Karthika Deepam 2 Weekly: శివన్నారాయణ ఉగ్రరూపం... దోషుల్లా కార్తీక్- దీప.. జ్యోత్స్నకి పారు క్లాస్
Photo Courtesy: JioHotstar
Karthika Deepam 2 Serial Weekly Roundup: కార్తీక దీపం 2 సీరియల్ ప్రస్తుతం రసవత్తరంగా నడుస్తోంది. స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ కు ప్రస్తుతం మంచి ఆదరణ దక్కుతోంది. ఈ సందర్భంగా అక్టోబర్ 20వ తేదీ నుంచి అక్టోబర్ 25వ తేదీ వరకు 493 నుంచి 498వ ఎపిసోడ్స్ వరకు ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..
అక్టోబర్ 20వ తేదీ 493వఎపిసోడ్‌లో..
రౌడీల దాడిలో గాయపడిన సుమిత్రను తన ఇంటికి తీసుకొస్తుంది దీప. కళ్లు తెరిచి చూసిన దీపకు తాను కాంచన ఇంట్లో ఉన్నట్లు అర్ధమవుతుంది. ఇక్కడ ఉండకూడదని వెళ్లిపోతూ పడిపోతుండగా దీప, కాంచనలు సుమిత్రను ఆపుతారు. మేం ఎవ్వరికీ చెప్పమని మీకు పూర్తిగా తగ్గేవరకు ఇక్కడే ఉండమని బతిమలాడుతుంది దీప. గతంలో మీ కోసం నా తలకి దెబ్బ తగిలింది... ఇప్పుడు నా కోసం మీరు దెబ్బతిన్నారని అలా రుణం తీరిపోయిందని గుర్తుచేస్తుంది దీప. వారిద్దరి మాట కాదనలేక అక్కడే ఉండటానికి సుమిత్ర ఓకే చెబుతుంది. సుమిత్రను ఎక్కడుందో? ఎలా ఉందో తెలియక భార్యను తలచుకుని దశరథ ఉలిక్కిపడి లేస్తాడు. అత్తయ్య ఎక్కడ అని శివన్నారాయణ నిలదీయగా.. అత్త ఎక్కడున్నా క్షేమంగానే ఉంటుందని, నన్ను నమ్మమని చెబుతాడు కార్తీక్. సుమిత్ర ఆచూకీ కార్తీక్‌కి తెలుసని జ్యోత్స్నకి అనుమానం వస్తుంది.
అక్టోబర్ 21వ తేదీ 494వ ఎపిసోడ్‌లో..
టిఫిన్ చేయకుండా మారాం చేస్తున్న సుమిత్రకు దీప టాబ్లెట్స్ వేసి పడుకోబెడుతుంది. సుమిత్ర వదినను మనం ఎక్కువ రోజులు దాయలేమని కాంచన అడగటంతో బావ వచ్చాక ఏదో ఒక నిర్ణయం తీసుకుందామని దీప అంటుంది. నీ మాటలు, చేతలతో నువ్వు కుటుంబానికి దూరం అయిపోతున్నావని, ఇకనైనా మారమని జ్యోత్స్నకి వార్నింగ్ ఇస్తుంది పారిజాతం. మమ్మీ ఎక్కడ ఉందో కార్తీక్, దీపలకు తెలుసని .. లేకపోతే వాళ్లిద్దరూ ఇంత కూల్‌గా ఉండరని, వాళ్లింటికి వెళితే అసలు బండారం బయటపడుతుందని చెబుతుంది జ్యోత్స్న. ఉదయాన్నే తన ఇంటికి వచ్చిన జ్యోత్స్నని చూసిన కాంచన, దీపలు షాక్ అవుతారు. శౌర్య దగ్గరికి వెళ్లిన జ్యోత్స్న అమ్మమ్మ ఇక్కడికి వచ్చిందా అని అడగటంతో వచ్చిందని, రెండు రోజులు అయ్యిందని పాప చెబుతుంది. లోపలికి వెళ్లి దీపను పెంచిన తల్లి ఫోటోను చూపిస్తుంది. మా మమ్మీ ఇక్కడే ఉందని జ్యోత్స్న గట్టిగా కేకలే వేయడంతో దీప, కాంచనలు మండిపడతారు. జ్యోత్స్న వెళ్లిపోయే టైంలో ఎవరో పెద్దావిడ దగ్గు వినిపించడంతో జ్యోత్స్నకి అనుమానం వస్తుంది. ఎవరు లోపల ఉన్నారు? ఎవరు దగ్గారో చూడటానికి వెళ్లగా అక్కడ జ్యోత్స్నకి ఎవరూ కనిపించరు. దాంతో దీప, కాంచనలు ఊపిరి పీల్చుకుంటారు.

