Karthika Deepam 2 October 13th: తిరిగి సీఈవోగా కార్తీక్... దీప దెబ్బకి జ్యోత్స్నకి ముచ్చెమటలు

Photo Courtesy: JioHotstar

శివన్నారాయణ కంపెనీలోని షేర్స్ తనకు దక్కకుండా చివరి నిమిషంలో అడ్డుతగిలిన కార్తీక్‌పై రగిలిపోతాడు వైరా. నీతో నాకు ఎలాంటి వైరం లేదు, కానీ నీ మావయ్య దశరథతో చాలా తేల్చుకోవాలని దానికి నువ్వు అడ్డు పడొద్దని వార్నింగ్ ఇస్తాడు. మొన్న వేలం పాటలోనూ నాకు నష్టం రావడనికి నువ్వే కారణమని నాకు తెలిసిందని చెబుతాడు వైరా. నువ్వు నాకు అడ్డు పడితే నీ కారును లారీ గుద్దొచ్చు, నీ ఫ్యామిలీ మీద దాడి జరగొచ్చు, నీ కూతురికి ఏమైనా జరగొచ్చని భయపెడతాడు.

వైరా మాటలతో రగిలిపోయిన కార్తీక్... నువ్వు నా ఫ్యామిలీ జోలికి, కంపెనీ జోలికి వస్తే పోతురాజుని నరికినట్లు నరుకుతానని వార్నింగ్ ఇస్తాడు. బోర్డ్ మీటింగ్‌లో తనకు జరిగిన అవమానం గురించి ఇంట్లో గొడవ చేస్తుంది జ్యోత్స్న. నువ్వు మన శత్రువుకి వెలకమ్ చెప్పావని ... కానీ కార్తీక్ లేకపోయుంటే ఈరోజు కంపెనీ మన శత్రువు చేతుల్లోకి వెళ్లిపోయేదని చెబుతాడు శివన్నారాయణ. నెక్ట్స్ బోర్డ్ మీటింగ్‌లో కొత్త సీఈవోని అనౌన్స్ చేస్తామని... పరువు పోయేలోగా నువ్వే రాజీనామా చేయమని శివన్నారాయణ చెప్పడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. నువ్వు నాకు తండ్రిగా ఏం చేయలేదని కాశీ అనడంతో దాస్ తన కొడుకుని కొట్టేందుకు చెయ్యి ఎత్తుతాడు. ఇంతలో శ్రీధర్ వచ్చి తండ్రి కొడుకులికి నచ్చచెబుతాడు. దీప, జ్యోత్స్నల పుట్టుక గురించి దాస్‌ని నిలదీస్తాడు శ్రీధర్. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి అక్టోబర్ 13వ తేదీ 487వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 487 October 13th 2025 Here is full story

Photo Courtesy: JioHotstar

నేను వయసులో ఉన్నప్పుడు వ్యాపారంలో పోటీ, గేమ్ భలే మజాగా ఉండేదని, కానీ ఇప్పుడు మోయలేనన్ని సమస్యలతో బాధపడుతున్నానని అంటాడు. ఇక ఈ సముద్రాన్ని నేను ఈదలేనని, ఇప్పుడు నాకొక సాలీడ్ ప్లేయర్ కావాలని చెబుతాడు శివన్నారాయణ. కత్తి మనిషైతే ఎలా ఉంటుందో? వాడు అలా ఉండాలి, నీలా ఉండాలని అంటాడు. నీ తాత నిన్ను రెండు కోరికలు కోరుతున్నాడు... తీరుస్తానని మాటిస్తావా? అని అడుగుతాడు శివన్నారాయణ. అవేంటో చెప్పమని కార్తీక్ అడగ్గా... నువ్వు నా చేతిలో చేయి వేస్తేనే నాకు నమ్మకం వస్తుందని చెబుతాడు పెద్దాయన.

