Karthika Deepam 2 October 22nd: దశరథ కాళ్లపై పడ్డ జ్యోత్స్న.. కార్తీక్‌, దీపలపై శివన్నారాయణలో అనుమానం

Photo Courtesy: JioHotstar

సుమిత్రకు ఎలాగోలా నచ్చజెప్పి టిఫిన్ పెట్టి, టాబ్లెట్స్ వేస్తుంది దీప. సుమిత్ర వదినను మనం ఎంతకాలం దాయగలమని కాంచన అడగటంతో బావ వచ్చాక ఏదో ఒక నిర్ణయం తీసుకుందామని చెబుతుంది. నువ్వు అందరికీ దూరం అయిపోతున్నావని, ఇకనైనా మారమని జ్యోత్స్నకి చెబుతుంది పారిజాతం. మమ్మీ ఎక్కడ ఉందో కార్తీక్, దీపలకు తెలుసని .. వాళ్లింటికి వెళితే అన్ని విషయాలు తెలుస్తాయని చెబుతుంది జ్యోత్స్న. ఉదయాన్నే తన ఇంటికి వచ్చిన జ్యోత్స్నని చూసిన కాంచన, దీపలు షాక్ అవుతారు. అక్కడ ఆడుకుంటున్న శౌర్య దగ్గరికి వెళ్లిన జ్యోత్స్న అమ్మమ్మ ఇక్కడికి వచ్చిందా అని అడగటంతో ఆ చిన్నారి వచ్చిందని చెబుతుంది.

లోపలికి వెళ్లి దీపను పెంచిన తల్లి ఫోటోను చూపిస్తుంది. మా మమ్మీ ఇక్కడే ఉందని నిలదీయగా.. దీప, కాంచనలు ఆమెకు క్లాస్ పీకుతారు. జ్యోత్స్న వెళ్లిపోయే సమయంలో దగ్గు వినిపించడంతో ఏం జరిగిందో? ఎవరు లోపల ఉన్నారో చూడటానికి వెళ్లగా అక్కడ జ్యోత్స్నకి ఎవరూ కనిపించరు. దాంతో దీప, కాంచనలు ఊపిరి పీల్చుకుంటారు. సుమిత్రను వెతికేందుకు తానే వెళ్తానని దశరథ చెబుతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి అక్టోబర్ 22వ తేదీ 495వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 495 October 22nd 2025 Here is full story

Photo Courtesy: JioHotstar

అత్త తన జీవితంలో వినకూడని మాటని వినేసిందని, అప్పటికే పశ్చాత్తాపంతో కుమిలిపోతోన్న అత్తకి ఆ మాట సుత్తితో కొట్టినట్లుగా అయ్యిందని అంటాడు కార్తీక్. కుమిలిపోతున్న ఈ బాధ నుంచి తను బయటికి రావడానికి కొంత సమయం తీసుకోవాలని అనుకుందని, అందుకే వెళ్లిపోయిందని చెబుతాడు. ఇదంతా మా మమ్మీ నీతో చెప్పినట్లే మాట్లాడుతున్నావని జ్యోత్స్న నిలదీస్తుంది. నేను అత్త చేతుల్లోనే పెరిగానని, ఆవిడ మనస్తత్వం ఏంటో నాకు తెలియదా అంటాడు కార్తీక్. సుమిత్ర ఎక్కడ ఉందో ఎలా తెలుస్తుందని అడుగుతాడు శివన్నారాయణ. దానికి కొంత టైం పడుతుందని, దీనిని మాత్రం బలంగా నమ్మాలని.. తనకి కొంత టైం కావాలని .. గాయపడ్డ మనసుకి నయం కావాలి కదా అని అంటాడు కార్తీక్. మనం ఎంత వెతికినా అత్త దొరకదని, ఒకవేళ దొరికినా అత్త రాను అంటుందని.. అత్త ఏ క్షణమైనా ఇంటికి రావొచ్చని నువ్వు ఇంట్లోనే ఉండాలని చెబుతాడు కార్తీక్.

కార్తీక్ చెప్పింది నిజమే కానీ.. ఏదో జరగబోతోందని భయంగా ఉందని అంటాడు దశరథ. దాంతో కొడుకుని శివన్నారాయణ ఓదారుస్తాడు. దాంతో ఎమోషనలైన పారిజాతం ఏడుస్తూ పక్కకి వెళ్లిపోతుంది. దశరథను చూస్తుంటే దాసే గుర్తొస్తున్నాడని, వాడు కన్నకొడుకైతే.. వీడు పెంచిన కొడుకని అంటుంది పారు. పారిజాతాన్ని చావు తప్పించి దేవుడు కూడా మార్చలేడని, కానీ నాలో కూడా కొన్ని ఎమోషన్స్ ఉన్నాయని చెబుతుంది పారు. నువ్వేదో తెలుసుకోవాలని వెళ్లావు కదా ఏమైందని అడుగుతుంది. మమ్మీ దీప దగ్గర ఉందని డౌట్ వచ్చిందని, వాళ్లింటిలో మొత్తం వెతికానని మమ్మీ అక్కడ లేదని అంటుంది జ్యోత్స్న. ఎక్కడో ఏదో లింక్ మిస్ అవుతున్నాను.. బావ కొత్త గేమ్ స్టార్ట్ చేశాడని అంటుంది. మనకి తెలియకుండానే మనల్ని కూడా దానిలోకి లాగాడని, నేను అనుకున్నది నిజమైతే మాత్రం నాకొక అవకాశం దొరికినట్లేనని అంటుంది జ్యోత్స్న.

