Karthika Deepam 2 October 27th: దశరథని తిట్టేసిన శివన్నారాయణ.. జ్యోత్స్న, పారులో కొత్త అనుమానాలు
Photo Courtesy: JioHotstar
కార్తీక్ ఇంట్లో సుమిత్ర జాడ దొరికిపోవడం, ఆమెను దాచాలని కాంచన కుటుంబం ప్రయత్నించడంతో శివన్నారాయణలో కోపం కట్టలు తెంచుకుంటుంది. నేను మీకు ఏ అన్యాయం చేశానని, ఏ పగ సాధించాలని నా కోడల్ని మీ ఇంట్లో దాచి పెట్టారని నిలదీస్తాడు శివన్నారాయణ. మిమ్మల్ని నేను వదిలేసుకున్నానని.. వెలి వేశానని, కానీ మనసు మార్చుకున్నానని చెబుతాడు. మీరు చేసిన తప్పుకు ఈ జన్మలో మిమ్మల్ని క్షమించనని, నా కోడల్ని ఇప్పుడే ఇంటికి తీసుకెళ్లిపోతానని అంటాడు శివన్నారాయణ. కార్తీక్ ఎదురెళ్లబోగా.. నా మీద ఒట్టే అనడంతో అంతా భయపడిపోతారు.
నువ్వు అత్తని తీసుకెళితే ఆమెను చూడటం అదే చివరిసారి అవుతుందని కార్తీక్ చెప్పడంతో పెద్దాయన షాక్ తింటాడు. దాంతో దీప అసలేం జరిగిందో చెబుతుంది. మీ కుటుంబం బాగుండాలని చెయ్యని తప్పుకు నా కొడుకు, కోడలు మాటలు పడుతున్నారని కాంచన తన తండ్రికి చెబుతుంది. నిజం తెలుసుకున్న శివన్నారాయణ ... మీ అందరినీ నానామాటలు అన్నానని క్షమాపణలు చెబుతాడు శివన్నారాయణ. ఉదయాన్నే ఆఫీస్‌కి వెళ్తూ ఇంట్లో కాశీ హడావుడి చేస్తాడు. ఇప్పటికైనా నువ్వు ఆ ఇంటికి వెళ్లాలని కార్తీక్, దీప, కాంచనలు సుమిత్రకు నచ్చజెబుతారు. ఆఫీస్‌కి వెళ్లాలని తొందరపడ్డ కాశీ.. రోడ్డు మీద ఫ్రెండ్‌తో కబుర్లు చెబుతూ శ్రీధర్‌కు దొరికిపోతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి అక్టోబర్ 27వ తేదీ 499వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

శివన్నారాయణను తీసుకుని ఇంటికి వస్తాడు కార్తీక్. అత్త మా ఇంట్లో ఉన్న విషయం ఎవ్వరికీ చెప్పొద్దని తాతతో అంటాడు. సుమిత్ర ఫోటో చూస్తూ కుమిలిపోతున్న దశరథను పారిజాతం ఓదారుస్తుంది. ఫోటో చూస్తూ కూర్చుంటే సుమిత్ర రాదని వెళ్లి వెతకాలని అంటుంది. డాడీని ఏం అనొద్దని మమ్మీ కోసం నేను వెళ్తానని చెబుతుంది జ్యోత్స్న.. ఇంతలో శివన్నారాయణ వచ్చి అవసరం లేదని అంటాడు శివన్నారాయణ. దాంతో అంతా షాక్ అవుతారు. సుమిత్ర ఎక్కుడుందో తెలిసిందా? అని దశరథ అడుగుతాడు. పేపర్‌లో ప్రకటన వేయిస్తానని, తప్పు నాదేనని.. నా కంటికి కనపడకపోతే బాగుండు అన్నాను కదా అంటాడు. అదే మాట నేను నిన్ను అంటాను.. నువ్వు కూడా వెళ్లిపోతావా? అని ప్రశ్నిస్తాడు శివన్నారాయణ. నిన్ను వదిలేసి నేను ఎక్కడికి పోతానని అంటాడు దశరథ.