Photo Courtesy: JioHotstar
అక్టోబర్ 22వ తేదీ 495వ ఎపిసోడ్‌లో..
సుమిత్ర ఇంట్లో నుంచి వెళ్లిపోయి రోజులు గడుస్తుండటంతో భార్యను వెతకడానికి తానే వెళ్తానని అంటాడు దశరథ. దాంతో శివన్నారాయణ, కార్తీక్‌లు అతనిని ఆపుతారు. అత్త ఎక్కడున్నా క్షేమంగా ఉంటుందని తిరిగి వచ్చేస్తుందని ధైర్యం చెబుతాడు కార్తీక్. బావ కొత్త గేమ్ స్టార్ట్ చేశాడని, మనల్ని కూడా అందులోకి లాగాడని పారుతో చెబుతుంది జ్యోత్స్న. అమ్మమ్మ మనింట్లో ఉన్నట్లు జోకి ఎందుకు చెప్పొద్దు అన్నావని దీపని ప్రశ్నిస్తుంది శౌర్య. అమ్మమ్మ దాగుడుమూతలు ఆడుతోందని, నువ్వు చెప్పేస్తే ఎక్కడుందో దొరికిపోతుందని అంటుంది దీప. దాంతో నేను ఎవ్వరికీ చెప్పనని అంటుంది శౌర్య. శివన్నారాయణ దగ్గరికి జ్యోత్స్న వచ్చి.. టాబ్లెట్స్, జ్యూస్ ఇస్తుంది జ్యోత్స్న. నీ ముఖం చూస్తేనే చిరాకుగా ఉందని కూతురిపై మండిపడతాడు దశరథ. ఆ మాటలతో రగిలిపోయిన జ్యోత్స్న.. మీకు నేను తప్పించి పరాయి వాళ్లంతా ఇష్టమేనంటూ వాదిస్తుంది. మమ్మీని బావ వెతకడం లేదని, దీప పనికి రావడం లేదని శివన్నారాయణ, దశరథలకు అనుమానం వచ్చేలా మాట్లాడుతుంది. దాంతో శివన్నారాయణకు అనుమానం వస్తుంది. నేను, స్వప్న వేరే ఇంటికి వెళ్లిపోతామని కాశీ చెప్పడంతో శ్రీధర్, స్వప్న, కావేరిలు షాక్ అవుతారు.
అక్టోబర్ 23వ వ తేదీ 496వ ఎపిసోడ్‌లో..
సుమిత్ర గురించి కాంచన, దీపలతో మాట్లాడుతుంటాడు కార్తీక్. ఇంతలో శివన్నారాయణకి కార్తీక్ ఫోన్ చేసి టాబ్లెట్స్ వేసుకున్నావా? లేదా? అని అడుగుతాడు. నా ఆరోగ్యం బాగానే ఉందని దశరథను మాత్రం ఓదార్చలేకపోతున్నానని శివన్నారాయణ కుమిలిపోతాడు. ఇంతలో శౌర్య వచ్చి నేను అమ్మమ్మ గదిలో పడుకోనా, నానమ్మ గదిలో పడుకోనా అని అడగటంతో శివన్నారాయణకు అనుమానం రెట్టింపు అవుతుంది. కార్తీక్ అందరి దృష్టిలో హీరోగా మారుతున్నాడని .. వాడిని దాటి అందరూ నిన్ను మెచ్చుకోవాలంటే మీ అమ్మ ఎక్కడుందో నువ్వే వెతికి పట్టుకోవాలని జ్యోత్స్నకి ఐడియా ఇస్తుంది పారిజాతం. నువ్వు ఇప్పటికైనా మీ ఇంటికి వెళ్లాలని సుమిత్రకు నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తాడు కార్తీక్. ఇంతలో శివన్నారాయణ అనుకోకుండా కార్తీక్ ఇంటికి వస్తాడు. ఇంట్లో పెద్దాయనను చూసిన కార్తీక్, దీపలు షాక్ అవుతారు.

