Karthika Deepam 2 October 29th: దీపని అరెస్ట్ చేయించిన జ్యోత్స్న... దశరథ బాధని కళ్లారా చూసిన సుమిత్ర

Photo Courtesy: JioHotstar

మీ అమ్మని వెతికి మీ నాన్న, తాతల దగ్గర మంచి మార్కులు కొట్టేయమని జ్యోత్స్నకి చెబుతుంది పారిజాతం. మమ్మీ ఎక్కడుందో బావకి తెలుసని, తాత కూడా కొత్తగా మాట్లాడుతున్నాడని జ్యోత్స్నకి అనుమానం వస్తుంది. లేట్ చేస్తే కార్తీక్ సీఈవో అవుతాడని, దీప ఈ ఇంటికి దేవత అవుతుందని .. మా అమ్మని నేనే వెతికి తీసుకొస్తానని చెబుతుంది జ్యోత్స్న. ఉదయాన్నే దశరథ ఒంటరిగా బయల్దేరడంతో కార్తీక్‌‌ని తోడుగా పంపిస్తాడు శివన్నారాయణ. తమ ప్లాన్ వర్కవుట్ కావడంతో తాత మనవళ్లు సైగలు చేసుకోవడంతో పారిజాతానికి అనుమానం వస్తుంది.

కాశీ జాబ్ లేకపోయినా ఉద్యోగం చేస్తున్నట్లు నటించడంతో శ్రీధర్‌ రగిలిపోతూ అల్లుడిని నిలదీస్తాడు. నాకు జాబ్ లేకపోతే అందరూ సలహాలు ఇచ్చారని అందుకే జాబ్ వచ్చిందని అబ్ధం చెప్పానని అంటాడు కాశీ. స్వప్నకి మోసం చేసేవాళ్లని చీరాకని అంటుండగా నిజం చెప్పొద్దని శ్రీధర్ కాళ్లు పట్టుకుంటాడు కాశీ. అది చూసిన స్వప్న షాక్ అవుతుంది. సుమిత్ర కనిపించకపోవడంతో దీప ఇంటికి పోలీసులతో వెళ్తుంది జ్యోత్స్న. దీప మా మమ్మీని కిడ్నాప్ చేసిందని, నేను వచ్చేలోగా మా మమ్మీని మాయం చేసిందని పోలీసులకు చెబుతుంది జ్యోత్స్న. పెళ్లి రోజు కావడంతో గుడికి వెళ్లిన సుమిత్రకు దశరథ, కార్తీక్ కనిపించడంతో షాక్ అవుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి అక్టోబర్ 29వ తేదీ 501వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే? ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి అక్టోబర్ 29వ తేదీ 501వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 501 October 29th 2025 Here is full story

Photo Courtesy: JioHotstar

గుడిలో దశరథను చూసిన సుమిత్ర పక్కకు వెళ్లి దాక్కుంటుంది. ఆమె జడలో నుంచి పూలు జారిపడిపోవడంతో వాటిని చూసిన దశరథ పక్కనే పెడతాడు. మా అత్తయ్య, మావయ్య పేరు మీద అర్చన చేయించమని కార్తీక్ సుమిత్ర, దశరథల పేర్లు చెప్పడంతో ఇంతకుముందే ఈ పేర్లతో ఒకరు అర్చన చేయించారని పంతులుగారు చెప్పడంతో కార్తీక్, దశరథ షాక్ అవుతారు. పేర్లను పోలిన పేర్లు ఉంటాయని కార్తీక్ చెప్పడంతో.. నన్నే వద్దు అనుకున్న మనిషికి పెళ్లి రోజు ఎందుకు గుర్తుంటుంది, అర్చ ఎందుకు చేయిస్తుందని దశరథ అనడంతో సుమిత్ర బాధపడుతుంది. కార్తీక్ బొట్టు పెట్టబోతుండగా అది కింద పడిపోవడంతో సుమిత్ర పక్కనే ఉంచిన బొట్టుని పెట్టుకుంటాడు దశరథ. వారిద్దరూ వెళ్లిపోయిన తర్వాత భర్త అక్కడ పెట్టిన పూలు పెట్టుకుంటుంది సుమిత్ర.

