Karthika Deepam 2 November 1st: దీప గురించి నిజం చెప్పిన సుమిత్ర.. షాక్‌లో జ్యోత్స్న, పారిజాతం
Photo Courtesy: JioHotstar
పోలీస్ స్టేషన్‌కి నా కూతురిని, కూతురి కోడలిని ఎందుకు తీసుకొచ్చావని ఎస్ఐ మీద సీరియస్ అవుతాడు శివన్నారాయణ. మీరు నా కూతురికి క్షమాపణలు చెప్పకుంటే నేను ఐజీకి ఫోన్ చేస్తానని శివన్నారాయణ బెదిరించడంతో కాంచనకు ఎస్ఐ క్షమాపణలు చెబుతాడు. నా కోడలు సేఫ్‌గా ఉందని పెద్దాయని చెప్పడంతో ఎక్కడ ఉందని అడుగుతుంది జ్యోత్స్న. అందరూ శివన్నారాయణ ఇంటికి బయల్దేరుతుండగా కాంచనకు శ్రీధర్ ఫోన్ చేయడంతో మేం పోలీస్ స్టేషన్‌లో ఉన్నామని చెబుతుంది.
పోలీస్ స్టేషన్‌లో జరిగిన దానికి జ్యోత్స్న రగిలిపోతుంటుంది. మమ్మీని దీప కిడ్నాప్ చేసిందని గట్టిగా వాదనకు దిగుతుంది. ఇంతలో శ్రీధర్ వచ్చి సుమిత్రను దీప, కాంచనలు కిడ్నాప్ చేశారని చెప్పడానికి నీ దగ్గర సాక్ష్యం ఉందా అని నిలదీస్తాడు. కాసేపటికి సుమిత్ర - దశరథలని తీసుకుని కార్తీక్ ఇంటికి రావడంతో అందరూ సంతోషిస్తారు. నా మనవడు ఉండగా నాకేంద భయలేదని, వాడు సర్వరోగ నివారిణి అని మెచ్చుకుంటాడు. కార్తీక్‌ను అందరూ పొగుడుతుంటే జ్యోత్స్న తట్టుకోలేకపోతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి నవంబర్ 1వ తేదీ 504వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
పోలీస్ స్టేషన్‌లో నువ్వు నన్ను సపోర్ట్ చేయలేదని పారిజాతంపై మండిపడుతుంది జ్యోత్స్న. నువ్వేం చేస్తున్నావో నాకు చెప్పి చేశావా అని పారు అడగ్గా.. అన్ని ముందు చెప్పలేం కదా అంటుంది జ్యోత్స్న. అప్పుడు రిజల్ట్ ఇలాగే ఉంటుందని ఫైర్ అవుతుంది పారు. పోలీసులను తీసుకుని నీ మేనత్త ఇంటికి వెళ్తావా? అన్నింటికి ఆవేశం పనికిరాదు, సుమిత్ర దీప ఇంట్లో ఉందని అనుమానం వస్తే నాకు ముందు చెప్పాలి కదా అంటుంది పారు. నువ్వు రోజురోజుకు దిగజారిపోతున్నావు.. ఇంట్లో వాళ్లందరికీ నువ్వొక శత్రువులా అయిపోతున్నావు.. పద్ధతి మార్చుకుంటే ఎవరైనా అర్ధం చేసుకుంటారని చెబుతుంది పారు.
నువ్వు నీలాగే తగలడు, నేను నాలాగే తగలడతాను.. కానీ మంచిదానిలా నటించమని అంటుంది. నువ్వు ఇంటికి వారసురాలిలా ఉండాలంటే మంచిదానిలా నటించాల్సిందేనని తేల్చేస్తుంది. మీ అమ్మ ఇంటికి తిరిగొచ్చింది అంటే మనసు మార్చుకుందని అర్ధం.. ఇప్పుడు మీ అమ్మనాన్నలు కూడా కలిసిపోయారు. నువ్వు మీ అమ్మ వెళ్లిపోవడం చూసి కూడా ఆపలేదనే విషయం మీ అమ్మకి ఇంకా తెలుసుండదు, అది ఎవరో ఒకరు చెప్పేలోపే, అమ్మ లేకపోవడం వల్ల నువ్వు ఎంత బాధపడ్డావో తెలిసేలా చేయాలని చెబుతుంది పారు. అందరూ కలిసున్నప్పుడు నువ్వు చేసిన చెడ్డ పని కొట్టుకుపోతుంది. మీ అమ్మను ప్రేమగా పట్టుకుని ఏడ్చేయ్ అని అంటుంది పారిజాతం.