Photo Courtesy: JioHotstar
అక్టోబర్ 24వ తేదీ 497వ ఎపిసోడ్‌లో..
తమ ఇంట్లో శివన్నారాయణను చూడగానే దీప షాక్ అవుతుంది.. సుమిత్ర ఉన్న గది వైపుకు వస్తుండగా కార్తీక్ వచ్చి ఆపుతాడు. నిన్ను చూసి వెళ్దామని వచ్చానని కాంచనతో శివన్నారాయణ అంటాడు. కార్తీక్‌తో పర్సనల్‌గా మాట్లాడాలని బయటికి తీసుకెళ్తాడు శివన్నారాయణ. సుమిత్ర ఎక్కడుందో నీకు తెలుసని నాకు అనిపిస్తుందని అనడంతో కార్తీక్ షాక్ అవుతాడు. వారి మాటలను దీప దొంగచాటుగా వింటుంది. ఇంతలో స్కూల్‌కి వెళ్తూ శౌర్య రావడంతో చిన్నారికి చాక్లెట్ల్స్ ఇస్తాడు శివన్నారాయణ. ఇంట్లో ఉన్న వాళ్లందరికీ చాక్లెట్స్ ఇవ్వమని ఒక్కొక్కరి పేరు అడుగుతాడు తెలివిగా పెద్దాయన. ఇంకా ఓ చాక్లెట్ మిగిలిందని అడగ్గా.. ఇది అమ్మమ్మకి ఇద్దామని శౌర్య అనబోతుండగా పాపను స్కూల్‌కి పంపేస్తాడు కార్తీక్. సుమిత్ర ఎక్కడుందో తెలియదని కార్తీక్ అనడంతో మనవడి మీద చెయ్యేత్తుతాడు శివన్నారాయణ. సుమిత్ర మీ ఇంట్లోనే ఉందని నాకు తెలుసు.. నేను చూశానని చెప్పడంతో కార్తీక్, దీప షాక్ అవుతారు.
అక్టోబర్ 25వ తేదీ 498వ ఎపిసోడ్‌లో..
మీరంతా ఎవరిని సాధించాలని నా కోడల్ని మీ ఇంట్లో దాచి పెట్టారని కార్తీక్ కుటుంబంపై మండిపడతాడు శివన్నారాయణ. ఈ జన్మలో మిమ్మల్ని క్షమించనని, నా కోడల్ని ఇప్పుడే తీసుకెళ్లిపోతానని అంటాడు శివన్నారాయణ. నువ్వు అత్తని తీసుకెళితే ఆమెను చూడటం అదే చివరిసారి అవుతుందని, అత్త మీ ఇంట్లో అడుగుపెట్టిన మరుక్షణం అత్త చనిపోతుందని అంటాడు కార్తీక్. ఆ మాటలతో శివన్నారాయణ షాక్ అవుతాడు. దాంతో దీప అసలేం జరిగిందో చెబుతుంది. మీ కుటుంబం బాగుండాలని చెయ్యని తప్పుకు నా కొడుకు, కోడలు మాటలు పడుతున్నారని కాంచన బాధపడుతుంది. నిజం తెలుసుకున్న శివన్నారాయణ అందరికీ క్షమాపణలు చెబుతాడు శివన్నారాయణ. ఉదయాన్నే ఆఫీస్‌కి వెళ్తూ కాశీ హడావుడి చేస్తాడు. ఇప్పటికైనా నువ్వు ఆ ఇంటికి వెళ్లాలని కార్తీక్, దీప, కాంచనలు సుమిత్రకు నచ్చజెబుతారు. ఆఫీస్‌కి వెళ్లాలని చెప్పిన కాశీ.. రోడ్డు మీద ఫ్రెండ్‌తో కబుర్లు చెబుతూ శ్రీధర్‌కు దొరికిపోతాడు. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











