Karthika Deepam 2 October 25th: నిజం తెలుసుకున్న శివన్నారాయణ... శ్రీధర్‌కి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన కాశీ

Photo Courtesy: JioHotstar

సుమిత్రను వెతుక్కుంటూ కార్తీక్ ఇంటికి వస్తాడు శివన్నారాయణ. పెద్దాయనను చూడగానే దీప షాక్ అవుతుంది.. కార్తీక్‌ను వెతుకుతూ సుమిత్ర ఉన్న గది వైపుకు వస్తుండగా కార్తీక్, దీప ఆపుతారు. నిన్ను చూసి వెళ్దామని వచ్చానని కాంచనతో శివన్నారాయణ అంటాడు. ఆయనను చూడగానే అందరూ కంగారు పడతారు. దాంతో కార్తీక్‌తో పర్సనల్‌గా మాట్లాడాలని బయటికి తీసుకెళ్తాడు శివన్నారాయణ. సుమిత్ర ఎక్కడుందో నీకు తెలుసని నా అనుమానం అనడంతో కార్తీక్ షాక్ అవుతాడు.

ఇంతలో శౌర్య రావడంతో ఇంట్లో ఉన్న వాళ్లందరికీ చాక్లెట్స్ ఇవ్వమని ఒక్కొక్కరి పేరు అడుగుతాడు. శౌర్య అమ్మమ్మ అనబోతుండగా పాపను స్కూల్‌కి పంపేస్తాడు కార్తీక్. నిజంగానే నీకు సుమిత్ర ఎక్కడుందో తెలియదా అంటూ కార్తీక్ మీద చెయ్యేత్తుతాడు శివన్నారాయణ. సుమిత్ర మీ ఇంట్లోనే ఉందని నాకు తెలుసు.. నేను చూశానని చెప్పడంతో కార్తీక్, దీప షాక్ అవుతారు. నా కోడలిని మీ ఇంట్లోనే పెట్టుకుని మా ప్రాణాలతో ఆడుకున్నారంటూ కార్తీక్, దీప, కాంచనలపై మండిపడతాడు శివన్నారాయణ. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి అక్టోబర్ 25వ తేదీ 498వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 498 October 25th 2025 Here is full story

Photo Courtesy: JioHotstar

నేను మంచానపడితే నాకు తిండి పెట్టి పోసిన ఊపిరినీ తీసేంత వరకు నువ్వు నిద్రపోవని కాంచనపై సీరియస్ అవుతాడు శివన్నారాయణ. ఎవరిని సాధించాలని మీ వదినని నీ ఇంట్లో దాచిపెట్టావని నిలదీస్తాడు. అమ్మకి ఏం సంబంధం లేదని కార్తీక్ ఎంత చెబుతున్నా శివన్నారాయణ వినిపించుకోడు. అమ్మమ్మ దగ్గర పడుకోనా? నానమ్మ దగ్గర పడుకోనా? అని శౌర్య అన్నప్పుడే నాకు అనుమానం వచ్చిందని అంటాడు శివన్నారాయణ. మీరు సుమిత్రను ఎందుకు ఇంట్లో పెట్టుకుంటారు? ఎందుకు అబద్ధాలు ఆడతారని అనుకున్నానని చెబుతాడు. అందుకే మీ ఇంటికి వచ్చి నా కోడల్ని చూశాను.. ఇక మిమ్మల్ని ఎప్పుడూ క్షమించనని నా కోడల్ని నేను తీసుకెళ్లిపోతానని అంటాడు. కార్తీక్ అడ్డుకోగా.. నా మీద ఒట్టేనని అనడంతో అందరూ షాక్ అవుతారు.