ఎన్నోసార్లు ఈ చేత్తో నన్ను ముద్దు చేశావు... నన్ను దండించావు.. నాకు అమ్మనే ఇచ్చావు, నీకు మాట ఇవ్వలేనా? అని అంటాడు కార్తీక్. బోర్డ్ మీటింగ్‌లో కార్తీక్ మనతోనే ఉంటాడు? మన కంపెనీలోనే ఉంటాడన్న మాటను నువ్వు నిజం చేయాలని అడుగుతాడు శివన్నారాయణ. ఆ మాటలతో షాకైన కార్తీక్... అదెలా సాధ్యమవుతుంది? నేను మీ డ్రైవర్‌ని అంటాడు. సాధ్యమయ్యేలా నేను చేస్తానని శివన్నారాయణ చెప్పడంతో సరేనంటాడు కార్తీక్. మీ అత్త మామల్ని మనుపటిలా చూడాలని, వాళ్లిద్దరినీ నువ్వే కలపాలని అంటాడు శివన్నారాయణ. నేను రెండు మూడు సార్లు ప్రయత్నించానని, ప్రతిసారి దూరం పెరిగిందే కానీ దగ్గర కాలేదని చెబుతాడు కార్తీక్.

ఏదో ఒక పెద్ద విషయం జరగాలని అంటాడు కార్తీక్.. నువ్వేం చేయగలవో అది చేయ్, వాళ్లిద్దిరనీ కలపాలని నేను సంకల్పం పెట్టుకున్నానని అంటాడు శివన్నారాయణ. నాది, మీ అమ్మది అయిపోయిందని... ఇది నీది అని చెబుతాడు శివన్నారాయణ. నా కుటుంబాన్ని, కంపెనీని ఒక్కో ఇటుక పేర్చుకుంటూ మహా సామ్రాజ్యాన్ని నిర్మించానని... అది కూలిపోకుండా కాపాడాల్సిన బాధ్యత నీదేనని చెబుతాడు శివన్నారాయణ. నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటావనే నమ్మకం నాకుందని చెప్పి వెళ్లిపోతాడు. చాలా పెద్ద బాధ్యతని చాలా సింపుల్‌గా భుజాలపై పెట్టి వెళ్లిపోయావు? నీ రెండు కోరికల్ని నేను తిరుస్తానని అనుకుంటాడు కార్తీక్.

వీరిద్దరి మాటల్ని విన్న జ్యోత్స్న... చాలా పెద్ద బాధ్యత తీసుకున్నావ్ కదా బావ అని అనుకుంటుంది. ఇంతలో దీప వచ్చి వాళ్లు మాట్లాడుకున్న మాటల్ని చాటుగా వినడమెందుకు అని ప్రశ్నిస్తుంది. పనిమనిషివి, పనిమనిషిలా ఉండమని వార్నింగ్ ఇస్తుంది జ్యోత్స్న. అయితే నీతో సెపరేట్‌గా మాట్లాడాలని అంటుంది దీప. టిఫిన్ చేయడానికి కాశీ రాకపోవడంతో శ్రీధర్ మండిపడతాడు. ఎవరు ఎవరితో మాట్లాడితే అల్లుడికి ఎందుకు? అని కావేరిని ప్రశ్నిస్తాడు శ్రీధర్. లవ్ మ్యారేజ్ అయినా అరెంజ్ మ్యారేజ్ అయినా అండర్‌ స్టాండింగ్ ఉండాలని స్వప్నకి చెబుతాడు.

దాంతో స్వప్నకి కోపమొచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతానని అంటుంది. ఈరోజు ఈ గొడవలన్నింటికీ పరిష్కారం ఇవ్వాల్సిందేనని చెబుతాడు శ్రీధర్. నేను ఇంట్లో నుంచి వెళ్లిపోతానిన కాశీ అనడంతో అంతా షాక్ అవుతారు. ఉద్యోగాల వేట వదిలేసి హాయిగా మన బిజినెస్‌లు చూసుకోమ్మని చెబుతాడు శ్రీధర్. బిజినెస్ మీద నాకు ఇంట్రెస్ట్ లేదని, నేను బలవంతంగా బిజినెస్‌లు చేసి, నష్టాలు తీసుకొచ్చి మీ చేత తిట్లు తినిపించుకోలేనని అంటాడు కాశీ. నీకు రేపు సాయంత్రం వరకు టైం ఇస్తున్నా, జాబ్ దొరికితే ఓకే.. లేదంటే ఎల్లుండి నుంచి మన బిజినెస్ నువ్వే చూసుకోవాలని చెబుతాడు శ్రీధర్.

