Karthika Deepam 2 October 20th: సుమిత్ర నిర్ణయంతో దీప కంటతడి.... కార్తీక్‌పై జ్యోత్న్న, పారుల అనుమానం

Photo Courtesy: JioHotstar

అత్త కోసం ఊరంతా వెతుకుతున్న కార్తీక్‌కి దీప ఫోన్ చేసి అర్జెంట్‌గా ఇంటికి రమ్మని చెబుతుంది. దాంతో కంగారుగా ఇంటికొచ్చిన కార్తీక్... ఏం జరిగింది? ఎందుకు నన్ను అర్జెంట్‌గా ఇంటికి రమ్మన్నావు? అని అడుగుతాడు. దాంతో కార్తీక్‌కు బెడ్‌రూంలో నిద్రపోతున్న సుమిత్రను చూపిస్తుంది. తన ఇంట్లో సుమిత్రను చూసి షాక్ అవుతాడు కార్తీక్. అత్తకి ఏమైంది? తలకి ఆ కట్టు ఏంటీ? అని దీపని అడగ్గా.. ఆమె రౌడీలతో జరిగిన గొడవ ఇతర వివరాలు చెబుతుంది. వెంటనే అత్త క్షేమంగా ఉందన్న విషయం తాతకి, మావయ్యకి చెప్పాలని వారిద్దరూ కంగారు పడుతున్నారని అంటాడు కార్తీక్.

దాంతో దీప తన భర్తని ఆపి... ఇంటికి తీసుకెళ్తే అమ్మ చచ్చిపోతానని నాతో ఒట్టు వేయించుకుందని, ఈ విషయం ఇంట్లో చెప్పొద్దని బతిమలాడుతుంది. దానికి కార్తీక్ సరేనని అంటాడు. ఇంతలో శ్రీధర్- కాంచన ఇంటికి రావడంతో సుమిత్ర ఇక్కడే ఉందన్న విషయం ఎక్కడ బయటపడుతుందోనని భయపడ్డ కార్తీక్ - దీపలు... శ్రీధర్‌ను బయటి నుంచే పంపించేస్తారు. కాంచనకి సుమిత్రను చూపించడంతో ఆమె ఎంతో సంతోషిస్తుంది. ఆమెకు కూడా జరిగినదంతా చెబుతుంది దీప. మరోవైపు సుమిత్ర కోసం దశరథ, శివన్నారాయణలు బాధపుడుతుంటారు. సుమిత్ర ఇల్లు వదిలి వెళ్లిపోయిన విషయాన్ని శ్రీధర్ చెప్పడంతో దాస్, కావేరి, కాశీ, స్వప్నలు షాక్ అవుతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి అక్టోబర్ 20వ తేదీ 493వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 493 October 20th 2025 Here is full story

Photo Courtesy: JioHotstar

సుమిత్ర కళ్లు తెరిచి చూసేసరికి నేను ఎక్కడ ఉన్నాను? ఇది ఎవరిల్లు? నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? అని ఆలోచిస్తుంటుంది. అటు ఇటు తిరిగి చూసి ఇది కాంచన వదిన ఇల్లని... నేను ఇక్కడ ఉన్న విషయం ఈపాటికే అందరికీ చెప్పేసి ఉంటుందని అనుకుంటుంది సుమిత్ర. అర్జెంట్‌గా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని బయటికి వెళ్తుండగా... సుమిత్రను శౌర్య ఆపుతుంది. వెళ్లిపోతున్నావా అమ్మమ్మ అని అడగ్గా... నీ కోసం మళ్లీ వస్తానని చెబుతుంది సుమిత్ర. ఇంతలో గుమ్మం దగ్గర దీప ఎదురై.... మీరు మీ ఇంటికి వెళ్లాలని అంటుంది. అది నాకు చావుతో సమానమని నీతో చెప్పాను కదా అని అంటుంది సుమిత్ర.

నాకు తెలిసి ఈపాటికే నేను ఇక్కడే ఉన్న విషయం.. మా ఇంట్లో చెప్పే ఉంటావ్? నా కోసం వాళ్లు బయల్దేరే ఉంటారని అంటుంది సుమిత్ర. నన్ను ప్రాణాలతో వదిలేయమని ప్రాధేయపడుతుంది. మీరు మా ఇంట్లో ఉన్న విషయం మాకు తప్ప ఎవరికీ తెలియదని దీప అనగా.. నువ్వు అబద్ధం చెబుతున్నావని అంటుంది సుమిత్ర. ఇంతలో కాంచన వచ్చి దీప నిజమే చెబుతుందని, నువ్వు మా ఇంట్లో ఉన్న విషయం మేం ఎవ్వరికీ చెప్పలేదని అంటుంది. మీ అంతట మీరే చెప్పే వరకు మేం కూడా చెప్పమని అంటుంది దీప. నా అంతట నేనే నా ఇంటికి వెళ్లేలా మీరు చేస్తారా? అని సుమిత్ర అడుగుతుంది. కార్తీక్ ఎక్కడ అని అడగ్గా.. బావ కూడా ఎవ్వరికీ చెప్పడని దీప అంటుంది.

