Karthika Deepam 2 October 18th: ఇంట్లో సుమిత్రను దాచిన కార్తీక్, దీప... బావపై జ్యోత్స్నలో అనుమానం

Photo Courtesy: JioHotstar

శివన్నారాయణ కళ్లు తెరిచి సుమిత్ర వచ్చిందా అని అడుగుతాడు. ఎవరికో కనిపించిందని వదిన తప్పకుండా వస్తుందని చెబుతుంది కాంచన. అత్తయ్య ఎక్కడున్నా వెతికి తీసుకొస్తానని కార్తీక్ తన తాతకి మాట ఇచ్చి బయల్దేరతాడు. భర్త అన్న మాటలే తలచుకుంటూ బాధపడుతున్న సుమిత్ర దగ్గరికి ఇద్దరు దొంగలు వచ్చి ఒంటి మీదున్న బంగారాన్ని ఇవ్వమని బెదిరిస్తారు. ఆమె మరో మాట మాట్లాడకుండా తిరిగి ఇచ్చేయడంతో ఇది బంగారమేనా అని దొంగలు అడుగుతారు. నాకు బంగారం ఇప్పుడు మట్టితో సమానమని సుమిత్ర అనడంతో.. మెడలో ఉన్న తాళి కూడా ఇవ్వమని అడుగుతారు. సుమిత్ర ఇవ్వనని అనడంతో బలవంతంగా లాగడానికి ప్రయత్నిస్తారు.. ఇంతలో దీప వచ్చి దొంగలని చితకబాదుతుంది.

ఇంటికి వచ్చేయమని సుమిత్రను దీప ఎంత బతిమలాడినా రాదు.. నన్ను రమ్మని చెప్పడానికి నువ్వెవరు అని సుమిత్ర ప్రశ్నించగా.. నువ్వు నా అమ్మ అని దీప చెబుతుంది. ఇంతలో రౌడీ వెనుక నుంచి దాడి చేస్తుండటంతో దీపకు అడ్డుగా నిల్చొంటుంది సుమిత్ర. దాంతో దెబ్బ తగిలి ఆమె కిందపడిపోతుంది. దశరథకి, శివన్నారాయణకి కాంచన గోరుముద్ధలు తినిపిస్తుండటంతో పారిజాతం ఎమోషనలై బయటికొచ్చి ఏడుస్తుంది. సింపతీ కోసం ఏడుస్తున్నావా? అని జ్యోత్స్న అడగ్గా.. నేను మనిషిని, నా భర్తకి అలా ఉంటే ఏడవకుండా ఎందుకుంటాను? అని మండిపడుతుంది. సుమిత్ర కోసం వెతుకుతున్న కార్తీక్‌ని అర్జెంట్‌గా ఇంటికి రమ్మని ఫోన్ చేస్తుంది దీప. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి అక్టోబర్ 18వ తేదీ 492వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 492 October 18th 2025 Here is full story

Photo Courtesy: JioHotstar

తన ఇంట్లో పడుకున్న సుమిత్రను చూసి కార్తీక్ షాక్ అవుతాడు. అత్త తలకి ఏమైంది? ఎక్కడ కనిపించింది? అని దీపను అడుగుతాడు కార్తీక్. దాంతో దీప దొంగల దగ్గర ఏం జరిగిందో చెబుతుంది. అత్తకి ఏమైందోనని అక్కడ తాత, మావయ్య తెగ బాధపడుతున్నారని ముందు వాళ్లకి కాల్ చేసి అత్త మనింట్లో సేఫ్‌గా ఉందని చెప్పాలని అంటాడు కార్తీక్. దాంతో కార్తీక్‌ను అడ్డుకుంటుంది దీప. నేను కనిపించినట్లు చెప్పినా, నన్ను ఇంటికి తీసుకెళ్లినా నేను ప్రాణాలతో ఉండనని నాతో అమ్మ చెప్పిందని అంటుంది. ఆ టైంలో ఆ దొంగ నన్ను కొట్టబోతే.. నన్ను కాపాడేందుకు అమ్మ అడ్డొచ్చిందని చెబుతుంది దీప.

