Karthika Deepam 2 October 14th: తల్లిదండ్రుల మధ్య జ్యోత్స్న చిచ్చు... ఇల్లు వదిలి వెళ్లిపోయిన సుమిత్ర

Photo Courtesy: JioHotstar

కుటుంబం, కంపెనీ భారం మోసే ఓపిక నాకు లేదని నువ్వే సైనికుడిలా పోరాడాలని కార్తీక్‌కు శివన్నారాయణ చెబుతాడు. దాంతో తాతకు కార్తీక్ మాట ఇస్తాడు. వీరి మాటలను విన్న జ్యోత్స్న కంగారు పడుతుంది. ఇంతలో దీప ఆమెను పిలిచి .. నీ ప్లేస్ నీది కాదని అనడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. దీపకు నిజం తెలిసిపోయిందా అని టెన్షన్ పడుతుంది. ఉద్యోగం విషయంలో కాశీ, స్వప్న గొడవపడటంతో శ్రీధర్ జోక్యం చేసుకుని అల్లుడికి 24 గంటలు టైమిస్తాడు. ఉద్యోగం దొరికితే ఓకే లేదంటే బిజినెస్ చూసుకోవాలని డెడ్‌లైన్ పెడతాడు. బిజినెస్ నాకు ఇంట్రెస్ట్ లేదని... బలవంతంగా చేస్తే నష్టాలు వస్తాయని చెబుతాడు కాశీ.

దీప ప్రవర్తన, నెక్ట్స్ సీఈవోగా కార్తీక్‌ని నియమించే అవకాశాలు ఉండటంతో జ్యోత్స్న అలర్ట్ అవుతుంది. కార్తీక్‌ను తీసుకుని రెస్టారెంట్‌కు వెళ్తుంది. సీఈవోగా ఉండటానికి నాకు నీ హెల్ప్ కావాలని అడుగుతుంది జ్యోత్స్న. ముందు ఇంట్లో మీ అమ్మనాన్నలను కలపమని కార్తీక్ అడగటంతో జ్యోత్స్న కోపం ఇంటికి వెళ్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి అక్టోబర్ 14వ తేదీ 488వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 488 October 14th 2025 Here is full story

Photo Courtesy: JioHotstar

సుమిత్ర, దశరథలను కలపాలని ఆవేశంగా ఇంటికొస్తుంది జ్యోత్స్న. దీప అనే అనాథకి మీరు అమ్మానాన్నలుగా నిలబడి పెళ్లి చేశారని, ఆ పెళ్లిలో అమ్మ కోపంతో ఓ పనిచేసిందని దానికి అత్తకి కూడా క్షమాపణ చెప్పిందని అంటుంది జ్యోత్స్న. ఇంకా మీకెందుకు కోపం? ఎన్నాళ్లు ఈ దూరం? అని దశరథను నిలదీస్తుంది. మా అమ్మతో మాట్లాడమని డాడీతో చెప్పొచ్చు కదా అని శివన్నారాయణపై కోప్పడుతుంది జ్యోత్స్న. దాంతో రగిలిపోయిన దశరథ .. మా నాన్న నాతో ఏం మాట్లాడాలో నువ్వు చెప్పొద్దని అంటాడు. మీ నాన్నంటే మీకు ఎంత ప్రేమో.. మీరంటే నాక్కూడా అంతే ప్రేమని చెబుతుంది జ్యోత్స్న. మా అమ్మ తరపున ఈ ఇంట్లో నిలబడేది నేను మాత్రమేనని, దీనికి కారణం నువ్వేనని కోప్పడుతుంది.

జ్యోత్స్న కారణంగా అత్తయ్య, మావయ్య మధ్య దూరం ఇంకా పెరిగేలా ఉందని కార్తీక్ టెన్షన్ పడతాడు. మమ్మీకి నువ్వంటేనే ఎక్కువ ఇష్టమని, అలాంటి మమ్మీ ప్రేమ.. నీకు దీప మీదున్న నమ్మకం ముందు ఓడిపోయిందని అంటుంది జ్యోత్స్న. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడొద్దని మరదల్ని ఆపాలని చూస్తాడు కార్తీక్. నువ్వు కలుపుతున్నట్లుగా లేదని కార్తీక్ చెప్పబోతుండగా.. మీ అమ్మానాన్నల విషయంలో నేనెప్పుడైనా కలగజేసుకున్నానా? అని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. ఈ ఇంట్లో ఇన్ని గొడవలు జరుగుతున్నా.. హ్యాపీగా డ్యూటీకి వస్తాడు? వెళ్లిపోతాడని అంటుంది. ఈ ఇంటి సమస్యలతో వాళ్లకి ఏ సంబంధం లేదని, సంతోషంగా నవ్వుతూ ఉండాల్సిన కుటుంబం కలిసి భోజనం కూడా చేయలేని పరిస్థితుల్లో ఉందని అంటుంది జ్యోత్స్న.

