Karthika Deepam 2 November 3rd: కార్తీక్, దీపలపై ప్రశంసలు.. సుమిత్ర మాటలతో జ్యోత్స్నకి ముచ్చెమటలు
Photo Courtesy: JioHotstar
అందరూ కార్తీక్‌ను పొగుడుతుంటే జ్యోత్స్న రగిలిపోతుంది.. కోపంతో పైకి వెళ్లడంతో పారిజాతం ఆమె దగ్గరి వెళ్లి బుజ్జగిస్తుంది. పోలీస్ స్టేషన్‌లో నన్ను ఎందుకు సపోర్ట్ చేయలేదని పారిజాతంపై మండిపడుతుంది జ్యోత్స్న. నీ మేనత్త ఇంటికి పోలీసులతో వెళ్తున్న విషయం నాకు చెప్పుంటే రిజల్ట్ వేరేలా ఉండేదని అంటుంది పారు. కొన్ని విషయాలు ముందు చెప్పలేమని జ్యోత్స్న అనగా.. నువ్వు రోజురోజుకు ఇంట్లో వాళ్లకి శత్రువులా మారిపోతున్నావని మంచిగా ఉన్నట్లు నటించమని సలహా ఇస్తుంది.
సుమిత్ర అత్తయ్య కనిపించిందని, అందరూ శివన్నారాయణ గారి ఇంట్లోనే సెలబ్రెట్ చేసుకుంటున్నారని .. మనం కూడా వెళ్దామని స్వప్న అడగటంతో కావేరి వద్దు అంటుంది. నేను మీ పెద్దమ్మకి, ఆ కుటుంబానికి ఎంతో రుణపడిపోయానని, నేను నాలాగే ఉంటానని అంటుంది కావేరి. దాంతో స్వప్న, కాశీలు ఎమోషనల్ అవుతారు. నువ్వు కనిపించకపోయేసరికి నీ కూతురు ఎంతో బాధపడిందని చెబుతుంది పారు. అంత బాధపడితే గుమ్మం దగ్గరే అత్తను పట్టుకుని ఎందుకు ఏడవలేదని కార్తీక్ సెటైర్లు వేస్తాడు. నా భార్యను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లినందుకు క్షమాపణలు చెప్పమని జ్యోత్స్నపై కోప్పడతాడు శ్రీధర్. క్షమాపణలు వద్దని.. ఇది అత్తకి, దీపకి ఉన్న రుణానుబంధం అంటాడు కార్తీక్. ఆ వెంటనే సుమిత్ర - దశరథల పెళ్లి రోజు వేడుకల్ని ఘనంగా జరిపిస్తాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి నవంబర్ 3వ తేదీ 505వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
కన్నతల్లి లాంటి ప్రేమను పంచిన అత్త రుణాన్ని ఎంతో కొంత తీర్చుకోవాలని అంటాడు కార్తీక్. దాంతో ఇదంతా నీకు ఎవరు చెప్పారని పారిజాతం ప్రశ్నిస్తుంది. తాత చెప్పాడని కార్తీక్ అనగా.. మనవడికే కాదు మనవరాలికి కూడా చాలా చెప్పానని సెటైర్లు వేస్తాడు శివన్నారాయణ. అందరూ కలిసి నన్ను జోకర్‌ని చేశారు, బావకి దీపకి ఎక్కడ నిజం తెలిసిపోయిందోనని భయం పట్టుకుంటుంది జ్యోత్స్నకి. కేక్ కట్ చేయడానికి ముందు మరో చిన్న సెలబ్రేషన్ ఉందని చెబుతాడు కార్తీక్. దశరథ- సుమిత్రలతో దండలు మార్చుకోమని అంటాడు. అన్నంత పనిచేశావని పారు అనగా.. మా బావ చెప్పిన పని ఖచ్చితంగా చేస్తాడని అంటుంది దీప.