దీప ఇంట్లో సుమిత్ర కనిపించకపోవడంతో జ్యోత్స్న సీరియస్ అవుతుంది. మా మమ్మీని ఎక్కడ దాచావు? మర్యాదగా చెప్పమంటూ రగిలిపోతుంది. కళ్ల ముందు వెళ్లిపోతున్న తల్లిని వదిలేసిన తల్లిని వదిలేసి ఇప్పుడు ఎలా దొరుకుతుందని అనుకుంటున్నావు అంటూ కౌంటర్ ఇస్తుంది దీప. మా మమ్మీ ఎక్కడుందో చెప్పకపోతే పరిణామాలు వేరేలా ఉంటాయని జ్యోత్స్న అనడంతో నువ్వు బెదిరిస్తే బెదిరిపోవడానికి నీ ఇంటి పనిమనిషిని కాదంటుంది దీప. కోడలి మీద జ్యోత్స్న చెయ్యెత్తడంతో కాంచన సీరియస్ అవుతుంది. నాకు నా మేనకోడలి కంటే కోడలే ఎక్కువని తేల్చి చెబుతుంది.

అసలు అత్తను అన్న గౌరవం ఉంటే నా ఇంటికి పోలీసులతోనే వచ్చేదానివి కాదని అంటుంది కాంచన. నేనొచ్చింది నిన్ను చూసిపోవడానికి కాదు, నీ కోడల్ని తీసుకుపోవడానికి అని జ్యోత్స్న చెబుతుంది. మా మమ్మీని దీప కిడ్నాప్ చేసింది? ఈ ఇంటిలోనే ఎక్కడో దాచింది? మేం వచ్చేలోపు మాయం చేసిందని అంటుంది జ్యోత్స్న. నువ్వు వెంటనే కార్తీక్‌కి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పమని దీపతో అంటుంది జ్యోత్స్న. కార్తీక్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో కాంచన, దీపలు కంగారు పడతారు. మా మమ్మీ కనిపించకపోవడానికి దీపే కారణమని నేను పోలీసులకు కంప్లయంట్ చేశానని జ్యోత్స్న చెప్పడంతో దీప, కాంచన షాక్ అవుతారు.

మా డాడీని ఈ దీప గన్‌తో షూట్ చేసిందని, మా మమ్మీకి దీపకి పడదని.. కోర్టులో కేసు కూడా రన్ అవుతోందని పోలీసులకు చెబుతుంది జ్యోత్స్న. దాంతో పోలీసులు దీపను అరెస్ట్ చేయబోతుండగా.. ముందు నన్ను అరెస్ట్ చేయమని అంటుంది కాంచన. ఇది నా ఇల్లు .. నా ఇంట్లోనే మీ అమ్మ ఉందని నువ్వు కంప్లయంట్ చేశావ్, మామూలుగా అయితే నా కొడుకు సమాధానం చెప్పాలి, వాడు అందుబాటులోకి లేకపోతే నన్ను అరెస్ట్ చేయమని అంటుంది. నిన్ను అరెస్ట్ చేయించి జ్యోత్స్న తన పరపతి చూపించింది.. నా నిజాయితీ ఏంటో నేనూ చూపిస్తానని అంటుంది కాంచన. ఆ వెంటనే దీపను పోలీసులు అరెస్ట్ చేస్తారు.

