Karthika Deepam 2 October 17th: తల్లి జాడ కనిపెట్టిన దీప... చావు బతుకుల్లో సుమిత్ర
Photo Courtesy: JioHotstar
సుమిత్ర అత్త కనిపించడం లేదని శ్రీధర్‌కు చెబుతాడు కార్తీక్. ఈ విషయాన్ని కాంచనకు చెప్పడంతో ఆమె షాక్ అవుతుంది. కార్తీక్, శ్రీధర్, దీప, దశరథలు సుమిత్ర కోసం ఊరంతా వెతుకుతారు. ఎంతకూ భార్య ఆచూకీ కనిపించకపోవడంతో దశరథ కండటతడి పెడతాడు. నా మాటలు ఆమెను నిలువునా చీల్చేశాయని అందుకే కనిపించకుండా వెళ్లిపోయిందని బాధపడతాడు. మేనమావకి కార్తీక్ ధైర్యం చెబుతాడు. తల్లి జాడ కనిపించకపోవడంతో అమ్మవారి మీద దీప కంటతడి పెడుతుంది.
ఇంతలో దీపకు గతంలో జాతకం చెప్పిన స్వామిజీ వచ్చి నువ్వు ఎవరన్నది త్వరలోనే అందరికీ తెలుస్తుందని, నువ్వు వెతుకుతున్నది దొరుకుతుందని చెబుతాడు. సుమిత్ర కనిపించడం లేదని కాంచనకు చెప్పి శివన్నారాయణ ఇంటికి తీసుకొస్తాడు శ్రీధర్. శివన్నారాయణకి బీపీ ఎక్కువైందని... ఆయన టెన్షన్ ఏంటో తెలుసుకోకుండా హార్ట్ ప్రాబ్లమ్ వస్తుందని డాక్టర్ వార్నింగ్ ఇస్తాడు. తండ్రిని అలా చూసిన కాంచన కన్నీళ్లు పెట్టుకుంటుంది. సుమిత్ర ఇల్లు వదిలి వెళ్లిపోతుంటే చూసి కూడా వదిలేస్తారా అని జ్యోత్స్నకు, పారిజాతానికి క్లాస్ పీకుతుంది కాంచన. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి అక్టోబర్ 17వ తేదీ 491వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
నీ తండ్రిని ఇలా చూడటం నీకెంత బాధగా ఉంటుందో? నా భర్తను ఇలా చూడటం నాకు అంతే బాధగా ఉంటుందని పారు బాధపడుతుంది. ఇంతలో శివన్నారాయణ స్పృహాలోకి రావడంతో అందరూ సంతోషిస్తారు. కళ్లు తెరిచిన వెంటనే సుమిత్ర గురించే అడుగుతాడు శివన్నారాయణ. వదిన ఎవరికో కనిపించిందని, కార్తీక్ వెళ్లి తీసుకొస్తాడని అంటుంది కాంచన. నా కొడుకు, కోడలు ఇద్దరూ కలిసి ఈ ఇంటికి మామూలు పరిస్ధితి తీసుకొస్తారని చెబుతుంది. ఈ కుటుంబానికి ఎవ్వరి వల్ల ఏం కాదు, మేం ఉన్నామని మాటిస్తాడు కార్తీక్. ఇంతలో సుమిత్ర ఓ చోట కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఆ వెంటనే కొందరు దొంగలు సుమిత్రను చుట్టుముట్టి.. నీ ఒంటి మీదున్న నగల్ని తీసివ్వమని కత్తితో బెదిరిస్తారు.
కుటుంబాన్ని వదులుకుని వచ్చిన దానిని వీటిని వదులుకోలేనా అని నగల్నీ తీసి ఇచ్చేస్తుంది సుమిత్ర. పారిపోయే ప్రయత్నం చేయకుండానే నగల్ని తీసి చేతిలో పెట్టావు ఇవి రోల్డ్ గోల్డ్ కాదు కదా అని అడుగుతారు. ఇప్పుడు నా దృష్టిలో బంగారం కూడా మట్టితో సమానమని అంటుంది. అయితే మెడలో తాళి కూడా ఇచ్చేయమని అడుగుతారు దొంగలు. ఆ మాటలతో షాకైన సుమిత్ర.. ఇది మంగళసూత్రం, నేను ఇవ్వనని అంటుంది. అయితే మేమే తీసుకుంటామని తాళిని లాక్కోబోతుండగా దీప వచ్చి ఆ రౌడీని వెనుక నుంచి కొడుతుంది. వెంటనే కర్రతో ఆ రౌడీలను తరిమి తరిమి కొడుతుంది.