సుమిత్ర అత్త కోసం అన్నయ్య, నాన్న ఎక్కడ తిరుగుతున్నారో ఏంటో? అని కావేరితో అంటుంది స్వప్న. ఇంతలో అత్త తిరిగొచ్చిందని మెసేజ్ రావడంతో కాశీ, కావేరి, స్వప్న సంతోషిస్తారు. మనం కూడా అక్కడికి వెళ్దామని కాశీ అడగ్గా.. వద్దులే అంటుంది కావేరి. ఫ్యామిలీ అంతా అక్కడే ఉన్నప్పుడే మనం ఎందుకు వెళ్లకూడదని తల్లిని నిలదీస్తుంది స్పప్న. కాశీకి శివన్నారాయణ గారు తాతయ్య అవుతారు. మా నాన్న ఆ ఇంటికి అల్లుడు కాబట్టి నాకు కూడా తాతే అవుతారని అంటుంది. పిలవకుండా ఎలా వెళ్తావని ప్రశ్నిస్తుంది కావేరి. నాన్నను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నువ్వు అజ్ఞాతంలోనే బతుకుతున్నావు.. నాన్న కూడా ఆ ఫ్యామిలీకి ఇచ్చినంత ప్రాధాన్యత, ఈ ఫ్యామిలీకి ఇవ్వడం లేదని నీకు అనిపించిందా అని ప్రశ్నిస్తుంది స్వప్న.
మీ నాన్నకు పెళ్లయ్యిందని, ఒక కొడుకు ఉన్నాడని తెలిసే నేను పెళ్లి చేసుకున్నానని చెబుతుంది కావేరి. నేను ఎవరో కాంచన అక్కకి తెలిశాక.. తన భర్తను నాకిచ్చేసిందని, తన భర్త తప్పు చేశాడు.. తనలా మరో ఆడది అన్యాయం అయిపోకూడదని నాకు భర్తను ఇచ్చేసి తను ఒంటరిగా మిగిలిపోయిందని అంటుంది కావేరి. అన్నీ తట్టుకుని నిలబడిందని, మీ నాన్నకి ఫస్ట్ ప్రయారిటీ మీ పెద్దమ్మేనని, అయినా ఇవ్వకపోయినా నేను ఇస్తానని చెబుతుంది. మీ నాన్న నన్ను కాంచన అక్కతో సమానంగా చూడాలని నేను ఏనాడూ ఆశపడలేదని.. కానీ నాకు చిన్న ఆశ ఉందని, అక్క కుటుంబంతో పాటు నాకు కూడా చోటు ఇస్తే బాగుంటుందని అంటుంది కావేరి. కానీ అలా చేస్తే అక్క గౌరవం పడిపోతుందని అది నాకిష్టం లేదని చెబుతుంది. దాంతో తల్లిని హత్తుకుంటుంది స్వప్న. మరి నువ్వేం అంటావని కాశీని అడగ్గా.. మనం వాళ్లతో లేకపోవచ్చు కానీ, వాళ్లు హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉన్నట్లేనని అంటాడు కాశీ.
తల్లి ఏమైపోయిందో తెలియక కన్నబిడ్డ తల్లడిల్లిపోతుందని జ్యోత్స్న గురించి చెబుతుంది పారిజాతం. అందుకేనా రాగానే అమ్మ అంటూ గుండెలకు హత్తుకుందని కార్తీక్ సెటైర్లు వేస్తాడు. గుమ్మం దగ్గర హారతి ఇస్తేనో, గుండెలకు హత్తకుంటేనే ప్రేమ ఉన్నట్లు కాదని పారు అనగా.. కేసులు పెడితేనే ప్రేమ ఉన్నట్లు అంటాడు శ్రీధర్. నువ్వు ఇంట్లో నుంచి వెళ్లిపోయినప్పటి నుంచి నీ కూతురు సరిగా తిండి తినలేదని, వాళ్ల నానమ్మ ఫోటో ముందు తెగ ఏడ్చిందని అంటుంది పారిజాతం. నీ కోసం వెతకడానికి వెళ్తుంటే మీ మావయ్య గారు ఆపారని చెబుతుంది. నా బాధ ఎవరికీ అర్ధం కావాల్సిన అవసరం లేదని మమ్మీ అర్ధం చేసుకుంటే చాలని అంటుంది జ్యోత్స్న.
