Karthika Deepam 2 Weekly: ఇల్లు వదిలి వెళ్లిపోయిన సుమిత్ర... కుప్పకూలిన శివన్నారాయణ, పారులో మార్పు

Photo Courtesy: JioHotstar

Karthika Deepam 2 Serial Weekly Roundup: కార్తీక దీపం 2 సీరియల్ ప్రస్తుతం రసవత్తరంగా నడుస్తోంది. స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ కు ప్రస్తుతం మంచి ఆదరణ దక్కుతోంది. ఈ సందర్భంగా అక్టోబర్ 13వ తేదీ నుంచి అక్టోబర్ 18వ తేదీ వరకు 487 నుంచి 492వ ఎపిసోడ్స్ వరకు ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..

అక్టోబర్ 13వ తేదీ 487వ ఎపిసోడ్‌లో..
వైరా నుంచి కంపెనీని కాపాడిన కార్తీక్‌ని మెచ్చుకుంటాడు శివన్నారాయణ. బోర్డ్ మెంబర్స్ అందరికీ నీ మీదే నమ్మకమని... కంపెనీయే కాదు, ఈ కుటుంబాన్ని మోసే బాధ్యత కూడ నీదేనని చెబుతాడు శివన్నారాయణ. దాంతో తాతకి కార్తీక్ మాటిస్తాడు. వీరిద్దరి మాటలు విన్న జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. ఇంతలో దీప వచ్చి మనిద్దరం పక్కకి వెళ్లి మాట్లాడుకుందామని అంటుంది. నీ ప్లేస్ నీది కాదని అనడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. దీపకు నిజం తెలిసిపోయిందా అని ఆమె ఇంకా టెన్షన్ పడుతుంది. 24 గంటల్లో ఉద్యోగం సంపాదిస్తావా? లేక కంపెనీ వ్యవహారాలు చూసుకుంటావా? అని కాశీకి శ్రీధర్ డెడ్ లైన్ పెడతాడు. దీప ప్రవర్తన, నెక్ట్స్ సీఈవోగా కార్తీక్‌ని నియమించే అవకాశాలు ఉండటంతో జ్యోత్స్న అలర్ట్ అవుతుంది. ఇంటికి వెళ్తున్న కార్తీక్‌ను తీసుకుని రెస్టారెంట్‌కు వెళ్తుంది. నేను సీఈవో పోస్ట్‌లోనే ఉండాలని.. దానికి నీ సాయం కావాలని చెబుతుంది జ్యోత్స్న. ముందు ఇంట్లో మీ అమ్మనాన్నలను కలపమని కార్తీక్ అడగటంతో జ్యోత్స్న కోపం ఇంటికి వెళ్తుంది.

అక్టోబర్ 14వ తేదీ 488వ ఎపిసోడ్‌లో..
సుమిత్ర - దశరథలను కలపాలని అనుకున్న జ్యోత్స్న ఏదేదో మాట్లాడుతుంది. ఆమె మాటలతో సుమిత్ర - దశరథల మధ్య మరింత దూరం పెరిగేలా కనిపించడంతో కార్తీక్ తన మరదలిని ఆపాలని చూస్తాడు. నువ్వు నీ పని చూసుకుంటే మంచిది, ఇది మా ఫ్యామిలీ మేటర్ అని జ్యోత్స్న నోరు జారడంతో శివన్నారాయణ, దశరథలు సీరియస్ అవుతారు. ఆ దీప చేసిన తప్పుకి మా అమ్మని ఎందుకు శిక్షిస్తున్నావని దశరథను నిలదీస్తుంది జ్యోత్స్న. అసలు ఇలాంటి వ్యక్తికి భర్తగా ఉన్నందుకు ఎందుకు బతికి ఉన్నానా? అనిపిస్తోందని దశరథ అనడంతో సుమిత్ర షాక్ అవుతుంది. కొడుకు, కోడలి మధ్య గొడవలతో శివన్నారాయణ కుప్పకూలిపోతాడు. శివన్నారాయణ గారింట్లో జరిగినదంతా దీపకు చెబుతాడు కార్తీక్. నువ్వు తప్పు చేస్తున్నావని జ్యోత్స్నను పారిజాతం కోప్పడుతుంది. తాను ఇంట్లో లేకపోతేనే తన భర్త హాయిగా ఉంటాడని నిర్ణయించుకున్న సుమిత్ర ... అర్ధరాత్రి ఇల్లు వదిలి వెళ్లిపోతుంది. ఆ సమయంలో జ్యోత్స్న తన తల్లిని చూసినా ఆపకుండా సైలెంట్‌గా ఉండిపోతుంది.