అమ్మమ్మ మనింట్లోనే ఉందని జ్యోత్స్నకి ఎందుకు చెప్పొద్దు అన్నావని దీపని నిలదీస్తుంది శౌర్య. అమ్మమ్మని బయటికెందుకు వెళ్లనివ్వలేదు? అమ్మమ్మ మనింట్లోనే ఎందుకు ఉండాలి? అని అడుగుతుంది. పెద్దవాళ్లు ఏమైనా చెబితే చిన్నవాళ్లు వినాలి.. ఎందుకు? ఏంటీ? అని అడగకూడదని శౌర్యకి క్లాస్ పీకుతుంది దీప. అయితే ఈసారి ఎవరొచ్చినా చెప్పేయొచ్చా అని శౌర్య అంటుంది. అమ్మమ్మ దాగుడుమూతలు ఆడుతుందని ఆమె ఎక్కడ ఉందో చెబితే ఔట్ అయిపోతుందని అంటుంది దీప. అమ్మమ్మ తలకి దెబ్బ ఎలా తగిలింది? అమ్మమ్మ ఎక్కడ ఉందో జోకి ఎందుకు చెప్పకూడదని ప్రశ్నల వర్షం కురిపిస్తుంది శౌర్య. అమ్మమ్మ అందరితో దాగుడుమూతలు ఆడుతోంది.. ఎవరు చూసినా దొరికిపోయినట్లేనని అంటుంది దీప. అమ్మమ్మ ముందులా లేదని .. వేరేలా కనిపిస్తుందని చెబుతుంది శౌర్య.

సుమిత్ర ఎక్కడుందో తెలియసిందా అని శ్రీధర్‌ని అడుగుతుంది కావేరి. మీరు ఎక్కడ వెతకొద్దని కార్తీక్ చెప్పాడని శ్రీధర్ చెప్పడంతో.. సుమిత్ర ఎక్కడుందో కార్తీక్‌కి తెలుసా అని ప్రశ్నిస్తుంది కావేరి. అలా అనుకోవచ్చు.. లేదంటే నేను ఇబ్బంది పడతానని ఆ బాధ్యత వాడు తీసుకోవచ్చని అంటాడు శ్రీధర్. ఇంతలో కాశీ వచ్చి.. నేను వారం రోజుల్లో వేరే ఇల్లు చూసుకుందామని అనుకుంటున్నానని చెబుతాడు. ఆ మాటలతో అందరూ షాక్ అవుతారు. ఇక్కడుంది మేమిద్దరమే కదా? మీరు మాతో పాటే ఉండొచ్చు కదా? అని శ్రీధర్ బతిమలాడతాడు. అల్లుడికి, ఇల్లరికం అల్లుడికి తేడా ఉంటుంది కదా అని కాశీ చెబుతాడు. ఇక్కడ ఎక్కువ రోజులు ఉండలేనని అంటాడు. నా ఇంట్లో ఫ్రీగా ఉండమంటే.. రెంట్ తీసుకుని డబ్బులు కట్టుకుంటానని అంటాడేంటీ? అని మండిపడతాడు శ్రీధర్.

మనందరం కలిసే ఉందామని శ్రీధర్ చెప్పగా.. అయితే మీరే మా ఇంటికి వచ్చి ఉండమని కాశీ అంటాడు. పోనీ ఈ ఇల్లు మా అమ్మాయి పేరు మీద రాయమంటారా? అని అడుగుతాడు శ్రీధర్. దానికి కాశీ వద్దు అంటాడు. నా ఇల్లు రాసిస్తానని మా మావయ్య అని ఉంటే.. మీ ఇష్టం మావయ్య అనే వాడిని అని చెబుతాడు శ్రీధర్. కూతురికి మంచి మొగుడు దొరకడం ఎలా కష్టమో.. మంచి ఇల్లు దొరకడం కూడా అంతే కష్టమని చెబుతాడు శ్రీధర్. అయితే ఈ కాలనీలోనే ఇల్లు చూస్తానని దగ్గరిలోనే ఉండమని అంటాడు శ్రీధర్. దానికి కాశీ సరేనని చెబుతాడు. కాశీ ఎందుకు వెళ్లిపోతానని అంటున్నాడు? నువ్వు ఏమైనా అన్నావా? అని స్వప్నని అడుగుతాడు కాశీ. అల్లుడి గారి ప్రవర్తనలో ఏదో తేడా కనిపిస్తోందని, జాబ్ వస్తే మనుషులు మారిపోతారని ఆయన అప్పట్లోనే అన్నాడు కదా అని అంటాడు శ్రీధర్.