మీరంతా నా కోసం ఇంత కష్టపడొద్దు.. నా దారిన నేను వెళ్లిపోతానని చెబుతుంది సుమిత్ర. నా ఒంట్లో ఓపిక లేదు, మాట రావడం కూడా కష్టంగానే ఉంది? అయినాసరే నేనిక్కడ ఉండలేనని అంటుంది సుమిత్ర. ఈరోజు నా తలకి తగలాల్సిన దెబ్బ మీ తలకి తగిలిందని, ఈ రోజు మీ తలకి తగలాల్సిన దెబ్బ నా తలకి తగిలిందని గుర్తు చేస్తుంది దీప. పరిస్ధితులు మారాయి కానీ, మనుషులు మారలేదని అంటుంది. ఆ రోజు మీరు నన్ను వదిలేశారా? ఆసుపత్రిలో చేర్పించి మీ ఇంటికి తీసుకెళ్లారని గుర్తుచేస్తుంది దీప. ఈరోజు నేను కూడా అదే పని చేస్తున్నానని చెబుతుంది. మీకు పూర్తిగా నయం అయ్యే వరకు మా ఇంట్లోనే ఉండండి... మీరు ఇక్కడే ఉన్న విషయాన్ని ఎవరికీ చెప్పమని అంటుంది దీప.

నువ్వు నా కోసం ఎందుకు వెతుకుతున్నావ్? నీకు నాకు ఏంటీ సంబంధం అని అడిగితే నువ్వేం అన్నావ్? నువ్వు మా అమ్మవి అన్నావ్... నువ్వు నా కూతురివా? అని అడుగుతుంది సుమిత్ర. దాంతో అవును అని సమాధానం ఇస్తుంది దీప. ఒకప్పుడు తల్లిలా ఆదరించి, అన్నం పెట్టి, నువ్వు నా కూతురివి అన్నారు కదా? నా మనసులో అదే అభిప్రాయం ఉందని చెబుతుంది దీప. నా మనసులో అయితే ఎలాంటి అభిప్రాయం లేదని, ఇన్ని రోజులు నా మీద నాకే క్లారిటీ లేదని... నేను నా వాళ్లకి అడ్డమే తప్పించి అవసరం లేదని బాధపడుతుంది సుమిత్ర. నీ కోసం నాన్న, అన్నయ్య ఎంతో బాధపడుతున్నారని కాంచన సర్దిచెప్పాలని చూస్తుంది. నా భర్తకి నా మీద నమ్మకం పోయింది అన్నప్పుడు నాకు ఎవరి మీద నమ్మకం ఉంటుందని సుమిత్ర నిలదీస్తుంది.

మీరు వెళ్లారంటే నా మీద ఒట్టేనని అంటుంది దీప. ఎందుకు అడ్డు పడుతున్నావ్? నువ్వంటే నాకు ఇష్టం లేదు, నీతో నేను మాట్లాడనని చెబుతుంది సుమిత్ర. నన్ను వద్దు అనుకున్నవాళ్లని బాధపెట్టకూడదని దూరంగా పోవాలనుకున్నానని, నా మీద ఎందుకు నీకు మమకారం అని అంటుంది. సుమిత్ర బయటికి వెళ్లబోతూ కిందపడబోతుండగా దీప పట్టుకుంటుంది. మీ ఆరోగ్యం బాలేదు, ఇప్పుడు మీకు విశ్రాంతి అవసరమని చెబుతుంది దీప. పూర్తిగా కోలుకునే వరకు ఇక్కడే ఉండమని గదిలోకి తీసుకెళ్తుంది. మరోవైపు... సోఫాలో నిద్రపోతున్న దశరథ ఉలిక్కిపడి నిద్రలేస్తాడు. దాంతో అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు. మీ అత్తయ్య గురించి ఏమైనా తెలిసిందా? అని కార్తీక్‌ని అడుగుతాడు దశరథ. అత్త క్షేమంగా ఉన్న విషయాన్ని తాతయ్య, మావయ్యలకి చెప్పలేకపోతున్నానని కార్తీక్ బాధపడతాడు.