Karthika deepam 2 Serial Weekly Episodes October 13th to October 18th Here is Highlights

Photo Courtesy: JioHotstar

అక్టోబర్ 15వ తేదీ 489వ ఎపిసోడ్‌లో..
కార్తీక్ - దీపలు శివన్నారాయణ గారింటికి బయల్దేరుతుండగా అనసూయ వచ్చి దీపను పెంచిన ఆమె ఫోటోను ఇస్తుంది. అలాగే ఒక ఆడపిల్ల బొమ్మని తీసుకొస్తుంది. నువ్వు శౌర్యకి చెల్లెలిని కానీ, తమ్ముడిని కానీ ఇవ్వాలని దీపని అడుగుతుంది అనసూయ. మీ ఇద్దరి కోరిక తప్పకుండా తీరుతుందని దీప చెప్పడంతో అనసూయ, కాంచనలు ఎంతో సంతోషిస్తారు. వారి మాటలను విన్న కార్తీక్.. అమ్మ, పెద్దమ్మలు పెద్ద ప్లానే వేశారని దీపతో అంటాడు. శివన్నారాయణ ఇంటికి కార్తీక్ - దీపలు వెళ్లేసరికి ఇంట్లో అంతా టెన్షన్ పడుతుంటారు. దాంతో సుమిత్ర ఇల్లు వదిలి వెళ్లిపోయిందని చెబుతుంది పారిజాతం. దాంతో కార్తీక్, దీపలు షాక్ అవుతారు. రాత్రి సుమిత్ర వెళ్లడం జ్యోత్స్న చూసిందని పారు చెప్పడంతో అందరూ ఆమెపై కోప్పడతారు. రాత్రి ఎవరో బయటికి వెళ్లినట్లుగా ఉందని, కానీ చీకట్లో అది మమ్మీ అని తెలియలేదని అంటుంది జ్యోత్స్న. కాశీ తనకు ఉద్యోగం వచ్చినట్లు అపాయింట్‌మెంట్ లెటర్ చూపించడంతో శ్రీధర్, కావేరి, స్వప్నలు సంతోషపడతారు.

అక్టోబర్ 16వ వ తేదీ 490వ ఎపిసోడ్‌లో..
కాంచనను కలిసేందుకు వచ్చిన శ్రీధర్‌కు కార్తీక్ ఫోన్ చేసి సుమిత్ర అత్త కనిపించడం లేదని చెబుతాడు. ఈ విషయాన్ని కాంచనకు చెప్పడంతో ఆమె షాక్ అవుతుంది. కార్తీక్, శ్రీధర్, దీప, దశరథలు సుమిత్ర కోసం ఊరంతా వెతుకుతారు. ఎంతకూ భార్య ఆచూకీ కనిపించకపోవడంతో దశరథ కుమిలిపోతాడు. దాంతో మేనమావకి కార్తీక్ ధైర్యం చెబుతాడు. తల్లి జాడ కనిపించకపోవడంతో అమ్మవారి దగ్గరికి వచ్చిన దీప కంటతడి పెడుతుంది. ఇంతలో దీపకు గతంలో జాతకం చెప్పిన స్వామిజీ వచ్చి నువ్వు ఎవరన్నది త్వరలోనే అందరికీ తెలుస్తుందని, నువ్వు వెతుకుతున్నది దొరుకుతుందని ధైర్యం చెబుతాడు. కాంచనకు చెప్పి శివన్నారాయణ ఇంటికి తీసుకొస్తాడు శ్రీధర్. పెద్దాయనకి బీపీ ఎక్కువైందని... ఆయన ఇలాగే టెన్షన్ పడితే హార్ట్ ప్రాబ్లమ్ వస్తుందని డాక్టర్ వార్నింగ్ ఇస్తాడు. తండ్రిని ఆ పరిస్థితుల్లో చూసిన కాంచన కన్నీళ్లు పెట్టుకుంటుంది. సుమిత్ర ఇల్లు వదిలి వెళ్లిపోతుంటే చూసి కూడా వదిలేస్తారా అని జ్యోత్స్నకు, పారిజాతానికి క్లాస్ పీకుతుంది కాంచన.