నువ్వు అత్తని తీసుకెళితే నీకు అదే చివరి చూపు అవుతుందని, ఆ ఇంట్లో అడుగుపెట్టిన క్షణమే ఆమె ప్రాణాలతో ఉండదని కార్తీక్ చెప్పడంతో శివన్నారాయణ షాక్ అవుతాడు. దాంతో దీప జరిగినదంతా చెబుతుంది. ఆవిడని మార్చి ఏదో రకంగా మళ్లీ మీ ఇంటికి తీసుకురావాలన్నదే మా తాపత్రయమని, అందుకే జ్యోత్స్నకి కూడా మేం నిజం చెప్పలేదని అంటుంది. సుమిత్రమ్మ గారు ఎక్కడున్నారో కూడా తెలిసి కూడా మీతో చెప్పలేకపోతున్నందుకు మేం కూడా అంతే బాధపడుతున్నామని చెబుతుంది. అన్నయ్య వదిన కోసం ఎంత కుమిలిపోతున్నాడో తెలుసని, కానీ ఇక్కడ వదిన పరిస్ధితి అంతకన్నా దారుణంగా ఉందని బాధపడుతుంది కాంచన. నన్నూ ఎవరూ గుర్తుపట్టని చోటికి వెళ్లిపోతానని అంటుందని చెబుతుంది. వదిన ఇక్కడుందని చెప్పకపోతే అన్నయ్య కోలుకోడు.. చెబితే వదిన బతకను అంటుందని బాధపడుతుంది కాంచన.

మాది స్వార్ధం అన్నావ్ కదా.. మీ అందరినీ కాపాడుకోవాలన్న స్వార్ధం అంటుంది కాంచన. చెయ్యని తప్పులకు నా కొడుకు, కోడలు మాటలు పడుతున్నారని బాధపడుతుంది. జరిగింది నాకు తెలియక అన్నానని.. ఒక్కసారి నా స్థానంలో ఉండి ఆలోచించండి అని శివన్నారాయణ అంటాడు. ఓ పక్క కొడుకు, ఇప్పుడు నేను కోడల్ని చూడలేను.. వాడితో సుమిత్ర ఇక్కడే ఉందని చెప్పలేనని బాధపడతాడు శివన్నారాయణ. మన ఫ్యామిలీకి ఏం కాదని.. నేనే అత్తని మార్చి ఇంటికి తీసుకొస్తానని కార్తీక్ మాటిస్తాడు. నేనొకసారి సుమిత్రను చూడొచ్చా అని శివన్నారాయణ అడగ్గా.. తను ఇక్కడున్న విషయం నీకు తెలిసిపోయిందని అత్తకు తెలిస్తే, మా ఇంట్లో కూడా ఉండదని అంటాడు కార్తీక్. నువ్వు నాతో పాటు వచ్చి దశరథను కూడా మార్చాలని చెబుతాడు శివన్నారాయణ. కోపంలో మీ అందరినీ నానామాటలు అన్నానని క్షమించమని అంటాడు.

మీ నాన్నగారు మనల్ని అర్ధం చేసుకుంటారు, రేపు ఈ విషయం ఎవరికి తెలిసినా మనల్ని ఎవ్వరూ తప్పుబట్టరని అంటుంది అనసూయ. తప్పుబట్టినా ఏం పర్లేదని, మనకు కావాల్సింది వాళ్లంతా బాగుండటమే అంటుంది దీప. వాళ్లంటే నీకెందుకు అంత ప్రేమ అని అనసూయ అడుగుతుంది. ఉదయాన్నే ఆఫీస్‌కి వెళ్తున్న అల్లుడిని చూసి శ్రీధర్ సంతోషిస్తాడు. ఈ కాలనీలో ఇల్లు ఉందో లేదో కనుక్కుని చెబుతానని అన్నారు కదా? కనుక్కున్నారా అని కాశీ అడుగుతాడు. రాత్రే కదా చెప్పింది, అప్పుడే ఇల్లు రెడీ అవుతుందా అని శ్రీధర్ కౌంటర్ వేస్తాడు. బైక్ చెడిపోవడంతో తాను కారులో డ్రాప్ చేస్తానని శ్రీధర్ చెప్పినా కాశీ కోపంగా వెళ్లిపోతాడు.