జ్యోత్స్న తరపున నేను సారీ చెబుతున్నానని సుమిత్ర అనడంతో శ్రీధర్ వద్దని.. నువ్వు ఎక్కడికి వెళ్లావు? బావని ఎలా కలిశావు? కార్తీక్‌ను ఎలా కలిశావని అడుగుతాడు. నేను చచ్చిపోదామని ఇంట్లో నుంచి వెళ్లిపోయానని సుమిత్ర చెప్పడంతో అంతా షాక్ అవుతారు. నేను బతకడానికి ఇంకేదైనా కారణం మిగిలిందా అని ఆలోచిస్తుండగా నా మెడలో ఉన్న నగల మీద ఆశపడ్డారని, రౌడీలతో గొడవ, వాళ్ల నుంచి దీప రక్షించడం అన్ని చెబుతుంది సుమిత్ర. దీప కనుక నన్ను కాపాడకపోయుంటే నా శవం మీకు దొరికేదని అంటుంది సుమిత్ర. అందుకేనా ఆ రోజు నన్ను బయటి నుంచి పంపించేశావని శ్రీధర్ అడుగుతాడు. ఈ మాటలు విన్న జ్యోత్స్న రగిలిపోతుంది. నేను పోలీసులను తీసుకుని బావ ఇంటికి ఎందుకు వెళ్లానో నీకు అర్ధమైందా? అని అంటుంది. వీళ్లు మా మమ్మీని ఇంట్లోనే దాచిపెట్టి మన ముందు మాత్రం వెతుకుతున్నట్లు నటించారని ఫైర్ అవుతుంది. అత్త క్షేమంగానే ఉందని చెప్పాడు కానీ, మా ఇంట్లోనే ఉందని బావ చెప్పలేదని అంటుంది జ్యోత్స్న.
నేను మీ ఇంటికి వస్తే నా తల్లిని కనిపించకుండా చేశారని.. అది మోసం కాదు కిడ్నాప్ చేయడం అంటారని జ్యోత్స్న మండిపడుతుంది. వీళ్లు కిడ్నాప్ చేశారని నేను నీకు చెప్పానా అని సుమిత్ర ఫైర్ అవుతుంది. నా గురించి ఎవరికీ చెప్పొద్దని మాట తీసుకున్నానని సుమిత్ర చెబుతుంది. మంచి చేసినా దీప మౌనంగా నిలబడటానికి కారణం నేనే అని అంటుంది. ఇప్పటికైనా జరిగింది అర్ధమైంది కదా నా భార్యకు సారీ చెప్పమని జ్యోత్స్నతో అంటాడు శ్రీధర్. సారీలు ఏమీ వద్దని ఇదంతా రుణానుబంధం అని చెబుతాడు కార్తీక్. మీరు నిజాలు దాచి బాగానే ఉన్నారు కానీ.. సుమిత్ర కోసం మా ఆయన, దశరథ, జ్యోత్స్నలు కుమిలిపోయారని అంటుంది పారిజాతం.
మీ అమ్మ ముందు కొన్ని మాట్లాడకూడదని ఊరుకున్నానని, లేదంటే నిన్ను ఎన్ని తిట్టాలో అన్ని తిట్టేవాడినని రగిలిపోతాడు శివన్నారాయణ. కార్తీక్, దీప లేకపోయుంటే ఈ ఇంటి దీపం ఆరిపోయేదని భార్యాభర్తలిద్దరికీ థ్యాంక్స్ చెబుతాడు. ఈ క్రెడిట్ మొత్తం నీ మనవరాలికే దక్కుతుందని కార్తీక్ చెప్పగా.. నాకెందుకు దక్కుతుందని జ్యోత్స్న అడుగుతుంది. నేను నీ గురించి చెప్పలేదు, దీప గురించి అంటాడు కార్తీక్. నువ్వు మా తాతకి భార్యవైతే మాకు అమ్మమ్మవి కాలేదా? ఇది కూడా అంతేనని పారుకు కౌంటర్ ఇస్తాడు కార్తీక్. ఆ తర్వాత సుమిత్ర, దశరథల పెళ్లి రోజు వేడుకల్ని ఘనంగా చేస్తాడు కార్తీక్. కన్నతల్లినే మరిచిపోయేంత ప్రేమను పంచిన అమ్మలాంటి అత్తకు నేను ఎంతో రుణపడిపోయానని చెబుతాడు కార్తీక్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