Karthika deepam 2 Serial Weekly Episodes October 13th to October 18th Here is Highlights

Photo Courtesy: JioHotstar

అక్టోబర్ 17వ తేదీ 491వ ఎపిసోడ్‌లో..
శివన్నారాయణ కళ్లు తెరిచి సుమిత్ర వచ్చిందా అని అడుగుతాడు. ఎవరికో కనిపించిందని వదిన తప్పకుండా వస్తుందని చెబుతుంది కాంచన. అత్తయ్య ఎక్కడున్నా వెతికి తీసుకొస్తానని కార్తీక్ తన తాతకి మాట ఇచ్చి బయల్దేరతాడు. భర్త మాటలను తలచుకుంటూ బాధపడుతున్న సుమిత్ర దగ్గరికి ఇద్దరు దొంగలు వచ్చి ఒంటి మీదున్న బంగారాన్ని ఇవ్వాలని కత్తితో బెదిరిస్తారు. ఒంటిమీదున్న బంగారం మొత్తం ఇచ్చేయడంతో దొంగు షాక్ అవుతారు. అసలు ఇది బంగారమేనా అని దొంగలు అడుగుతారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారం మట్టితో సమానమని సుమిత్ర అనడంతో.. మెడలో ఉన్న తాళి ఇవ్వమని అడుగుతారు దొంగలు. సుమిత్ర ఇవ్వనని మొండికేయడంతో బలవంతంగా లాగడానికి ప్రయత్నిస్తారు.. ఇంతలో దీప వచ్చి దొంగలని చితకబాదుతుంది. ఇంటికి వచ్చేయమని సుమిత్రను దీప ఎంత బతిమలాడినా రాదు.. ఇంతలో ఒక రౌడీ వెనుక నుంచి దీపపై దాడి చేస్తుండటంతో ఆమెను కాపాడేందుకు అడ్డుగా నిల్చొంటుంది సుమిత్ర. దశరథకి, శివన్నారాయణకి కాంచన గోరుముద్ధలు తినిపిస్తుండటంతో పారిజాతం ఎమోషనలై బయటికొచ్చి ఏడుస్తుంది. నా భర్తకి అలా ఉంటే ఏడవకుండా ఎందుకుంటాను? అని జ్యోత్స్నపై మండిపడుతుంది. సుమిత్ర కోసం ఊరంతా వెతుకుతున్న కార్తీక్‌ని అర్జెంట్‌గా ఇంటికి రమ్మని ఫోన్ చేస్తుంది దీప.

అక్టోబర్ 18వ తేదీ 492వ ఎపిసోడ్‌లో..
తన ఇంట్లో సుమిత్రను చూసి షాక్ అవుతాడు కార్తీక్. అత్తకి ఏమైంది? తలకి ఆ కట్టు ఏంటీ? అని దీపని అడగ్గా.. ఆమె జరిగినదంతా చెబుతుంది. వెంటనే విషయం తాతకి, మావయ్యకి చెప్పాలని వారిద్దర కంగారు పడుతున్నారని అంటాడు కార్తీక్. దాంతో దీప తన భర్తని ఆపి... ఇంటికి తీసుకెళ్తే అమ్మ చచ్చిపోతానని అని చెప్పిందని, ఈ విషయం ఇంట్లో చెప్పొద్దని అంటుంది. దానికి కార్తీక్ సరేనని అంటాడు. ఇంతలో శ్రీధర్- కాంచన ఇంటికి రావడంతో సుమిత్ర విషయం బయటపడుతుందని భయపడ్డ కార్తీక్ - దీపలు... శ్రీధర్‌ను బయటి నుంచే పంపించేస్తారు. కాంచనకి సుమిత్రను చూపించడంతో ఆమె ఎంతో సంతోషిస్తుంది. మరోవైపు సుమిత్ర కోసం దశరథ, శివన్నారాయణలు బాధపుడుతుంటారు. సుమిత్ర ఇల్లు వదిలి వెళ్లిపోయిన విషయాన్ని చెప్పడంతో దాస్, కావేరి, కాశీ, స్వప్నలు షాక్ అవుతారు. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X