యోత్స్న. దీపకి తను ఎవరి కూతురు అనేది చెప్పావా? అని తండ్రిని నిలదీస్తుంది. బావకి నేను నీ కూతురేనని తెలిసినట్లుగా ఉందని, దీప కూడా బావ లాగే మాట్లాడుతోందని.. నిజం తెలిస్తేనే అలా మాట్లాడగలరని అంటుంది జ్యోత్స్న.

నువ్వే సుమిత్ర, దశరథల కూతురని చెప్పడం నాకు క్షణం పట్టదని అంటాడు. ఈ నిజం తెలిసినవాడిని నేనొక్కడినే ఉంటానా? ఇంకెవ్వరూ ఉండరా? అని తండ్రి నిలదీస్తాడు. బిడ్డల్ని మార్చిన విషయం మా అమ్మకి తెలుసు.. ఈ ఇంటి వారసురాలు బతికే ఉందని కూడా నేనే చెప్పానని అంటాడు. మరెవరైనా ఆ రోజు రాత్రి జరిగింది చూసి ఉండొచ్చు కదా అని చెప్పడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. మా అమ్మ చంపించిన సైదులు గాడు బతికే ఉన్నాడేమో, వాడే దీపకి నిజం చెప్పాడేమో అంటాడు. కొన్ని మనం ఎంత ఆపినా ఆగవని అనడంతో నీ కూతురంటే నీకు ఇష్టం లేదా? నా జీవితం, గ్రానీ నిర్ణయమని.. ఇదంతా చేసింది నీకోసమేనని అంటుంది. ఈ పాపాన్ని నేను కడుక్కోవాలని అనుకుంటున్నానని తండ్రి చెప్పగా.. అప్పుడు నా పరిస్ధితి ఏంటనీ అడుగుతుంది జ్యోత్స్న. వీరిద్దరినీ చూసిన కాశీ.. జ్యోత్స్న అక్క నాన్న ముందు తగ్గి మాట్లాడటం ఏంటని ఆలోచిస్తాడు.

ఈరోజు చాలా విశేషమైన రోజనీ భార్యాభర్తలు గుడికి వెళ్తే చాలా మంచిదని దశరథ, సుమిత్రలకి చెబుతుంది దీప. నేను ఎక్కడికి వెళ్లనని దశరథ చెబుతాడు. మంచి అనేది మనలో ఉండాలని, అది లేకుండా దేవుడికి నమస్కారం పెట్టి నవ్వుతూ కొబ్బరికాయ కొట్టినంత మాత్రాన మనం కోరుకున్న ఫలితం రాదని అంటాడు. ఇంకెంత కాలం మీరు, సుమిత్ర అమ్మగారితో మాట్లాడకుండా ఉంటారని.. ఇప్పుడు సమస్య నాకు, సుమిత్ర అమ్మ గారికి మధ్యనే అంటుంది దీప. సమస్య ఏంటో బాధపడుతున్న వాళ్లకి, బాధపెడుతున్న వాళ్లకి తెలుసని.. సరిదిద్దుకునే మార్గం ఉంది, కానీ సరిదిద్దుకునే ఆలోచనే చేయడం లేదని అంటాడు దశరథ.

మీరు ఇలా ఉండొద్దని మాట్లాడుకోవాలి.. గతంలో మాదిరిగా ప్రేమగా ఉండాలని అంటుంది దీప. మాట్లాడుకుంటేనే సమస్యలు తొలగిపోతాయని చెబుతుంది. సుమిత్ర అమ్మ గారిని క్షమిస్తా.. కానీ నువ్వొక పనిచేయాలని అడుగుతాడు దశరథ. కాఫీ కప్పుని చూపించి ఇది నా భార్య మీద పెట్టుకున్న నమ్మకమని.. పగులగొట్టి దానిని అతికించగలవా? అని ప్రశ్నిస్తాడు. మీరైనా అయ్యగారితో మాట్లాడండి.. ఎన్ని రోజులు ఇలాగే ఉండిపోతారని అడుగుతుంది దీప. నేను తప్పు చేశాను.. నన్ను శిక్ష అనుభవించని అని అంటుంది సుమిత్ర. నువ్వు నాకు చేసిన ద్రోహాన్ని మర్చిపోతానని అనుకోకు.. ప్రాణం పోయినా మరిచిపోనని చెబుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X