Karthika Deepam 2 October 23rd: కార్తీక్, దీపలకి షాకిచ్చిన శివన్నారాయణ.. జ్యోత్స్న చెంప పగలగొట్టిన పారిజాతం

Photo Courtesy: JioHotstar

అత్త ఎక్కడున్నా క్షేమంగా ఉంటుందని తిరిగి వచ్చేస్తుందని మరోసారి ధైర్యం చెబుతాడు కార్తీక్. బావ కొత్త గేమ్ స్టార్ట్ చేశాడని, మనల్ని కూడా అందులో లాగాడని దీనిని నేను ఉపయోగించుకుంటానని పారుతో చెబుతుంది జ్యోత్స్న. అమ్మమ్మ ఇక్కడే ఉన్నట్లు జోకి ఎందుకు చెప్పొద్దు అన్నావని దీపని అడుగుతుంది శౌర్య. అమ్మమ్మ దాగుడుమూతలు ఆడుతోందని, నువ్వు చెప్పేస్తే దొరికిపోతుందని అంటుంది దీప. దాంతో నేను ఎవ్వరికీ చెప్పనని లోపలికి వెళ్లిన శౌర్య.. సుమిత్రకు నారింజ మిఠాయి తినిపిస్తుంది.

శివన్నారాయణ దగ్గరికి జ్యోత్స్న వచ్చి.. టాబ్లెట్స్, జ్యూస్ ఇస్తుంది జ్యోత్స్న. నీ ముఖం చూస్తేనే చిరాకుగా ఉందని కూతురిపై మండిపడతాడు దశరథ. నేను తప్పించి అందరూ మీకు ఇష్టమేనని రగిలిపోతుంది జ్యోత్స్న. మమ్మీ గురించి బావ సరిగా పట్టించుకోవడం లేదని, దీప ఇంటికి రావడం లేదని శివన్నారాయణకు అనుమానం వచ్చేలా మాట్లాడుతుంది. దాంతో పెద్దాయన ఆలోచనలో పడతాడు. నేను, స్వప్న వేరే ఇంటికి వెళ్లిపోతామని కాశీ చెప్పడంతో శ్రీధర్, స్వప్న, కావేరిలు షాక్ అవుతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి అక్టోబర్ 23వ తేదీ 496వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 496 October 23rd 2025 Here is full story

Photo Courtesy: JioHotstar

సుమిత్ర అత్తని ఎక్కువ రోజులు ఇక్కడ దాచలేమని దీప, కాంచనలతో అంటాడు కార్తీక్. ఇంట్లో నుంచి వచ్చేసిన వాళ్లు వంద అంటారు.. నేను ఆ ఇంటికి వెళ్లను, ఆ ఇంటితో సంబంధం లేదని చెబుతారు. అంతమాత్రం చేత వాళ్ల మాటలను పట్టించుకుంటే ఎలా అని ప్రశ్నిస్తాడు కార్తీక్. సుమిత్రమ్మ గారి ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చాయని.. ఒక్కసారి ఆమెతో మాట్లాడితే నీకు తెలుస్తుందని దీప, అనసూయలు చెబుతారు. ఇంతకీ మా నాన్న ఎలా ఉన్నారు? టాబ్లెట్స్ వేసుకుంటున్నారా? అని కాంచన అడుగుతుంది.

దాంతో శివన్నారాయణకి కార్తీక్ ఫోన్ చేస్తాడు. సుమిత్ర ఎలా ఉంది? ఎక్కడుంది? ఏమైనా ఆచూకీ దొరికిందా? లేదా? అని అడుగుతాడు పెద్దాయన. తను ఎక్కడున్నా క్షేమంగానే ఉంటుందని చెప్పాను కదా? అంటాడు కార్తీక్. తను వచ్చే వరకు మేం క్షేమంగా ఉండేలా కనిపించడం లేదని బాధపడతాడు శివన్నారాయణ. ఈ వయసులో నా లాంటి వాళ్లు కోరుకునేది ఏం ఉంటుంది.. మనవరాలికి పెళ్లి చేయాలి, కొడుకు కోడలు క్షేమంగా ఉండాలి అంతే అంటాడు పెద్దాయన. నా మీద నాకే నమ్మకం పోతోందని చెబుతాడు శివన్నారాయణ.

నువ్వు అలా మాట్లాడొద్దని కాంచన బాధపడుతుంది. పిల్లల జీవితాలు సరిగా లేని ఏ తండ్రయినా ఇలాగే మాట్లాడతాడని, డబ్బులు లేకపోవడం వల్లే కష్టాలు అనుకునే వాడిని, కానీ కష్టాలకు డబ్బులకు ఏమాత్రం సంబంధం లేదని చెబుతాడు శివన్నారాయణ. నువ్వంటే నాలాగే మొండిదానివి.. కానీ మీ అన్నయ్య మనలాంటి వాడు కాదు.. ఒకప్పుడు తల్లి కోసం ఎలా బాధపడ్డాడో, ఇప్పుడు భార్య కోసం అలాగే బాధపడుతున్నాడని కంటతడి పెడతాడు శివన్నారాయణ. అన్నయ్యకి నువ్వే ధైర్యం చెప్పాలని కాంచన చెబుతుంది. మీ వదిన ఎక్కడుందో నీకు తెలుసా? అని శివన్నారాయణ ప్రశ్నిస్తాడు. మేం బాధపడకూడదని కార్తీక్ ధైర్యం చెబుతున్నాడని.. ఈ బాధ మమ్మల్ని చంపేసేలా లోపు సుమిత్ర ఎక్కడుందో తెలిస్తే బాగుండని అంటాడు శివన్నారాయణ.