పోని సుమిత్ర వెళ్లకుండా ఉండుంటే మాట్లాడే వాడివా? తిట్టకుండా ఉండేవాడివా? అంటూ నిలదీస్తాడు. తాత ఏదో చేసేలా ఉన్నాడని కార్తీక్ ఆపుతుండగా.. నువ్వు డ్రైవర్‌వి, డ్రైవర్‌లా ఉండు అంటాడు శివన్నారాయణ. నీ మీద గౌరవం లేని నీ భార్య గురించి నువ్వెందుకురా ఆలోచిస్తావని ప్రశ్నిస్తాడు. ఆ మాటలతో పారిజాతం, జ్యోత్స్నలు షాక్ అవుతారు. వద్దు అనుకుని వెళ్లిపోయిన భార్య గురించి దశరథ ఎందుకు బాధపడాలి అని ప్రశ్నిస్తాడు. సుమిత్ర వచ్చినప్పుడే వస్తుంది.. తన కోసం వెతకాల్సిన అవసరం ఏం లేదని చెబుతాడు. సంసారంలో గొడవలు జరుగుతాయి.. మాటా మాటా అనకుండా ఉంటామా? అని మండిపడతాడు శివన్నారాయణ. డోస్ కొంచెం ఎక్కువైందని, తగ్గించమని తాతతో చెబుతాడు కార్తీక్. వాళ్లిద్దరూ గుసగుసలు చెప్పుకుంటూ ఉండటంతో పారిజాతానికి అనుమానం వస్తుంది.
బావ రోజు ఇదే చెబుతున్నాడని జ్యోత్స్న అనగా.. మరో రెండ్రోజులైనా ఇదే చెబుతాడని, దొరక్కపోతే వాడు మాత్రం ఏం చేస్తాడని అంటాడు పెద్దాయన. ఆ మాటలతో షాకైన దశరథ.. సుమిత్ర ఎక్కడున్నా క్షేమంగానే ఉంటుందని, ఆ ధైర్యాన్ని చంపేయొద్దని చెబుతాడు. మాట, వస్తువు అనేవి వదిలేముందు ఆలోచించాలని.. సుమిత్రను క్షమించు, మాట్లాడు అని చెప్పాను నా మాట విన్నావా? కోడలితో మాట్లాడావా? నువ్వు పొమ్మన్నావ్.. తను వెళ్లిపోయిందని మండిపడతాడు శివన్నారాయణ. తప్పు నాదే .. సుమిత్రకు క్షమాపణ చెప్పాలి, మరోసారి తనని బాధపెట్టనని చెప్పాలని అంటాడు. రేపు మీ పెళ్లి రోజట కదా... సుమిత్ర లేదు కాబట్టి సెలబ్రెట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదని, నిన్ను విష్ చేయాల్సిన అవసరం కూడా లేదని చెబుతాడు శివన్నారాయణ.
దీప లేదు కాబట్టి మన రెస్టారెంట్ నుంచే టిఫిన్లు, భోజనం తెప్పించమని కార్తీక్‌కి చెబుతాడు శివన్నారాయణ. ఏదైనా దూరమైతేనే గానీ దాని విలువ తెలియదని కొడుకుని నానామాటలు అంటాడు. ఈసారి నీ విలువ సుమిత్రకు తెలుస్తుందని చెబుతాడు. నిన్నటి వరకు కోడలి కోసం బెంగ పెట్టుకున్న మనిషి.. ఇప్పుడు పోతేపోనీ అంటాడేంటీ? అని పారిజాతాన్ని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. తాత, కార్తీక్ ఎక్కడికి వెళ్లారు? మమ్మీని కలిశారా? అని అడుగుతుంది. ఈ ఇంట్లో జరిగేవన్నీ చిత్ర విచిత్రంగా ఉన్నాయని పారిజాతం అంటుంది. మమ్మీ ఎక్కడుందో తాతకి, కార్తీక్‌కి తెలుసని జ్యోత్స్నకి అనుమానం వస్తుంది.