జ్యోత్స్న ఏదేదో వాగుతుండగా నాలుగు రోజుల నుంచి టెన్షన్‌తో ఉండటం వల్ల అలా మాట్లాడుతుందని కవర్ చేస్తుంది పారిజాతం. దండలు మార్చుకునే ముందు మీ ఇద్దరు మనసులోని మాటను చెప్పాలని అంటాడు కార్తీక్. ముందు లేడీస్ ఫస్ట్ అని కాంచన అనగా.. ఈసారి మా బావగారు చెబుతారని అంటాడు శ్రీధర్. పారుని పెళ్లి పాట పాడతావా? అని కార్తీక్, దీపలు పారిజాతాన్ని అడుగుతారు. ఇప్పుడు విపత్తుల్ని ఆహ్వానించొద్దని సెటైర్లు వేస్తాడు శివన్నారాయణ. మనిషి శరీరంలో ప్రాణం ఎక్కడుంది అంటే.. శరీరం అంతా ఉంటుంది అంటారు, కానీ గుండె ఆగిపోతే ప్రాణం ఆగిపోతుందని అంటారు అది నిజం కాదు.. ఊపిరిలోనే ప్రాణం ఉంటుంది. భార్యకు భర్తే ఊపిరి అని చెబుతుంది సుమిత్ర. ఓ కఠిన మాట తీసుకునే ఊపిరిని కూడా ఆపేస్తుందని, మాట అనుకునే ముందు ఊపిరి ఆగిపోతుందని మాట ఇస్తున్నాను అని దశరథ మెడలో దండ వేస్తుంది సుమిత్ర.
ఆ తర్వాత దశరథ మాట్లాడుతూ.. మరోసారి తనని నేను మాటలతో కానీ, చేతలతో కానీ బాధపెట్టనని అంటాడు. కన్నీళ్ల బరువు కార్చేవాళ్లకే కాదు, మోసేవాళ్లకి తెలుస్తుంది. ఈ రెండ్రోజులు అలాంటి బరువులు నేను చాలానే మోశానని చెబుతాడు దశరథ. నా మేనల్లుడు, భార్య దగ్గర నా బరువు దించేసుకున్నానని.. మరోసారి నిన్ను బాధపెట్టే పని చేయనని మాట ఇచ్చి భార్య మెడలో దండలు వేస్తాడు దశరథ. దాంతో ఒక్క మాటతో చెల్లి మాటతో చెల్లెమ్మ మనసు గెలిచేశావని చెబుతాడు శ్రీధర్. ఆ తర్వాత సుమిత్రను అక్షింతలు వేసి దీవిస్తాడు దశరథ. ఆ తర్వాత సుమిత్ర- దశరథలతో కేక్ కట్ చేయిస్తాడు కార్తీక్. పరాయి దానిలా దూరంగా ఉంటున్నావని పారిజాతం అడగ్గా.. పరాయి దానినే దూరంగానే ఉంటానని అంటుంది జ్యోత్స్న.
మేం మళ్లీ కలవడానికి కారణమైన మీకే ముందు కేక్ తినిపించాలని అనుకుంటున్నానని దశరథ అనగా.. ముందు జ్యోత్స్నకి పెట్టమని చెబుతుంది దీప. తను నా కూతురే కావొచ్చు కానీ కొన్నిసార్లు అర్హత నిర్ణయించేది రక్తబంధం కాదు ప్రేమబంధం అంటాడు దశరథ. నువ్వు, కార్తీక్ వల్ల ఈ ఇంటి కన్నీరుని తుడిచిందని.. మేమిద్దరం కలిసి పెళ్లి రోజు జరుపుకుంటున్నామంటే కారణం మీరే అంటాడు దశరథ. దాంతో జ్యోత్స్న రగిలిపోతుంది. ఇది ఎందుకు ఇంతలా ఫీల్ అవుతుంది, కన్నవాళ్లు వీళ్లేనని దీపకు తెలుసా అని జ్యోత్స్నలో టెన్షన్ మొదలవుతుంది. నాకు గిఫ్ట్ కావాలని దశరథ అడగ్గా.. ఏం కావాలంటే అది ఇస్తానని చెబుతాడు శ్రీధర్.