మా మమ్మీని నేను వెతుకుతానంటే వద్దు అన్నారు? నీ మీద ఉన్న నమ్మకం మా మీద లేదని అంటుంది జ్యోత్స్న. బాధలో ఉన్నవారికి కావాల్సింది ఓదార్పు అని దెబ్బిపొడుపులు కాదని అంటాడు కార్తీక్. అయితే సుమిత్రను ఇంత వరకు ఎందుకు తీసుకురాలేదని అడుగుతుంది పారు. దీప తన ముఖం చూపించలేక ఇంటికి రావడం లేదు? బాగానే పోయిందన్న ఆనందంతోనా? అని జ్యోత్స్న నిలదీస్తుంది. దీప అలాంటి మనిషే అయితే సుమిత్ర కనిపించడం లేదని తెలియగానే ప్రశాంతంగా వంట చేసుకుని తినేదని అంటాడు దశరథ. దీప మనం అర్ధం చేసుకోలేనంత ఉన్నత స్థాయి మనిషి అని చెబుతాడు. అవసరం లేని వాళ్లని ఎందుకు పొగుడుతున్నావు? ఎవరి బాధకు ఎవరు కారణమో అందరికీ తెలుసులేనని నానామాటలు అంటుంది పారు. దాంతో పారిజాతంపై శివన్నారాయణ మండిపడతాడు.

నా తల్లి మాటిస్తే నేను ఇచ్చినట్లే... ఏదో ఒక రోజు అత్తని నేనే ఇంటికి తీసుకొస్తానని చెబుతాడు కార్తీక్. గొడవలన్నీ మరిచిపోయి మనమంతా పండగ చేసుకునే రోజు త్వరలోనే వస్తుందని అంటాడు. ఈ కుటుంబం ఎలా ఉండాలని కలలు కన్నావో? అలాగే ఉంటుందని దానిని ఎవ్వరూ మార్చలేరని చెబుతాడు. కార్తీక్ మాటలతో ధైర్యంగానే ఉన్నా... సుమిత్ర ఏం అఘాయిత్యం చేసుకుంటుందోనని భయంగా ఉందని చెబుతాడు దశరథ. భార్య అంటే మనలో సగమని, మనలో సగం మన నుంచి వెళ్లిపోతే కానీ దాని విలువ తెలియదని అంటాడు శివన్నారాయణ.

టిఫిన్ తినకుండా మారాం చేస్తున్న సుమిత్రపై కాంచన, దీపలు మండిపడతారు. భార్యకి ఉన్నతమైన స్థానం భర్త మనసులో ఉంటుంది... అది ఉన్నంత సేపు, మిగతావన్నీ వాటి తర్వాతే అనిపిస్తుంది, నీతో మాట్లాడటం, కలిసుండటం కంటే ఆరోజు బుల్లెట్ తగిలినప్పుడు ప్రాణం పోయినా బాగుండేదని మీ అన్నయ్య అన్నారని గుర్తుచేస్తుంది సుమిత్ర. ఆ ఒక్క మాట చాలని, భార్య స్థానంలో నేనింక లేనని.. ఊపిరి ఆగిపోతేనే నేను చనిపోయినట్లు కాదు, తను నమ్మిన మనిషే వద్దు అనుకున్నప్పుడు అది చావుతో సమానమేనని అంటుంది సుమిత్ర. ఆ బుల్లెట్ నాకు తగిలి నేను చనిపోయినా బాగుండు అని తర్వాత అనిపించిందని చెబుతుంది.

ఆ మాటలతో కాంచన మండిపడుతుంది. నేను నా భర్తని దూరం పెట్టానని, దానికి తగ్గ కారణాలు దానికి ఉన్నాయి.. అంతకుమించిన పరిష్కారం నా దగ్గర లేదు, ఇంకెవ్వరి దగ్గరా లేదని అంటుంది. కానీ నీ సమస్య నా లాంటిది కాదని, బంగారం లాంటి సంసారమని.. పెళ్లికి ఎదిగిన కూతురు, మంచి మర్యాద, గౌరవం ఉన్న అత్తారిల్లు, తండ్రిలా చూసుకునే మామగారు.. ఇంతకుమించి ఓ ఆడదానికేం కావాలని అడుగుతుంది కాంచన. వీటిని పొందే అర్హత నేను కోల్పోయానని, నా భర్తే నాతో మాట్లాడటానికి ఇబ్బంది పడుతున్నాడు... అన్ని తెలిసి అక్కడ ఉండకూడదు, ఎవరినీ బాధపెట్టలేను... నన్ను ఆయన అంత మాట అన్న తర్వాత ఉదయం లేచి ఆయన నా ముఖం చూడగలరా? ఆయన ఎదురుపడినా నేను చూడగలనా? నా వల్ల ఎవరు బాధపడకూడదు? నేను ఆ ఇంట్లో ఉండకూడదని వచ్చేశానని చెబుతుంది సుమిత్ర. దీప కంట్లో పడకపోయుంటే, ఎవరి కంటా పడని దూరం వెళ్లిపోయేదానిని అని చెబుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X