ఆఫీస్ నుంచి వచ్చిన కాశీకి బత్తాయి జ్యూస్ ఇచ్చి నువ్వు జాబ్ చేస్తుంటే నేను స్ట్రెస్ ఫీల్ అవుతున్నానని అంటాడు శ్రీధర్. నేనొక ఫోటో చూశానని అప్పటి నుంచి నా మెంటల్ స్ట్రెస్ తగ్గడం లేదని చెప్పడంతో ఆ ఫోటో నాకు కూడా చూపించమని చెబుతాడు కాశీ. ఉదయం ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నప్పుడు తీసిన ఫోటో కావడంతో కాశీ షాక్ అవుతాడు. నేను నీతో ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు నీ వెనుకే కారులో ఉన్నానని చెబుతాడు శ్రీధర్. నువ్వు పనిచేస్తున్న కంపెనీకి వెళ్లి అడిగితే అక్కడ కాశీ అన్న పేరుతో ఎవరూ లేరని అంటాడు. కాశీ ఏదో చెప్పబోతుండగా.. ఏంట్రా మామయ్య అంటూ సీరియస్ అవుతాడు శ్రీధర్. ఇంతలో స్వప్న రావడంతో ఇద్దరూ సైలెంట్ అవుతారు.
కార్తీక్, శివన్నారాయణలు మాట్లాడుకుంటూ ఉండగా.. అంత గట్టిగా ఎందుకు మాట్లాడావని కార్తీక్ నిలదీస్తాడు. నా మాటలతో వాడిలోని ప్రేమను బయటికి తీసుకురావాలని అనుకున్నానని చెబుతాడు శివన్నారాయణ. ఇంట్లో జరిగే అనర్ధాలకు కారణం నువ్వేనని కార్తీక్ అనడంతో పెద్దాయన షాక్ అవుతాడు. మా నాన్న మమ్మల్ని మోసం చేస్తే నా తల్లికి భరోసా ఇచ్చావా? అమ్మను చాలా అపురూపంగా ప్రేమించావట, కొడుకు మీదున్న ప్రేమ కూతురి మీద ఎందుకు లేదని ప్రశ్నిస్తాడు కార్తీక్. నీ కూతురు నీ గుమ్మం తొక్కినప్పుడు కూడా నువ్వు పట్టించుకోలేదు.. ఇదంతా నీ కంటికి కనిపించలేదు, మావయ్య కంటికి కనిపించింది. రెండు కుటుంబాల్ని కలపాలని మావయ్య చాలా ప్రయత్నించాడు. అత్త లేనిపోని అనుమానాలతో దానిని చెడగొట్టింది. ఇద్దరి మధ్య గొడవ ఇక్కడే మొదలైందని చెబుతాడు కార్తీక్.
రేపు వాడి పెళ్లి రోజు కాబట్టి.. దరరథను సుమిత్రను కలపడానికి నా దగ్గర ప్లాన్ ఉందని కార్తీక్‌తో చెబుతాడు శివన్నారాయణ. అనసూయ తెచ్చిన బొమ్మకి పేరు పెట్టమని దీపతో శౌర్య గొడవ పడుతుంది. ఇంతలో కార్తీక్ వచ్చి నీకు తమ్ముడంటే ఇష్టమా? చెల్లి అంటే ఇష్టమా? అని అడుగుతాడు. నాకు చెల్లెలు కావాలని మురిసిపోతుంది శౌర్య. తాతయ్యకి నిజం తెలిసిన తర్వాత నిన్ను ఇంటికి తీసుకెళ్లారు కదా? అక్కడ వాతావరణం ఎలా ఉందని కార్తీక్‌ని అడుగుతుంది దీప. అత్తని, మావయ్యని కలపడానికి తాత ప్లాన్ చేశాడని దీపకి చెబుతాడు కార్తీక్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Click it and Unblock the Notifications