నువ్వు నాతో ఏదైనా చెప్పాలనుకుంటే ధైర్యంగా చెప్పు... అంతేకానీ ఎవరి తరపునో నిలబడి నన్ను మాట్లాడమని చెప్పొద్దని మండిపడతాడు దశరథ. జ్యోత్స్న చెప్పిన విధానం కరెక్ట్‌గా లేకపోవచ్చు కానీ, తన ఉద్దేశం మాత్రం కరెక్ట్‌గానే ఉంది.. మీరిద్దరూ ఎన్నాళ్లు దూరంగా ఉంటారు.. మునుపటిలా కలిసిపోతే చూడాలని ఉందని శివన్నారాయణ అంటాడు. ఎవరికైనా ప్రమాదం జరిగి హాస్పిటల్‌లో అడ్మిట్ అయితే ట్రీట్‌మెంట్ అయ్యేదాకా అక్కడే ఉండాలి? అంతేకానీ బలవంతంగా తీసుకెళ్లిపోతామంటే కుదరదని అంటాడు దశరథ. మానవ సంబంధాల మధ్య జరిగే ప్రమాదాలు కూడా అలాంటివే అంటాడు.. అవి కూడా కోలుకోవడానికి టైం పడుతుందని చెబుతాడు.

ఇక్కడ ప్రమాదం చేసింది దీప అయితే గాయపడింది మా మమ్మీ, అప్పుడు మీరు ఎవరిని శిక్షించాలి? ఎవరిని దూరం పెట్టాలి? అని జ్యోత్స్న ప్రశ్నిస్తుంది. మీ అమ్మ చిన్నపిల్లా? తను ఏ తప్పు చేసిందో తనకు తెలియదా? అని అంటాడు దశరథ. దీనిని ఇక్కడితే ఆపేస్తే మంచిదని కార్తీక్ బతిమలాడతాడు. మా ఫ్యామిలీలో నువ్వెందుకు జోక్యం చేసుకుంటున్నావని జ్యోత్స్న మండిపడగా... కార్తీక్ కూడా ఈ ఫ్యామిలీ మనిషేనని అంటాడు దశరథ. మా మమ్మీ తప్పించి నీకు అందరూ కావాలి, నీ ప్రవర్తన చూస్తుంటే మమ్మీ ఇంట్లో ఉండటం కూడా నీకు ఇష్టం లేదని జ్యోత్స్న అనడంతో అంతా షాక్ అవుతారు. దాంతో శివన్నారాయణ, కార్తీక్‌లు ఆమెను ఆపాలని చూస్తారు.

నేను నీతో మాట్లాడాలని, బయటికి రమ్మంటాడు కార్తీక్. నేను నీతో మాట్లాడను.. మా మమ్మీ డాడీ కలవడం ఆ దీపకి ఇష్టం ఉండదు కాబట్టి నీకు ఇబ్బందిగా ఉందా? అని జ్యోత్స్న మండిపడుతుంది. వాళ్లిద్దరి మధ్య దూరం పెరగడానికి కారణం అందరికీ అర్ధమవుతుందని అంటాడు కార్తీక్. నీ పెళ్లాన్ని ఒక్క మాటంటే నీకు మండుతుందా? డ్యూటీ అయిపోయాక ఇక్కడ నీకేం పని? అన్నింటిలోకి అందరూ దూరొద్దని పారు వార్నింగ్ ఇస్తుంది. దాంతో పారిజాతంపై శివన్నారాయణ ఫైర్ అవుతాడు. నువ్వు అందరితో మాటలు పడటం ఎందుకు? నువ్వెళ్లిపో అని అంటాడు పెద్దాయన. ఇక్కడ జరిగినదంతా దీపకి చెప్పాలి కదా? చూడనీయమని అంటుంది జ్యోత్స్న.