నువ్వు ఈ విషయం చెబితే.. నా ప్రాణం పోయే వరకు అమ్మ నన్ను క్షమించదని, ఏం చేయాలన్నా అమ్మ ముందు స్పృహలోకి రావాలి? తనతో మాట్లాడాలి? ఏం జరిగిందో తెలుసుకోవాలని చెబుతుంది దీప. మా అమ్మనాన్నల మధ్య ఏం జరిగిందో మీకు తెలియదు కదా అని అంటుంది. తండ్రిని వదల్లేక.. ఇటు అత్తని వెతకలేక మావయ్య మధ్యలో నలిగిపోతున్నాడని... సుమిత్ర కనిపిస్తే చేతులు పట్టుకుని క్షమాపణలు చెప్పాలని ఏడుస్తున్నాడని చెబుతాడు. అయితే అత్త స్పృహలోకి వచ్చే వరకు మనం ఏం తెలియనట్లే ఉండాలని అంటాడు కార్తీక్. ముందు అమ్మతో మాట్లాడాలి.. తన మనసు మార్చి, అమ్మ సరేనన్న తర్వాత మనం చెప్పాలని లేదంటే ఎవరో ఒకరిని కోల్పోతామని అంటుంది దీప.

అంత వరకు రానివ్వనని, అందరూ నేను అత్తని వెతకడానికి వెళ్లానని అనుకుంటున్నారని.. వాళ్లు అలాగే అనుకోని, కానీ నా భయమంతా తాత గురించే, మళ్లీ ఆయన ఒత్తిడికి గురైతే హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదముందని డాక్టర్లు చెప్పారు.. అత్త స్పృహలోకి వచ్చే వరకు మనకి అన్ని తెలిసినా మౌనంగా ఉండాల్సిందే అంటాడు కార్తీక్. మరోవైపు భార్య గురించి ఆలోచిస్తూ దశరథ బాధపడతాడు. ఇంతలో శివన్నారాయణ దగ్గుతూ బయటికి వస్తాడు. రెస్ట్ తీసుకోమంటే ఎందుకు వచ్చావని మండిపడతాడు దశరథ. సుమిత్ర జాడ ఏమైనా తెలిసిందా? అని కొడుకుని అడుగుతాడు శివన్నారాయణ. ఇంకా ఏం తెలియలేదని బాధపడతాడు దశరథ.

సుమిత్రను నేనే అర్ధం చేసుకోలేకపోయానని, మనవాళ్లు మనకి నచ్చని పనిచేస్తే కోప్పడతామని, అది ప్రేమే కాదా? కానీ నీ కోడలికి అది అర్ధం కాలేదని.. అంత తేలిగ్గా బంధాన్ని తెంపుకుని వెళ్లిపోయిందని అంటాడు దశరథ. వద్దు అనుకునే రెండక్షరాల వెనుక ఎంతో భవిష్యత్, గడిచిపోయిన జీవితం ఉన్నాయని చెబుతాడు దశరథ. పోలీస్ కంప్లయంట్ ఇస్తే మంచిదని జ్యోత్స్న అనడంతో శివన్నారాయణ, దశరథలు సీరియస్ అవుతారు. మనలో మనం కొట్టుకున్నది చాలు... కార్తీక్, దీప వెతుకుతున్నారు కదా? సుమిత్ర వాళ్ల కంటపడాలని కోరుకుంటున్నానని అంటాడు శివన్నారాయణ.

సుమిత్ర దగ్గర కార్తీక్, దీప కూర్చొని ఉండగా కాంచనని తీసుకుని శ్రీధర్ వస్తాడు. అమ్మ ఇక్కడే ఉందన్న విషయం ఎవరికీ తెలియకూడదంటే ఆయనని బయటే ఆపాలని చెబుతాడు కార్తీక్. భార్యాభర్తలిద్దరూ బయటికి వెళ్లి శ్రీధర్‌ను అడ్డుకుంటారు. అత్త కనిపించలేదని తల్లిదండ్రులకు చెబుతాడు కార్తీక్. తాతయ్య గారికి ఎలా ఉందని దీప అడగ్గా.. బాగానే ఉన్నారని చెబుతాడు శ్రీధర్. వీడు అత్తను తీసుకొస్తానని చెప్పాడు కదా ఆ నమ్మకంతోనే ఎదురుచూస్తున్నారని అంటాడు. శ్రీధర్ లోపలికి వెళ్తుండగా.. పొద్దున్న నుంచి ఇక్కడే ఉన్నావ్.. చెల్లెమ్మకి, చిన్నమ్మకి అత్త గురించి తెలియక కంగారు పడతారని నువ్వు ఇంటికి వెళ్లమని చెబుతాడు కార్తీక్. మీ చిన్నమ్మ మీద ప్రేమతో నన్ను వెళ్లిపోమంటున్నావా? లేక నా ఇంట్లోకి నువ్వెందుకులే రావడమని పొమ్మంటున్నావా? అని నిలదీస్తాడు శ్రీధర్.