తన ముందు సోఫాలో కూర్చొన్న దీపను చూసి జ్యోత్స్న రగిలిపోతుంది. చేతకానీ పనులు ఎప్పుడూ చేయొద్దని మా బావ చెబుతాడని దీప అనగా... మీరు కూడా అలాంటివి మానేయమని అంటుంది దీప. నాకు సలహా ఇవ్వాలంటే ఒక స్థాయి, ఒక అర్హత ఉండాలని చెబుతుంది దీప. నువ్వు ఈ ఇంటి పనిమనిషివని మండిపడుతుంది జ్యోత్స్న. మన చేతికాని తనం వల్ల మనవాళ్లు నష్టపోతున్నారని తెలిసినప్పుడైనా మనమేంటో మనకి అర్ధం కావాలని చెబుతుంది దీప. నువ్వున్న ప్లేస్‌ని బట్టి నువ్వు ఇచ్చే సలహా నాకు విలువైంది కాదని అంటుంది జ్యోత్స్న. అలా అయితే మీరున్న ప్లేస్ మీది కాదని... ఈ ప్లేస్‌లో ఉండే అర్హత మీకుందా? అని దీప నిలదీస్తుంది. దాంతో షాకైన జ్యోత్స్న... దీపకి నిజం తెలిసిపోయిందని, నేనున్న స్థానం తనది కాబట్టే ఇలా చెబుతుందని అనుకుంటుంది.

ఇది మాట్లాడుతుంటే నాకు మాటలు రావడం లేదు.. తెలియకుండానే నాలో భయం మొదలైంది, నేను ఇలాగే మౌనంగా ఉంటే, నువ్వు దాస్ కూతురివని సడెన్‌గా చెబుతుందేమో అని జ్యోత్స్న అనుకుంటుంది. మీరుండే ప్లేస్ అంటే జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్‌కి మీరు సీఈవో కదా అని అంటుంది దీప. ఆ మాటలతో నేను అనవరంగా భయపడుతున్నాను, దీనికి నిజం తెలియదని అనుకుంటుంది జ్యోత్స్న. మా తాత నాకేదో వార్నింగ్ ఇచ్చాడని నువ్వు నాకేం సలహాలు ఇవ్వొద్దని మండిపడుతుంది. ఇప్పటికైనా నువ్వు మారకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడతావని హెచ్చరిస్తుంది దీప. గట్టిగా మాట్లాడితే నీకున్న ప్లేస్‌ని మార్చేస్తానని జ్యోత్స్న అనగా.. నా ప్లేస్‌ని మీరు ఎప్పటికీ మార్చలేరని అంటుంది దీప.

ఆఫీసులో, మీ తాత దగ్గర, మీ నాన్న దగ్గర... చివరికి మన పనిమనిషి దీప దగ్గరా పరువు పోయిందని సెటైర్లు వేస్తుంది పారు. దీప పుట్టుక గురించి కార్తీక్‌కి తెలిస్తే ఈ పాటికే ఇల్లంతా తగలబెట్టేవాడని చెబుతుంది. సీఈవోగా రాజీనామా చేయకూడదంటే నువ్వు ఒక పని పనిచేయలేదని చెబుతుంది. కార్తీక్- దీప వెళ్తుండగా.. కారులో ఎదురొస్తుంది జ్యోత్స్న. నీతో మాట్లాడాలని కార్తీక్‌ని అడుగుతుంది జ్యోత్స్న.. నేను పంపనని అంటుంది దీప. ఇది మా ఫ్యామిలీ మేటర్ అని నీ ముందు మాట్లాడనని చెబుతుంది జ్యోత్స్న. దీపను బతిమలాడి జ్యోత్స్నతో మాట్లాడటానికి రెస్టారెంట్‌కు తీసుకెళ్తుంది జ్యోత్స్న. నేను సీఈవోగా ఉండాలంటే నువ్వే సాయం చేయాలని అడుగుతుంది.

నా లెక్క ప్రకారం నెక్ట్స్ సీఈవో నువ్వేనని అనుకుంటుంది జ్యోత్స్న. ముందు అత్తయ్య, మావయ్యలని కలిపే సంగతి చూడమని చెబుతుంది. అంటే మా మమ్మీ డాడీ కలిసిపోతే నువ్వు నాకు సపోర్ట్ చేస్తావా అని అడుగుతుంది జ్యోత్స్న. ఇది ఏదో ఒక గొడవ చేస్తుందని కార్తీక్ భయపడుతాడు. ఇంటికెళ్లి అందరినీ పిలిచిన జ్యోత్స్న.. తన తండ్రి పక్కన సుమిత్రని నిల్చోబెడుతుంది. దాంతో దశరథ పక్కకి వచ్చేస్తాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X