నువ్వు ఉదయం నుంచి ఏం తినలేదని ఏదో ఒకటి తినమని శివన్నారాయణని అడుగుతుంది కాంచన. సుమిత్రను తీసుకొస్తానని కార్తీక్ వెళ్లాడు కదా? తీసుకొస్తాడని అంటుంది. సుమిత్రను ఎవరో చూశారని చెప్పావుగా అని అడుగుతాడు. నిజం చెబితే నేనేమీ చచ్చిపోనులే అని అంటాడు శివన్నారాయణ. ఆ మాటలతో అందరూ బాధపడతారు. ఇప్పుడు కనిపించలేదు అనుకుందాం.. ఇక కనిపించదా అని ప్రశ్నిస్తుంది కాంచన. నా కొడుకు, నా కోడలు కలిసి దీపని వెతుకుతున్నారని.. తను ఎక్కడ ఉన్నా వెతికి తీసుకొస్తారని చెబుతుంది. అయినా వదిన మాత్రం మనల్ని వదిలి ఎక్కడికి వెళ్తుందని ప్రశ్నిస్తుంది.
కొంచెం అన్నం తిని టాబ్లెట్స్ వేసుకుంటే వదినని తీసుకుని నీ మనవడు వచ్చేస్తాడని అంటుంది కాంచన. నాకు వద్దు అని శివన్నారాయణ అంటాడు. చిన్నప్పుడు నువ్వు నాకు అన్నయ్యకి తినిపించావు కదా? అప్పుడు మేం చంటి పిల్లలమని, ఇప్పుడు నువ్వు మాకు చంటి పిల్లాడివని అన్నం తినిపిస్తుంది కాంచన. నువ్వు కూడా ఏం తినలేదని దశరథకు తినిపిస్తుంది కాంచన. ఇంటిలో ఆడపిల్ల ఉంటే అందరికీ అమ్మ ఉన్నట్లే అంటారని శ్రీధర్ చెబుతాడు. దాంతో కాంచనకి కూడా దశరథ తినిపిస్తాడు. నా కొడుకు ఖచ్చితంగా వదినని తీసుకుని వస్తాడని అంటుంది కాంచన.
వారి మాటలు విన్న పారిజాతం.. బయటికొచ్చి ఏడుస్తుంది. సింపతీ కోసం ఏడుస్తున్నావా? అని జ్యోత్స్న అడగటంతో.. నేను మనిషిని, నీలాగా మరబొమ్మని కాదని మనవరాలిపై మండిపడుతుంది పారిజాతం. అక్కడ లేవలేని స్థితిలో ఉన్నది నా భర్త... నేను స్వార్ధపరురాలినే, కానీ ఒక ఆడదానిగా ఆలోచిస్తే భర్త లేకపోతే ఈ రంగు రంగుల చీరలు, ఈ ఆభరణాలు, ఈ సోకులు ఏమీ ఉండవని అంటుంది పారు. చివరికి మెడలో తాళి కూడా ఉండదని, ఆడదానికి ఐదోతనం ఇచ్చేది భర్తేనని.. నా కొడుకు కూతురినే ఈ ఇంటికి వారసురాలిని చేయాలని అనుకున్నాను... అది నా భర్త మీద పగతోనే కానీ, చంపాలని నేను ఎప్పుడూ అనుకోలేదని అంటుంది పారిజాతం.
ఈ రోజు నా భర్త ఎలాంటి స్థితిలో ఉన్నాడో తెలుసా? దీనికి ఎవరు కారణం... నువ్వు అంటూ జ్యోత్స్నపై ఫైర్ అవుతుంది పారిజాతం. సుమిత్రని నువ్వు ఆపి ఉంటే ఇదంతా జరిగి ఉండేది కాదని, నీలో మానవత్వం, మంచితనం పూర్తిగా చచ్చిపోయినట్లుగా ఉన్నాయని మండిపడుతుంది. అందుకే నీలో ఏ బాధ కనిపించడం లేదని, నేను నీలాగా ఉండలేకపోతున్నానని.. వాళ్లని అలా చూస్తుంటే ఏడుపు ఆగడం లేదు, సుమిత్ర ఎక్కడున్నా త్వరగా వస్తే బాగుండని బాధపడుతుంది పారిజాతం. ఎవరు మారినా నేను మారను.. దీప, బావ వెతుకుతున్నారు కదా.. చూద్దాం మమ్మీ ఎవరికి ముందు కనిపిస్తుందో అని అనుకుంటుంది జ్యోత్స్న.