మనకి నచ్చనివాళ్లు మన గురించి ఎలాగూ తప్పుగానే మాట్లాడుకుంటారని, మన గురించి మనం కూడా తప్పుగా ఎందుకు మాట్లాడుకుంటామని అంటాడు కార్తీక్. సుమిత్ర గురించి నువ్వు కంగారుపడకు, నేను మా ఏరియాలో కూడా వెతుకుతానని చెబుతాడు శ్రీధర్. ఈ రాత్రి సుమిత్ర కనుక ఇంటికి రాకపోతే చెల్లెమ్మని వెతికేపనిని అప్పగిస్తానని అంటాడు. అత్త గురించి వెతకొద్దు.. తనకేం కాదు, ఎలా వెళ్లిందో? అలాగే తిరిగొస్తుందని చెబుతాడు కార్తీక్. అన్నయ్య పరిస్ధితి దారుణంగా ఉంది.. వదిన ఎక్కడుందో? ఎలా ఉందో? అని కాంచన కంగారుపడుతుంది.

మనసు విరిగిపోయిన మనిషికి మనసు స్థిమితంగా ఉండదని అంటుంది దీప. అయినా వదినకి, అన్నయ్యకి ఏం జరిగిందో నీకెలా తెలుసు అని అడుగుతుంది కాంచన. ఎందుకంటే నేను సుమిత్రమ్మ గారితో మాట్లాడాను, చూశానని దీప చెప్పడంతో కాంచన షాక్ అవుతుంది. వదిన ఎక్కడుందని అడగ్గా... ఆమెను తీసుకెళ్లి చూపిస్తుంది దీప. వదినకి ఏమైంది? ఆ కట్టు? ఆ టాబ్లెట్ ఏంటీ? అని కాంచన కంగారు పడుతోంది. మరోవైపు.. సుమిత్ర గురించి దశరథ, శివన్నారాయణ గొడవపడతారు. సుమిత్రతో మాట్లాడమని ఎన్నిసార్లు చెప్పినా దశరథ విన్నాడా? నోటికొచ్చినట్లు మాట్లాడి జ్యోత్స్న ఈ గొడవని పెంచిందని అంటాడు. మీ అమ్మ నీ కళ్ల ముందే వెళ్లిపోతుంటే ఏం చేస్తున్నావ్ అని మండిపడతాడు.

ఇంతలో కార్తీక్‌కి జ్యోత్స్న ఫోన్ చేసి సుమిత్ర గురించి అడుగుతుంది. అత్త క్షేమంగా ఉందని చెప్పడంతో శివన్నారాయణ, దశరథ సంతోషిస్తారు. బావ నా దగ్గర ఏదో నిజం దాస్తున్నాడని జ్యోత్స్నకి అనుమానం వస్తుంది. రేపు నేను డ్యూటీకి రానని, నువ్వే డ్యూటీకి వెళ్లమని చెబుతుంది దీప. సుమిత్ర కనిపించడం లేదని శ్రీధర్.. కావేరి, స్వప్న, దాసు, కాశీలకు చెబుతాడు. దీప తప్పు ఒప్పుకుంటే కుటుంబాలు కలిసిపోతాయి.. ఏ సమస్యలు ఉండవని ఆరోజే చెప్పానని, నా కొడుకు నా మాట వినలేదని అంటాడు. ఊరంతా వెతికినా సుమిత్ర దొరకలేదని... శివన్నారాయణ గారు గుండె పట్టుకుని పడిపోయారని చెప్పడంతో అంతా షాక్ అవుతారు. ప్రస్తుతానికి ఆయన బాగానే ఉన్నారని కానీ కోడలు గురించి బాధపడుతున్నాడని చెబుతాడు. దాంతో శ్రీధర్, దాస్, కాశీలు సుమిత్రను వెతకడానికి వెళ్తారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X