శివన్నారాయణకి జ్యూస్ తీసుకుని వచ్చిన జ్యోత్స్నని పెద్దాయన లోపలికి వెళ్లిపోమంటాడు. దాంతో జ్యోత్స్న సీరియస్ అవుతుంది. నేనెందుకు లోపలికి వెళ్లాలని నిలదీస్తుంది. నువ్వు ఎవరినీ లోపల ఉండనీయవు కదా? నిన్ను చూస్తే ఇంకా బాధగా ఉందని అంటాడు దశరథ. కార్తీక్ మాటలకి మేం కొంతసేపైనా ధైర్యంగా ఉంటామని, నేనే లోపలికి వెళ్లిపోతానని అంటాడు. నీ మాటలను బట్టి.. మమ్మీ ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి కారణం నేనే అన్నట్లుగా ఉందని మండిపడుతుంది జ్యోత్స్న. నువ్వే కారణం.. దగ్గరుండి మరి సుమిత్రను బయటికి సాగనంపావు, నువ్వు ఆపలేదు, కనీసం మాకు చెప్పలేదని రగిలిపోతాడు దశరథ. నేను తప్పు చేశాను.. కావాలంటే నీ కాళ్లు పట్టుకుంటానని జ్యోత్స్న అంటుంది. అసలు మమ్మీ వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకోవడానికి కారణం నువ్వే కదా? మరి నీదెంత తప్పు? నువ్వు అన్న మాటల వల్లే మమ్మీ వెళ్లిపోయిందని మండిపడుతుంది జ్యోత్స్న.

అసలు ఆ మాట అన్నది నువ్వే కదా? మనుషుల్ని రెచ్చగొట్టి రెండు ముక్కలు చేశావని శివన్నారాయణ మండిపడతాడు. మీరు టెన్షన్ పడితే గుండెపోటు వస్తుందని డాక్టర్ గారు చెప్పారని పారు కంగారు పడుతుంది. దాంతో జ్యోత్స్నని లోపలికి వెళ్లిపోమ్మని చెబుతుంది పారు. మా మమ్మీ డాడీ గొడవ పడటానికి కారణమైన దీప, వెతుకుతానని టైంపాస్ చేస్తున్న బావ కూడా బాగానే ఉన్నాడని అంటుంది జ్యోత్స్న. కార్తీక్ టైం పాస్ చేయడని, వాడు నీలా కాదని అంటాడు శివన్నారాయణ. నిన్న ఉన్న టెన్షన్ ఈరోజు బావలో లేదని.. నార్మల్‌గా వచ్చి మీకు బూస్టింగ్ ఇచ్చి వెళ్లిపోయాడని చెబుతుంది జ్యోత్స్న. నిన్నటి నుంచి దీప ఈ ఇంటికి రావడం లేదని మీకు అనుమానం రావడం లేదా? దీప, బావ అసలు మమ్మీని వెతకడం లేదని అంటుంది. నా కొడుకు.. కోడలిని తిట్టడానికి కారణం నువ్వే నువ్వే అంటున్న శివన్నారాయణకి ఒక్కసారిగా ఛాతిలో పెయిన్ వస్తుంది. దాంతో నువ్వు లోపలికి పో.. బయటికి రావొద్దని మండిపడుతాడు దశరథ. అమ్మ ఎక్కడుందో కార్తీక్ మాత్రం చెప్పడని అంటుంది జ్యోత్స్న. జ్యోత్స్న అన్నదానిలో కొంత నిజం ఉన్నట్లుగానే ఉందని శివన్నారాయణకి అనుమానం వస్తుంది. సుమిత్ర ఎక్కడుందో కార్తీక్‌కి తెలుసా? అని అనుకుంటాడు.

స్పృహలోకి వచ్చిన సుమిత్ర దగ్గరికి వచ్చి నారింజ మిఠాయి ఇచ్చి తినమని ఇస్తుంది శౌర్య. నేను నిన్ను కాపాడనని చెప్పడంతో ఎలా కాపాడావు అని అడుగుతుంది సుమిత్ర. జో మనింటికి వచ్చి నిన్ను అడిగిందని, కానీ నేను చెప్పలేదు.. చెబితే నువ్వు దొరికిపోతావని అంటుంది శౌర్య. నువ్వు ఇప్పుడు దాగుడుమూతలు ఆడుతున్నావని మా అమ్మ చెప్పిందని, అందుకే నీ గురించి ఎవ్వరికీ చెప్పనని అంటుంది. ఈ అమ్మమ్మ ఎవ్వరికీ దొరకదని అంటుంది. ఇంతలో కార్తీక్ వచ్చి శౌర్యని బయటికి తీసుకెళ్తాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X