ఇంటికి రమ్మని సుమిత్రని దీప చాలా బతిమలాడుతుంది. గత కొంతకాలంగా మీ ఆలోచనలో, మీ చేతల్లో మార్పులు వచ్చాయని అంటుంది దీప. పిల్లలు ఏదైనా తప్పు చేస్తే చెప్పాల్సిన మీరే ఇలా చేస్తే ఎలా చెప్పండి అని ప్రశ్నిస్తుంది దీప. నేనొక దారిని ఎంచుకున్నాను, నా దారిన నన్ను పోనివ్వమని చెబుతుంది సుమిత్ర. మీరు ఎక్కడికి పోవడానికి వీల్లేదని దీప అనగా.. ఆ మాట చెప్పడానికి నువ్వెవరు అని అడుగుతుంది సుమిత్ర. మా బావ, దశరథ గారు మీ కోసం ఊరంతా వెతుకుతున్నారని.. మిమ్మల్ని నేను ఇంటికి తీసుకెళ్తానని దీప అనగా.. అప్పుడు నువ్వు చూసేది నా శవాన్ని అంటుంది సుమిత్ర. ఆ మాటలతో దీప షాక్ అవుతుంది. నువ్వు ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినా, నేను కనిపించానని నా గురించి ఎవరికైనా చెప్పినా నేను చచ్చినంత ఒట్టని అంటుంది సుమిత్ర. భార్యాభర్తల మధ్య గొడవలు రావడం సహజమని.. ఇవన్నీ మీరు నాకు నేర్పించిన మాటలే, కానీ ఈరోజు మీరే మరిచిపోయారని దీప అంటుంది.
నేను అన్ని ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నానని సుమిత్ర అనగా.. అది మంచి నిర్ణయం కాదని దీప అంటుంది. అది చెప్పడానికి నువ్వెవరు? నీకు నాకు ఏ బంధం ఉందని నువ్వు నా కోసం వెతుకుతున్నావని సుమిత్ర అడగ్గా.. నువ్వు నా అమ్మవని చెబుతుంది దీప. ఆ మాటలు విన్న సుమిత్ర షాకవుతుంది. ఇంతలో రౌడీ వెనుక నుంచి దీపను కొట్టబోతుండగా సుమిత్ర అడ్డువెళ్తుంది. గట్టిగా దెబ్బ తగలడంతో సుమిత్ర కుప్పకూలిపోతుంది. అత్త, మావయ్య, తాతయ్యలు జ్యోత్స్నని ఎంత బాగా చూసుకున్నారు అలాంటి ఫ్యామిలీని ఎలా చూసుకోవాలని మనసులో రగిలిపోతాడు కార్తీక్. ఇంతలో కార్తీక్‌కి దీప ఫోన్ చేసి అర్జెంట్‌గా ఇంటికి రమ్మని చెబుతుంది. ఇంటికి వెళ్లి దీపపై రంకెలు వేస్తాడు కార్తీక్.
నువ్వు తప్పించి అందరూ ఆ ఇంటి దగ్గరే ఉన్నారని.. తాత కళ్లు తిరిగి పడిపోయాడు తెలుసా అని అనడంతో దీప షాక్ అవుతుంది. కోడలు ఏమైందో తెలియక ఆలోచించి ఆలోచించి బీపీ పెంచుకుని పడిపోయాడని.. జ్యోత్స్న, పారులు అక్కడే ఉన్నారని వాళ్ల వల్ల ఏ ఉపయోగం ఉండదని మండిపడతాడు కార్తీక్. అత్తకి ఏమైందో తెలియడం లేదు.. ఎందుకు అర్జెంట్‌గా రమ్మన్నావు? ఏం జరిగిందో చెప్పమని కార్తీక్ అడుగుతాడు. ఇంతలో శౌర్య వచ్చి అమ్మమ్మ ఇంటిలోనే ఉందని చెప్పడంతో కార్తీక్ షాక్ అవుతాడు. మంచంపై చూసేసరికి తలకి కట్టుతో సుమిత్ర కనిపిస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