ఇంతలో శౌర్య వచ్చి నేను అమ్మమ్మ రూమ్‌లో పడుకోనా? నానమ్మ రూమ్‌లో పడుకోనా అని అడుగుతుంది. ఆ మాటలు విన్న శివన్నారాయణ షాక్ అవుతాడు. శౌర్య అమ్మమ్మ అంటుంది.. ఎవరి గురించి అని అడుగుతాడు శివన్నారాయణ. అది అమ్మమ్మ అంటుంది.. నానమ్మ అంటుందని కవర్ చేస్తుంది కాంచన. తాతకి అనుమానం వచ్చిందా? అని కార్తీక్ అడగ్గా.. అలా జరిగితే మా నాన్న ముఖం మీద అడిగేస్తాడని చెబుతుంది కాంచన. నేనొకసారి అత్తతో మాట్లాడతానని కార్తీక్ వెళ్తాడు.

మీ మమ్మీ పేరు మీద ఉదయాన్నే గుడిలో పూజ చేయిద్దామని జ్యోత్స్నతో అంటుంది పారు. నా ముఖం చూడటమే డాడీకి, తాతకి నచ్చడం లేదు కదా, నా పూజలు ఎలా నచ్చుతాయి.. పైగా నీ భర్త మీద ఇన్నాళ్లూ లేని ప్రేమ వచ్చిందని అంటుంది జ్యోత్స్న. నీ ప్రేమ వేరు, పగ వేరు... మనుషుల్ని సాధించడం కాదు నా పగ, నేను అనుకున్నది సాధించడం అంటుంది పారిజాతం. అయితే నువ్వు రెండ్రోజులు సైలెంట్‌గా ఉండాలని అంటుంది జ్యోత్స్న. మీ అమ్మ వెళ్లిపోయి ఇంటిల్లిపాది బాధపడుతుంటే సైలెంట్‌గా ఉండమంటావ్ అని మండిపడుతుంది పారు. పోయింది.. పోయింది అంటారేంటీ పోని అని జ్యోత్స్న కఠినంగా మాట్లాడటంతో పారు షాక్ అవుతుంది. మా మమ్మీ వెళ్లిపోవడం నాకు మైనస్ కాదు.. డాడీ, తాత బాధలో ఉంటారు కాబట్టి సీఈవో పోస్ట్ గురించి కానీ, కంపెనీ వ్యవహారాల గురించి కానీ అస్సలు పట్టించుకోరని అంటుంది జ్యోత్స్న. ఆ మాటలు విన్న పారిజాతం లాగిపెట్టి మనవరాలిని కోడుతుంది.

ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి రాదా? తప్పు చేయ్.. కానీ దానికి కారణం నువ్వు కాకూడదని అంటుంది. మీ అమ్మ వెళ్లిపోతుంటే నువ్వు ఆపకుండా తప్పు చేశావ్.. కార్తీక్ గాడు హీరో అవుతున్నాడు, నువ్వు ఏదైనా చేయ్ మీ అమ్మని ఇంటికి తీసుకురా అని తేల్చి చెబుతుంది పారిజాతం. వాడు తీసుకొస్తే వాడు హీరో అవుతాడని.. నువ్వు అసలైన కూతురివి కాదని నువ్వే బయటపడేలా ఉన్నావని అంటుంది. తాతకి సారీ చెప్పి మీ అమ్మని తీసుకొచ్చే వరకు ఇంట్లోకి రానని శపథం చేయమని చెబుతుంది పారిజాతం. నన్ను ఇక్కడి నుంచి పంపించేయమని కార్తీక్‌ను అడుగుతుంది సుమిత్ర.. మరి మేం అంతా ఎక్కడికి వెళ్లాలని అంటాడు కార్తీక్. నీకేం కావాలో చెప్పు.. చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెబుతాడు కార్తీక్. నాకేం తెలియడం లేదు.. మనస్పూర్తిగా ఉండలేకపోతున్నానని బాధపడుతుంది సుమిత్ర.

నీ కోసం తాత సోఫాలో ఎదురుచూస్తున్నాడని, మావయ్య తనలో తాను కుమిలిపోతున్నాడు.. నువ్వు మా దగ్గరే ఉన్నట్లు వాళ్లకి చెప్పలేనని బాధపడతాడు కార్తీక్. నిన్ను తిట్టి తప్పు చేశానని నీ కంటే ఎక్కువ బాధపడుతున్నాడని చెబుతాడు కార్తీక్. ఇంతలో సుమిత్ర తలనొప్పితో బాధపడుతూ కుప్పకూలిపోతుంది. ఉదయాన్నే తన ఇంటికి శివన్నారాయణ రావడంతో దీప షాక్ అవుతుంది. దీప ఎంత ఆపుతున్నా వినిపించుకోకుండా శివన్నారాయణ ఇల్లంతా వెతుకుతాడు. ఇంతలో కార్తీక్ వచ్చి నాతో ఏదైనా పని ఉంటే నాకు ఫోన్ చేయొచ్చు కదా అని అంటాడు. ఆపరా నీ నాటకాలు అంటూ పెద్దాయన సీరియస్ అవుతాడు. ఇంటికొచ్చాక సార్ ఏంటీ.. తాత అని పిలవొచ్చు కదా అని అంటాడు శివన్నారాయణ. సుమిత్ర ఎక్కడున్నా క్షేమంగా ఉంటుందని అన్నావ్.. నిజంగా సుమిత్ర దొరుకుతుందా అని అడుగుతాడు శివన్నారాయణ. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X