ఆఫీసులో నాకు చాలా వర్క్ ఉందని కాశీ హడావుడి చేస్తాడు. నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావ్, ఏదో తప్పు చేశావ్.. నువ్వు మా నాన్న కాళ్లు ఎందుకు పట్టుకున్నావ్ అని అడుగుతుంది స్వప్న. ఆఫీస్‌లో నన్ను అందరూ మెచ్చుకోవడంతో నేను మావయ్య ఆశీర్వాదం తీసుకున్నానని కవర్ చేస్తాడు కాశీ. ఆ విషయం ముందే నాకు చెప్పొచ్చు కదా అని కూల్ అవుతుంది స్వప్న. నేను తప్పు చేశాను, అది నీకు తెలిసేలోగా జాబ్ వెతుక్కోవాలని బాత్‌రూమ్‌లో బాధపడతాడు కాశీ.

గుడిలో కూర్చొని దశరథ బాధపడతాడు. మీ అత్తయ్యకి, నాకు పెళ్లయిన దగ్గరి నుంచి ప్రతి సంవత్సరం మేమిద్దరం ఈ గుడికి వచ్చేవాళ్లమని చెబుతాడు దశరథ. తను ఎక్కడున్నా, ఇద్దరం కలిసొచ్చి అర్చన చేయించుకునే వాళ్లమని తనకి గుర్తుంటుందని కార్తీక్‌తో అంటాడు. కనీసం ఈ ఆలోచన అయినా తనని గుడికి తీసుకొస్తుందని నేను ఇక్కడికి వచ్చానని చెబుతాడు. నీ మీద ప్రేమతో అయినా అత్త ఖచ్చితంగా గుడికి వస్తుందని అంటాడు కార్తీక్. అంత ప్రేముంటే వదిలి వెళ్లేదే కాదని చెబుతాడు దశరథ. అసలు తప్పుని క్షమించకుండా మనిషిని దూరం పెడుతున్నాడంటే వాడిది మూర్ఖత్వం.. మీ అత్త విషయంలో నేను మూర్ఖుడిలా ప్రవర్తించానని బాధపడతాడు దశరథ. కోడలితో మాట్లాడు, మునుపటిలా ఉండమని మా నాన్న చెబుతూనే ఉన్నాడని .. నేనే పంతానికిపోయి ప్రేమించే మనిషిని దూరం చేసుకున్నానని అంటాడు.

దీప మీదున్న కోపంతోనే అత్త తాళి తీసింది తప్పించి.. నీ మీద గౌరవం లేక కాదని చెబుతాడు కార్తీక్. కానీ ఆ తప్పుని నువ్వు క్షమించలేకపోయావని, ఇప్పటికీ దాని గురించే బాధపడుతున్నావని అంటాడు. నా భార్య తప్పు చేసిందని బాధపడటం లేదు.. నన్ను అర్ధం చేసుకోలేదనే ఈ బాధంతా అని చెబుతాడు దశరథ. నా ప్రేమను తీసుకుంటుంది కానీ.. నా కోపాన్ని తీసుకోదా అని ప్రశ్నిస్తాడు. బతుకు పూర్తయ్యే వరకు భార్యాభర్త జంటగా కలిసి బతకాల్సిందేనని గుడిలో వెలుగుతున్న దీపాల్ని చూసి చెబుతాడు దశరథ. ఇంతలో రెండు ఒత్తుల్లో ఒకటి ఆరిపోవడంతో టెన్షన్ పడతాడు.. సుమిత్రకు ఏం కాలేదు కదా? అని కార్తీక్‌ని అడుగుతాడు. మీ అత్తయ్యకి ఏమైనా అయితే నేను బతకలేనని అంటాడు దశరథ. ఆ వెంటనే రెండు ఒత్తులు వెలగడంతో సంతోషిస్తాడు. రెండు జ్యోతుల్లో ఒక జ్యోతి ఆరిపోతే.. రెండో జ్యోతి ఓపిగ్గా ఎదురుచూసింది, అత్త ఇక్కడికి రావొచ్చు.. నీతో మాట్లాడొచ్చని ధైర్యం చెబుతాడు కార్తీక్. ఇంతలో సుమిత్రను కార్తీక్ చూస్తాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X