మమ్మల్ని కలిపింది మీరే.. మీ ఇద్దరి కోసం ఏదైనా చేయాలని ఉందని, ఏం కావాలన్నా ఇస్తానని అంటాడు దశరథ. ఇదే మీకు సువర్ణావకాశం, ఇంతకు మించిన ఛాన్స్ రాదని సెటైర్లు వేస్తుంది జ్యోత్స్న. విడదీసేది వీళ్లే.. కలిపేది వీళ్లేనని అంటుంది. భార్యాభర్తల్ని కలిపేంత సమర్థత ఉంటే.. అత్తని, మావయ్యని ఎందుకు కలపలేకపోయారని జ్యోత్స్న అడగటంతో అంతా షాక్ అవుతారు. మీ అమ్మనాన్న గురించి ఎందుకు ఆలోచించావా? అని కార్తీక్‌ను నిలదీస్తుంది.. కనీసం కలిపే ప్రయత్నం అయినా చేయాలి కదా అని అంటుంది. దాంతో శివన్నారాయణ మండిపడతాడు. అత్తయ్య, మావయ్య విడిపోయారని నీకు ఎవరు చెప్పారు.. కలిసిలేరు కదా అని అంటుంది జ్యోత్స్న. కార్తీక్ పెళ్లికి, సత్యనారాయణ స్వామి వ్రతానికి మీ మావయ్య అత్తతో పాటే ఉన్నాడా? లేదా అని ప్రశ్నిస్తాడు శివన్నారాయణ. ఈరోజు ఈ ఇంట్లో కూడా జంటగానే ఉన్నారు కదా అని చెబుతాడు. నేను, కాంచన వేరు అని నేను ఎప్పుడు అనుకోలేదని శ్రీధర్ తేల్చిచెప్పడంతో కాంచన ఎమోషనల్ అవుతుంది. అసలు నీ వల్లే కదా ఇదంతా జరిగిందని మండిపడతాడు శివన్నారాయణ.
దీప ఎలాంటిదో నీకు తెలుసు కదా? దాని వల్లే నువ్వు డాడీ విడిపోయారని సుమిత్రతో అంటుంది జ్యోత్స్న. నీతో మాట్లాడాలని పక్కకి తీసుకెళ్లి మాట్లాడుతుంది సుమిత్ర. శ్రీధర్ అన్నయ్య, కాంచన వదిన గురించి ఎందుకు అడిగావని నిలదీస్తుంది. నిన్ను, డాడీని వాళ్లిద్దరే కలిపినట్లు అందరూ భజన చేస్తుంటే తట్టుకోవడం నా వల్ల కాదని అంటుంది జ్యోత్స్న. నేను గతాన్ని మరిచిపోలేనని చెబుతుంది. నాకు మీ నాన్నకి దూరం పెరగడానికి దూరం దీపేనా అని నిలదీస్తుంది సుమిత్ర. బోర్డ్ మీటింగ్ తర్వాత నువ్వు చేసిన గొడవ వల్లే మీ డాడీ అంతలా రియాక్ట్ అయ్యాడని అని చెబుతుంది సుమిత్ర. నేను ఇంట్లో నుంచి వెళ్లిపోవడం చూసినా ఆపలేనంత అమాయకురాలివి అని సుమిత్ర అనడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. ఒకప్పుడు దీప ప్రాణాలకి తెగించి నన్ను కాపాడింది, ఇప్పుడు కూడా తనే కాపాడిందని అంటుంది సుమిత్ర. నువ్వు నన్ను వదిలేశావ్.. దీప నన్ను వదిలేయలేదని చెబుతుంది. ఇంతలో పారిజాతం వచ్చి యువరాణిలా ఆస్తి మొత్తం సొంతం చేసుకుంటావని అనుకున్నానని.. నువ్వు ఈ ఇంటి వారసురాలివి కాదని తెలిసేరోజు దగ్గరలోనే ఉందని చెప్పడంతో జ్యోత్స్న వణికిపోతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