టిఫిన్ సరిగా తినకపోవడంతో సుమిత్రపై కోప్పడుతుంది దీప. నా ఆరోగ్యం బాగానే ఉంది కానీ, మనసే బాలేదని అంటుంది సుమిత్ర. సమస్యల్ని దూరం చేసుకోవాలి కానీ మనుషుల్ని కాదని అంటుంది దీప. నీ భర్త అంటే నీకు ఇష్టం కదా అని అడుగుతుంది సుమిత్ర. నువ్వు అతనికి దూరంగా పోతేనే అతను సంతోషంగా ఉంటాడని నీకు తెలిస్తే వెళ్లిపోతావా? నీ కోసం నువ్వే ఆలోచించుకుంటావా? అని ప్రశ్నిస్తుంది. వెళ్లిపోతానని దీప ఆన్సర్ ఇవ్వగా.. నేను కూదా అదే చేశానని అంటుంది సుమిత్ర. నీతో కలిసుండటం కంటే ఆరోజు నా గుండెకు బుల్లెట్ తగిలి నేను చనిపోయినా బాగుండేదని నా భర్త అన్నప్పుడు ఆ క్షణమే నేను చనిపోయినట్లు లెక్క అంటుంది సుమిత్ర. నేను బాగా ఆలోచించి ఆయన సంతోషం కోరుకునే మనిషిగా ఉండాలనుకున్నానని చెబుతుంది. అందుకే వచ్చేశానని, దీప కంట్లో పడకపోయుంటే నా ప్రయాణం వేరేలా ఉండేదని అంటుంది సుమిత్ర.

భార్యాభర్తల గురించి చెప్పే అర్హత నాకు లేదని, ఎందుకంటే నా సంసారమే సరిగా లేదని అంటుంది కాంచన. నా భర్త మంచివాడా? చెడ్డవాడా? అనుకుంటే నేను పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు, నన్ను మోసం చేశాడని.. కానీ నీ సమస్య వేరని చెబుతుంది. మా అన్నయ్య లాంటి మంచి భర్తకి, నీలాంటి మంచి భార్య దొరికిందని అంటుంది. అన్నయ్య గురించి నువ్వెలా ఆలోచిస్తున్నావో? అక్కడ నీ గురించి అన్నయ్య కూడా అలాగే ఆలోచిస్తున్నాడని చెబుతుంది కాంచన. ఒక మనిషే మన జీవితం అనుకుంటే ఆ మనిషితోనే బతకాలని మనం లేకపోతే ఆ మనిషి పడే చిన్నపాటి కష్టం కూడా మనం భరించలేమని అంటుంది. మీరు అంతగా ప్రేమించిన భర్త.. ఈరోజు మీరు లేక భోజనం కూడా సరిగా చేయడం లేదని చెబుతుంది దీప.

దశరథ గారిని పక్కనపెడితే మీరు ఆయన గురించి ఆలోచించకుండా ఉండగలుగుతున్నారా అని ప్రశ్నిస్తుంది దీప. ఏడాది కాపురానికే మా బావను ఎంతో ప్రేమిస్తున్నాను, అలాంటిది ఎన్నో వసంతాలు కలిసి ప్రయాణం చేశారు, ఎంతో గొప్ప జీవితాన్ని చూశారు.. మరి దశరథ గారిని మీరు ఎంతగా ప్రేమించి ఉంటారని గుర్తుచేస్తుంది దీప. ఆ కంట్లో కన్నీరు తుడవటానికి మీ చేయి వెళ్లకూడదా? అని ప్రశ్నిస్తుంది. ఆ రోజు నా భర్త బదులు ఆ బుల్లెట్ నాకు తగలాల్సింది అంటుంది సుమిత్ర. నిన్న జ్యోత్స్న వచ్చింది చూడకుండా ఆపారు... ఈరోజు మావయ్య గారు వచ్చారు చూడకుండా ఆపారని సుమిత్ర అనడంతో కాంచన, దీప షాక్ అవుతారు. తొందరలోనే ఎవరికీ ఏ బాధ లేకుండా చేస్తానని అంటుంది సుమిత్ర. ఎలాగైనా ఈ సమస్యకు పరిష్కారం చూడాలని దీప, కాంచనలు అనుకుంటారు.

ఆఫీస్‌కు వెళ్లకుండా కాశీ రోడ్డుపై తన ఫ్రెండ్‌తో మాట్లాడుతూ శ్రీధర్‌కి కనిపిస్తాడు. దగ్గరికి వెళ్లకుండా ఫోన్ చేయగా నేను ఆఫీసులో ఉన్నానని అబద్ధం చెబుతాడు కాశీ. నాకు జాబ్ రావడం అబద్ధమని తెలిస్తే ఘోరంగా తిడతాడని భయపడతాడు కాశీ. నేనే అనుకుంటే నువ్వు నా కంటే జాదూలా ఉన్నావని నీ సంగతి చెబుతానని అనుకుంటాడు శ్రీధర్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X