కార్తీక్ నీకు పరాయివాడేమో కానీ నాకు మాత్రం మనవడని, నా కూతురి కొడుకు అంటాడు శివన్నారాయణ. మనవడి మీద మాటపడితే తాత తట్టుకోలేకపోయాడు, వీళ్లందరి కోసం మా మమ్మీని దూరం పెడుతున్నావని మండిపడుతుంది జ్యోత్స్న. అలా చూడటానికి కారణం మీ అమ్మేనని సీరియస్ అవుతాడు దశరథ. ఎవరి గౌరవ మర్యాదలు మంటగలిసిపోయినా పర్లేదని, మీ అమ్మ ఎప్పుడైతే తప్పు చేసిందో? ఆ క్షణమే నా మనసు చచ్చిపోయిందని అంటాడు దశరథ. బుల్లెట్ జరిగిన రోజే చచ్చిపోతే బావుండు అనిపించిందని అనడంతో అంతా షాక్ అవుతారు. ఆ మాటలతో శివన్నారాయణ కోప్పడతాడు. భర్త మాటలతో బాధపడిన సుమిత్ర.. ఏడుస్తూ వెళ్లిపోతుంది.

ఇంట్లో గొడవతో శివన్నారాయణ కుప్పకూలిపోతాడు. జ్యోత్స్నని చెప్పుతో కొట్టినా తప్పులేదు, ఎంత విధ్వంసం చేయాలో అంత చేసిందని కోపంగా వెళ్లిపోతాడు కార్తీక్. జ్యోత్స్న నిన్ను ఎందుకు రమ్మని పిలిచింది? ఇద్దరూ ఏం మాట్లాడుకున్నారని కార్తీక్‌ని అడుగుతుంది దీప. దాంతో ఆమెకు క్షమాపణలు చెప్పి.. జరిగిన దాంట్లో ఎంతో కొంత తప్పుందని చెబుతాడు. దాంతో ఏం జరిగిందో దీపకి చెబుతాడు కార్తీక్. నేను తనతో చెప్పింది వేరు? తను అర్ధం చేసుకున్నది వేరు. అత్తని, మావయ్యని కలిపితే తను సీఈవోగా ఉండటానికి నేను సపోర్ట్‌ చేస్తానని అనుకుందని అంటాడు. ఆ మనిషికి మనుషుల్ని విడదీయటం తప్పించి, కలపడం రాదు... అప్పటికే జరగాల్సిన విధ్వంసం జరిగిపోయిందని చెబుతాడు కార్తీక్.

నాన్న చిన్న మాట అంటేనే అమ్మ తట్టుకోలేదని, అలాంటిది అన్ని మాటలు అంటే అమ్మ ఎలా తీసుకుంటుందోనని అంటుంది దీప. నేను మాట్లాడితే గొడవ ఇంకా పెరుగుతుందని ఇంటికి వచ్చేశానని అంటాడు కార్తీక్. జరిగినదంతా తలుచుకుంటూ అమ్మ బాధపడుతుందని చెబుతుంది దీప. భర్త అన్న మాటలతో ఏడుస్తుంటుంది సుమిత్ర. గొడవ తర్వాత జ్యోత్స్న, పారులు మాట్లాడుకుంటూ ఉంటారు. నువ్వు చాలా తప్పు చేస్తున్నావని పారు అనగా.. ఏం పర్లేదని, ఈ గొడవతో మమ్మీ మీదున్న సింపతీని అడ్డు పెట్టుకుని తాత ప్రేమను పొందితే బావ సపోర్ట్ లేకుండానే నేను సీఈవో పోస్ట్‌లో ఉంటానని అంటుంది జ్యోత్స్న. బోర్డ్ మీటింగ్ పూర్తయ్యే వరకు మమ్మీ ఇలాగే ఉండాలని... ఆవిడ ఎంత బాధపడితే మనకి అంత మంచిదని చెబుతుంది.

నా వల్ల నా భర్త బాధపడుతున్నాడంటే... నేను లేకపోతే తను సంతోషంగా ఉంటాడని, మీ ఇంట్లో, మీ జీవితంలో ఉండనని సుమిత్ర ఇల్లు వదిలి వెళ్లిపోవాలని అనుకుంటుంది. అర్ధరాత్రి బయటికి వెళ్లిపోతున్న తల్లిని చూసి షాక్ అవుతుంది జ్యోత్స్న. పారుకి ఏం కనిపించకపోవడంతో ఎవరూ లేరని అబద్ధం చెబుతుంది. మమ్మీ ఎక్కడికి వెళ్తుంది? డాడీ అన్న మాటల్ని సీరియస్‌గా తీసుకుని ఇల్లు వదిలి వెళ్లిపోతుందా? ఏం జరిగినా మన మంచికే అని అనుకుంటుంది జ్యోత్స్న. ఊరు నుంచి వచ్చిన అనసూయ... నీకెంతో విలువైనవి తీసుకొచ్చానని దీపతో అంటుంది. తల్లి ఫోటో చూసి దీప ఎమోషనల్ అవుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X